కథ ఎప్పుడు దొరికితే అప్పుడు సినిమా -చిరంజీవి


  మంచి కథ ఎప్పుడు దొరికితే అప్పుడు తన 150 వ సినిమా ప్రారంభమవుతుందని ప్రముఖ నటుడు చిరంజీవి ఈ రోజు స్పష్టం చేశారు. తనయుడు రామ్ చరణ్ నటించిన 'రచ్చ' సినిమా ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా హాజరై, ఆడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన తన సినిమా గురించి కూడా ప్రస్తావించారు. దొరికే కథను బట్టే తాను చేయబోయే సినిమా ఆధారపడి ఉంటుందని చిరంజీవి అన్నారు. అంటే కథే తన 150 వ సినిమాను నిర్ణయిస్తుందని తేల్చి చెప్పారాయన. అందులో కథానాయికగా తమన్నా నటించాలని కోరుకుంటున్నానని చిరంజీవి నవ్వుతూ అన్నారు. ఇటీవల తాను రచ్చ సినిమా షూటింగుకి వెళ్ళాననీ, అక్కడ తన 150 వ సినిమా ప్రస్తావన వస్తే, 'కథానాయికగా నటిస్తావా? అని తమన్నాను అడిగాననీ, ఆమె చాలా సరదాగా జవాబు చెప్పిందనీ ఆయన అన్నారు.
        దీనిని బట్టి చూస్తే, ఇక చిరంజీవి 150 వ సినిమా వుండదేమో అనుకుంటున్న అభిమానుల్లో ఆయన మళ్లీ ఆశలు చిగురింపజేశారు. ఇదిలా ఉంచితే, హైదరాబాదు నెక్లస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో వేలాదిమంది అభిమానుల సమక్షంలో 'రచ్చ' ఆడియో వేడుక వైభవంగా జరిగింది. నిన్న షూటింగులో గాయపడ్డ హీరో రామ్ చరణ్ కూడా వేడుకకు విచ్చేశాడు. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు దీనికి హాజరయ్యారు. 

Post a Comment

Previous Post Next Post