Latest Post

Kondapolam Audio Launched Grandly

 కొండపొలం ఆడియో లాంచ్ ఈవెంట్‌...



ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ రెండో చిత్రంతో అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. క్రిష్ దర్శకత్వంలో రాబోతోన్న కొండపొలం సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 8న విడుదలకాబోతోంది. ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా శనివారం నాడు ఆడియో లాంచ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎం కీరవాణి, రాజీవ్ రెడ్డి, క్రిష్, వైష్ణవ్ తేజ్, సాయి చంద్ తదితరులు పాల్గొన్నారు.

 

సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మాట్లాడుతూ.. ‘కర్నూలులో ఉన్న అభిమానులందరికీ థ్యాంక్స్. నాకు కర్నూలు జిల్లా అంటే చాలా ఇష్టం. మంత్రాలయం, శ్రీశైలం, జోగులాంబ ఇలా నాకు ఇష్టమైన పుణ్యక్షేత్రాలున్నాయి. ఆత్యన్యూనత భావం, అపనమ్మకం ఉన్నప్పుడు పాడుకునే మంత్రాన్ని నేను కంపోజ్ చేశాను. ఇక్కడకు వస్తూ వస్తూనే ఓ పాటను విడుదల చేశామ’ని అన్నారు.


సాయి చంద్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు నాకు ప్రత్యేకం. నేను కర్నూలులో పుట్టాను. పుడితే కర్నూలులోనే పుట్టాలి. నాలుగేళ్లు ఉన్నప్పుడే హైద్రాబాద్‌కు వెళ్లాను. కర్నూలు రుణం ఎలా తీర్చుకోవాలని అనుకున్నాడు. అన్ని యాసలో పాత్రలను చేశాను. కానీ కొండపొలం సినిమాలో కర్నూలు యాసలోనే మాట్లాడాను. తెలుగు  సాహిత్యానికి, తెలుగు సినిమాకు మధ్య ఉండేది. కానీ చాలా ఏళ్ల క్రితమే ఆ బంధం విడిపోయింది. కానీ ఈ సినిమాతో మళ్లీ ఆ బంధం కుదిరింది. క్రిష్ గారు ఆ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు’


సన్నపురెడ్డి వెంకట రామి రెడ్డి మాట్లాడుతూ.. ‘మాది కడప జిల్లా. నల్లమల కొండలు ఇవతల కర్నూలు, అవతల కడప జిల్లా. నల్లమల అడవుల్లో ఓ 40 రోజులు ఉండి, అక్కడ జరిగిన సంఘటనల ఆధారంగానే కొండపొలం నవల రాశాను. ఆ నవలను క్రిష్ గారు సినిమాగా తీశారు. ఓ యువకుడు సాగించిన ప్రయాణమే ఈ చిత్రం. ఇది మన కథ, మన ప్రాంతం కథ. రాయలసీమ కథ సినిమాగా రావడం మనకెంతో గర్వకారణం. ఇది వరకు అయితే కత్తులు, బాంబులు, తొడగొట్టడాలు, సుమోలు గాల్లోకి ఎగిరేవి. రాయలసీమ అంటే ఫ్యాక్షన్ కథ అని ఫిక్స్ అయ్యారు. కానీ ఇది అలాంటిది కాదు. ఒకటి రెండు శాతం ఉండే ఫ్యాక్షన్‌ను తీసేసి మిగతా 98 శాతం ఉండే రైతులు, గొర్లకాపర్లు, అట్టడుగు వర్గాల వారి బాధలు, కష్టాల గురించి చెప్పే కథ’ అని అన్నారు.


నిర్మాత రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘నిర్మాతలకు కొంత మంది హీరోలతో పని చేయాలని ఉంటుంది. కానీ నాకు మాత్రం మ్యూజిక్ డైరెక్టర్‌తో పని చేయాలని ఉంది. అది కేవలం కీరవాణి గారు మాత్రమే. మళ్లీ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్. క్రిష్‌కు థ్యాంక్స్ చెప్పను. ఆయన నాకోసం  చేయాల్సింది చేస్తాడు. కొండపొలం కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. అక్టోబర్ 8న ఈ చిత్రం రాబోతోంది’ అని అన్నారు.


రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ‘లండన్‌లో సినిమా షూటింగ్‌లో ఉన్నాను. అందుకే ఈవెంట్‌కు రాలేకపోయాను. ఓబులమ్మ పాత్ర నాకు ఎంతో నచ్చింది. కొత్త లుక్కులో చూపించారు. ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు, నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు క్రిష్‌కు థ్యాంక్స్. ఈ జర్నీ నాకు ఎంతో నచ్చింది. ఇంత కంటే గొప్పది ఏమీ కోరుకోలేం. వైష్ణవ్ తేజ్‌కు ఎంతో భవిష్యత్తు ఉంది. ఇంత మంచి చిత్రాన్ని నిర్మించినందుకు నిర్మాతలకు థ్యాంక్స్. ఓబులమ్మ మీ హృదయంలో నిలిచిపోతుంది’.


దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ.. ‘ఈ కొండపొలం సినిమా చూసిన తరువాత బస్సులో వస్తున్నప్పుడు ఆలోచించాను. పవన్ కళ్యాణ్ గారికి నేను మొట్టమొదటగా థ్యాంక్స్ చెప్పాలి. వందల కోట్లతో భారీ బడ్జెట్ సినిమా చేస్తుంటే.. మధ్యలో గ్యాప్ వస్తే.. ఇలా వెళ్లి ఒక సినిమా చేసి వస్తాను అని చెబితే.. వెన్నుతట్టి అవసరం క్రిష్.. నీకు నీ టీంకు అవసరం. వెళ్లు సినిమా చేసుకో. మళ్లీ మనం సినిమా చేద్దామని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్. హరిహర వీరమళ్ల మధ్యలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఆయన అనుమతించకపోయినా, ఏఎం రత్నం గారు అంగీకరించకపోయినా.. ఇంద్రగంటి, సుకుమార్ గారు ఈ నవలను నాకు పరిచయం చేయకపోయినా.. సన్నపురెడ్డి వెంకటరెడ్డి ఈ నవలను రాయకపోయినా ఈ చిత్రం వచ్చేది కాదు. ఈ అందరికీ థ్యాంక్స్. ఈ చిత్రం అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్నాం. పడుతూ లేస్తూ ఉన్నాం. రాజీవ్‌కు ఈ నవల చెప్పి, చేద్దామని అంటే.. కథ కూడా అడగలేదు.  ఆయన వల్లే ఇలాంటి చిత్రాలు చేయగలుగుతున్నాను. నేను సినిమా తీసింది అంతా ఒకెత్తు అయితే.. పై మెట్టులో పెట్టింది ఎంఎం కీరవాణి. ఆయన ఈ చిత్రాన్ని మరో లెవెల్‌కి తీసుకెళ్లారు. రయ్ రయ్ అనేది పాట కాదు మంత్రం. కీరవాణి, సిరివెన్నెల గారు అద్భుతమైన పాటలు రాశారు. ఆత్మ న్యూనత భావం ఉన్న రవీంద్ర అనే యువకుడు.. తనది తాను ఎలా సాధించుకున్నాడు అనేది కథగా రాస్తే.. దాన్ని అందంగా  చిత్రీకరించాం. నేను రకుల్ దగ్గరి నుంచి క్రమశిక్షణను నేర్చుకున్నాను. ఎదుటి వాళ్ల నుంచి ఏం నేర్చుకోవాలి అని నేను నేర్చుకున్నాను. చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి.  వంద ఏళ్లు, వంద సినిమాలతో ఓ గొప్ప నటుడిగా ఉంటావని ఆశిస్తున్నాను’ అని అన్నారు.


వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. ‘కీరవాణి గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ రోజు ఆయనే హీరో. ఈ కథలో రవీంద్ర అనే క్యారెక్టర్.. ఎన్ని ఒడిదొడుకులున్నా కూడా తలెత్తుకుని తిరగాలని చెబుతాడు. సన్నపురెడ్డి వెంకటరెడ్డి రాసిన కథను తెరపైకి తీసుకొచ్చేందుకు క్రిష్ చాలా కష్టపడ్డారు. ఎప్పుడూ తలెత్తుకుని మన దేశాన్ని గర్వపడేలా చేయాలని క్రిష్ చెబుతుంటారు. తలెత్తుకుని ఉంటూ మనదేశాన్ని గర్వపడేలా చేయాలని అనుకునే కుర్రాడి కథ. ఇది మీలోని ఒక్కరి కథ. రయ్ రయ్ రయ్యారనే మంత్రం మీకు కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను’ అని అన్నారు.

 


నటీనటులు : పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్


సాంకేతిక బృందం


దర్శకుడు :  క్రిష్ జాగర్లమూడి

నిర్మాత  : సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి

బ్యానర్  : ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్

సంగీతం  : ఎంఎం కీరవాణి

సినిమాటోగ్రఫర్  : జ్ఞాన శేఖర్ వీఎస్

కథ  : సన్నపురెడ్డి వెంకట రామి రెడ్డి

ఎడిటర్  : శ్రావన్ కటికనేని

ఆర్ట్  : రాజ్ కుమార్ గిబ్సన్

కాస్టూమ్స్ : ఐశ్వర్యా రాజీవ్

ఫైట్స్ : వెంకట్

పీఆర్వో : వంశీ-శేఖర్

Lyca Productions to bankroll a straight Telugu film with Aishwaryaa R Dhanush as director

 Lyca Productions to bankroll a straight Telugu film with Aishwaryaa R Dhanush as director



It's well-known that the prestigious production house Lyca Productions has bankrolled India's most expensive film, '2.0', with Rajinikanth and Akshay Kumar in the past. It has also been bankrolling a number of other important movies. Lyca is all set to debut in Bollywood with Akshay Kumar's 'Ram Setu', besides bankrolling 'Good Luck Jerry' with director Aanand L Rai and actress Jahnvi Kapoor. The banner has been busy producing promising movies in both Tamil and Hindi. And now, Lyca is all set to make a Tollywood debut with a film to be directed by Aishwaryaa R Dhanush.


Producers SubasKaran and Mahaveer Jain are jointly producing this venture under the direction of Aishwaryaa, who is Superstar Rajinikanth's daughter and actor Dhanush's wife. She debuted as a director with Dhanush's '3' years ago. The movie was released in Telugu as well. She then went on to direct the highly-acclaimed 'Vai Raja Vai', a bi-lingual thriller. Her third film as a director will now be made in Telugu and it aims to cater to a pan-Indian audience.


Speaking on the occasion of the project's announcement, Aishwaryaa said, “I am so excited to direct this film and with Lyca backing this project, our collective endeavour will be to bring a much-needed, family entertainer for our pan-India audiences.”


Aashish Singh, CEO Lyca Productions, said, "We are thrilled to have Aishwaryaa on board to direct our first Telugu production. We are confident that this film will captivate and entertain audiences across the country.”


Details of the rest of the cast and crew will be announced soon

Producer Yelamanchali Ravichand Pressmeet

 


నిర్మాత యలమంచల రవిచంద్ మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది,2010 లో పైరసీ పై నేను ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు ఇండస్ట్రీ అంతా నాకు సంఘీ భావం ప్రకటించింది,కరోనా టైం లో అందరూ తీవ్రంగా నష్ట పోయి వుంటే ఇండస్ట్రీలో బాధాకర మైన సంఘటనలు జరుగుతున్నాయి,అందరూ కరెక్ట్ గా వుండి ఐకమత్యంగా కలసి వుంటే ఇండస్ట్ర కి మంచిది-పోసాని కృష్ణమురళి ఇంటి పై దాడిని అందరూ నిర్మాతలు ఖండించారు అని నట్టి కుమార్ చెప్పాడు,మా అందరి తరుపున చెప్పడానికి అతను ఎవ్వరూ,ఇండస్ట్రీకి సంబంధం లేని విషయాలు తీసుకొచ్చి ఇండస్ట్రీ కి అంటించవద్దు.


-గవర్నమెంట్ నీ రిక్వెస్ట్ చెయ్యాలి కాని డిమాండ్ చెయ్యకూడదు,జగన్ ప్రభుత్వం వచ్చినతరువాత ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఆయనకు ఎవ్వరూ విషెస్ చెప్పలేదు,ఇప్పుడు మికు అవసరం వచ్చింది కాబట్టి వెళ్లి…

నిర్మాత యలమంచి రవిచంద్  ప్రెస్ మీట్ 


-నిర్మాత యలమంచి రవిచంద్ మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీ లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది,2010 లో పైరసీ పై నేను ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు ఇండస్ట్రీ అంతా నాకు సంఘీ భావం ప్రకటించింది,కరోనా టైం లో అందరూ తీవ్రంగా నష్ట పోయి వుంటే ఇండస్ట్రీలో బాధాకర మైన సంఘటనలు జరుగుతున్నాయి,అందరూ కరెక్ట్ గా వుండి ఐకమత్యంగా కలసి వుంటే ఇండస్ట్ర కి మంచిది


-పోసాని కృష్ణమురళి ఇంటి పై దాడిని అందరూ నిర్మాతలు ఖండించారు అని నట్టి కుమార్ చెప్పాడు,మా అందరి తరుపున చెప్పడానికి అతను ఎవ్వరూ,ఇండస్ట్రీకి సంబంధం లేని విషయాలు తీసుకొచ్చి ఇండస్ట్రీ కి అంటించవద్దు.


-గవర్నమెంట్ నీ రిక్వెస్ట్ చెయ్యాలి కాని డిమాండ్ చెయ్యకూడదు,జగన్ ప్రభుత్వం వచ్చినతరువాత ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఆయనకు ఎవ్వరూ విషెస్ చెప్పలేదు,ఇప్పుడు మికు అవసరం వచ్చింది కాబట్టి వెళ్లి కలిశారు,ఏ గవర్నమెంట్ వచ్చిన ఇండస్ట్రీ నుంచి విషెస్ తెలపడం మన నైతిక బాధ్యత


-పేర్ని నాని గారు సంక్షేమ పథకాలు కు ఇంత బడ్జెట్ కేటాయించామని చెప్పారు చాలా మంచి విషయం అలాగే సినీ పరిశ్రమ ను కూడా ఆదుకోవాలి,దయచేసి సిని ఇండస్ట్రీ నీ కాపాడండి..మాకున్న సమస్యలను పరిష్కరించండి అని ఏపి ప్రభుత్వన్ని వేడుకుంటున్నాను,ప్రస్తుతం ఇండస్ట్రీకి క్రమ శిక్షణ కావాలి,ఇండస్ట్రీ పెద్దల కు నా మనవి ఏమిటంటే ఒక సుప్రీం కమిటీ నీ ఏర్పాటు చెయ్యాలి,గిల్డ్, ఛాంబర్ లు కలసి ఒక తాటి పైకి రండి,ఛాంబర్ కౌన్సిల్ మా, ఫెడరేషన్ నుంచి ఒక సుప్రీం బాడీని ఏర్పాటు చెయ్యాలి.


-మా ఎన్నికలు నిలబడే మెంబెర్స్ కి తప్పితే  ఎవరికి లాభం లేదు.కానీ ఇంత రచ్చ అవసరమా.


-ప్రకాష్ రాజ్ నిర్మాతలను ఇబ్బంది పెట్టిన వ్యక్తి..మా కూడా సస్పెండ్ చేసింది అలాగే తాను షూటింగ్ కి టైమ్ కి రాడు అని తనని సస్పెండ్ అయితే మీరు ఏమి పీక్కుంటారో పీక్కోండి అన్న వ్యక్తి మాటలు మీరు ఎలా మరిచి పోయి మద్దతు ఇస్తారు అని అడుగుతున్నా.


-బండ్ల గణేష్ ఎన్వలిడ్ అయ్యారు కానీ అతను దేవుడు సూచన మేరకు ఉపసంహరించు కున్నాను అని చెపుతున్నాడు, అది అంత అవాస్తవం.


-మంచు మోహన్ బాబు గారు ఫ్యామిలీ ఇండస్ట్రీ కోసం,మా కోసం ఎంతో కొంత వాళ్ళు నిర్మాత గాను తెలుగు సినీ పరిశ్రమకు సేవ చేసారు అందువల్ల వారికి మద్దతు తెలపటం లో ఎలాంటి సందేహం లేదు.


-కొంత మంది చేసిన వ్యాక్యాలు ఏపి ప్రభుత్వాన్ని హార్ట్ చేసి వుంటే క్షమించి సిని ఇండస్ట్రీ కి సపోర్ట్ చెయ్యండి,రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీ కి సహకరించాలి అని నా మనవి.


-ఇండస్ట్రీ లో 50వేల మంది బతుకుతున్నారు వారిని దృష్టిలో పెట్టుకొని ఏపి ప్రభుత్వం సహకరించాలి,నేను మొన్న ఏపిలో షూటింగ్ చేశాను చాలా చక్కగా సహకరించారు అక్కడ వాళ్ళు.


-సినిమా ఇండస్ట్రీ లో మా ఎలక్షన్స్ 900ల ఓట్లు కోసమే మనమే ఇంత రాజకీయం చేస్తున్నామే అలాంటిది రాజకీయ పార్టీ అని పేరుపెట్టుకున్న వాళ్ళు ఎంత రాజకీయం చేయాలి అసలు మనకి రాజకీయాలు ఎందుకు, ఎవరిని అయినా ఏదైనా సమస్య ఉంటె అడిగే విధానం బావుండాలి అలా కాకుండా ఎరా సన్నాసి ఇది చెయ్యి అంటె చేస్తారా అని మాట్లాడారు.


-మంత్రి పేర్ని నాని గారు మీరు స్మార్ట్ గా మాట్లాడారు కాని మా ప్రొడ్యూసర్స్ ముందు పెట్టుకొని అలా తిట్టటం అనేది బాలేదు సార్,రాజకీయాలు వేరు సినిమా ఇండస్ట్రీ వేరు సార్,మీ రాజకీయాలు మీరు చేసుకోండి సార్ కాని అందులో మా ఇండస్ట్రీ ని వేరుగా చుడండి అని కోరుకుంటున్నాను.


-అన్ లైన్ సిస్టం వలన ట్రాన్స్ పరెన్సి వుంటుంది దీనికి నేను అంగీకరిస్తున్నాను కాని దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ అందరికి నచ్చితెనే ముందుకు వెళ్ళాలి.


-చివరిగా అందరికి నేను మనవి చేసేది ఏమిటీ అంటె అందరం కలిసి ఇండస్ట్రీ ని కాపాడుకుందాం అని కోరుకుంటున్నాను.

Ravi Teja, Trinadha Rao Nakkina, People’s Media Factory, Abhishek Aggarwal Arts’ #RT69 To Commence From October 4

 Ravi Teja, Trinadha Rao Nakkina, People’s Media Factory, Abhishek Aggarwal Arts’ #RT69 To Commence From October 4



Mass Maharaja Ravi Teja is on full swing with the blockbuster success of Krack. The actor has been doing some interesting projects and here comes official announcement regarding his 69th film to be directed by Trinadha Rao Nakkina who is known for making hilarious family entertainers.


Billed to be an out and out entertainer, the film tentatively titled #RT69 will be mounted on grand scale by People’s Media Factory and Abhishek Aggarwal Arts. TG Vishwa Prasad will produce the movie, while Vivek Kuchibhotla is the co-producer.


The movie will feature some well-known actors in vital roles and top-notch technicians handling different crafts.


Prasanna Kumar Bezawada has penned story and dialogues for the film, while Bheems Ceciroleo will score music and Karthik Ghattamaneni will handle the cinematography. Other cast and crew details will be revealed soon.


Ravi Teja and Trinadha Rao Nakkina is an interesting combination and RT69 is going to offer unlimited fun to audience in theatres. The film’s regular shooting commences from October 4th.


Cast: Ravi Teja


Technical Crew:

Writer, Director: Trinadha Rao Nakkina

Producers: TG Vishwa Prasad

Banners: People’s Media Factory, Abhishek Aggarwal Arts

Co-Producer: Vivek Kuchibhotla

Story, Dialogues: Prasanna Kumar Bezawada

Music Director: Bheems Ceciroleo

Cinematography: Karthik Ghattamaneni

Production Designer: Srinagendra Tangala

PRO: Vamsi Shekar

Gopichand, Nayanthara, B Gopal, Jaya Balaji Real Media’s Aaradugula Bullet To Release On October 8th

 Gopichand, Nayanthara, B Gopal, Jaya Balaji Real Media’s Aaradugula Bullet To Release On October 8th



Macho Hero Gopichand played an action-packed role in Aaradugula Bullet. Mass director B Gopal helmed the project where stunning diva Nayanthara played the lead actress opposite Gopichand. Thandra Ramesh produced the film under Jaya Balaji Real Media banner.


Tipped to be a mass and action entertainer, Aaradugula Bullet gets a new release date. The film will be releasing on October 8th. The makers have announced the news officially today.


Prakash Raj, Abhimanyu Singh, Kota Srinivasa Rao, Brahmanandam, Jaya Prakash Reddy and Chalapathi Rao played important roles in the movie.


The film’s technical crew includes Mani Sharma as music director and Bala Murugan handling cinematography. Kotagiri Venkateswara Rao is the editor. Vakkantham Vamsi provided story and screenplay, while Abburi Ravi penned dialogues.


Cast: Gopichand, Nayanthara, Prakash Raj, Abhimanyu Singh, Kota Srinivasa Rao, Brahmanandam, Jaya Prakash Reddy, Chalapathi Rao and others.


Technical Crew:

Director: B Gopal

Producer: Thandra Ramesh

Banner: Jaya Balaji Real Media

Story, Screenplay: Vakkantham Vamsi

Music Director: Mani Sharma

Cinematography: Bala Murugan

Editor: Kotagiri Venkateswara Rao

PRO: Vamsi Shekar

The wedding ceremony song from Naga Shaurya and Ritu Varma’s ‘Varudu Kaavalenu' is released

  ‘VADDAANAM’ SONG RELEASE

The wedding ceremony song from Naga Shaurya and Ritu Varma’s ‘Varudu Kaavalenu' is released.



Sithara Entertainments, a well-known film production company, is making a film 'Varudu Kavalenu' with young hero ‘Naga Shourya’ and heroine 'Ritu Varma' introducing 'Lakshmi Soujanya' as the director.

The ‘Varudu Kaavalenu’ unit released a sensational lyrical song from the movie today (2-10-2021).

This lyrical video song, when viewed, acts as a feast for the eyes. Going into further details..

The song that goes “Vaddanam chuttesi vacchaare bhamalu.. Vayyaram chindese andala bhamalu..”, are the lyrics that are penned down by Raghuram. The song was sung by singers Srikrishna, Geeta Madhuri, ML Gayatri, Aditi Bhavraju and Shruti Ranjani. The music for this song was composed by Vishal Chandrashekhar. This wedding ceremony song which is placed within the bounds of the story will include other main cast of the film alongside the hero-heroine, Naga Shaurya and Ritu Varma.

The song has beautiful music and good lyrics. In addition to these, Brinda masters dance choreography is even more uplifting.

Post-production of the film is currently underway. The film will be released on October 15 as a gift on the occasion of Dussehra.

 

Naga Shourya and Ritu Varma as a leading pair, Nadiya, Murali Sharma, Vennela Kishore, Praveen, Ananth, Kiriti Damaraju, Rangasthalam Mahesh, Arjun Kalyan, Vaishnavi Chaitanya, Siddiksha are the main leads.

For this movie

Dialogues: Ganesh Kumar Ravuri,

Cinematographer: Vamsi Patchipulusu,

Music : Vishal Chandrashekhar

Editor: Navin Nooli

Art: A.S Prakash

PRO: Lakshmivenugopal

Presents by: P.D.V Prasad

Produced by: Surya Devara NagaVamsi

Story- Direction:Lakshmi Sowjanya

Idhe Maa Kadha Pre Release Event Held Grandly

 ఇదే మా కథ సినిమా కచ్ఛితంగా సుమంత్ కి మంచి పేరు తెస్తుంది -  ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో  శ్రీకాంత్



సుమంత్‌ అశ్విన్‌, శ్రీకాంత్‌, భూమిక, తాన్య హోప్‌లు కలిసి నటించిన చిత్రం ‘ఇదే మా కథ’. శ్రీమతి గుర్రప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద జీ మహేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు గురు పవన్‌ దర్శకుడు. ఈ చిత్రం అక్టోబర్‌ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌లో ఎంఎస్ రాజు, బీ గోపాల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. శ్రీకాంత్, సుమంత్ అశ్విన్‌లు ఈవెంట్‌లో పాల్గొన్నారు.


దర్శకుడు గురు పవన్ మాట్లాడుతూ.. సినిమా గురించి, నటీనటుల గురించి చెప్పే ముందు.. నా గురించి చెప్పుకోవాలి. ఈ గురు ఎక్కడి నుంచి వచ్చారు అని తెలియాలి. ఎలాగైనా బతకాలి అని కోట్ల మంది అనుకుంటారు. నాకు నచ్చినట్టే బతకాలి అని అనుకునే వాళ్లు లక్షల్లో ఉంటారు. ఆ లక్షల్లో ఒక్కడిని నేను. వారంతా ఆర్మీ, పోలీస్, డాక్టర్లు అంటూ వివిధ రకాల వృత్తులను ఎంచుకుంటారు. ఎంటర్టైన్మెంట్ రంగానికి వచ్చే కొంత మందిలో నేను ఒక్కడిని. సక్సెస్ రేటు చాలా తక్కువ ఉంటుందని తెలిసి వచ్చిన వాడిలో నేను ఒక్కడిని. అలా వచ్చిన నేను దాదాపు 12 ఏళ్లు ఎన్నో కష్టాలు పడ్డాను అని నేను చెప్పను. ఆల్మోస్ట్ పదేళ్లలో ఎన్నో చిత్రాలకు కో డైరెక్టర్‌గా పని చేశాను. ఈ చిత్ర పరిశ్రమలో నేను ఎంతో లక్కీ ఫెలోని. నాకు ఇంత ఇచ్చిన పరిశ్రమకు ఏదైనా ఇవ్వాలని అనుకున్నాను. కానీ నాకు ఆ అవకాశం ఎలా వస్తుందని రకరకాలుగా ప్రయత్నించాను. ఆ సమయంలోనే నా నిర్మాత మహేష్ గారి రూపంలో నాకు ఈ అవకాశం వచ్చింది. రకరకాల కథలు మనం రాస్తుంటాం. కానీ మనం మొదటిసారి వస్తున్నప్పుడు సాలిడ్‌గా రావాలి. లేదంటే మళ్లీ అలానే వెనక్కి వెళ్లిపోతాం. వంద శాతం మన లక్ష్యాన్ని చేరుకోవాలి అని ఈ కథను రాశాను. అందుకే ఈ రైడింగ్ జానర్ ఎంచుకున్నాను. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొన్న సమయంలో కొత్త ప్రపంచానికి వెళ్లాను. ఎంతో మంది  కొత్త రచయితలను చూశాను. అలా అందరిలోంచి కొన్ని పాయింట్లను తీసుకుని రాయడంతో ఇదే మా కథ రెడీ అయింది. ఈ కథను నేను ముందుగా ఫీలవ్వాలని, ఆ తరువాతే మిగతా వాళ్లకు చెప్పాలని అనుకున్నాను. అందుకే ఐదు వేల కిలోమీటర్లు జర్నీ చేసుకుంటూ ఈ కథను రాశాను అని గర్వంగా చెప్పుకుంటున్నాను. శృంగేరీ, హంపీ, గోకర్ణ అంటూ ఇలా తిరిగాను. కథ రాశాను. ఆ కథను నిర్మాత మహేష్‌కు చెప్పాను. ఈ కథను అందరికీ చెప్పాలనే ఆశ అందరికంటే ఆయనకే ఎక్కువగా ఉండేది. ఈ సినిమాను ఎలాగైనా సరే థియేటర్లోనే విడుదల చేయాలని నిర్మాత ఫిక్స్ అయ్యారు. అక్టోబర్ 2న మా సినిమా రాబోతోంది. అక్టోబర్ 2న భారత దేశం ఎంత స్వచ్చంగా ఉంటుందో.. ఇదే మా కథ కూడా అంతే స్వచ్చంగా ఉంటుంది. ఈ సినిమాలో ఏదో  ఉంది.. చేద్దామని ముందుకు వచ్చిన శ్రీకాంత్, భూమిక, సుమంత్, తాన్యా అందరికీ థ్యాంక్స్. ఎంఎస్ రాజు గారు కూడా కథ విన్నారు. ఒక్క చిన్న పాయింట్‌లో కూడా ఎందుకు ప్రశ్న వేయలేదు. నన్ను ఎంతో సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్. అతిథిగా వచ్చిన బీ గోపాల్ గారికి థ్యాంక్స్’ అని అన్నారు.


ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. నేను మామూలుగా స్టేజ్ మీద ఎక్కువగా మాట్లాడను. ఎక్కడ పిలుస్తారో అని మూలకు వెళ్లి నిల్చున్నాను.  సినిమా గురించి అందరూ మాట్లాడేశారు. ఇక నేను మాట్లాడాల్సింది ఏం లేదు. ఈ చిత్రాన్ని మొదట ఓకే చేసింది నిర్మాత మహేష్ గారే. ఆయనే మొదటి హీరో. అందరినీ ఒప్పించి ఈ చిత్రంలోకి తీసుకొచ్చినందుకు డైరెక్టర్ గురు ఇంకో హీరో. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎమోషన్ అయ్యేట్టు చేసిన సినిమా ఇదే. శ్రీకాంత్, భూమిక,సుమంత్, తాన్యలు అంత అద్భుతంగా నటించారు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొని ఈ సినిమాను పూర్తి చేశారు. అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.


దర్శకుడు బీ గోపాల్ మాట్లాడుతూ.. ‘ఇదే మా కథ టైటిల్ బాగుంది. పాటలు, లొకేషన్స్ ఇలా అన్నీ బాగున్నాయి. శ్రీకాంత్ వందల సినిమాలు చేశారు. అన్ని రకాల పాత్రలు చేశారు. అందరికీ మంచి స్నేహితుడు. నాకు ఎంతో ఇష్టమైన నటుడు. నాకు బాగా ఇష్టమైన నిర్మాత ఎంఎస్ రాజు. దేవీ, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం ఇలా ఎన్నో అద్భుతైన సినిమాలు తీశారు. ఆయన కుమారుడు సుమంత్ ఎన్నో మంచి చిత్రాలు చేశారు. ఈ చిత్రం మరింత విజయం సాధించాలని కోరుకుంటున్నాను.  ఈ చిత్రానికి పని చేసిన అందరికీ కంగ్రాట్స్. సినిమాను తీయడం ఒకెత్తు. కొత్త దర్శకుడుని మహష్ పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలి.. ఇంకా ఎంతో మంది దర్శకులను పరిచయం చేయాలి. ఆయన ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి. ఈ చిత్రానికి పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.


సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం నాకు ఎంతో స్పెషల్. సౌత్ నుంచి నార్త్ వరకు అంతా చూపించాం. మన దేశం ఎంతో అందమైందని నాకు తెలిసింది. ఇండియన్ అవ్వడం నాకు ఎంతో గర్వకారణంగా అనిపించింది. ఈ జర్నీని నాకెంతో ఇష్టమైన శ్రీకాంత్, భూమిక గారితో పని చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆయనతో ఉన్న ఎక్స్ పీరియన్స్ గురించి రాయాలంటే పుస్తకాలు సరిపోవు. ఎంతో సీనియర్ అయినా కూడా ఓ బ్రదర్‌లా ఉండేవారు. ఎన్నో సలహాలు ఇచ్చేవారు. నేను ఇందులో బాగా చేశాను అని ఎవరైనా అంటే.. అది శ్రీకాంత్ గారి వల్లే. నా స్పీచ్‌ను మా నాన్న కొట్టేశారు. ఈ చిత్రానికి టెక్నికల్ యూనిట్ అంతా ఎంతో కష్టపడింది. కథను నమ్మి, ఎంతో ధైర్యంతో మహేష్ గారు చిత్రాన్ని తీశారు. అక్టోబర్ 2న మా సినిమా రాబోతోంది’ అని అన్నారు.


హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘ఇది మా కథ అనేది నాకు మంచి ఎక్స్‌పీరియన్స్. ఫీల్ గుడ్ కథ. ఓ నలుగురి కథ. వారి లక్ష్యాలు ఏంటి? వాటిని ఎలా చేరుకున్నారు. ఒకరినొకరు ఎలా హెల్ప్ చేసుకున్నారు అనేదే కథ. ఇలాంటి కథలను ఎలా డీల్ చేయాలి.. స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి.. నిర్మాతను ఒప్పించడం అనేదా చాలా కష్టం అని దర్శకుడు గురుకు చెప్పాను. మంచి నిర్మాత మహేష్ దొరికాడు అని గురు చెప్పారు. ముందు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయిపోయింది. బడ్జెట్ అసలు కంట్రోల్ అవ్వడం లేదు. ఆ కథే అలా కోరుకుంది.  సినిమా మీద ప్యాషన్ ఉంది కాబట్టే.. ఈ రోజు మహేష్ లాంటి నిర్మాత ఈ సినిమాను తీశారు. ఇలాంటి సినిమాలు రావాలంటే దర్శకులు, నిర్మాతలే ముఖ్యం. ప్రతీ చిన్న పాయింట్ కూడా వర్కవుట్ చేసుకున్నాడు. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి సినిమా చూశాం. ఎంతో  అద్భుతంగా ఉంది. నేను తోటీ హీరోలతో సినిమాలు చేశాను. కానీ యంగ్ హీరోతో పని చేయడం ఇదే మొదటిసారి. సుమంత్‌ను చూస్తే  నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది. లఢఖ్‌లో వాటర్‌లో జంప్ చేసి యాక్షన్ సీక్వెన్స్ చేశాడు. అంత చలిలో అలా చేయడం చూసి నాకు భయమేసింది. ఎంతో కష్టపడుతున్నాడు.. ఎంతో భవిష్యత్తు ఉంది. డైలాగ్ డెలివరీ, మెమోరీ ఉన్న నటుడు. ఈ సినిమా సక్సెస్ అవుతుంది. కచ్చితంగా సుమంత్‌కు పేరు వస్తుంది. ఈ చిత్రం అక్టోబర్ 2న థియేటర్లోకి రాబోతోంది. అందరూ థియేటర్లోనే చూడండి’ అని అన్నారు.

Panja Vaisshnav Tej, Rakul Preet Singh, Krish and First Frame Entertainments’ Konda Polam Awarded With Clean U Certificate

 Panja Vaisshnav Tej, Rakul Preet Singh, Krish and First Frame Entertainments’ Konda Polam Awarded With Clean U Certificate



Expectations are quite high on Mega sensation Vaisshnav Tej’s second film Konda Polam, since his first film Uppena was a blockbuster and this spectacular action adventurous movie is directed by creative director Krish with gorgeous diva Rakul Preet Singh playing the female lead and popular production house First Frame Entertainments is producing it.


Promotions are also happening in full swing for the film ahead of its release and trailer as well as songs got optimistic response. Konda Polam has completed all the formalities, including censor and the movie is awarded with clean U certificate. Censor officials have appreciated the makers and have recommended no cuts. The final duration of the movie is 2:15 hours and it’s a perfect runtime.


Konda Polam is now all set for a grand release worldwide on 8th of this month. Both Vaisshnav Tej and Rakul Preet Singh played their parts exceptionally well, while director Krish made the movie as a commercial entertainer. Gnana Shekar VS’s top-notch camera work and MM Keeravani’s magical music are other big assets of the film.


Konda Polam’s audio launch event will take place tomorrow at Kurnool Convention Centre, Santhosh Nagar Colony in Kurnool. The event begins from 5 PM onwards.


Adapted from the novel written by Sannapureddy Venkata Rami Reddy, Konda Polam is produced by Saibabu Jagarlamudi, Rajeev Reddy and is presented by Bibo Srinivas.


Prasanth Varma, Teja Sajja, Primeshow Entertainment’s HANU-MAN Shooting In Maredumilli and Paderu

 Prasanth Varma, Teja Sajja, Primeshow Entertainment’s HANU-MAN Shooting In Maredumilli and Paderu



Creative director Prasanth Varma has been surprising every time with his first of its kind concepts and wonderful taking. The director is coming up with HANU-MAN which is going to be another first of its kind film on Indian screen. It is the first Pan-Indian superhero film. Prasanth Varma teams up with young hero Teja Sajja and the film HANU-MAN will be a visual treat for cine goers.


The film’s shooting is currently taking place in Maredumilli and Paderu. The team is shooting action sequences and also songs in this schedule. The working still shows serious discussion between Prashanth Varma and Teja Sajja. While Prashanth Varma explains a scene, Teja is keenly listening to him.


The film’s first look and glimpse got overwhelming response. They indeed gave hints about the kind of visual extravaganza we are going to witness on big screens. Teja Sajja underwent tremendous makeover to play the superhero. Teja’s getup is also very different.


HANU-MAN will be high on VFX and this magnum opus, like every other superhero film, will have unbelievable stunt sequences. In fact, superhero films are not constrained for one particular section or age group. HANU-Man, with a universal concept, is for all sections and age groups. It is being made in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi languages.


Popular production house Primeshow Entertainment is producing the movie on grand scale and big stars and top-grade technicians are associating for it.


K Niranjan Reddy is producing the movie, while Smt Chaitanya presenting it. Asrin Reddy is the executive producer, Venkat Kumar Jetty is the Line Producer while Kushal Reddy is the associate producer. Dasaradhi Shivendra takes care of cinematography.


Four young and talented composers- Anudeep Dev, Hari Gowra, Jay Krish and Krishna Saurabh are providing sound tracks for the film.


Other cast and crew of the project will be unveiled soon.


Cast: Teja Sajja


Technical Crew:

Writer & Director: Prasanth Varma

Producer: K Niranjan Reddy

Banner: Primeshow Entertainment

Presents: Smt Chaitanya

Screenplay: Scriptsville

DOP: Dasaradhi Shivendra

Music Directors: Anudeep Dev, Hari Gowra, Jay Krish and Krishna Saurabh

Executive Producer: Asrin Reddy

Line Producer: Venkat Kumar Jetty

Associate Producer: Kushal Reddy

Production Designer: Srinagendhra Tangala

PRO: Vamsi-Shekar

Costume Designer: Lanka Santhoshi

Legendary Actor Allu Ramalingaiah Sathajayanthi Celebrations

 లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకలు.. 



కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య. ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తనదైన కామెడీతో కడుపులు చెక్కలు చేసారు అల్లు రామలింగయ్య గారు. దశాబ్ధాల పాటు 1000 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చెరిగిపోని ఖ్యాతిని గడించారు. అక్టోబర్ 1న ఈయన జయంతి సందర్భంగా అభిమానులు ఆయన్ని గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులు శ్రీ అల్లు రామలింగయ్య గారికి నివాళులు అర్పించారు. ఆయన తెలుగు సినిమాకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. అలాగే అల్లు రామలింగయ్య గారితో తమకున్న అనుబంధాన్ని మరోసారి నెమరేసుకున్నారు. 99 వసంతాలు పూర్తి చేసుకుని ఆయన శత జయంతిలోకి అడుగు పెడుతున్నారు. ఆయన 100వ జయంతి వేడుకలను రెండు స్థానాల్లో ఘనంగా జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు కుటుంబ సభ్యులు.

PelliSandaD Releasing on October 15th

 ద‌స‌రా సందర్భంగా అక్టోబర్ 15న థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌నున్న రాఘవేంద్రరావు ‘పెళ్లిసంద‌D’... 



ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న‌ చిత్రం ‘పెళ్లి సంద‌D’. ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల రూప‌క‌ల్ప‌న‌లో త‌న మేజిక్‌ను చూపిన ఈయ‌న ‘పెళ్లిసంద‌D’ లో న‌టుడిగా ప‌రిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో రాఘ‌వేంద్ర‌రావు అతిథి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. మూవీని ఆయ‌న శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేశారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో  మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ను పొందింది. సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబర్ 15న విడుద‌ల చేస్తున్నారు. 


ద‌ర్శ‌కేంద్రుడు తెర‌కెక్కించిన నాటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ `పెళ్లిసంద‌డి`లో శ్రీ‌కాంత్ హీరో అయితే నేడు ఆయ‌న ద‌ర్శ‌క‌త్వ పర్య‌వేక్ష‌ణ‌లో గౌరి రోణంకి డైరెక్ట్ చేస్తున్న ‘పెళ్లిసంద‌D’లో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరో అవ‌డం విశేషం. శ్రీలీల హీరోయిన్‌. ‘‘సినిమా ప్ర‌మోష‌న్స్‌ను ప్లానింగ్ ప్ర‌కారం చేసుకుంటూ రావ‌డం వ‌ల్ల సినిమా అంద‌రికీ రీచ్ అయ్యింది . ఈ సినిమా నుంచి విడుద‌లైన రాఘవేంద్ర‌రావు ప్రోమో,  హీరో, హీరోయిన్ ప్రోమోలు, సాంగ్స్, టీజర్, రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది.  సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను కూడా పూర్తి చేసుకుని క్లీన్ యు స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఈ క్యూట్ అండ్ బ్యూటీఫుల్ ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ద‌స‌రా సంద‌ర్భంగా ఈ అక్టోబర్ 15న విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు. 


నటీనటులు:


రోష‌న్, శ్రీ‌లీల, ప్ర‌కాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, రావు ర‌మేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, స‌త్యంరాజేష్‌, రాజీవ్ క‌నకాల‌, శ్రీ‌నివాస్ రెడ్డి, శక‌లక శంక‌ర్‌, అన్న‌పూర్ణ‌, జాన్సి, ప్ర‌గ‌తి, హేమ‌, కౌముది, భ‌ద్రం, కిరీటి త‌దిత‌రులు.. 


సాంకేతిక వ‌ర్గం: 


సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి

సాహిత్యం: శివ‌శ‌క్తి ద‌త్త‌, చంద్ర‌బోస్

సినిమాటోగ్ర‌ఫి: సునీల్ కుమార్ నామ

ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు

ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్ మ‌న్నె,

‌మాట‌లు: శ్రీ‌ధ‌ర్ సీపాన‌

ఫైట్స్‌: వెంక‌ట్

కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్ వీజే

ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: వి. మోహ‌న్ రావు,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సాయిబాబా  కోవెల‌మూడి

స‌మ‌ర్ప‌ణ‌: కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌

నిర్మాత‌లు: మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని

ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: కె. రాఘ‌వేంద్ర‌రావు బి.ఎ

ద‌ర్శ‌క‌త్వం: గౌరీ రోణంకి.

aha announces a new web series 3 Roses with director Maruthi as showrunner an intriguing first poster launched

 aha announces a new web series 3 Roses with director Maruthi as showrunner; an intriguing first poster launched



100% Telugu platform aha, a household name for Telugu entertainment, is coming up with an exciting web series titled 3 Roses. Renowned director Maruthi Dasari, with hits like Bhale Bhale Magadivoy, Prathi Roju Pandage, Ee Rojullo and Mahanubhavudu to his credit, is the showrunner of what's the first female-trio web series in the Telugu digital space. Written by Ravi Namburi and directed by Maggi, 3 Roses is produced by SKN (he had also produced Vijay Deverakonda's hit film Taxiwaala) under Action Cut Movies LLP. An eye-catching first poster of the show, featuring three young women in a bar, was released on Friday.


The poster, with the tagline 'Blooming soon', leaves audiences curious about the leading faces of 3 Roses and teases them to play the guessing game. The production design and the colourful costumes of the characters instantly win your attention. The fact that the platform didn't choose to reveal the actors in this first glimpse has generated more anticipation among audiences around 3 Roses. 


While Allu Arjun had revealed that director Maruthi will be ideating a show for aha at the Aha grand reveal event held in 2020, it's impressive that the filmmaker has delivered on his promise within a year. Maruthi, who's directed several commercially successful, entertaining films like Ee Rojullo, Prema Katha Chitram, Prathi Roju Pandage, Bhale Bhale Magadivoy and Mahanubhavudu, is a name synonymous with his uncanny premises, rib-tickling humour, and it's certain that 3 Roses will be a fun ride with all the key ingredients that define him as a storyteller. Balreddy is the cinematographer of 3 Roses, while the editor is SB Uddhav. Uyyala Jampala fame MR Sunny is composing the music.


aha, over the recent months, has delivered one hit after the other in the web space with their three originals, Kudi Yedamaithe, Tharagathi Gadhi Daati and The Baker and the Beauty, impressing audiences and garnering critical acclaim. The three originals belonged to different genres, from sci-fi thriller to teenage drama and a slice-of-life rom-com, and the performances, execution received praise from all corners. The next few months are going to be nothing less than a feast for audiences on aha with several promising web shows slated for release.


aha is home to some of the biggest Telugu releases in 2021, including Krack, 11th Hour, Zombie Reddy, Chaavu Kaburu Challaga, Naandhi, In the Name of God, Needa, Kala, aha Bhojanambu, One, Super Deluxe, Chathur Mukham, Kudi Yedamaithe, Tharagathi Gadhi Daati, The Baker and the Beauty, Maha Ganesha, Parinayam, Orey Baammardhi and Ichata Vahanamulu Nilupa Radu.

Adhire Abhi "white paper "movie 1st look launch by Nagababu

 అదిరే అభి " వైట్ పేపర్ " సినిమా 1స్ట్ లుక్ విడుదల చేసిన మెగా బ్రదర్ నాగబాబు



జి.ఎస్.కె  ప్రొడక్షన్స్ పతాకంపై శివ దర్శకత్వం గ్రందే శివ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం  " వైట్ పేపర్" (White Paper). ప్రభాస్ హీరో గా నటించిన ఈశ్వర్ చిత్రంలో ప్రభాస్ ఫ్రెండ్ గా తన నట జీవితాన్ని ప్రారంభించిన అభినయ కృష్ణ, ఎన్నో చిత్రాల్లో నటుడుగా కమెడియన్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. జబర్దస్త్ టివి షో తో అదిరిపోయే కామెడీ పెర్ఫార్మెన్స్ తో అదిరే అభి గా ప్రసిద్ధి చెందాడు. ఇప్పుడు ఈ వైట్ పేపర్ చిత్రం తో హీరో గా పరిచయం కాబోతున్నాడు.


ఈ చిత్రాన్ని కేవలం 9 గంటల 51 నిమిషాల వ్యవధిలో పూర్తి చేశారు. ఈ సందర్భంగా  ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు అరుదైన చిత్రంగా సత్కరించారు. ఈ  వైట్ పేపర్ చిత్రం మొదటి  పోస్టర్ ని మెగా బ్రదర్  నాగబాబు గారు విడుదల చేశారు.



ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ "వైవిధ్య కథనాలు ఎంచుకోవడంలో మా అభి ముందు ఉంటాడు, జబర్దస్త్ లో తన టాలెంట్ తో తెలుగు ప్రేక్షకులని మీపించాడు. ఇప్పుడు ఈ వైట్ పేపర్ సినిమా తో హీరో గా పరిచయం అవుతున్నాడు. ఫస్ట్ లుక్ డిఫరెంట్ గా ఉంది. సినిమా ని కూడా కేవలం 9 గంటల 51 నిమిషాలు పూర్తి చేసి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం సంపాదించారు. అభి అండ్ వాళ్ళ టీం పడిన కష్టానికి ఈ సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను, టీం అందరికి నా

శుభాకాంక్షలు" అని అన్నారు.


హీరో అభి మాట్లాడుతూ " మొన్న విడుదల చేసిన టైటిల్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు మా సినిమా ఫస్ట్ లుక్ ని నా ఫేవరెట్ నటులు మెగా బ్రదర్  నాగబాబు గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది" అని తెలిపారు.


డైరెక్టర్ శివ మాట్లాడుతూ "సస్పెన్స్ కథనంతో తెరకెక్కిన ఈ సినిమా లో అభి హీరో గా నటించారు. నాగబాబు గారి బ్లెస్సింగ్స్ మా టీం అందరికీ ఉండాలి, పోస్టర్ చూస్తుంటే మేము పడిన కష్టం మరిచిపోతున్నాం, ఇలా పెద్దలందరు మా సినిమా ని , మేము చేసిన ప్రయోగాన్ని మెచ్చుకుంటున్నారు, చాలా సంతోషంగా ఉంది" అన్నారు.



ఈ కార్యక్రమంలో  రాజశేఖర్,  శ్యామ్ ప్రసాద్, రవి వంశీ లు పాల్గొన్నారు.


అదిరే అభి ( అభినయ కృష్ణ), వాణి, తల్లాడ సాయి కృష్ణ ,నేహా, నంద కిషోర్ తదితరులు నటించిన ఈ సినిమా కి

నిర్మాత - గ్రంథి శివ కుమార్, డైరెక్టర్- శివ,కేమేరా- మురళి కృష్ణ,

ఎడిటింగ్- కె.సి.బి. హరి

సంగీతం - నవనిత్ చారి,

పి.ఆర్.ఓ- పవన్ పాల్.

Anti Virus Movie Audio Released

 యాంటీ వైరస్ సినిమా పాటల విడుదల



ఏం. కె క్రియేషన్స్ బ్యానర్ పైన  రాజ్ కుమార్ నిర్మిస్తూ, హీరో గా నటిస్తున్న సినిమా "యాంటీ వైరస్". ఈ చిత్రానికి సుభాష్ దర్శకుడు. ఈ చిత్రం యొక్క ఆడియో రిలీజ్ వేడుక ఇటీవలే జరిగింది. హీరోయిన్లు ప్రియమణి, పూర్ణ మరియు డాన్స్ మాస్టర్ గణేష్ లు ఈ చిత్రం యొక్క పాటలు  విడుదల చేసి వారి శుభాకాంక్షలు తెలిపారు.


ఈ సందర్భంగా డాన్స్ మాస్టర్ గణేష్ మాట్లాడుతూ "హీరో నిర్మాత  రాజ్ కుమార్ నాకు మంచి మిత్రుడు, తను చేసిన డ్యాన్స్, ఫైట్స్ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. పాటలు చాలా బాగున్నాయి, సినిమా కూడా మంచి విజయవంతం అవ్వాలి" అని కోరుకున్నారు.



హీరోయిన్ ప్రియమణి మాట్లాడుతూ "టైటిల్ చాలా డిఫరెంట్ గా ఉంది, ప్రస్తుతం ఉన్న కోవిడ్ కి ఈ సినిమా యాంటీ డోస్ లాగా ఆడియన్స్ ని మెప్పించాలి. పాటలు మరియు ట్రైలర్ చూసాను, సినిమా కొత్తగా ఉంది. మంచి విజయం సాధించాలి" అని తెలిపారు.



హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ "సాంగ్స్ చాలా బాగున్నాయి, అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది, సినిమా లోని కొన్ని షాట్స్ చూసాను చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి,టీం అందరికీ బెస్ట్ విషెస్.



హీరో & నిర్మాత రాజ్  కుమార్ మాట్లాడుతూ "నేను అడగగానే మా సినిమా పాటలు విడుదల చేసిన గణేష్ మాస్టర్ కి, పూర్ణ గారికి, ప్రియమణి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీం అందరూ ఎంతో కష్టపడి ఈ సినిమా ని నిర్మించాం, మా హీరోయిన్ లు అనూష, నందిత లు డెడికేషన్ తో వర్క్ చేశారు. పాటలు ,ఫైట్స్ , మెసేజ్ ఇలా అన్ని అంశాలు మా సినిమా లో ఉన్నాయి, కమర్షల్ సినిమా కి ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ని తీయడం జరిగింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు.



ఈ సినిమా కి కెమెరా-  శ్రీనివాస్ సబ్బి, సంగీతం - మురళి లియోన్,

లిరిక్స్ - లక్ష్మిభాస్కర్ కనకాల,

డాన్స్ :-

గోరా మాస్టర్,

నరేందర్ మాస్టర్,

చార్లీ మాస్టర్,

పి.ఆర్.ఓ - పవన్ పాల్.

Yekkadiko Ee Adugu in Censor Works

 సెన్సార్ సన్నాహాల్లో

"ఎక్కడికో ఈ అడుగు'



     'ఎఫెక్ట్స్ రాజు'గా పరిశ్రమ వర్గాలకు సుపరిచితుడైన రాజు బొనగాని దర్శకత్వంలో... 'స్కై లైన్ ఎంటర్ టైన్మెంట్స్' పతాకంపై తొలి ప్రయత్నంగా అట్లూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రం "ఎక్కడికో ఈ అడుగు". పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ సన్నాహాల్లో ఉంది.

     గోపీకృష్ణ-ప్రియాంక చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆర్తి రాజ్, జయప్రకాష్ (తమిళ్), తోటపల్లి మధు, పిల్లా ప్రసాద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

     1990లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా.. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన "ఎక్కడికో ఈ అడుగు" అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం తమకుందని, సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న తమ చిత్రాన్ని నవంబర్ ద్వితీయార్ధంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు రాజు బొనగాని తెలిపారు.

     నిర్మాత అట్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ..."చిత్ర నిర్మాణంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ "ఇనావర్స్ స్టూడియో"కు అప్పగించాం. మాకు ప్రామిస్ చేసిన బడ్జెట్ లో... మాకు ప్రామిస్ చేసిన దానికంటే మంచి క్వాలిటీతో పూర్తి చేశారు. ఈ సందర్భంగా "ఇనావర్స్ స్టూడియో"వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం" అన్నారు.

    ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, కో-డైరెక్టర్: నాగరాజు, ఆర్ట్: వెంకటేష్ ఆరె, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, సంగీతం: దిలీప్ బండారి, మాటలు: రమన్ లోక్ వర్మ, ఛాయాగ్రహణం: ఈశ్వర్ ఎల్లుమహంతి, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర్రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తాతినేని సుజన్ బాబు, నిర్మాత: అట్లూరి శ్రీనివాస్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రాజు బొనగాని!!

Tollywood Producers Met Powerstar Pawankalyan



టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కళ్యాణ్ గార్ని ఈ రోజు ఉదయం ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, దానయ్య, నవీన్ ఎర్నేని, వంశీ రెడ్డి, సునీల్ నారంగ్, బన్నీ వాసు లు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్రపరిశ్రమకు సంభందించిన సమస్యల గురించి సృహృద్భావ వాతావరణంలో వీరి మధ్య చర్చలు జరిగాయి.

Aata Naadhe Veta Naadhe Releasing on October 2nd

 అక్టోబరు 2 న గ్రాండ్ గా విడుదలవుతున్న "ఆట నాదే.. వేట నాదే.."



 వీరాంజనేయులు &  రాజ్యలక్ష్మి సమర్పించు  భరత్, సంచిత శెట్టి,చాందిని తమిళ రసన్, ఖతీర్ ,

రాధా రవి ,యోగ్ జపి, ఆత్మ పాట్రిక్, గడ్డం కిషన్  నటీనటులుగా అరుణ్ కృష్ణస్వామి దర్శకత్వంలో కుబేర ప్రసాద్ నిర్మించిన చిత్రం "ఆట నాదే.. వేట నాదే" .అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం అక్టోబర్ 2 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. ఈ  సందర్భంగా


 *చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ ..* మనిషి జీవితమే ఒక ఆట ప్రేమ అనే ఆటలో గెలవాలంటే మనుసులను  గెలవాలి,  మనసులను గెలవాలంటే గెలుపోటములు ఉంటాయి . గెలుపు ఓటమి అనేది ప్రతి ఆట లో ఉంటాయి .ఒక ప్రేమికుడు తను  కోరుకున్న అమ్మాయిని గెలుచు కోవడం కోసం గుర్రపు పందేలు ఆడదానికి సిద్ధమయ్యి ఆఖరి రూపాయి వరకు తను ఎంత కష్టపడ్డాడు ఆ గుర్రపు పందేలు ఎంతోమంది హేమాహేమీలు ఉన్నా.. గుర్రపు పందేలలో తను నెగ్గి తన ప్రేమను గెలిపించు కున్నాడా..తను గెలిచాడా.. ఒడిపోయాడా.. తనకోసం అనుకోని  ఇంకొక తన ఫ్రెండ్ ను ఈ ఉచ్చు లోకి లాగితే అమాయకుడైన ఫ్రెండ్ తను కూడా ఈ పోటీకి సిద్ధమై తను  సహాయ పడ్డాడా.. తను గెలిచాడా.. తన ప్రేమను గెలిపించుకున్నాడా... గెలుపు ఓటమి అనేది మనిషికి ముఖ్యం అది ప్రేమ కావచ్చు జీవితంలో కావచ్చు  ఆటలో అవ్వచ్చు అయితే ఈ ఆట ఆడేటప్పుడు ప్రేమ  మనిషిని గెలిపించుకోవడం కోసం రేస్ ఆడవలసిన అవసరం లేదు అని చెప్పవచ్చు.అలాగే మనిషి తన ప్రేమను గెలిపించుకోవడం కోసం  దేనికైనా  తెగిస్తాడు  అనేది సినిమా ఇతి వృత్తం. తనని తాను గేలుసుకోవడం కోసం తనను తన మనసు చేసిన చేసిన అమ్మాయిని  గెలుచుకోవడం కోసం ఇద్దరు కుర్రాళ్లు ఈ ఆటలో పోటీపడి ఎలా నెగ్గారు. తన ప్రేమను ఎలా గెలిపించుకున్నారు తన జీవితంలో ఎలా గెలిచారు   అనేదే మా "ఆట నాదే.. వేట నాదే".. అంటే ఆట కోసం వేట మొదలెట్టాలి ఆ  వేట సక్సెస్ అయితే మన ఆట ఆడి గెలిచినట్లే..అందుకే  ఈ చిత్రానికి  ఆట నాదే.. వేట నాదే.. టైటిల్ పెట్టడం జరిగింది.సినిమా చాలా బాగా వచ్చింది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబరు 2 న విడుదల చేస్తున్నాము. ఈ సినిమా ప్రేక్షకులందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.


 *నటీనటులు* 

భరత్, సంచిత శెట్టి,చాందిని తమిళ రసన్, ఖతీర్ ,రాధా రవి , యోగ్ జపి, ఆత్మ పాట్రిక్, గడ్డం కిషన్ తదితరులు 



 *సాంకేతిక నిపుణులు* 

సమర్పణ :-వీరాంజనేయులు & రాజ్యలక్ష్మి 

నిర్మాత :- కుబేర ప్రసాద్ 

రచన దర్శకత్వం :-అరుణ్ కృష్ణస్వామి 

సహ నిర్మాతలు :- అక్కినేని శ్రీనివాసరావు, అట్లూరి సురేష్ బాబు 

సంగీతం :- ఏ మోసెస్ 

ఛాయాగ్రహణం :; యువ 

కూర్పు :- గోపికృష్ణ 

వి.ఎఫ్.ఎక్స్  :-చందు ఆది - అండ్ టీం 

ఆర్ట్ డైరెక్టర్ :- సుబ్బు.ఏ 

నృత్యం :-  విజయ సతీష్ 

పాటలు, మాటలు :-భారతీబాబు 

నేపథ్య సంగీతం :- సుదర్శన్ కుమార్ 

పి.ఆర్.ఓ :- మధు వి.ఆర్

Most Eligible Bachelor Trailer Launched Grandly

 అంగ‌రంగ వైభవంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్



అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో  మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం ట్రైలర్ ను విడుదల చేశారు.  అక్టోబర్ 15న  ఈ సినిమా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్ర  నిర్మాత లు  ఈ సందర్భంగా.. 


 చిత్ర సమర్పకుడు అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ .. గీతా ఆర్ట్స్ లోగాని,జి.ఏ 2 లో గాని సినిమాలు హిట్స్ అయ్యాయి అంటే అవి మా వల్ల కాదు అవి మీ వల్లే..అందుకే ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. ఇండియాకు మన తెలుగు ప్రేక్షకులు  ఒక లెషన్ నేర్పించారు. సినిమా రిలీజ్ చేస్తే ప్రేక్షకులు వస్తారనే నమ్మకాన్ని హిందీ వారికి మన తెలుగు వారు కలిగించారు..కరోనా వలన సినిమా విడుదల చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందుకే ఈ ప్రభుత్వాన్ని విన్నవించు కుంటున్నాము ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ ని తెలుసుకొని వాటిని సాల్వ్ చేయవలసిందిగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి ని కోరుతున్నాము. అలాగే హీరో హీరోయిన్లు ఇందులో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు .మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది అని అన్నారు. 


 నిర్మాత బన్నీ వాసు, వాసు వర్మ లు మాట్లాడుతూ.. ఈ కథ  మాకు నచ్చడంతో సినిమా షూట్ కి వెళ్ళడం జరిగింది.  ఒక  రిలేషన్షిప్ నుంచి డిఫరెంట్ యాంగిల్స్ ని దర్శకుడు చూపించాడు .మేము చాలా కథలు వింటూ ఉంటాం కానీ కొన్ని కథలు లైఫ్  మీద ఇంపాక్ట్ చూపిస్తుంటాయి అలాంటిదే ఈ కథ. నా బిఫోర్ మ్యారేజ్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్ 100 శాతం చేంజ్   అయ్యిందని చెప్పలేను కానీ ఈ సినిమాలో ఉండే ఆరు క్వశ్చన్ లు నా లైఫ్ లో అక్కడక్కడ తగులుతూ ఉన్నాయి . ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి వ్యక్తి తన భార్య  చేయి పట్టుకుని వెళ్తాడని ఖచ్చితంగా చెప్పగలను.అందుకే మాకు ఈ సినిమా పై ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చింది. నటీనటులందరూ చాలా చక్కగా నటించారు. ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు.



 చిత్ర దర్శకుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ మాట్లాడుతూ. .నేను ఎక్కువగా లవ్ స్టోరీస్ రాయను .లైఫ్ గురించి ఎక్కువగా రాస్తాను.లైఫ్ స్టొరీ లో లవ్ స్టొరీ వస్తుంది.  మనిషి లైఫ్ ను ఎలా లీడ్ చెయ్యాలి అనే కొశ్చన్ కు ఒక దారి దొరికితే దాన్ని ఫాలో అయ్యాను.ఇదంతా రాయడం నాకు చాలా స్త్రగుల్ అనిపించింది.. అయినా  వాసు వర్మ  నాకు సపోర్ట్ గా నిలిచాడు. ఫ్రెస్ కంటెంట్ తో వస్తున్న చిత్రమిది. అఖిల్ ను ఈ సినిమాలో ఫ్రెస్ గా చూస్తారు. అఖిల్,పూజ కెమిస్ట్రీ చాలా బాగుంది. అలాగే బన్నీ వాసు, అరవింద్ గార్ల సపోర్ట్ తో ఇక్కడిదాక వచ్చింది . అందరికీ  ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని అన్నారు. 


 చిత్ర హీరో అఖిల్ మాట్లాడుతూ.. ఈ సినిమా ఐ ఓపెనర్ గా ఉంటుంది ఈ సినిమా ను ఫ్యామిలీతో వచ్చి చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ మాకు ఇలాంటి ఇన్సిడెంట్  జరిగిందని గుర్తు చేసుకుంటారు.  సినిమా లో చాలా బాగుంటుంది . దర్శకుడు భాస్కర్ చాలా చక్కగా తీశాడు.నిర్మాతలు ఒక బ్రిడ్జి లా ఉండి మాకు సపోర్ట్ గా నిలిచారు ఈ సినిమా చాలా బాగా వచ్చింది అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని అన్నారు 


ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ చిత్రం పెద్ద విజయం సాదించాలని అన్నారు. 


న‌టీ న‌టులు :


అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్ తదితరులు.. 


సాంకేతిక నిపుణులు: 


దర్శకుడు : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్

నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌

బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్

స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య గమడి

మ్యూజిక్ : గోపీ సుంద‌ర్

సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ

ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్

ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా

పీఆర్ఓ : ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Jai Sena Karnataka Distribution by DS Rao V Samudra

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

"జనసేన"ను కర్ణాటకలో

విస్తరిస్తున్న డి.ఎస్.రావ్-వి.సముద్ర



    జనసేనాధినేతగా అప్రతిహతంగా సాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు వి.సముద్ర తెలుగులో రూపొందించిన "జైసేన" చిత్రాన్ని కన్నడలో అనువదిస్తున్నారు ప్రముఖ నటుడు-నిర్మాత డి.ఎస్.రావు. 

    శ్రీకాంత్, సునీల్, తారక్ రత్న, శ్రీరామ్, సత్యం రాజేష్, ప్రవీణ్, హరీష్ గౌతమ్, అభినవ్ మణికంఠ, విశ్వకార్తికేయ, నీతూ గౌడ్, ఆరాధ్య, మనోచిత్ర, అజయ్ ఘోష్, చమ్మక్ చంద్ర, డి.ఎస్.రావ్, పృథ్వి ముఖ్యపాత్రలు పోషించిన "జై సేన" చిత్రం మెగా-పవర్ ఫ్యాన్స్ తోపాటు  అందరినీ అమితంగా ఆకట్టుకుంది. 

      ఈ చిత్రాన్ని గణపతి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.ఎస్.రావ్ కన్నడ ప్రేక్షకులకు అందిస్తున్నారు. తెలుగులో ఘన విజయం సాధించిన "జై సేన" కన్నడలోనూ మంచి విజయం కైవసం చేసుకోవడం ఖాయమని దర్శకుడు వి.సముద్ర పేర్కొన్నారు.

      ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వాసు, కూర్పు: నందమూరి హరి, నిర్మాత: డి.ఎస్.రావ్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: వి.సముద్ర!!

Maanaadu Trailer To Be Revealed By Nani

 125 కోట్ల భారీ బడ్జెట్ 

బహు భాషా చిత్రం "మానాడు" 

ట్రైలర్ రిలీజ్ చేస్తున్న 

నేచురల్ స్టార్ నాని!!



     తెలుగులోనూ సుప్రసిద్ధుడైన సూపర్ స్టైలిష్ తమిళ్ స్టార్ శింబు-కల్యాణి ప్రియదర్శన్ జంటగా... క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో.. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత 'సురేష్ కామాచి" 125 కోట్ల భారీ బడ్జెట్ తో హిందీ-తమిళ్-తెలుగు-కన్నడ-మలయాళ భాషల్లో నిర్మిస్తున్న బహుభాషా చిత్రం "మానాడు" ట్రైలర్ నేచురల్ స్టార్ నాని అక్టోబర్ 2, గాంధీ జయంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు ముస్లింగా నటిస్తుండడం గమనార్హం.

     సుప్రసిద్ధ దర్శకులు భారతీరాజా, ఎస్.ఏ.చంద్రశేఖర్, ఎస్.జె.సూర్య ఈ చిత్రంలో నటిస్తుండడం విశేషం. తమ చిత్రం 'మానాడు' తెలుగు ట్రైలర్.. నేచురల్ స్టార్ నాని విడుదల చేయనుండడం పట్ల దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు!!