మళ్లీ మరోసారి...సారీ....!!



ఈ ఏడాది తెలుగు సినిమాలకు వేటికీ జాతీయ అవార్డులు రాలేదన్న బాధ అందరితో పాటు నాకూ అమితంగానే వుంది....ఏదో ఒక సినిమాకు నేషనల్ అవార్డు రాకపోతుందా... తెలుగు సినిమా పరువు నిలవక పోతుందా అని నేను కూడా ఎంతగానో ఎదురు చూసాను... నిరాశ తప్పలేదు...అసలు జాతీయ అవార్డులు మన వైపు కన్నెత్తి కూడా చూడలేదు... ఎందుకు అవార్డులు రాలేదు అంటే... రాలేదు...అంతే....అక్కడ ప్రశ్నాలేదు...సమాధానమూ లేదు..నార్తు వాళ్ళు ...తమిళ  మళయాళ  సినిమాల వాళ్ళకున్న లాబీలు మనకు లేవు అనో...మన పార్లమెంట్ సభ్యులు అసలు పట్టించుకోవటం లేదనో ఈ సందర్భంగా వినిపిస్తున్న వ్యాఖ్యలు నా దృష్టిలో పస లేని వాదనలు... అవార్డు రాకపోవటం బాధాకరమే...కాని అందుకు గల కారణాలను ఆత్మ విమర్శతో ఆలోచించాలే గాని...సంకుచిద్తంగా కాదన్నది నా ఉద్దేశ్యం...లాబీలు లేవనో, ఎంపిలు లేరానో కారణాలు హాస్యాస్పదం... అలా వచ్చేవి అవార్డులా... అవి మనకు అవసరమా... అన్నది ప్రశ్న... ఈ వాదన మనల్ని మనమే అవమానించుకోవటం కాదా...? సహజత్వ పరంగా, సాంకేతికంగా, ఇతివృత్త పరంగా మనమూ, మన సినిమాలూ ఎక్కడ వున్నామన్నది ఆత్మ పరిశీలన చేసుకోవలసిన అవసరం లేదా...? గత ఏడాది అవార్డుల ఎంపికకు వెళ్ళిన మన సినిమాలు తక్కువన్నది నా ఉద్దేశ్యం కాదు...ఒక శ్రీ రామ రాజ్యం, రాజన్న లాంటి మంచి సినిమాలు వెళ్ళాయి. 
అయితే మన సినిమాల గొప్పతనం గురించి మనకు తెలుసు...అవతల అవార్డులు వచ్చిన వాటి గురించి మనకు తెలియదు కదా.....మనకు రానప్పుడు ఏదో అన్యాయం...మోసం జరిగిందని అనుకోవటం సహజం...కాని క్రియేటివ్ రంగంలో వున్న సినిమా అలా ఆలోచించ కూడదన్నది  నా అంతరంగం...నా ఉద్దేశ్యంలో విద్యా బాలన్ కంటే రామ రాజ్యంలో నయనతార బాగా నటించింది.. శ్రీ రామ రాజ్యం లాంటి ఇతిహాసాన్ని బాపు గారు తప్ప భారత దేశంలో మరే దర్శకుడు అలా రూపొందించలేరు. .కాని న్యాయ నిర్ణేతలు నాలాగా ఆలోచించాలని లేదు కదా...వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వేరుగా వుంటుంది. మనం అలా స్పోర్టివ్ గా  ఆలోచించగలిగితేనే మంచిది... అన్ని విధాలా తెలుగు సినిమా రేంజ్ గతంతో పోలిస్తే పెరిగింది...అందులో సందేహం లేదు....అయితే కదల ఎంపిక విషయంలో మనం మరింత జాగరూకత వహిస్తే  జాతీయ అవార్డులు ప్రకటించిన  ప్రతిసారీ ఇలా బాధపడాల్సిన అవసరం వుండదు....!

avs 

Post a Comment

Previous Post Next Post