నిన్న త్రిష ఈ రోజు అనుష్క anushka replaced trisha


నిన్న త్రిష ఈ రోజు అనుష్క  అందమైన కథానాయికల మధ్య సినిమాల విషయంలోనే కాదు ... వ్యాపార ప్రకటనల విషయంలోనూ గట్టిపోటీ వుంటుంది. ఈ నేపథ్యంలోనే ఒకరి అవకాశాలు మరొకరికి వెళ్లడమనేది సహజంగానే జరుగుతుంటుంది. ఇప్పుడు త్రిష - అనుష్క విషయంలోనూ ఇదే జరిగింది. 'మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా?' అంటూ త్రిష చేసిన 'కోల్గేట్' యాడ్ అందరికీ గుర్తుండే వుంటుంది. ఇకపై ఆ యాడ్ లో అనుష్క కనిపించబోతోంది. 'కోల్గేట్' కి కొత్త ఆకర్షణ తీసుకురావడం కోసం ఆ సంస్థ తెలుగు  - తమిళ భాషల్లో అనుష్క ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంది. ఈ రెండు భాషల్లోనూ అనుష్క కి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకునే ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అటు సినిమాల్లోనే కాకుండా, ఇటు యాడ్స్ లోను అనుష్క పోటీ అవుతుండటంతో, త్రిష కాస్త అసహనానికి లోనైందని సన్నిహితులు అంటున్నారు. ఇతర బ్రాండ్ లకి ప్రచారకర్తగా అవకాశాలు దక్కించుకోవడం కోసం ఆమె మరిన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు.ఇంతకి ఈ పోటి లో గెలుపు ఎవరిదో వేచిచూడాలి 

Post a Comment

Previous Post Next Post