Latest Post

Tremendous Response for Most Eligible Bachelor Trailer

 ఎమోషనల్ జర్నీగా అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ట్రైలర్‌.. ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన..



అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో  మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రతీ కంటెంట్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ప్రేమ, కెరీర్, పెళ్లి చుట్టూ అన్ని అంశాలు ముడిపెడుతూ ఎమోషనల్ జర్నీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్. 2.04 నిమిషాల ట్రైలర్ అంతా చాలా ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా మధ్యలో పెళ్లి, పార్ట్‌నర్ గురించి వచ్చే మాటలు అద్భుతంగా ఉన్నాయి. సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్మకంగా చెప్తున్నారు చిత్ర యూనిట్. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ వస్తుంది. ఈ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు మేకర్స్.


న‌టీ న‌టులు:

అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్ తదితరులు..


సాంకేతిక నిపుణులు:


దర్శకుడు : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్

నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌  

బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్  

స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్  

మ్యూజిక్ : గోపీ సుంద‌ర్

సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ

ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్

ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా

పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్


Hero Srikanth Interview About Idhe Maa Kadha

 ఇదే మా కథ’ లాంటి చిత్రాలను తెరకెక్కించాలంటే నిర్మాతలకు గట్స్ ఉండాలి -  శ్రీకాంత్



సుమంత్‌ అశ్విన్‌, శ్రీకాంత్‌, భూమిక, తాన్య హోప్‌లు కలిసి నటించిన చిత్రం ‘ఇదే మా కథ’. శ్రీమతి గుర్రప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద జీ మహేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు గురు పవన్‌ దర్శకుడు. ఈ చిత్రం అక్టోబర్‌ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్ గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు.


గురు వచ్చి ఓ సబ్జెక్ట్  చెప్పాడు. అది తన డ్రీమ్ అని చెప్పాడు. రియల్ ఇన్సిడెంట్‌లు కూడా ఉంటాయి. ఓ నలుగురు బైక్ ట్రావెల్లర్స్ కలవడం, వారి కష్టాలను ఒకరినొకరు ఎలా పంచుకున్నారు.. ఎలా పరిష్కరించుకున్నారు అనేదే కథ. ఇక్కడి నుంచి లడఖ్ వరకు బైక్ రైడింగ్ అని చెప్పడంతోనే షాక్ అయ్యాను. ఇది యూత్‌ను టచ్ చేసే కథ అని చాలా రోజుల తరువాత మళ్లీ వచ్చిందని ఓకే చెప్పాను. ఇందులో మహేంద్ర పాత్రలో కనిపించబోతోన్నాను. 24 ఏళ్ల క్రితం మిస్ అయిన అమ్మాయిని కలుసుకునేందుకు లఢఖ్ వెళ్తాడు. బైక్‌లోనే ఎందుకు వెళ్తాడు అనే దానికి కూడా ఓ కథ ఉంటుంది. భూమిక ఇందులో ఓ గృహిణిగా, ఇద్దరు పిల్లల తల్లిగా కనిపిస్తుంది. వాళ్ల నాన్న కలలను నిజం చేసేందుకు ఓ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి లడఖ్‌లో జరిగే ఈవెంట్‌లో పొందు పరిచేందుకు వస్తుంది. ప్రతీ యంగ్ స్టర్‌కి ఓ కల ఉంటుంది. కానీ తల్లిదండ్రులు మాత్రం అది వద్దు ఇది వద్దు అని అంటుంటారు. కానీ అవేం ఇష్టముండవు. బైక్ రేసింగ్‌లంటే ఇష్టపడే క్యారెక్టర్. ఇంకో క్యారెక్టర్ థాన్యా హోప్ అనే అమ్మాయి మాతో ఎలా కలిసి ఎందుకు కలిసింది అనేది కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.


కులు మనాలి నుంచి లడఖ్ వరకు బైక్ మీద షూటింగ్ చేశాం. అంతకు ముందు కొంత మేం చేశాం.. కొంత టీం మాత్రమే వెళ్లి షూటింగ్ చేసింది.  యువతలో ఆలోచనలు రేకెత్తించేలా చిత్రం ఉంటుంది. కలను సాకారం చేసుకునేందుకు చాలా కష్టపడాలి. సంకల్పం లేకపోతే లక్ష్యాన్ని మనం చేరుకోలేమనే థీమ్‌తో నడుస్తుంది. అయితే షూటింగ్ చేసేటప్పుడు మాత్రం మేం ఎక్కువగా భద్రత గురించే ఆలోచించాం. నాకు, సుమంత్‌కు బైక్ రైడింగ్ వచ్చు. కానీ భూమిక,  థాన్యా హోప్‌లను పెట్టుకుని చేయడం చాలా కష్టమయ్యింది. అందుకోసమే మేం రియల్ బైక్ రైడర్స్‌ను కూడా తీసుకున్నాం. వాళ్ల సూచనలతోనే ముందుకు వెళ్లాం. అలా ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాం. ఇలాంటి చిత్రాలను తెరకెక్కించాలంటే నిర్మాతలకు గట్స్ ఉండాలి. ఏదో పేరుకే బైక్ రైడింగ్ మీద సినిమా తీశామని కాదు. ఇంత మంది అక్కడికి తీసుకెళ్లడం మామూలు విషయం కాదు. డైరెక్టర్ ఏం అనుకున్నారో అది తెరకెక్కించేలా నిర్మాత సహకరించారు.


నాకు బైక్ రైడింగ్‌లంటే చాలా ఇష్టం. నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో బైక్ మీదే తిరిగేవాడిని. మద్రాస్ నుంచి హైద్రాబాద్‌కు కూడా బైక్ మీదే వచ్చేవాడిని. ఇక బాధ్యతలు పెరుగుతున్న సమయంలో భద్రత దృష్ట్యా బైక్‌లను పక్కన పెట్టేశాను. కానీ మళ్లీ ఇలా బైక్ రైడింగ్ చేయడం ఆనందంగా అనిపించింది. నా సీన్ లేకపోయినా కూడా బైక్ ఎక్కి తిరిగేవాడిని. చేతులు వదిలేసి మరీ నడిపేవాడిని. అలా రోడ్డు మీద డిఫరెంట్ లొకేషన్స్‌ను చూసుకుంటూ వెళ్లడం ఎంతో ఆనందంగా అనిపించింది.


మామూలుగా బైకర్స్ అంతా కూడా ఢిల్లీలో కలుస్తుంటారు. అక్కడి నుంచి ట్రూప్‌గా వెళ్తారు. ఆ జర్నీని వాళ్లు ఎంజాయ్ చేస్తుంటారు. ఈ గ్రూపుల్లో కలిసిన వాళ్లంతా కూడా జీవితాంతం ఫ్రెండ్స్ అవుతుంటారు. వారి జీవిత కష్టాలను కూడా ఇందులో చూపించాం.


కులుమనాలి చేసిన షూటింగ్ చాలా కష్టంగా అనిపించింది. చలిలో అంత దూరం బైక్ నడపడం, హెల్మెట్స్ పెట్టుకోవాలి.. మొహాలు కూడా కనపడాలి.. అలాంటి ప్లేస్‌లో షూట్ చేయడం చాలా కష్టం. రేసర్స్ సాయంతో అలా 15 కిలో మీటర్ల దూరం వెళ్లి షూటింగ్ చేసేశాం.


నలుగురు క్యారెక్టర్స్ చుట్టూ తిరిగే కథ ఇది. గురుకు ఉన్న ప్యాషన్, డ్రీమ్ ఇది. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదలవుతోంది.  నేను చూశాను. మాకు సంతృప్తిగా అనిపించింది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఇలా అన్నీ కూడా బాగున్నాయి. దర్శకుడు కొత్తవాడు. ఆయనకు కొన్ని భావాలున్నాయి. అన్ని రకాల ఎమోషన్స్ ఉండేలా చూసుకున్నాడు. పృథ్వీ క్యారెక్టర్‌తో  కామెడీని కూడా జోడించాడు.


జీవితం అంటే ఏంటి? మనం కన్న కలలను సాకారం చేసుకునేందుకు, అనుకున్న లక్ష్యాలను ఎలా  చేరుకోవాలి? వాటి కోసం ఎంతలా కష్టపడాలి అనేది ఈ చిత్రంలోని సందేశం.


మేం ఇద్దరం ఇంత వరకు కలిసి పని చేయలేదు. భూమిక గారు ఎంతో చక్కగా నటించారు. ఎప్పుడూ చీరలో కనిపించే భూమిక ఇలా రైడర్ లుక్కులో కనిపించడం కొత్తగా ఉంటుంది. అసలు ఈ  పాత్ర చేస్తారా? లేదా? అని అందరం అనుకున్నాం. కానీ ఆమె కథ విన్న వెంటనే ఓకే చెప్పేశారు. ఫ్లాష్ బ్యాక్‌లో నాకు ఓ జంట ఉంటుంది. ఆమెను కలిసేందుకే అక్కడికి వెళ్తాను. ఆమె బైకును చూసే నన్ను ఇష్టపడుతుంటుంది. నన్ను గుర్తు పట్టకపోయినా ఆ బైకును అయినా కూడా గుర్తుపడుతుందని వెళ్తాడు.


రోషన్‌ను ఇప్పుడే దింపే  ఆలోచన లేదు. ఇంకో ఏడాది ఆగుదామని అనుకున్నాం. లాస్ ఏంజిల్స్‌లో నటనలో శిక్షణ తీసుకున్నాడు. ఆ తరువాత సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 సినిమాకు  ప్రభుదేవా దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడు. ఎక్స్‌పీరియన్స్ కోసం అవన్నీ చేశాడు. నేను కేవలం సాయం మాత్రమే చేశాను.


ఓ సారి రాఘవేంద్ర రావు గారు  ఫోన్ చేసి రోషన్ గురించి అడిగారు. ఇంకా చిన్నపిల్లవాడే  కదా? అని అన్నారు. అది పదేళ్ల క్రితమండి.. ఇప్పుడు కాదు అని అన్నాను.  ఓసారి నా దగ్గరికి తీసుకురావా? అని అడిగారు. అలా మేం ఇద్దరం వెళ్లాం. పెళ్లి సందడి ఫ్లేవర్‌తో అదే టైటిల్ పెట్టి సినిమా తీసేందుకు  స్క్రిప్ట్ వరకు కూడా రెడీ అయింది. రోషన్ కోసం అనే కాదు కానీ కథను రెడీ చేసుకున్నారు. కానీ మధ్యలో ఎవరో చెప్పినట్టున్నారు. శ్రీకాంత్ కొడుకు అయితే బాగుంటుందని అన్నట్టున్నారు. అలా రోషన్‌ను చూసి.. కరెక్ట్‌గా సరిపోయాడు.. ఈ ఏజ్‌ ఉండాలనే అనుకున్నాని అని రాఘవేంద్రరావు గారు అన్నారు. అలా సినిమా ఆఫర్ వచ్చింది.


రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా ఎంతో మంది హీరోలు లాంచ్ అయ్యారు. ఆ అవకాశం రావడం రోషన్ అదృష్టం. ఆయన ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారు. అలాంటి వారి దర్శకత్వంలో రోషన్ చేయడం ఆనందంగా ఉంది.


పోలికలు అయితే అందరూ పెడతారు. అది తెలిసిన విషయమే. ఎవరు బాగా చేశారు? ఎవరు బాగున్నారు? అని తేడాలు చూస్తారు. కానీ నాకంటే  రోషన్ బాగుంటాడు. అది అందరికీ తెలిసిన విషయమే. మనం కష్టపడితేనే గుర్తింపు వస్తుంది. మొదటి సినిమానే కదా? నేను ఎక్కువగా గర్వంగా చెప్పుకోకూడదు. పొగడకూడదు.


ఇప్పుడు వస్తున్న జానర్లకంటే కొత్తగా ఉంటుంది. పెళ్లిలో ఉండే గోల, ఆ సందడి, కామెడీ, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ పాత్ర ఇలా అన్నీ బాగుంటాయి. మహిళా ప్రేక్షకులందరూ కూడా వచ్చి చూసే  చిత్రమవుతుంది. ఎఫ్ 2 సినిమా ఎంత ఫ్రెష్‌లా అనిపించిందో.. పెళ్లి సందD కూడా అంతే ఫ్రెష్‌గా ఉంటుంది. సాంగ్స్, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్స్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఇందులో బాస్కెట్ బాల్ ప్లేయర్‌గా రోషన్ కనిపించబోతోన్నారు.


అక్టోబర్ 2న మా సినిమా విడుదల కాబోతోంది. నిర్మాతలు చాలా కష్టపడ్డారు. గురుకు ఇది చాలెజింగ్ మూవీ. డిఫరెంట్ మూవీ ఇది. ఈ చిత్రం హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందో  చూడాలి.


అఖండ సినిమాలో కొత్తగా కనిపిస్తాను. ఫ్రెష్‌గా కనిపిస్తాను. దాని కోసం ముంబై నుంచి డిజైనర్లను తీసుకొచ్చారు. రగ్డ్ గెటప్‌లో ఉంటాను. మహిళా ప్రేక్షకులు మళ్లీ నన్ను తిడతారేమో అని అనుకునేవాడిని. బయటకు  మాత్రం చూపించడం లేదు. ఎప్పుడైనా లుక్ రివీల్ చేస్తారా? లేదా నేరుగా సినిమాలోనే చూపిస్తారా? అన్నది తెలియదు.


శ్రీరామరాజ్యం సినిమాలో లక్ష్మణుడిగా బాలకృష్ణ పక్కన  చేశాను. మళ్లి ఇంత క్రూరమైన పాత్రలో కనిపిస్తే బాగుంటుందా? అని అన్నాను. ఇలాంటి పాత్రలే చేయాలి. దీని తరువాత చాలా క్యారెక్టర్స్ వస్తాయి. కానీ ఏది పడితే అది  చేయకు అని బాలకృష్ణ సలహా ఇచ్చారు. అది మన మంచికే. బాలకృష్ణ గారు కథలు వింటే అందరికీ సజెస్ట్ చేస్తుంటారు.


సాయి ధరమ్ తేజ్ చాలా మంచివాడు. మేమంతా కలిసి క్రికెట్  ఆడేవాళ్లం. బైక్ ప్రమాదాలు అనేవి సాధారణంగా జరుగుతుంటాయి. సాయి ధరమ్ తేజ్‌ క్షేమంగా ఉన్నారు. ఈ రోజు కూడా మాట్లాడాను. ఇంకా త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఆయన చిత్రం రిపబ్లిక్ పెద్ద హిట్ కావాలి. మంచి బూస్టప్ ఇవ్వాలి.

Missing Releasing on October 22nd

 అక్టోబర్ 22న థియేటర్లలో “మిస్సింగ్” రిలీజ్




హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “మిస్సింగ్”. ఈ చిత్రాన్ని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించారు. “మిస్సింగ్” చిత్రంతో శ్రీని జోస్యుల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 


*అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “మిస్సింగ్” చిత్రం  అక్టోబర్ 22న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది*. ఈ సందర్భంగా


*నిర్మాతలు భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరిరావు మాట్లాడుతూ*... “మిస్సింగ్” ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. సినిమా బిగినింగ్ నుంచి ఎండ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఫస్ట్,సెకండ్ వేవ్ లను తట్టుకుని లాక్ డౌన్ లో పట్టుదలగా సినిమాను కంప్లీట్ చేశాం. అక్టోబర్ 22న మా "మిస్సింగ్" చిత్రాన్ని థియేటర్ ల ద్వారా మీ ముందుకు తీసుకు రాబోతున్నాం. మంచి హిట్ కొడతాం అనే నమ్మకంతో ఉన్నాం. అన్నారు.


*దర్శకుడు శ్రీని జోస్యుల మాట్లాడుతూ*...మమ్మల్ని ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తూ వస్తున్న అన్నయ్య బన్నీ వాసు కు థాంక్స్. ఈ కొవిడ్ వల్ల 2020 మిస్ అయ్యింది. 2021 కూడా మిస్ కాకుండా ఉండాలని ఈ నెల 22 న విడుదలకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేశాం. ఒక థ్రిల్లర్ జానర్ మూవీ చేయాలనే కోరికతో ఈ స్టోరీ అనుకున్నాం. సినిమాటోగ్రాఫర్ జన లేకుంటే మిస్సింగ్ మూవీ ఇంత బాగా వచ్చేది కాదు. మిస్సింగ్ లో బెస్ట్ మ్యూజిక్ వింటారు. థియేటర్ లో సినిమా ఉండాలనేది మా కోరిక.అలాగే ఇటీవల విడుదలైన ట్రైలర్ మరియు ప్రమోషనల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మిస్సింగ్ మూవీ నా టీమ్ ఎఫర్ట్ అందరం ఈ నెల 22 వ తేదీ కొరకు అందరం ఎదురు చూస్తున్నాం  అన్నారు.


సూర్య, ఛత్రపతి శేఖర్, రామ్ దత్, విష్ణు విహారి, అశోక్ వర్థన్, వినోద్ నువ్వుల తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సాహిత్యం - వశిష్ఠ శర్మ, కిట్టు విస్సాప్రగడ, శ్రీని జోస్యుల, మేకప్ - వెంకటేష్ బాల, కాస్ట్యూమ్స్ -  టీఎస్ రావు, ప్రొడక్షన్ డిజైనర్ - దీక్ష రెడ్డి, కాస్ట్యూమ్స్ డిజైనర్ : శ్రుతి కిరణ్, ఆర్ట్ - దార రమేష్ బాబు, పైట్స్ - పి. సతీష్, డాన్స్ - బంగర్రాజు, జీతు, స్టిల్స్ - గుంటూరు రవి, ప్రొడక్షన్ కంట్రోలర్ - బి సి చౌదరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - సాయి కె కిరణ్, ఎడిటర్- సత్య జి, సంగీతం - అజయ్ అరసాడ, సినిమాటోగ్రఫీ - జనా. డి, పీఆర్వో - జీఎస్ కె మీడియా, నిర్మాతలు - భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరిరావు నర్రా, కథా మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం - శ్రీని జోస్యుల.

Actress Nabha Natesh As Legendary Comedian Charile Chaplin

 Actress Nabha Natesh As Legendary Comedian Charile Chaplin



Nabha Natesh is master of setting temperature soaring with her red-hot

glamour show. The actress often shares eye-pleasing pics of herself in

sizzling outfits and provides glamour treat to her followers.


Now, the actress has tried her hand at cosplay as she sported the

famous ‘Charlie Chaplin’ look in this dress-up photoshoot.

Thanks to the tuxedo and the make-up, Nabha looks strikingly similar

to the master entertainer Charlie Chaplin. These photoshoot pics going

viral now on internet.


Nabha had already proved herself as a capable performer with films

like Ismart Shankar, Nannu Dochukunduvate and Solo Brathuke So Better.

She is waiting for that one catalyst film that catapults her to the

big league.

Uttej Wife Condolence Meet

 ప్రముఖ నటుడు ఉత్తేజ్ శ్రీమతి పద్మ సంస్మరణ సభ !!



ఉత్తేజ్.. ఇండస్ట్రీలో ఈ పేరు తెలీనివారంటూ ఎవరూ ఉండరు.. నటుడు, రచయిత, స్నేహశీలి, చిత్ర పరిశ్రమలోని ప్రతీ ఒక్కరోతోనూ సత్ సంబంధాలు కలిగినటువంటి మంచి మనిషి ఉత్తేజ్. రీసెంట్ గా ఆయన సతీమణి శ్రీమతి పద్మ అనారోగ్య కారణంగా అకాల మరణం చెందిన విషయం అందరికీ తెలిసిందే.. ఈ విషయం ఇండస్ట్రీలో అందర్నీ కలచివేసింది.. మెగాస్టార్ చిరంజీవి హుటాహుటిన బసవతారకం కాన్సర్ హాస్పటల్ కు వెళ్లి ఉత్తేజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.. అంతే కాకుండా మేమంతా నీకు అండగా ఉంటాం..  అని మనో ధైర్యాన్ని, కలిగించారు.. కాగా సెప్టెంబర్ 29న హైదరాబాద్ ఫిలింనగర్ ఎఫ్ఎన్ సిసి క్లబ్ లో ఉత్తేజ్ సతీమణి శ్రీమతి పద్మ సంస్మరణ సభ జరిగింది.. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి,మురళి మోహన్,ఏమ్.ఎల్.ఏ.మాగంటి గోపీనాథ్, దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్, డా. రాజశేఖర్, మెగాబ్రదర్  నాగబాబు లతో పాటు ఎంతోమంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు, సీనియర్ నటి నటులు  హాజరయ్యి శ్రీమతి పద్మ కు  ఘన  నివాళి అర్పించారు..


ఈ సంతాప సభ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ " భార్యా  వియోగం అన్నది చాలా  దుర్భరం. అన్ని విధాల జీవితంలో సెటిల్ అవుతున్న  సమయంలో పద్మ చనిపోవడం మమ్మల్ని అందరినీ కలిచివేసింది. ఈ వార్త విని నేను చలించిపోయాను.  హిట్లర్ సినిమా నుండి ఉత్తేజ్ తో  నాకు మంచి అనుబంధం ఏర్పడింది.  ఈ ఆపద సమయంలో ఉత్తేజ్ కు మేము అందరం అండదండగా ఉంటాం. ఈ విషాదం నుండి ఉత్తేజ్  త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను "  అన్నారు .

ఇంకా  ఈ సంతాప సభలో హీరోలు డా. రాజశేఖర్ ,శ్రీకాంత్, ప్రముఖ రచయిత తనికెళ్ల భరణి ,  గీత రచయిత ఉత్తేజ్ మేనమామ సుద్దాల అశోక్ తేజ , దర్శకులు ఎస్.వి. కృష్ణారెడ్డి , నిర్మాత అచ్చిరెడ్డి, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, యాంకర్ ఝాన్సీ,  ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ , నటి హేమ తదితరులు తమ సంతాపాన్ని తెలియజేస్తూ  ఉత్తేజ్ కు ఆత్మస్థైర్యాన్ని పద్మకు ఆత్మ శాంతిని  చేకూర్చాలని ఆకాంక్షించారు. ప్రముఖ జర్నలిస్ట్ ప్రభు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

Maha Samudram Hey Thikamaka Modhale Song’s Lyrical Video Out

 Sharwanand, Siddharth, Ajay Bhupathi, AK Entertainments’ Maha Samudram Hey Thikamaka Modhale Song’s Lyrical Video Out



Versatile actors Sharwanand and Siddharth starrer intense love and action drama Maha Samudram is one of the most awaited movies. Directed by Ajay Bhupathi, the makers are increasing expectations on the movie with intriguing promotional content. Theatrical trailer of the movie was released recently to overwhelming response.


Music being scored by Chaitan Bharadwaj is one of the major attractions. His work for the trailer was appreciated by everyone and the previously released songs too got tremendous response. Today, they have launched lyrical video of third single Hey Thikamaka Modhale.


Interesting aspect is the song Hey Thikamaka Modhale narrates two beautiful love stories. Sharwanand-Anu Emmanuel and Siddharth-Aditi Rao Hydari are shown as love birds in the song. The chemistry of the lead pair is equally charming as the track.


Haricharan and Nutana Mohan have sung the number soulfully. Kittu Vissapragada wrote chaste Telugu lyrics and his choice of words is notable. On the whole, Hey Thikamaka Modhale is another chartbuster number from Maha Samudram.


Sunkara Ramabrahmam is producing the movie on Anil Sunkara’s AK Entertainments banner and Raj Thota is the cinematographer.


Maha Samudram will release worldwide on October 14th as Dussehra special.


Cast: Sharwanand, Siddharth, Aditi Rao Hydari, Anu Emmanuel, Jagapathi Babu, Rao Ramesh, KGF Ramchandra Raju and others


Technical Crew:

Writer, Director: Ajay Bhupathi

Producer: Sunkara Ramabrahmam

Co-Producer: Ajay Sunkara

Banner: AK Entertainments

Ex-Producer: Kishore Garikipati

Music Director: Chaitan Bharadwaj

Cinematography: Raj Thota

Production Designer: Kolla Avinash

Editor: Praveen KL

Action: Venkat

PRO: Vamsi Shekar

Gangubai Kathiawadi Releasing on January 6th 2022

 జ‌న‌వ‌రి 6న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ‌వుతున్న  ఆలియా భట్  `గంగూబాయి క‌తియ‌వాడి`..‌



బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం "గంగూబాయి కతియావాడి". బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో ప్రముఖ జర్నలిస్ట్ హుస్సేన్‌ జైదీ రచించిన "మాఫియా క్వీన్స్ అఫ్ ముంబై" అనే బుక్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంజయ్‌ లీలా భన్సాలీ, డా. జ‌యంతిలాల్‌గ‌డ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో ‌బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో గంగూబాయిగా అలియా భట్‌ వేశ్య గృహం నడిపే యజమానిగా నటిస్తోంది. ఇప్పటికే పాత్రకు సంబంధించిన పోస్టర్‌, టీజ‌ర్ విడుద‌లై విశేష స్పంద‌న రాబ‌ట్టుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 6, 2022న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌.

Bollywood Star Hero Ajay Devgn Starrer 'Maidaan' To Release on 3rd June, 2022 in Hindi, Telugu, Tamil and Malayalam Languages

 Bollywood Star Hero Ajay Devgn Starrer 'Maidaan' To Release on 3rd June, 2022 in Hindi, Telugu, Tamil and Malayalam Languages



Football (Soccer) is the much loved sport followed by most games lovers.

Inspired from an incredible true story about an inspiring coach who introduced Indian Football to the world..  Maidaan pays tribute to the golden era of Indian football starring Star Hero Ajay Devgn. Directed by Amit Ravindernath Sharma of Blockbuster Badhai Ho fame, Maidaan has been with football backdrop with true events from 1952-62, Golden Era of Indian Football. Posters and First looks released so far have created terrific buzz. The team has made a couple of release announcements of 'Maidaan' in last year. Now Producer Boney Kapoor announced that the film is all set to release on 3rd June, 2022 in Hindi, Telugu, Tamil and Malayalam languages.


Producer Boney Kapoor said, " We all are fighting with Corona for the last two years. Everyone saved their lives and protected their loved ones by taking all precautions and staying at home. Theatres were closed.  'Maidaan' will make every Indian proud. It will be a never seen before inspiring experience. 'Maidaan' is such kind of film which must be experienced only in theatres. So, we didn't released even after announcing release dates couple of times. We are releasing the film with perfect planning on June 3rd, 2022."


Director Ravindranath Sharma who has earlier made Successful Film like 'Badhaai Ho' said, " Audience loved many sports based films. Many movies have been made with a backdrop of Kabaddi, Cricket, Boxing Wrestling, Running Race but no movie has been ever made about Football on Indian screen. 'Maidaan' will gives you an experience of watching a live football game sitting in the stadium. It will take you to an emotional roller coaster ride. That's why we have waited to release the film in Theatres only."


Along with Ajay Devgn, 'Maidaan' stars National award-winning actress Priyamani, Gajraj Rao who created magic with Badhai Ho and the well known Bengali actor Rudranil Ghosh, Nitansh Goyal and others


Maidaan Presented by Zee Studios, Bayview Projects in association with FreshLime Films is produced by Zee Studios, Boney Kapoor, Akash Chawla, and Arunava Joy Sengupta. The screenplay and dialogues are written by Saiwyn Quadras and Ritesh Shah respectively.


Konda Polam’s Second Single Shwaasalo Lyrical Out

Panja Vaisshnav Tej, Rakul Preet Singh, Krish and First Frame Entertainments’ Konda Polam’s Second Single Shwaasalo Lyrical Out



Mega sensation Panja Vaisshnav Tej’s second film Konda Polam directed by creative director Krish is getting ready for its theatrical release on October 8th. Promotions are in full swing for the film, that will feature Rakul Preet Singh playing the female lead, as the release date is not far away.


First look of the lead actors, followed by Obulamma song and most recently theatrical trailer have hiked prospects on the film. Today, the makers have come up with lyrical video of second single Shwaasalo.


It’s a MM Keeravani mark soulful romantic and mellifluous number. The ace composer has also penned lyrics for the film and his usage of words make this sound extra pleasant. The song indeed uplifts the beautiful romantic chemistry of Vaisshnav Tej and Rakul Preet Singh. Yamini Ghantasala and PVNS Rohit sung the song expressively. This is going to be another chartbuster song from the film.


Adapted from the novel written by Sannapureddy Venkata Rami Reddy, Konda Polam is produced by Saibabu Jagarlamudi, Rajeev Reddy under First Frame Entertainments and is presented by Bibo Srinivas. Gnana Shekar VS is the cinematographer.


Cast: Panja Vaisshnav Tej, Rakul Preet Singh


Technical Crew:


Director: Krish Jagarlamudi

Producers: Saibabu Jagarlamudi and Rajeev Reddy

Banner: First Frame Entertainments

Music Director: MM Keeravani

Cinematography: Gnana Shekar VS

Story: Sannapureddi Venkata Rami Reddy

Editor: Shravan Katikaneni

Art: Raj Kumar Gibson

Costumes: Aishwarya Rajeev

Fights: Venkat

PRO: Vamsi-Shekar 

Tremendous Response for Rashmika Pushpa The Rise Look

 ‘పుష్ప: ది రైజ్’ నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ కు అనూహ్య స్పందన.. 



అల వైకుఠ‌పురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థ‌లం‌ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్  ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదలైంది. శ్రీవల్లి పాత్రలో ఇందులో నటిస్తున్నారు రష్మిక. పూర్తిగా డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్నారు రష్మిక మందన్న. చెవుల కమ్మలు పెట్టుకుంటూ ఉన్న ఆమె లుక్ ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ కూడా విడుదలైంది. క్రిస్మస్ సందర్భంగా పుష్ప: ది రైజ్ విడుదల కానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్. 


నటీనటలు: 

అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు


టెక్నికల్ టీం: 

దర్శకుడు: సుకుమార్

నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ 

కో ప్రొడ్యూసర్స్: ముత్తంశెట్టి మీడియా 

సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్ 

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 

ఆర్ట్ డైరెక్టర్: S. రామకృష్ణ - మోనిక నిగొత్రే 

సౌండ్ డిజైన్: రసూల్ పూకుట్టి 

ఎడిటర్: కార్తిక శ్రీనివాస్ R

ఫైట్స్: రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్

లిరిసిస్ట్: చంద్రబోస్ 

క్యాస్ట్యూమ్ డిజైన్: దీపాలీ నూర్

మేకప్: నాని భారతి 

CEO: చెర్రీ

కో డైరెక్టర్: విష్ణు 

లైన్ ప్రొడ్యూసర్: KVV బాల సుబ్రమణ్యం 

బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ ముత్తంశెట్టి మీడియా

PRO: ఏలూరు శ్రీను, మడూరి మధు

RadheShyam to stick to festive release date of 14th Jan, 2022

 RadheShyam to stick to festive release date of 14th Jan, 2022



Ever since the announcement of the title 'RadheShyam', there has been a lot of rage and excitement about the film, starring Prabhas and Pooja Hegde. The film is a love story and the actor will be seen in a romantic role after a decade and that is reason enough for his fans to watch the romantic-drama.


The makers of RadheShyam have decided to stick to the prior set festive release date for the film. The Prabhas-Pooja starrer film was slated to release on 14th January 2022, which is a big weekend down south, Pongal celebrations will be underway making it a very auspicious day for this film to release.


The anticipation of the film has been on the rise with the back to back unveiling of different posters. The audiences are loving Prabhas' glimpses in the lover boy avatar and the picturesque backdrop of romantic city Italy only add to the excitement. The film posters have encompassed a very vintage, old-school and dreamy vibe and the chemistry of Prabhas and Pooja Hegde is being most sought after in the film. 


Radheshyam is a beautiful love story all the fans are longing to witness. A multi-lingual film starring the Pan-India star Prabhas and gorgeous Pooja Hegde in lead roles, helmed by Radha Krishna Kumar, presented by Dr.U.V.Krishnam Raju garu and Gopikrishna Movies. It is produced by UV Creations.


The film is being produced by Vamsi,Pramod and Praseedha

Mass Maharaja Raviteja Launched PelliSandaD Lyrical Song

 మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా ‘పెళ్లి సంద‌D’ చిత్రం నుంచి ‘మధురానగరిలో యమునా తటిలో.. ’ అనే లిరికల్ సాంగ్ విడుదల 



ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న‌ చిత్రం ‘పెళ్లి సంద‌D’. ఈ బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఆయ‌న శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో  మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల రూప‌క‌ల్ప‌న‌లో త‌న మేజిక్‌ను చూపిన ఈయ‌న ‘పెళ్లిసంద‌D’ లో అతిథి పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. ఈ చిత్రం నుంచి ‘మధురానగరిలో యమునా తటిలో...’  అనే లిరికల్ పాట‌ను మాస్ మహారాజా ర‌వితేజ విడుద‌ల చేశారు. సినిమా పెద్ద హిట్ కావాల‌ని చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు. 


‘మధురా నగరిలో, మయునా తటిలో..

మురళీ స్వరములే ముసిరిన ఎదలో..

కురిసెనంట మురిపాల వాన‌

ల‌య‌లై హోయ‌లై జ‌ల జ‌ల జ‌తులై.. గ‌ల గ‌ల గ‌తులై’’


అంటూ సాగే ఈ పాట‌లో ల‌వ్ సాంగ్‌.. రెండు వేరియేష‌న్స్‌లో సాగే ఈ పాట‌ను చంద్ర‌బోస్ రాశారు. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. శ్రీనిధి, నయ‌నా నాయ‌ర్‌, కాల భైర‌వ పాడారు. 



ఈ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చాయి. అలాగే టీజ‌ర్‌, రీసెంట్‌గా సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌కు కూడా అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది.  ఇప్పుడు మధురానగరిలో అనే లిరికల్ సాంగ్ కూడా విడుదలైంది. 


నటీనటులు:


రోష‌న్, శ్రీ‌లీల, ప్ర‌కాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, రావు ర‌మేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, స‌త్యంరాజేష్‌, రాజీవ్ క‌నకాల‌, శ్రీ‌నివాస్ రెడ్డి, శక‌లక శంక‌ర్‌, అన్న‌పూర్ణ‌, జాన్సి, ప్ర‌గ‌తి, హేమ‌, కౌముది, భ‌ద్రం, కిరీటి త‌దిత‌రులు.. 


సాంకేతిక వ‌ర్గం: 


సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి

సాహిత్యం: శివ‌శ‌క్తి ద‌త్త‌, చంద్ర‌బోస్

సినిమాటోగ్ర‌ఫి: సునీల్ కుమార్ నామ

ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు

ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్ మ‌న్నె,

‌మాట‌లు: శ్రీ‌ధ‌ర్ సీపాన‌

ఫైట్స్‌: వెంక‌ట్

కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్ వీజే

ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: వి. మోహ‌న్ రావు,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సాయిబాబా  కోవెల‌మూడి

స‌మ‌ర్ప‌ణ‌: కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌

నిర్మాత‌లు: మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని

ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: కె. రాఘ‌వేంద్ర‌రావు బి.ఎ

ద‌ర్శ‌క‌త్వం: గౌరీ రోణంకి.


Sumanth Ashwin Interview About Idhe Maa Kadha

 ఇదే మా కథ స్టోరీ చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యాను - సుమంత్ అశ్విన్.



సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇదే మా కథ. గురు పవన్ దర్శకత్వంలో శ్రీ‌మ‌తి మ‌నోర‌మ స‌మ‌ర్ప‌ణ‌లో గుర‌ప్ప ప‌ర‌మేశ్వ‌ర ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై మహేష్ గొల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు.  టాలీవుడ్ లోనే మొదటి రోడ్ జర్నీ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్బంగా హీరో సుమంత్ అశ్విన్ ఇంటర్వ్యూ...


''డైరెక్టర్ ఓ ఫోటో సెషన్ చేద్దాం అన్నారు. సరే అండి అని చేశాం. హైదరాబాద్ నుంచి లడక్ కి ఓ జర్నీ ఉంటుంది. ఏదో రఫ్ గా చేసి ఆ ఫొటోస్ పంపించా. ఇది ఫైనల్ కాదనుకున్నా. డైరెక్టర్ చూసి నాకు ఇదే కావాలన్నారు. మొత్తం సినిమాలో అదే మెయిన్ టైన్ చేసాం.


ఈ సినిమాలో ఒక్కొక్కరికీ ఒక్కో గోల్ ఉంటుంది. శ్రీకాంత్ గారికి లడక్ లో ఓ స్టోరీ ఉంటుంది. ఆయనకు డబ్బు అన్నీ ఉన్నాయి. ఆయన కావాలంటే ప్రైవేట్ జెట్ ఫ్లయిట్ లో వెళ్లొచ్చు. కానీ ఆయనకు సాటిస్ఫాక్షన్ లేదు. ఆయనకు బైక్ రైడ్ అంటే ఇష్టం. ఫీల్ కోసం బైక్ లో స్టార్ట్ అవుతారు. అలాగే భూమిక గారికి ఓ గోల్ ఉంటుంది. భూమిక గారి ఫాదర్ గోల్ ఫుల్ ఫిల్ చేయడానికి భూమిక గారు స్టార్ట్ అవుతారు. ఆలాగే అమ్మాయికి ఒక గోల్. అలాగే అజయ్ క్యారెక్టర్ ఓవర్ కాన్ఫిడెంట్ ఫెలో. ఇతనికి లడక్ లో స్నో మీద ఓ రేస్ ఉంటుంది. ఆ రేస్ గెలిస్తే ఆసియా లెవెల్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇలా వీళ్లంతా బయల్దేరి ఎక్కడ కలుసుకున్నారు? కలుసుకున్నారా లేదా.. ఆ జర్నీ అంతా ఏమైంది? గోల్స్ రీచ్ అయ్యారా లేదా? అనేది కథ.


ఒక్కొక్కరూ సపరేట్ గా స్టార్ట్ అవుతారు. నాలుగు కథలకు లింక్ అనేది.. మధ్యలో మంచి ఫ్రెండ్ షిప్, బ్యాండ్ క్రియేట్ అయి ముందుకెళ్తారు. ఎవరి గోల్ వారు ఫుల్ ఫిల్ చేసుకోవాలని హెల్ప్ చేసుకుంటారు. కథ చెప్పింది కరోనా ముందు. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో అనుకున్నాం. అప్పుడే వ్యూహాన్ లో స్టార్ట్ అయ్యాం. సెకండ్ షెడ్యూల్ టైంలో కరోనా వల్ల లాక్ అయ్యాం.


తెలుగులో రోడ్ ఫిలిమ్స్ చాలా తక్కువ ఉన్నాయి. మంచి మంచి లొకేషన్స్ చూపించడం వల్ల అంత ఎగ్జైట్మెంట్ ఉండదు. కథలో రోల్స్ ఇన్వాల్మెంట్ ఉండాలి. ఇందులో అవన్నీ ఉన్నాయి. కథ చెప్పగానే ఎగ్జైట్ అయ్యాను. అందరికీ ఫ్లష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఏవీ లేవు కానీ శ్రీకాంత్ గారికి ఉంది. లాస్ట్ లో 20 మినిట్స్ స్నో మీద రైడ్, రేస్ ఆసక్తికరంగా ఉంటుంది. బైక్ నన్ను మాదాపూర్ నడపమంటే నడిపేస్తా. కానీ స్నో మీద చాలా రిస్క్. అందుకే స్నో మీద చాలా ప్రాక్టీస్ చేసి షూటింగ్ చేశాం. లక్కీగా ఎవ్వరికీ ఏమీ యాక్సిడెంట్ లాంటివి జరగలేదు.


భూమిక గారు కూడా చాలా డేర్ చేశారు. డూప్స్ పెట్టి చేయొచ్చు. కానీ రియలిస్టిక్ గా ఉండేందుకు ఆమెనే చేశారు. ఒక్కడు తర్వాత ఆవిడతో డైరెక్ట్ కాంటాక్ట్ ఇదే. నా చిన్న తనంలో ఫిలిం చాంబర్ లో భూమికను చూసి భలే ఉంది హీరోయిన్ అనుకున్నా. ఆవిడతో ఒక్కడు సెట్ లో మంచి రిలేషన్ ఏర్పడింది. ఆవిడతో నేరుగా యాక్ట్ చేస్తానని అస్సలు అనుకోలేదు. ఇది ఎక్సలెంట్ ఫీలింగ్.


ఈ సినిమాలో ఒక్క సీన్ లో భూమిక గారు నా బైక్ ఎక్కుతారు. ఆ సీన్ షూట్ చేసినప్పుడు గానీ, మళ్ళీ చూసినప్పుడు గానీ గూస్ బంప్స్ వచ్చాయి. అక్క అనే రిలేషన్ ఉంటుంది. నాకు తాన్యా హాప్ కి లవ్ ట్రాక్ నాచురల్ గా ఉంటుంది. డైరెక్టర్ గురు మంచి రైటర్. ఈ సినిమా స్టార్ట్ కాక ముందే మాకు ఈజీ కావాలని ఆయనే స్వయంగా తిరిగి టెస్ట్ చేశారు, చాలా రీసెర్చ్ చేశారు. అది డైరెక్టర్ కి డెఫినెట్ గా ఉండాలి. ఆయనకు ఏ బైక్ ఎంత సీసీ ఉంటుంది. గేర్ల పట్ల చాలా అవగాహన ఉంది. గురు మైండ్ లో పక్కా కమర్షిల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటిని నాచురల్ గా మలిచి సినిమా రూపొందించారు.


అంతకుముందు ఆ తర్వాత, లవర్స్ లాంటి సినిమాలు చేశా. ప్రతి ప్రాజెక్టు నుంచి ఓ అనుభవం వచ్చింది. నా సినీ జర్నీలో చాలా నేర్చుకున్నా. నేను చాలా హ్యాపీ. కారులో కంటే బైక్ లో వెళితే ఆ కిక్కే వేరు. మైనస్ డిగ్రీస్ లో చాలా సన్నివేశాలు షూట్ చేశాం. బైక్ అనేది రియల్లీ ఫన్. అందుకే చాలా మంది రైడర్స్ వేల కిలోమీటర్లు ప్రయాణిస్తారు. నా తదుపరి సినిమా 7 డేస్ 6 నైట్స్ షూటింగ్ కూడా పూర్తయింది.  


మా నాన్నగారికి ఒకే టైపు లో సినిమాలు తీయడం ఇష్టం ఉండదు. అందుకే డిఫరెంట్ ఒరింటెడ్ సినిమాలు తీస్తారు. లో బడ్జెట్, హై బడ్జెట్, గ్రాఫిక్ ఇలా అన్ని కోణాలు టచ్ చేస్తున్నారు. నిర్మాత అనేది చాలా టఫ్ జాబ్. ప్రొడ్యూసర్ కి ఏదన్నా తేడా వస్తే కష్టం. అందుకే అంతా పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు అర్థమైంది ఆ కష్టం ఏంటనేది. అయితే ఆ సినిమా సక్సెస్ తర్వాత ఆ థ్రిల్ ఏంటనేది తెలుస్తుంది. ఇదే మా కథలో సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, లొకేషన్స్ అనేవి హైలైట్స్.

Nenu Leni Naa Premakatha

 అక్టోబర్ 8న రిలీజ్ అవుతున్న ‘నేను లేని నా ప్రేమకథ’



త్రిషాల ఎంటర్‌టైన్‌మెంట్స్, సరస్వతి క్రియేషన్స్, యస్.యస్.స్టూడియోస్ బ్యానర్లపై కళ్యాణ్ కందుకూరి, ఎ.భాస్కరరావు సంయుక్తంగా నిర్మించిన ‘నేను లేని నా ప్రేమకథ’ చిత్రం UFO Moviez INDIA LIMITED ద్వారా అక్టోబర్ 8న విడుదలకు సిద్ధమైంది.


ఈ సంగీత ప్రేమకథా చిత్రానికి సురేష్ ఉత్తరాది దర్శకత్వం వహించగా.. నవీన్ చంద్ర మరియు గాయత్రి సురేష్ మరియు నూతన పరిచయం క్రిష్ సిద్ధిపల్లి, అదితి మ్యాకల్ తారాగణంగా కీలక పాత్రలో సీనియర్ నటుడు రాజా రవీంద్రలతో ఈ చిత్రం నిర్మించబడింది.


ఇటీవల జెమినీ రికార్డ్స్(మ్యూజిక్) ద్వారా విడుదలైన ఈ చిత్ర సంగీతం శ్రోతలను, సినిమా అభిమానులను ఎంతగానో అలరించింది.


వినూత్న కథాంశంలో, హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలతో ‘నేను లేని నా ప్రేమకథ’ చిత్రం నిర్మించబడిందని, అలాగే  మా ప్రయత్నాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడానికి సహకరిస్తున్న UFO Moviez వారికి ప్రత్యేక కృతజ్ఞతలను చిత్ర నిర్మాత కళ్యాణ్ కందుకూరి మరియు చిత్ర దర్శకుడు సురేష్ ఉత్తరాది తెలియజేశారు.


ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకుని, అక్టోబర్ 8న విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ‘నేను లేని నా ప్రేమకథ’ చిత్రాన్ని UFO Moviez INDIA LIMITED ద్వారా థియేటర్స్‌లో విడుదల చేయడం జరుగుతుంది.


ఈ చిత్రానికి చాయాగ్రహణం SKa భూపతి, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి, మాటలు సాబిర్ షా, లిరిక్స్ రాంబాబు గోసాల, సంగీతం జువెన్ సింగ్ అన్ని విభాగాలు ప్రధాన భూమికను పోషించాయి

Natyam Second Song Launched by Victory Venkatesh

 `నాట్యం` సెకండ్ సాంగ్ లాంచ్ చేసిన విక్టరీ వెంకటేష్.



`నాట్యం`అంటే ఓ క‌థ‌ను డాన్స్ ద్వారా అంద‌మైన రూపంలో చెప్ప‌డ‌మే. అలాంటి ఓ అద్భుత‌మైన‌ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం `నాట్యం`. ఈ మూవీ ద్వారా ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా ప‌రిచ‌యం అవుతున్నారు. రేవంత్ కోరుకొండ దర్శకుడు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్, టీజ‌ర్‌కు ట్రెమండ‌స్‌ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ఇటీవ‌ల న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ ఆవిష్క‌రించిన ఈ సినిమాలో తొలి సాంగ్ `నమః శివాయ‌`కు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న ల‌భించింది. తాజాగా నాట్యం సెకండ్ సాంగ్ పోనీ పోనీ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు.


ఈ సంద‌ర్భంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ''రేవంత్ దర్శకత్వంలో డాన్సర్ సంధ్య నటించిన నాట్యం సినిమా నుంచి ఈ పోనీ పోనీ సాంగ్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. విలక్షణ కథకు ఎమోషన్స్ కలగలిపి  రూపొందించారు. చాలా చక్కగా డాన్స్ చేశారు. చూస్తుంటే స్వర్ణ కమలం మళ్ళీ గుర్తొస్తోంది. అందమైన లొకేషన్స్‌లో ఎంతో అందంగా చిత్రీకరించారు. డాన్స్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా రాక చాలా రోజులైంది. చిత్ర యూనిట్ మొత్తానికి ఆల్ ది బెస్ట్'' అన్నారు.


సంధ్యారాజు మాట్లాడుతూ.. ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఇది మా మూవీలో చాలా ముఖ్యమైన ఎమోషనల్ సాంగ్. స్వర్ణ కమలం మూవీ చూసి చూసి ఆ టేప్ అరిగిపోయి ఉంటుంది. ఈ సినిమాలో భాగమవడం ఓ ఆశిర్వాదంలా ఫీల్ అవుతున్నా. ఈ సినిమాలో భానుప్రియ గారు నా తల్లి పాత్రలో నటించారు. అలాగే ముఖ్యమైన సాంగ్ వెంకటేష్ లాంచ్ చేశారు. ఇవి నా జీవితంలో ఎప్పటికీ మరవలేని క్షణాలు'' అన్నారు.


డైరెక్టర్ రేవంత్ మాట్లాడుతూ.. ''ఈ మూవీ చేయడానికి స్వర్ణ కమలం నన్ను ఇన్స్పైర్ చేసింది. టాలీవుడ్‌లో మీరు (వెంకటేష్) ఓ గ్రేట్ యాక్టర్. ఎమోషన్, కామెడీ, ఫైట్స్ ఇలా ఏ క్యారెక్టర్ లో అయినా మీరు లీనమైపోతారు. మా కాలేజీలో ఒక్కొక్కరూ ఒక్కో హీరోకు ఫ్యాన్. కానీ మీ సినిమా విడుదలైందంటే మేమంతా కలిసి వెళ్లే సినిమా అదే అవుతుంది'' అన్నారు.  


ఈ సినిమాలో కమల్ కామరాజ్, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, భానుప్రియ, సుభలేఖ సుధాకర్, రుక్మిణీ విజయకుమార్, బేబీ దీవెన ముఖ్య పాత్రలు పోషించారు. శ్రావణ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి కరుణాకర్ అడిగర్ల సాహిత్యం అందించారు. నిశ్రింకళ ఫిలింస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది.  


న‌టీన‌టులు: సంధ్యారాజు, క‌మ‌ల్ కామ‌రాజు, రోహిత్ బెహ‌ల్‌, ఆదిత్య మీన‌న్‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, భానుప్రియ‌, బేబీ దీవ‌న త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:


స్క్రిప్ట్‌, కెమెరా, ఎడిటింగ్‌, ద‌ర్శ‌కత్వం: రేవంత్ కోరుకొండ‌

నిర్మాణ సంస్థ‌: నిశ్రింక‌ళ ఫిల్మ్‌

సంగీతం: శ్రవణ్ భ‌రద్వాజ్‌

పాటలు: క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల‌

ఆర్ట్‌: మ‌హేశ్ ఉప్పుటూరి

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: సంధ్యా రాజు

వి.ఎఫ్‌.ఎక్స్‌: థండ‌ర్ స్టూడియోస్‌

క‌ల‌రిస్ట్‌: ఎం.రాజురెడ్డి

ఎస్ఎఫ్ఎక్స్‌: సింక్ సినిమాస్‌

సౌండ్ మిక్సింగ్‌: కృష్ణంరాజు

ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: వాల్మీకి శ్రీనివాస్‌

పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్

Director Devakatta Interview About Republic

 



‘రిప‌బ్లిక్‌’ మూవీని డైరెక్ట‌ర్‌గా నా విజ‌న్‌తో తెర‌కెక్కించ‌డానికి హీరో సాయితేజ్ ఓ సైనికుడిలా స‌పోర్ట్‌గా నిల‌బ‌డ్డాడు :  డైరెక్ట‌ర్ దేవాక‌ట్టా



సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా న‌టించిన పొలిటికల్ థ్రిల్ల‌ర్ ‘రిప‌బ్లిక్‌’. దేవ క‌ట్టా ద‌ర్శ‌కుడిగా జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘రిప‌బ్లిక్‌’ గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 1న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు దేవ‌క‌ట్టా ఇంట‌ర్వ్యూ విశేషాలు...



- ‘రిపబ్లిక్‌’ సినిమాకు ఇన్‌స్పిరేష‌న్ నా అజ్ఞానం. మ‌న‌కు ఉహ తెలిసినప్ప‌టి నుంచి ఈ రాజ‌కీయాలేంటి?  రాజ‌కీయ నాయ‌కులేంటి? అని అనుకుంటూ ఉంటాం. క్యాప్ట‌లిజం, క‌మ్యూనిజం, సోష‌లిజం అంటూ మ‌నం ఇజ‌మ్‌ల గురించి మాట్లాడుతుంటాం. డెమోక్ర‌సీ, డిక్టేట‌ర్ షిప్ అంటాం. ఇలా చాలా  వాటి గురించి మాట్లాడుతుంటాం. అయితే వీటి గురించి మ‌న‌కు ఎంత లోతుగా తెలుసు? అనే ప్ర‌శ్న వేసుకుంటే మ‌న‌కు తెలియ‌దు. నా వ‌ర‌కు వ‌స్తే.. నాకు తెలియ‌దు. మ‌నం ప్ర‌కృతిలో ఓ భాగం, మ‌నం ఎక్క‌డున్నామో దాని గురించి తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేక‌పోతే ఉండ‌లేం. అలాగే స‌మాజం కూడా మ‌న జీవితాన్ని ప్ర‌భావితం చేస్తుంది. అలాంట‌ప్పుడు మ‌నం ఎలాంటి వ్య‌వ‌స్థ‌లో ఉన్నామో తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ప్ర‌తి ఒక్క‌రికీ ఉంటుంది. చ‌దువుకున్న వ్య‌క్తిగా అలాంటి స‌మాజం గురించి తెలియ‌న‌ప్పుడు ఓ సామాన్యుడికి ఏం అర్థ‌మ‌వుతుంద‌నే సిగ్గుతో దానిపై స్ట‌డీ చేసుకుని ఈ క‌థ‌ను త‌యారు చేసుకున్నాం. ఇప్పుడు మ‌నం ప్ర‌భుత్వ‌మో, ప్ర‌జాస్వామ్య‌మో ఉంద‌నే భ్ర‌మ‌లో బ్ర‌తుకుతున్నాం. కానీ అదెలా ఉంటుందో తెలియ‌దు. అంటే మ‌నం ప్ర‌జాస్వామ్యంలో బ‌త‌క‌డం లేదు. ఏ పార్టీకి, మ‌నిషికి అయినా అప‌రిమిత‌మైన శ‌క్తి ఇచ్చిన‌ప్పుడు క‌చ్చితంగా క‌రెప్ట్ అవుతాడు. అది మాన‌వ నైజం. ప‌వ‌ర్ అనేది ఓ క్ర‌మ‌బ‌ద్దంగా ఉండాలి. బ్యాలెన్స్‌డ్‌గా ఉన్న‌ప్పుడే బావుంటుంది. ట్రంప్‌లాంటి వ్య‌క్తి ఏ దేశంలో అయినా డిక్టేట‌ర్ అయ్యుండేవాడు. కానీ ఆయ‌న నియ‌మించిన జడ్జీలే ఆయ‌న్ని డిక్టేట‌ర్ కానీయ‌కుండా అడ్డుకున్నారు. 


- న్యాయ‌వ్య‌వ‌స్థ‌, బ్యూరోక్ర‌సీ, లెజిస్లేటివ్ అనేవి ఇండిపెండెంట్‌గా ఉండాలి. అయితే ఒక‌రికొక‌రు అన్వ‌యం ఉండాలి. ఇవి మూడుగుర్రాలుగా ఉండి ప్ర‌యాణించేట‌ప్పుడు ఏదైనా ఓ గుర్రం గాడి త‌ప్పుతున్న‌ట్లు అనిపిస్తే మిగిలిన గుర్రాలు ప‌ట్టుకోవాలి. అలా ఉన్న‌ప్పుడు ప్రజాస్వామ్య వ్య‌వ‌స్థ స‌రిగా ఉంటుంది. కామ‌న్ మేన్‌గా విలువ త‌ప్ప‌డాన్ని మ‌నం ఆనందిస్తే, మ‌నం ప‌వ‌ర్ ఇచ్చిన ప్ర‌తి ఒక్క‌రూ విలువ త‌ప్పుతారు. ఈరోజు మ‌న పార్టీ గెలిచి విలువ త‌ప్ప మ‌రో పార్టీని ఇబ్బంది పెట్టిన‌ప్పుడు, రేపు ఆ పార్టీ వాళ్లు ప‌వ‌ర్‌లోకి వ‌చ్చిన‌ప్పుడు మ‌నల్ని ఇబ్బంది పెడ‌తాడు. వేరే దారిలేదు. ఈ విషయాల‌పై సామాన్యుల‌కు అవ‌గాహ‌న లేదు. ఇదేదో ఓ పార్టీని ఉద్దేశించోమ‌నిషిని ఉద్దేశించో వ‌చ్చిన ఆలోచ‌న‌లు కావు. ఈ ఐడియాను ఓ రోజు జిమ్‌లో సాయితేజ్‌కు చెప్పాను. 


- సాధార‌ణంగా రాజ‌కీయ నాయ‌కులకు, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య అన్వ‌య‌క‌ర్త‌గా ఉండే ఓ బ్యూరోక్రట్ నిజాయ‌తీగా ఉన్న‌ప్పుడు, త‌ను వ్య‌వ‌స్థ‌ను ఎలా చూస్తున్నాడు. త‌న ఆలోచ‌న‌ల వ‌ల్ల త‌న ప్ర‌యాణం ఎలా సాగింది. అనే పాయింట్‌తో ఈ క‌థ‌ను త‌యారు చేశాను. సాయితేజ్ ఓ కామ‌న్ మ్యాన్‌గా ఈ క‌థ‌కు రిలేట్ అయ్యాడు. ఈ డిస్ట్ర‌బెన్స్ నుంచి వ‌చ్చిన ఐడియాలో నిజం ఉంది. ఈ క‌థ‌ను నేనే చేయాలి. అనుకున్నాడు. ఈ ఆలోచ‌న‌ను క‌థ‌గా రాయ‌క ముందే నాతోనే ఈ సినిమా చేయాల‌ని తేజ్ ప్రామిస్ తీసుకున్నాడు. 


- సెన్సార్ స‌భ్యుల‌కు సినిమా చాలా బాగా న‌చ్చింది. సింగిల్ క‌ట్ లేకుండా సెన్సార్ స‌ర్టిఫికేట్ ఇచ్చారు. చాలా నిష్ప‌క్షంగా, ఎలా బేదాభావాలు లేకుండా నిజాయ‌తీగా తెర‌కెక్కించార‌ని అప్రిషియేట్ చేశారు. 


- ఇందులో ప్ర‌జ‌ల‌కు ఏదీ మంచిది అనేది చెప్ప‌లేదు. ఓ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ అనుకున్న‌ప్పుడు అది ఎలా అవ్య‌స్థంగా ఉంద‌ని ఎత్తి చూపిస్తూనే, అదొక వ్య‌వ‌స్థ‌గా మారాల‌ని సొల్యూష‌న్‌గా నిర్వ‌చ‌నం చెప్పే ప్ర‌య‌త్నం చేశాం. ఇప్పుడు స‌మాజంలోని వ్య‌వ‌స్థ‌లు, మ‌న ఆలోచ‌న‌లు, దాని వ‌ల్ల ప్ర‌భావిత‌మయ్యే అంశాల‌ను ఈ సినిమాలో చూపించే ప్ర‌య‌త్నం చేశాను. 


- వ్య‌క్తిగ‌తంగా దూషించిన‌ప్పుడు ఇత‌రులు బాద‌ప‌డ‌తారు. దాని నుంచి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అదే మ‌న‌సాక్షితో మాట్లాడిన‌ప్పుడు ఏమీ కాదు. నొప్పించే విధంలో కాకుండా చెప్పాలి. బ్యూరోక్రాట్స్ మీద‌, న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై రాజ‌కీయ ఒత్తిళ్లు ఉన్నాయ‌నే పాయింట్‌ను ఈ సినిమాలో చూపించే ప్ర‌య‌త్నం చేశాను. పొలిటిక‌ల్ ప‌వ‌ర్ ఉన్న‌ప్పుడు ఏమైనా చేయ‌వ‌చ్చు అనే ఓ భావ‌న అంద‌రిలో ఉంది. దాన్ని అంద‌రం ఎంజాయ్ చేస్తున్నాం కూడా. కానీ అది త‌ప్పు. మ‌నం ఎలా ఆలోచిస్తున్నామో అదే వ్య‌వ‌స్థ అవుతుంది. 


- వెన్నెల, ప్ర‌స్థానం సినిమాలు చేసేట‌ప్ప‌డు నాకు రిసోర్స‌స్ త‌క్కువ‌గా ఉన్నాయి. కానీ.. లిబ‌ర్టీ ఉండేది. కానీ ఓ స్థాయి త‌ర్వాత మ‌న చుట్టు ప‌క్క‌ల ఉన్న‌వాళ్ల లెక్క‌లు వ‌చ్చేస్తాయి. ప్ర‌స్థానం బ్లాక్‌బ‌స్ట‌ర్ కాక‌పోవ‌డానికి కామెడీ ట్రాక్ లేక‌పోవ‌డ‌మో, మ‌రోటో అని న‌న్ను క‌న్విన్స్ చేసి.. నేను ఆ ట్రాప్‌లో ప‌డ్డ త‌ర్వాత నేనెదైతే చెత్త పెట్టానో దాన్ని ప్ర‌జ‌లు తిప్పి కొట్టారు. కానీ రిప‌బ్లిక్ విష‌యంలో ఇలాంటివేమీ లేకుండా నేను ఓన్ చేసుకుని చేసిన సినిమా. నా విజ‌న్‌లోనే న‌న్ను సినిమా తీసేలా సాయితేజ్ సినిమా చేయ‌డానికి ఎంక‌రేజ్ చేశాడు. సైనికుడిలా నాకు అండ‌గా నిల‌బ‌డ్డాడు. 


- డైలాగ్ అనేది నా దృష్టిలో మాట‌ల గార‌డీ కాదు. ప్ర‌తి మాట ఓ ఆలోచ‌న‌. ఆలోచ‌న‌ను, త‌త్వాని ప‌దునుగా ఎలివేట్ చేయాలి. ఆలోచ‌న ఎంత బ‌లంగా ఉంటే డైలాగ్ అంత ప‌దునుగా ఉంటుంది. ఈ సినిమా క‌థ‌ను చూసిన నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ రీమేక్ రైట్స్‌ను కూడా కొనేశారు. 


-  ఫ్ర‌స్టేష‌న్‌లో, బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోకూడదు. అలా తీసుకున్న నిర్ణ‌య‌మే డైన‌మైట్ సినిమా. అదే స‌మ‌యంలో నేను యు.ఎస్‌లో ఫ్యామిలీని వ‌దిలేసి వ‌చ్చాను. అర్థికంగా ఎలాంటి సపోర్ట్ లేదు. ఇలాంటి కార‌ణాల‌తో క‌న్విన్స్ అయిన ఒప్పుకున్న సినిమా. ఆ సినిమాను నేను 9 రోజులు మాత్ర‌మే షూట్ చేశాను. త‌ర్వాత వాళ్ల‌కు కావాల్సి వ‌చ్చిన‌ట్లు వాళ్లే షూట్ చేసుకున్నారు. దాని త‌ర్వాత నేను ద‌ర్శ‌కుడిగా ఇత‌రుల న‌మ్మ‌కాన్ని సంపాదించుకోవ‌డానికి ఇంకా స‌మ‌యం ప‌ట్టింది. రిప‌బ్లిక్  ఆ న‌మ్మ‌కాన్ని పెంచుతుంద‌ని భావిస్తున్నాను. ఇకపై ఎక్కువ గ్యాప్ లేకుండా సినిమాలు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను. 


- త‌మిళంలో కాక్కాముట్టై అనే సినిమాను చూసిన‌ప్పుడు అందులో ఐశ్వ‌ర్యా రాజేశ్ న‌ట‌న బాగా ఆక‌ట్టుకుంది. ఆమెతో ఎప్పుడైనా ప‌నిచేయాల‌ని అనుకున్నాను. ఈ సినిమాకు కుదిరింది. అయితే నేను రొటీన్‌కు భిన్నంగా న‌టీన‌టుల‌ను ఇత‌ర పాత్ర‌ల్లో న‌టింప చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాను. అలా ఐశ్వ‌ర్యా రాజేశ్‌ను ఇందులో ఎన్నారై అమ్మాయిగా చూపించాను. త‌ను అద్భుతంగా న‌టించింది. ర‌మ్య‌కృష్ణగారు క్యారెక్ట‌ర్‌లో ముందుగా భార‌తీరాజానో, మ‌హేంద్ర‌న్ వంటి డైరెక్ట‌ర్స్‌ను పెట్టుకోవాల‌ని క్యారెక్ట‌ర్ రాసుకున్నాను. అయితే న‌టీన‌టుల ఎంపిక గురించి మాట్లాడుకుంటున్న స‌మ‌యంలో తేజ్ ర‌మ్య‌కృష్ణ‌గారిని ఆ పాత్ర‌కు తీసుకుంటే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న‌ను చెప్పాడు. క్యాస్టింగ్‌లో కొత్త‌ద‌నం కోసం ఆ పాత్ర‌ను మ‌హిళ‌గా మార్చాం. ఆ పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ‌గారిని లేదా విజ‌య‌శాంతిగారినో తీసుకోవాల‌ని అనుకున్నాం. అయితే అప్ప‌టికే విజ‌య‌శాంతిగారు పాలిటిక్స్‌లో ఉన్నారు. ఆమె రాజ‌కీయ జీవితం ఎక్క‌డ ప్ర‌భావిత‌మ‌వుతుందోన‌ని భావించి, ర‌మ్య‌కృష్ణ‌గారిని అప్రోచ్ అయ్యాం. ఆమె అప్ప‌టికే న‌ర‌సింహ‌, బాహుబ‌లి సినిమాల్లో త‌న పాత్ర‌ల‌ను ర‌మ్య‌గారు మ‌రొక‌రు చేయ‌లేర‌నే గొప్ప‌గా చేసున్నారు. దాంతో ఈ పాత్ర‌కు ఆమె న్యాయం చేస్తుంద‌ని భావించాం. 


- మ‌నం ఒప్పుకున్నా, ఒప్పుకోక‌పోయినా మ‌న‌సులో ఉన్న‌ది దాచుకోకుండా మాట్లాడుతారు. సాయితేజ్‌కు యాక్సిడెంట్ అయిన త‌ర్వాత మేం ఆలోచిస్తున్న‌ప్పుడు చిరంజీవిగారు ట్రైల‌ర్ లాంచ్ చేస్తాన‌ని మాట ఇచ్చారు. క‌ళ్యాణ్‌గారు నేను ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కు వ‌స్తాన‌ని అన్నారు. ప‌వ‌న్‌గారు వేదిక‌పై ఏం మాట్లాడార‌నేది ఆయ‌న వ్య‌క్తిగ‌త కోణం కావ‌చ్చు. కానీ మా రిప‌బ్లిక్ సినిమా అనేది ఈ రాజకీయ కోణాలకు సంబంధం లేని న్యూట్ర‌ల్ పాయింట్‌తో తెర‌కెక్కింది. 


- నేను ఎవ‌రినీ వేదిక‌పై విమ‌ర్శించ‌లేదు. ఆన్‌లైన్ టిక్కెటింగ్ వ‌ల్ల పార‌దర్శ‌క‌త ఉంటుంది. కానీ త‌ర్వాత స్టెప్స్ ఏంట‌ని నేను అడిగానంతే. 


- సాయితేజ్‌ను యాక్సిడెంట్ త‌ర్వాత క‌లిశాను. అక్టోబ‌ర్ 1న సినిమాను విడుద‌ల చేద్దామ‌ని త‌న‌తో మాట్లాడుకున్న త‌ర్వాతే ఫైన‌ల్‌గా ఓకే చేశాం. త‌ను ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చూశాడు. త‌ను హండ్రెడ్ ప‌ర్సెంట్ ఓకే అనుకునే వ‌ర‌కు ఐసోలేష‌న్‌లో ఉంటే మంచిద‌ని భావించాం. త‌ను త్వ‌ర‌గా కోలుకుంటున్నాడు. మాట్లాడుతున్నాడు. కాస్త కాస్త ఆహారం కూడా తీసుకుంటున్నాడు. త‌ను రిక‌వ‌ర్ కావ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. 


- చంద్ర‌బాబునాయుడుగారు, వై.ఎస్‌గారి జీవితాల‌ను బేస్ చేసుకుని వారీ కాలేజీ జీవితాల నుంచి వై.ఎస్‌.ఆర్ మ‌ర‌ణం వ‌ర‌కు ఉండే సినిమా. ఈ సినిమాను గాడ్‌ఫాద‌ర్ రేంజ్‌లో మూడు భాగాలుగా తెర‌కెక్కించాల‌ని అనుకుంటున్నాను. వెబ్ సిరీస్‌గానూ కూడా తెర‌కెక్కించ‌వ‌చ్చు. ఇంద్ర‌ప్ర‌స్థం అనే వ‌ర్కింగ్ టైటిల్‌ను అనుకున్నాం. విష్ణువ‌ర్ధ‌న్‌గారితో ఎన్టీఆర్‌గారి బ‌యోపిక్ గురించి, ఈ క‌థ గురించి చ‌ర్చించాను. ఎన్టీఆర్ బ‌యోపిక్ త‌న సినిమా అనేలా బ‌య‌ట‌కు వెళ్లింది. కానీ ఇంద్ర‌ప్ర‌స్థం అనే సినిమా గురించి  ఇండ‌స్ట్రీలో అంద‌రికీ తెలుసు. ఎలా రూపొందుతుందో అంద‌రూ ఎదురుచూస్తున్నారు. పెద్ద క్యాస్టింగ్ అవ‌స‌రం. స‌మ‌యం ప‌డుతుంది. ఇలాంటి స‌మ‌యంలో విష్ణువ‌ర్ధ‌న్‌గారు వారి జీవితాల‌పై సినిమాను తీస్తాన‌ని చెప్పిన‌ప్పుడు నాకేం అభ్యంత‌రం అనిపించ‌లేదు. అయితే స్టోరి ప‌రంగా నా క‌థ‌లో ఎలిమెంట్స్‌ను తీసుకుంటే లీగ‌ల్‌గా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని అన్నాను. 


- బాహుబ‌లి ది బిగినింగ్ ముఖ్యోద్దేశం ఇండియాకు చెందిన గ్రేమ్ ఆఫ్ థ్రోన్స్ కావాల‌నేదే. అలాంటి గొప్ప ఆశ‌యాన్ని ఒక‌రిద్ద‌రూ ద‌ర్శ‌కుల‌తో ఒక‌ట్రెండు సంవత్స‌రాల్లో చేసేది కాదు. దానికి స‌మయాన్ని వెచ్చించ‌డం చాలా అవ‌స‌రం. ఉదాహ‌ర‌ణ‌కు గేమ్ ఆఫ్ థ్రోన్స్‌ను ప‌దేళ్లు క‌థ‌గా రాస్తే ప‌ది ప‌దిహేనేళ్లు స్క్రీన్‌ప్లే రాశారు. తీశారు. ఆపేశారు. మ‌ళ్లీ తీశారు. అలా ఎంతో క్లారిటీగా చేశారు. ఆ లెవ‌ల్ టీమ్ టెక్నీషియ‌న్స్‌, టైమ్‌, ఇన్వెస్ట్ చేస్తేనే ఔట్‌పుట్ వ‌స్తుంద‌ని భావించి .. మా జీవితాన్నంతా అక్క‌డే వెచ్చించ‌లేమ‌ని అర్థం చేసుకుని రాసిందంతా అక్క‌డే పెట్టేసి ప్రాజెక్ట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాం. ఓ సీజ‌న్‌ను రాసుకుని తీసే ప్రాజెక్ట్ అది కాదు. కాస్త షూట్ చేసినా కూడా ప‌క్క‌కు వ‌చ్చేశాం.


Parvatipuram Lyrical Video From Kinnerasani Out Now

 Parvatipuram Lyrical Video From Kinnerasani Out Now



The makers of Kinnerasani, an intense drama starring Kalyaan Dhev in the lead role have unveiled a new song from the album.


The song has been titled ‘Parvatipuram’ and it has an intense vibe to it. The lyrics are deep and impactful and so is the turn composed by Mahati Swara Sagar.


The song depicts the mystical story involving the protagonist, played by Kalyaan, and the mystical story spun around the other central characters in the film.


The film has Ravindra Vijay, Ann Sheetal, Mahathi Bikshu, and others in the lead roles. It is directed by Ramana Teja and produced by Ram Talluri under SRT Entertainments banner. 

Director Puri Jagannadh Birthday Celebrations

 

లైగ‌ర్ సెట్లో గ్రాండ్‌గా జ‌రిగిన‌ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాధ్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్‌


మోస్ట్ హ్యపెనింగ్ హీరో  విజయ్ దేవరకొండ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరిజ‌గ‌న్నాధ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న క్రేజీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `లైగర్`. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ట్యాగ్‌లైన్‌. ప్యాన్ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ  సినిమాపై అటు అభిమానుల్లో ఇటు ప్రేక్ష‌కుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం లైగర్ చిత్రీకరణ గోవాలో జరుగుతుంది. ఈ రోజు(సెప్టెంబ‌రు 28) డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా లైగ‌ర్ సెట్లో పూరిజ‌గ‌న్నాధ్ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ గ్రాండ్‌గా జ‌రిగాయి. ఈ వేడుక‌ల్లో చిత్ర యూనిట్ స‌మక్షంలో బ‌ర్త్‌డే కేక్ క‌ట్ చేశారు పూరి జ‌గ‌న్నాధ్‌. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అయ్యాయి.  

లైగ‌ర్ చిత్రం ద్వారా ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత బాక్స‌ర్ మైక్ టైసన్ మొదటి సారిగా ఇండియన్ స్క్రీన్‌కు పరిచయమ‌వున్నారు. ఈ అనౌన్స్‌మెంట్ కి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. ఇండియా వైడ్ గా ట్విట్ట‌ర్ లో ట్రెండ్ అయ్యింది.  బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

రమ్యకృష్ణ, రోనిత్ రాయ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

ఈ మూవీ హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మళయాలి భాషల్లో రూపొందుతోంది.

నటీనటులు : విజయ్ దేవరకొండ, మైక్‌టైస‌న్, అనన్య పాండే, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విష్ణురెడ్డి, ఆలి, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను

సాంకేతిక బృందం
దర్శకుడు:  పూరి జగన్నాథ్
నిర్మాతలు:  పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా
బ్యానర్స్:  పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్
కెమెరామెన్: విష్ణు శర్మ
ఆర్ట్ డైరెక్టర్: జానీ షేక్ బాషా
ఎడిటర్: జునైద్ సిద్దిఖీ
స్టంట్: డైరెక్టర్ కెచ్చా



Love story Success Meet Held Grandly

 తెలుగు సినిమా ఇండస్ట్రీలో  "లవ్ స్టోరి" ఒక క్లాసిక్ గా నిలిచిపోతుంది - నాగార్జున




నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా "లవ్ స్టోరి". ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన ప్రతి సెంటర్ నుంచి సూపర్బ్ రిపోర్ట్ అందుకుంటోంది. ఈ నేపథ్యంలో మ్యాజికల్ సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించింది లవ్ స్టోరి టీమ్. ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటు కింగ్ నాగార్జున, దర్శకుడు సుకుమార్, నిర్మాతలు కేఎస్ రామారావు, డి సురేష్ బాబు తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 



*నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ*...లవ్ స్టోరి సినిమా సక్సెస్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. థియేటర్ లలో సినిమా మ్యాజిక్ మళ్లీ లవ్ స్టోరితో తిరిగొచ్చేసింది. శేఖర్ కమ్ములకు ఇది ఎంత ఇంపార్టెంట్ మూవీనో నాకు తెలుసు. వెల్ డన్ శేఖర్ కమ్ముల. నారాయణదాస్ నారంగ్, సునీల్, రామ్మోహన్ కంగ్రాట్స్, కీప్ ఇట్ అప్. నాగ చైతన్య, సాయి పల్లవి అద్భుతంగా నటించారు. సంగీతం సూపర్బ్ గా వచ్చింది. థియేటర్ లలో సినిమా మ్యాజిక్ ఇంకా ఉంది ఉంటుంది అని ప్రూవ్ చేసిన లవ్ స్టోరి టీమ్ అందరికీ థాంక్స్. అన్నారు.


*నిర్మాత నారాయణ దాస్ నారంగ్ మాట్లాడుతూ*...అందరికీ నమస్తే. నా ఫ్రెండ్ శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన సూపర్ హిట్ సినిమా లవ్ స్టోరిని నిర్మించి, విడుదల చేయడం సంతోషంగా ఉంది. సినిమా అద్భుతంగా ప్రదర్శితం అవుతోంది. చాలా సంతోషంగా ఉంది. ఇండస్ట్రీ ఇప్పుడు లవ్ స్టోరితో ఓపెన్ అయ్యిందని అనుకుంటున్నాను. లవ్ స్టోరి సక్సెస్ కావడం టాలీవుడ్ కు శుభ పరిణామం. ఇప్పుడు చాలా సినిమా మా సినిమా సక్సెస్ చూసి రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాయి. ఎంటైర్ టీమ్ కు, నాగార్జున గారికి థాంక్స్. అన్నారు.


*గీత రచయిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ*...కొండల్లో, గుట్టల్లో ఉండే జానపద గీతాన్ని వెండితెరపైకి తెచ్చింది సినిమా. జానపద పాటతో ఒక హిట్ పాట చేద్దామని శేఖర్ గారు చెప్పారు. అలా సారంగ దరియా పాట ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సాధించింది. లవ్ స్టోరి టీమ్ అందరికీ నా కంగ్రాట్స్. అన్నారు.


*దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ*...లవ్ స్టోరి సినిమా సాధించిన విజయం నాకు చాలా రిలీవ్ ఇచ్చింది. జనరల్ గా నా సినిమాల సక్సెస్ గురించి టెన్షన్ పడను. కానీ లవ్ స్టోరి విజయం సాధించాలని గట్టిగా కోరుకున్నా. రెండు సెన్సిటివ్ ఇష్యూస్ గురించి సినిమాలో చెప్పాం. దాన్ని కథలో చక్కగా రాయాలని అనుకున్నాం. మరో ఛాలెంజింగ్ విషయం పాండమిక్ టైమ్ లో థియేటర్ లకు జనం వస్తారా రారా అని భయపడ్డాం. ఆ భయాలన్నీ జయించి ఇవాళ విజయం సాధించాం. దేవుడు దీవించాడు. పైన మా నాన్నగారు ఆశీర్వదించారు అని నమ్ముతున్నాను.  ఇవాళ నిజంగా చాలా హ్యాపీ. లవ్ స్టోరి చాలా స్ట్రెస్ ఫుల్ జర్నీ. 3 ఏళ్లుగా సినిమాకు పనిచేస్తున్నాం. రెండు పాండమిక్ లు చూశాం. మా యూనిట్ కు థాంక్స్ తప్ప మరో మాట రావడం లేదు. నారాయణదాస్ గారు, ఆయన మా వెనక గట్టిగా నిలబడ్డారు. సినిమా మాత్రం థియేటర్లలో రిలీజ్ అవ్వాలని నారాయణ దాస్ నారంగ్ గారు నిర్ణయంతో పట్టుబడ్డి రిలీజ్ చేశారు. చైతూ, సాయి పల్లవి, ఇతర కాస్ట్ అండ్ క్రూ కు థాంక్స్. తెలుగు సినిమా ఇండస్ట్రీకి థాంక్స్. చిరంజీవి గారు దగ్గర్నుంచి చాలా మంది స్టార్స్, దర్శకులు మాకు అండగా నిలబడ్డారు. నాగార్జున గారికి థాంక్స్. తన కొడుకు సినిమా అని కాదు ఆయన ఫిల్మ్ లవర్ కాబట్టి ఇక్కడికి వచ్చారు. ఇతర అతిథులకు కృతజ్ఞతలు. మాకు సపోర్ట్ చేసిన పిప్రీ ప్రజలకు, డిస్ట్రిబ్యూటర్స్ కు, థియేటర్స్ ఓనర్స్ కు థాంక్స్. నా ఫ్యామిలీకి థాంక్స్. అన్నారు.


*హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ*... మా సక్సెస్ మీట్ కు వచ్చిన పెద్ద వాళ్లందరికీ థాంక్స్. నాగార్జున గారు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వస్తారు. ఆయన గురించి అప్పుడు చెప్పాలని అనుకున్నాను. మా తాతయ్య అన్నమయ్య సినిమా ఒక వంద సార్లు చూసి ఉంటారు. ఆయనతో పాటు మేమూ చూశాం. ఆ సినిమా చూసినప్పటి నుంచి మీరంటే ఇష్టం, అభిమానం ఏర్పడ్డాయి. అన్నమయ్య సినిమా చూసి తాతయ్య ఏడుస్తుంటే, ఆయన నటిస్తున్నారు తాతయ్య ఏడవకు అన్నాను. కానీ తాతయ్య అన్నారు ఇప్పుడు నటిస్తుండొచ్చు , గానీ గత జన్మలో నాగార్జున యోగి అయి ఉంటారు అన్నారు. అప్పటి నుంచి మీ సినిమాలు టీవీలో వస్తే ఛానెల్ మారుస్తాను. ఎందుకంటే తాతయ్య దృష్టిలో మీరు ఎప్పుడూ అన్నమయ్యే. ఇవాళ కార్యక్రమానికి వచ్చినందుకు మీకు థాంక్స్. దర్శకుడు శేఖర్ గారు చెప్పినట్లు నైతికంగా మనమంతా కరెక్ట్ గా ఉండాలని టీమ్ మొత్తం పాటించాం. అమ్మాయి తరుపున నిలబడి శేఖర్ గారు ఫైట్ చేశారు ఈ సినిమా ద్వారా. సినిమా మేకింగ్ లోనూ ఆయన మా కోసమే మాట్లాడేవారు. మ్యూజిక్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఇలా ప్రతి అంశంలో లవ్ స్టోరి మ్యాజిక్ చేసింది. ప్రొడ్యూసర్స్ కు థాంక్స్. థియేటర్ లో సినిమా చూసి ఎంజాయ్ చేసి చాలా రోజులైంది. లవ్ స్టోరి తో మళ్లీ సినిమాను ఆస్వాదిస్తున్నాం. ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఈ సినిమాలో జరిగినట్లు నాకు అయింది అని చెప్పేందుకు అమ్మాయిలకి ఒక ధైర్యాన్ని లవ్ స్టోరి ఇచ్చింది. అన్నారు.


*హీరో నాగ చైతన్య మాట్లాడుతూ*...అందరికీ నమస్కారం. చాలా చాలా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ లవ్ స్టోరి మూవీ సక్సెస్ ను సెలబ్రేట్ చేస్తుంది. పాండమిక్ వల్ల లవ్ స్టోరి సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఫ్రైడే మూవీస్ థియేటర్ లలో ఎలా ఉన్నాయి, వాటి రిజల్ట్ ఏంటి అనేది ఎప్పుడూ గమనిస్తుంటాను. పాండమిక్ వల్ల అది మిస్ అయ్యాను. కానీ ఈ నెల 24న ఆ మ్యాజిక్ డే నాకు వచ్చింది. రిలీజ్ చేస్తే థియేటర్ కు జనాలు వస్తారా లేదా అని భయపడ్డాం. కానీ మీరు వచ్చి చూస్తున్నారు. చాలా థాంక్స్. తెలుగు సినిమా ఆడియెన్స్ చిత్రాలను ఆదరించినట్లు దేశంలో ఇంకెక్కడా ఆదరించలేదు. దర్శకుడు శేఖర్ కమ్ముల గారి కంటెంట్, ఆయనకున్న గుడ్ విల్ ఎంత ఉందో ఇవాళ లవ్ స్టోరి సక్సెస్ చూపిస్తోంది. మన జర్నీ ఆగొద్దు, ఇకపైనా మంచి సినిమాలు చేద్దాం. సినిమా రిలీజ్ అయ్యే ముందు లవ్ స్టోరి హిట్ కావాలని స్టార్స్, డైరెక్టర్స్ కోరుకున్నారు. మనమంతా ఒక ఫ్యామిలీ అనే ఫీల్ క్రియేట్ చేశారు. వాళ్లందరికీ థాంక్స్. మా నిర్మాతలు కంటెంట్ నమ్మారు. థియేటర్ లో రిలీజ్ అవ్వాలని హోల్డ్ చేశారు. లవ్ స్టోరి చిత్రంతో శేఖర్ గారు చాలా మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేశారు. ఈ మ్యాజికల్ సక్సెస్ సందర్భంగా లవ్ స్టోరి టీమ్ అందరికీ కంగ్రాట్స్. మా అభిమానులందరికీ థాంక్స్. కొత్త సినిమా అయినా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. కొత్త తరహా సినిమా చేస్తే మీ ఆదరణ ఉంటుందని నిరూపించారు. లవ్ స్టోరిని థియేటర్ లో ఎంజాయ్ చేయండి. అన్నారు.


*హీరో నాగార్జున మాట్లాడుతూ*... తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా ముందు ఉన్న మిత్రులు, పెద్దలు నారాయణదాస్ నారంగ్ గారికి నమస్కారం. నాకు లవ్ స్టోరి సక్సెస్ మీట్ కన్నా ఇది హ్యూమానిటీ సక్సెస్ మీట్ లా అనిపిస్తోంది. మార్చి 2020 నుంచి పోరాడుతూనే ఉన్నా వైరస్ తో , ఏడాదిన్నర గడిచిపోయింది. ఒక వేవ్ లో బయటపడ్డాం అనుకున్నాం కానీ రెండో వేవ్ వచ్చి అణిచివేసింది. ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. 208 రోజుల తర్వాత తెలంగాణలో కోవిడ్ డెత్స్ లేవని తెలిసి సంతోషించాను. ఏపీతో పాటు దేశంలోనూ కరోనా తగ్గుతోంది. కాబట్టి మనం దాన్ని ముందు సెలబ్రేట్ చేసుకోవాలి. కేంద్ర, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా తో బాగా పోరాడారు. కరోనాతో పోరాడి, కరెక్ట్ డెసిషన్స్ సరైన సమయంలో తీసుకుని ప్రజల్ని కాపాడారు. తెలంగాణ మీద కాస్త కనికరం చూపించింది, ఏపీలో ఉధృతి ఎక్కువగా ఉండేది. కానీ ఇవాళ ఆ వైరస్ నుంచి బయటపడ్డాం. ప్రజల్ని కాపాడటమే ప్రభుత్వాల పని. చాలా రాష్ట్రాల్లో థియేటర్స్ తెరవలేదు. తెలంగాణలో థియేటర్స్ తెరిచారు. ఏపీలో వైరస్ దృష్ట్యా పూర్తిగా తెరవలేదు. ఆరోగ్య కార్యకర్తల నుంచి ముఖ్యమంత్రుల దాకా థాంక్స్ చెబుతున్నా. లవ్ స్టోరి సక్సెస్ గురించి మాట్లాడాలంటే ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియడం లేదు. ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకే కాదు మొత్తం దేశ సినిమా పరిశ్రమకే ఉత్సాహాన్ని ఇస్తోంది. లవ్ స్టోరి ఫస్ట్ డే వరల్డ్ వైడ్ షేర్ 7 కోట్ల రూపాయలు. ఒక మంచి సినిమా ఇస్తే థియేటర్లకు వస్తామని తెలుగు్ ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. కొవిడ్ ఒక్కటే కాదు తుఫాన్, సైక్లోన్ వచ్చినప్పుడు కూడా మన వాళ్లు సినిమాలను ఆదరించారు. లవ్ స్టోరి ఒక నాంది. దసరా సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేసుకునేందుకు ధైర్యం వచ్చింది. ప్రతి ఫిల్మ్ మేకర్ లవ్ స్టోరి విజయం వల్ల సంబరాలు చేసుకున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి మనం సంస్కారం నేర్చుకోవాలి. ఆయన పేరు పేరునా టీమ్ అందరినీ పిలిచారు. మేము మర్చిపోతాం. నీ మానవత్వం సూపర్బ్. శేఖర్ కమ్ముల చాలా సెన్సిటివ్ డైరెక్టర్. ఆయన థీమ్స్ అన్నింటిలో సెన్సిటివిటీ ఉంటుంది. కానీ అది సరిపోదు. దాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో బ్యాలెన్స్ చేసి తీయాలి. శేకర్ కమ్ముల అది నేర్చుకున్నాడు. లవ్ స్టోరి ఊరికే హిట్ అవలేదు. అన్ని ఎలిమెంట్స్ కలిపి తెరకెక్కించారు. వన్ గర్ల్ ముందుకొచ్చి తన సమస్యను చెప్పగలిగితే చాలు లవ్ స్టోరి కి సార్థకత వచ్చినట్లే. సినిమాలో ప్రతి సన్నివేశం బ్యూటిఫుల్ గా ఉంది. ఏదో ఏవేవో వద్దు ఒక టెర్రస్ చాలు మంచి సినిమా చేసేందుకు అని నిరూపించారు శేఖర్ కమ్ముల. క్యారెక్టర్స్ తో ఎమోషన్ కనెక్ట్ చేస్తే చాలు సినిమా విజయం సాధిస్తుందని శేఖర్ కమ్ముల ప్రూవ్ చేశారు. నాకు ఇలాంటి ఇన్సిడెంట్స్ చదవడం కూడా ఇష్టం ఉండదు. కానీ అలాంటి అంశాలను శేఖర్ కమ్ముల చూపించిన విధానం సూపర్బ్. నేను సినిమా చూసి రెండు మూడు రోజులు అదే ఎమోషన్ లో ఉండిపోయాను. నారాయణ దాస్ నారంగ్ గారికి నాన్నగారు ఏఎన్నార్ తో చాలా అనుబంధం ఉండేది. మీరు నాతో సినిమా తీయకుండా చైతూతో సినిమా నిర్మించి సూపర్ హిట్ చేశారు. మిమ్మల్ని చూస్తుంటే నాన్నను చూసినట్లే ఉంటుంది. సునీల్ నా ఫ్రెండ్ చాలా టెన్షన్ పడ్డారు సినిమా రిలీజ్ డేట్ విషయంలో. కానీ మీరు కరెక్ట్ డేట్ సెలెక్ట్ చేసుకున్నారు. నేను మిమ్మల్నందరినీ కంగ్రాట్స్ చేస్తున్నాను. పవన్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఏఆర్ రెహమాన్ గారి శిష్యుడు అని విన్నాను. అందుకే వందలాది మిలియన్ వ్యూస్ వచ్చాయి. వెల్ డన్ పవన్. సుద్దాల సాహిత్యం, మంగ్లీ పాటలు పాడిన తీరు బ్యూటిఫుల్ గా ఉంది. సినిమాకు పనిచేసిన చాలా మంది గురించి మాట్లాడాలి. సాయి పల్లవి..మీ తాతగారికి అన్నమయ్య సినిమానే చూపిస్తూ ఉండు. సాయి పల్లవి వండర్ ఫుల్ యాక్ట్రెస్. ఆమె డాన్స్ చేస్తుంటే సమ్ స్పిరిట్ కనిపిస్తుంటుంది. ఆమె చుట్టూ వంద సాయి పల్లవిలు డాన్స్ చేస్తున్నట్లు ఉంటుంది. ఆమె కాళ్లు గాలిలో తేలినట్లు ఉంటాయి. నువ్వు ఏ క్యారెక్టర్ చేసినా ఆ మ్యాజిక్ కనిపిస్తుంటుంది. నీకు అది గొప్ప గిఫ్ట్. పేరు పేరునా నటీనటులు, టీమ్ మెంబర్స్ అందరికీ గాడ్ బ్లెస్ యూ. లవ్ స్టోరి ఒక క్లాసిక్ ఫిల్మ్. ఇలాంటివి అప్పుడప్పుడూ వస్తుంటాయి. కొడుకు గురించి ఏం చెప్పుకుంటాను. చైతన్యను చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. ఈ సినిమా చూశాక ఇంకా సంతోషమేసింది. యాక్టర్ అండ్ స్టార్ ఇవి రెండు డిఫరెంట్ పదాలు. చైతూను ఒక స్టార్ యాక్టర్ గా తయారు చేశావ్ శేఖర్ కమ్ముల. అతన్ని న్యూ జర్నీలో తీసుకెళ్లావ్. నాన్నా...నువ్వు చాలా ఫెంటాస్టిక్ గా నటించావు. నేను నవ్వేలా, ఏడ్చేలా చేశావ్ సినిమాలో. ప్రేమనగర్ రిలీజ్ అయి 50 ఏళ్లవుతోంది. సేమ్ డేట్ కు లవ్ స్టోరి రిలీజ్ అయ్యింది. ప్రేమనగర్ టైమ్ లోనూ తుఫాన్ సైక్లోన్ అన్నీ ఉన్నా, నాన్నగారి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. తుఫాన్, కొవిడ్, సైక్లోన్ తో పోరాడి లవ్ స్టోరి గొప్ప విజయాన్ని సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పుడూ మమ్మల్ని మంచి చూపుతో చూశాయి. తెలుగు  ప్రేక్షకులు సినిమాను ప్రేమిస్తారు. ఇకపైనా ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మనం మాస్క్ లు తీసేసి హాయిగా కలిసి ఉండాలని, ఆ రోజు రావాలని కోరుకుంటున్నా. అన్నారు.

Anand Deverakonda's "Pushpaka Vimanam" To Release In Theatres On 12th November

 Anand Deverakonda's "Pushpaka Vimanam" To Release In Theatres On 12th November 



Anand Deverakonda's Pushpaka Vimanam is all set for theatrical release. The makers have announced that the film will be releasing in theatres on the 12th of this month. This is Anand's third film after Dorasani, and Middle Class Melodies.


The film is directed by debutante Damodara and Tollywood heartthrob Vijay Deverakonda is presenting it under 'King Of The Hill' banner. Tanga Productions are co-producing the film. Govardhan Rao Deverakonda, Pradeep Errabilli, and Vijay Dashi are producing the film. 


The director Damodara says Pushpaka Vimanam is a concept-based film. "Anand plays a government school teacher in the film. It is a family drama that deals with subtle nuances. The film s releasing on the 12th of November," he concludes.



 *Cast* : 

Anand Deverakonda 

Geeth Saini , Saanve Megghana

Sunil, Naresh, Harsha Vardhan , Giridhar, Kireeti, Badhram, viva Harsha, Abhijeeth, Ajay, Sudarshan, Saranya, Meena Vasu, shaking Seshu


Writer & Director: Damodara.

Presenter : Vijay Deverakonda.

Producers: Govardhan Rao Deverakonda, Vijay Dashi, Pradeep Errabilli

DOP: Hestin Jose Joseph

Music: Ram Miriyala, Sidharth Sadasivuni, Amit Dasani.

BGM: R H Vikram


Editor: Raviteja Girijala 


Art director: Neil Sebastian


Costume designer: Bharath Gandhi


Choreographers: Raghu master, Aata Sandeep


Publicity designers: Anil bhanu


Digital media : Walls and Trends


PRO :GSK Media