Latest Post

T Series Bhadrakali Pictures Prabhas 25 Spirit Announced

 T సిరీస్, భ‌ద్ర‌కాళీ పిక్చ‌ర్స్ బ్యానర్స్ పై సందీప్ రెడ్డి వంగా దర్శకుడిగా రెబల్ స్టార్ ప్రభాస్ 25వ సినిమాగా రానున్న‌ 'స్పిరిట్'.. 

 


గత కొన్ని రోజులుగా రెబల్ స్టార్  ప్రభాస్ 25వ సినిమా గురించి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పుడు దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. రెబల్ స్టార్ ప్రభాస్ తన 25వ సినిమాను పాన్ ఇండియన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయబోతున్నారు. దీనికి 'స్పిరిట్' అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన దర్శక నిర్మాతల నుంచి విడుదలైంది. అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి.. ఆ తర్వాత అదే సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ పేరుతో రీమేక్ అక్కడా సంచలన విజయం అందుకున్నారు. ఇప్పటి వరకు రెబెల్ స్టార్ ప్రభాస్‌ను అభిమానులు కనీసం ఊహించనటువంటి కొత్త పాత్రలో సందీప్ రెడ్డి వంగా చూపించబోతున్నారు. పాన్ ఇండియన్ స్థాయిలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రాబోతుంది. టి సిరీస్, భ‌ద్ర‌కాళీ పిక్చ‌ర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు.  ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలతో బిజీగా ఉన్నారు.  ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

ZEE5 to stream 'Raja Raja Chora' on 8th October

 ZEE5 to stream 'Raja Raja Chora' on 8th October



Sree Vishnu -starrer is an acclaimed box-office hit set to entertain ZEE5 viewers


Hyderabad, 7th October 2021: It's the unanimous opinion of viewers that there is no dearth of entertainment when ZEE5 is around. The streaming platform has entertained the audience across languages with a wide range of offers, be it web series, originals, or direct-to-digital releases. After bringing out movies like 'Alanti Sitralu' very recently, ZEE5 is all set to release the fun drama 'Raja Raja Chora' as a post-theatrical digital release.


ZEE5 is all set to stream the super hit movie on 8th October. The streaming platform will bring the crime comedy to its patrons on the eve of the festival.


When it was released in theatres, the film garnered encouraging box-office collections and overwhelming critical acclaim. As a robber named Bhaskar, Sree Vishnu's performance was praised by everyone. Sunaina and Megha Akash were joined by able performers like Ravi Babu, Srikanth Iyyengar, Ajay Ghosh, Gangavva, and Tanikella Bharani.


Directed by debutant Hasith Goli, the film's music is by Vivek Sagar.


Later this month, ZEE5 will also release 'Heads & Tales', a Telugu-language drama to be streamed from October 22.

Chetan Bharadwaj interview about Maha Samudram

 మహాసముద్రం లాంటి సినిమాను ఈ మధ్య కాలంలో చూసి ఉండరు - మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్



శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతోన్న ‘మహా సముద్రం’ సినిమా మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ఆర్ ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతోన్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను స్పీడు పెంచేశారు. ఈ క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు


మహా సముద్రం ఎంతో ఇంటెన్స్ ఎమోషన్స్ ఉన్న సినిమా. ఈ  చిత్రం చూసిన ప్రేక్షకులు కచ్చితంగా ఓ మౌనంతో వెళ్తారు. చివరి 40 నిమిషాలు మాత్రం ఎవ్వరూ ఏం మాట్లాడకుండా చూస్తారు. సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం.


మనిషి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో అదే మహాసముద్రం. అమాయకపు మనుషుల జీవిత కథలే ఇందులో కనిపిస్తాయి. ఇలాంటి ఇంటెన్స్ ఎమోషన్స్ ఉన్న సినిమాకు బ్యాక్ గ్రౌండ్  స్కోర్ ఇవ్వడం నాకు  చాలెంజింగ్ మారింది. ఎన్ని రకాలుగా ఇవ్వొచ్చనే విషయం కూడా తెలిసింది. అంద‌రి అంచనాలు మించేలా సినిమా ఉంటుంది.


మ్యూజిక్ అనేది కథకు అనుగుణంగానే ఇస్తాను. కథ బాగుంటే.. మ్యూజిక్ కూడా బాగుంటుంది. కథను బట్టే మ్యూజిక్ ఇవ్వడానికి నేను ఎక్కువగా ఇస్తుంటాను.


ఆర్ఎక్స్ 100 సినిమాలో కంటే ఎక్కువ ట్విస్ట్‌లు మహాసముద్రంలో ఉంటాయి. ఇందులో దాదాపు ఐదారు ట్విస్ట్‌లుంటాయి. అందులో  ఒకే ఎమోషన్ ఉంటుంది. కానీ ఇందులో మల్టిపుల్ ఎమోషన్స్ ఉంటాయి. ఒక అతీంద్రియ శక్తి మనిషిని ఎన్నిరకాలుగా మార్చుతుంది.. టైం, విధి మనిషిని ఎన్ని రకాలుగా మార్చుతుందనేది చూపించబోతోన్నాం.


ఆర్ఎక్స్ 100 సినిమాకు చేసిన ప్రయోగాన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు. బాగా ఆదరించారు. ఇప్పుడు ఈ సినిమాకు ఒళ్లు దగ్గరపెట్టుకుని మరింత జాగ్రత్తగా చేశాను. కచ్చితంగా మహాసముద్రం కూడా అందరినీ ఆకట్టుకుంటుంది.


మహా అనే క్యారెక్టర్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. ఆమె జీవితంలో జరిగే ఘటనల ద్వారా చుట్టూ ఉన్న వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది కథ.


కొన్ని కొన్ని జానర్స్ మూవీ సెంట్రిక్‌గా చేయాల్సి ఉంటుంది. మూవీకి ఆ పర్టిక్యులర్ సీన్‌కు పాట ఆడియెన్స్‌కు కనెక్ట్ అయితే.. ఆపాట హిట్టైనట్టే. ఆర్ఎక్స్  100 సినిమా అనేది ఎమోషన్స్, లవ్, యాక్షన్ అన్ని కలిపి ఉంటాయి. ఆ సినిమాలోని పాటలు ఆడియెన్స్‌ను కనెక్ట్ అయ్యాయి. ఆ సెక్షన్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యాయంటే హిట్ అయినట్టే. మహా సముద్రం సినిమాలో  నాకు చెప్పకే చెప్పకే అనే పాట ఎక్కువగా ఇష్టం. మంచి మూమెంట్‌లో ఆ పాట వస్తుంది. హే రంభా అనే పాట పాడటం నాకు సంతోషంగా ఉంది.


నాకు కథను ఎంతో క్లియర్‌గా, డీటైల్డ్‌గా చెప్పారు. నా టోన్ ఆ స్టోరీకి సరిపోతుందని అజయ్ భూపతి గారు నమ్మారు. లైవ్ బేస్డ్‌ ఎలిమెంట్స్ చేసే స్కోప్ ఇచ్చారు. నాకు డీటైల్డ్ ఎమోషన్ కనుక్కుని మ్యూజిక్ ఇవ్వడం ఇష్టం. అందుకే నేను చేసిన ప్రతీ అటెంప్ట్ పాజిటివ్‌గానే తీసుకున్నారు.


ప్రతీ ఒక్కరూ అద్బుతంగా నటించేశారు. అంత ఇంటెన్స్ ఉన్న సినిమాను ఈ మధ్య కాలంలో చూసి ఉండరు. ప్రతీ ఒక్క పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్  చేయడం చాలా కష్టంగా అనిపించినా.. చాలెంజింగ్‌గా తీసుకున్నాను.


పాటను జనాలకు రీచ్ అయ్యేట్టుగా సంగీతం ఇవ్వాల్సి ఉంటుంది. కథను తగ్గట్టుగానూ ఉండాలి. అందుకే పాటలు చేసేటప్పుడే రెండు రకాలుగా ఆలోచిస్తాను. సినిమాను ముందుకు తీసుకెళ్లేలా ఉండాలని, జనాలకు నచ్చే విధంగా ఉండాలనుకుంటాను. ఈ సినిమాలో చెప్పకే చెప్పకే అనే పాటకు ఎక్కువ సమయం తీసుకున్నాను.


లిరిక్ రైటర్స్ చాలా కష్టపడి రాశారు. పాటలో అమాయకత్వం, సిట్యువేషన్‌కు తగ్గట్టు పాట, పాటకు తగ్గ లిరిక్స్ అన్నీ ఇలా కుదిరాయి. చైతన్య ప్రసాద్, భాస్కరభట్ల, కిట్టు విశ్వప్రగడ అందరూ అద్భుతంగా రాశారు. సినిమాలోని ఎమోషన్‌ను ముందుకు తీసుకెళ్లారు.


బ్యాక్ గ్రౌండ్ కన్నా.. సాంగ్స్ చేయడమే నాకు ఇష్టం. పాటలు చేయడంలో ఫ్రీడం ఎక్కువగా ఉంటుంది. ఆర్ఎక్స్ 100లో రుధిరం, ఎస్ఆర్ కళ్యాణమండపంలోని చుక్కల చున్నీ బాగా ఇష్టం. ఆనంద్ దేవరకొండ సినిమా ఒకటి చర్చల్లో ఉంది.


పాటలు ఎప్పుడూ కూడా సినిమాకు తగ్గట్టే ఉండాలి.  పాటలను బట్టే సినిమాలను చూస్తున్నారు. ఆర్ఎక్స్ 100 సినిమాకు అంత ఆదరణ ఇచ్చినందుకు ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. నా జర్నీ నాకు ఎంతో సంతృప్తిగా ఉంది.


Naatyam Movie Song Launched by Mass Raja Raviteja

 నాట్యం` సినిమాలోని `వేణువులో..` పాట‌ను రిలీజ్ చేసిన మాస్ మ‌హారాజా ర‌వితేజ



`నాట్యం`అంటే ఓ క‌థ‌ను డాన్స్ ద్వారా అంద‌మైన రూపంలో చెప్ప‌డ‌మే. అలాంటి ఓ అద్భుత‌మైన‌ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రం `నాట్యం`. ఈ మూవీ ద్వారా ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా ప‌రిచ‌యం అవుతున్నారు. రేవంత్ కోరుకొండ దర్శకుడు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్, టీజర్, సాంగ్స్‌కి  ట్రెమండ‌స్‌ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా నాట్యం సినిమా నుండి `వేణువులో చేర‌ని గాలికి సంగీతం లేదు...` అనే పాట‌ను మాస్ మ‌హారాజా ర‌వితేజ విడుద‌ల‌చేసి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.


క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల సాహిత్యం అందించిన ఈ పాట‌కు  శ్రవణ్ భ‌రద్వాజ్ మంచి ట్యూన్ కంపోజ్ చేశారు.  అనురాగ్ కుల‌క‌ర్ణి శ్రావ్యంగా ఆల‌పించిన ఈ పాట శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకుంటోంది. నాట్యం చిత్రం అక్టోబ‌రు 22న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కానుంది.


ఈ సినిమాలో కమల్ కామరాజ్, రోహిత్ బెహల్, ఆదిత్య మీనన్, భానుప్రియ, సుభలేఖ సుధాకర్, రుక్మిణీ విజయకుమార్, బేబీ దీవెన ముఖ్య పాత్రలు పోషించారు. నిశ్రింకళ ఫిలింస్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించింది.  


న‌టీన‌టులు: సంధ్యారాజు, క‌మ‌ల్ కామ‌రాజు, రోహిత్ బెహ‌ల్‌, ఆదిత్య మీన‌న్‌, శుభ‌లేఖ సుధాక‌ర్‌, భానుప్రియ‌, బేబీ దీవ‌న త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:


స్క్రిప్ట్‌, కెమెరా, ఎడిటింగ్‌, ద‌ర్శ‌కత్వం: రేవంత్ కోరుకొండ‌

నిర్మాణ సంస్థ‌: నిశ్రింక‌ళ ఫిల్మ్‌

సంగీతం: శ్రవణ్ భ‌రద్వాజ్‌

పాటలు: క‌రుణాక‌ర్ అడిగ‌ర్ల‌

ఆర్ట్‌: మ‌హేశ్ ఉప్పుటూరి

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: సంధ్యా రాజు

వి.ఎఫ్‌.ఎక్స్‌: థండ‌ర్ స్టూడియోస్‌

క‌ల‌రిస్ట్‌: ఎం.రాజురెడ్డి

ఎస్ఎఫ్ఎక్స్‌: సింక్ సినిమాస్‌

సౌండ్ మిక్సింగ్‌: కృష్ణంరాజు

ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: వాల్మీకి శ్రీనివాస్‌

పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌


Konda Polam Pre Release Event Held Grandly

 మ‌నంద‌రం గ‌ర్వ‌ప‌డే చిత్రం కొండ‌పొలం - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ద‌ర్శ‌కుడు క్రిష్‌



`ఉప్పెన` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రం త‌ర్వాత మెగాసెన్సేష‌న్ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న

 చిత్రం `కొండపొలం`. యాక్షన్ మ‌రియు అడ్వెంచ‌ర‌స్ గా రూపొందుతోన్న ఈ  చిత్రానికి  క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం అక్టోబర్ 8న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.  ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కొండ‌పొలం గ్రాండ్  ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైద‌రాబాద్‌లో  ఏర్పాటు చేశారు.  ఈ సంద‌ర్భంగా...


రచ్చ రవి మాట్లాడుతూ.. ‘కొన్ని సినిమాలు  రంజింపచేస్తాయి.. మరికొన్ని ఉత్తేజపరుస్తాయి.. ఇంకొన్ని సినిమాలు చూస్తే ఆలోచించేలా చేస్తాయి.. కానీ రంజింపచేస్తూ, ఉత్తేజపరుస్తూ, ఆలోచించేలా చేస్తే సినిమానే కొండపొలం’ అని అన్నారు.


రంగస్థలం ఫేమ్ మహేష్ మాట్లాడుతూ.. ‘ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చినందుకు క్రిష్ గారికి థ్యాంక్స్. చిరంజీవి గారితో చేశాను, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో చేశాను, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ అందరితోనూ చేశాను. ఇక ఇప్పుడు వైష్ణవ్ తేజ్‌తో కూడా న‌టించ‌డం చాలా సంతోషంగా ఉంది’ అని అన్నారు.


చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో రెండు పాటలు రాశాను. హరిహర వీరమల్లుతో పని చేస్తున్న సమయంలోనే కొండపొలం అవకాశం వచ్చింది. సన్నపురెడ్డి వెంకటరెడ్డి కొండపొలం అద్భుతంగా రచించారు. చ‌క్కటి కథనాన్ని అందించారు. అడవి గురించి మూడు నిమిషాల పాట రాశాను. అడవిని తల్లి ఒడి, గుడి, బడి అనే కోణాల్లోంచి చూసి రాశాను. చెట్టెక్కి అనే పాట కూడా రాశాను. ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు కీరవాణి, క్రిష్ గారికి థ్యాంక్స్’ అని అన్నారు.


సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ‘సినిమా చూసేందుకు నేను కూడా నిరీక్షిస్తున్నాను. నేను కొందరినీ చూసి ఊహించుకుని నవల రాశాను. వాటిని క్రిష్ తెరపై ఎలా చూపించాడా? అని ఎదురుచూస్తున్నాను. నేను కూడా అక్టోబర్ 8న సినిమా చూసేందుకు ఆత్రుతగా ఎదరుచూస్తున్నాను’ అని అన్నారు.


సాయి చంద్ మాట్లాడుతూ.. ‘సినిమాలో నటించిన నటుడిగా ఇక్కడకు రాలేదు. ఓ తండ్రిగా వచ్చాను. ఉప్పెన సినిమాలో పాత్రను చేయమని చిరంజీవి గారు చెప్పారు. ఒక వేళ ఆయన చెప్పినట్టు చేయకపోతే.. ఓ మంచి కొడుకును మిస్ చేసుకునే వాడిని. ఈ జనరేషన్‌లో ఇంత మంచి వాడు ఉండటం చాలా సంతోషం. ఉప్పెనతో తండ్రి పాత్రకు ఇంకా తనివితీరలేదని అనుకున్నాను. మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే కచ్చితంగా నెరవేరుతుందని అంటారు. అలా అప్పుడు క్రిష్ నుంచి ఫోన్ వచ్చింది. కొండపొలం కథను సినిమాగా చేస్తున్నామని చెప్పారు. తండ్రి పాత్ర అని చెప్పడంతో ఎంతో సంతోషించాను. వైష్ణవ్ తేజ్ నన్ను ఎంతో బాగా చూసుకున్నాడు’ అని అన్నారు.


హేమ మాట్లాడుతూ.. ‘మెగా ఫ్యామిలీలో అందరితో సినిమాలు చేశాను. ఒక్క వరుణ్ తేజ్‌తోనే ఇంకా చేయలేదు. ఎంతో  సహజంగా నటిస్తావు అని పవన్ కళ్యాణ్ అన్నారు. చిరంజీవి సినిమాల్లో అత్తగారి పాత్ర వేశాను. సాయి ధరమ్ తేజ్‌ మొదటి సినిమాలో అమ్మ పాత్రను వేశాను. ఎక్కడ కలిసిన అమ్మా అని పిలుస్తుంటాడు. ఆయన త్వరగా కోలుకోవాలి. వైష్ణవ్ తేజ్ నా తమ్ముడు. మొదటి రోజు నుంచి అక్కా అని పిలిచేవాడు. వైష్ణవ్ డైలాగ్స్ చెబితే మాత్రం మామూలుగా ఉండదు. ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు క్రిష్ గారికి థ్యాంక్స్. రకుల్‌ది టైం అంటే టైం. సినిమా కోసం చాలా కష్టపడింది. గమ్యం, వేదం కంటే ఎక్కువ కాన్ఫిడెంట్‌గా ఈ సినిమా గురించి మాట్లాడారు. ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాలి’ అని అన్నారు.


హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవల అని ఈ సినిమా పోస్టర్లో వేయడం నాకు నచ్చింది. నవలు రాసే వారు కాదు.. చదివే వారు తగ్గారు. సోషల్ మీడియాలో అడ్డమైన చెత్త చదవడానికి టైం ఉంటుంది కానీ ఇలాంటి పుస్తకాలు చదివే టైం ఉండదు. నేను కూడా దానికి అతీతుడిని కాదు. సాహిత్యాన్ని.. అక్షరాలను ముత్యాలుగా మార్చి ఇండస్ట్రీకి తీసుకొస్తున్నాడు క్రిష్‌. సినిమాకు నవలా సాహిత్యానికి మధ్య గ్యాప్ కాదు అగాథంలా ఉంది. చలం మైదానం లాంటి సినిమాలు తీయాలని వచ్చాను. ఎకనామిక్స్, ఈస్థటిక్స్ కలిపి సినిమాలు తీయడం మామూలు విషయం కాదు. కానీ క్రిష్ దాన్ని అవలీలగా దాటేశారు. చంద్రబోస్ అద్భుతంగా పాట రాశారు. బతుకును కొరికే ఆకలి కేకలు అని లైన్ బాగా రాశారు. కరోనా సమయంలో సినిమా షూటింగ్ అవసరమా? అని అన్నాను. కానీ ఇలాంటి సమయంలోనే అవసరం.. కొందరికైనా పని కల్పిస్తాను అని క్రిష్ అన్నారు. సాయి ధరమ్ తేజ్ హాస్పిటల్‌లో ఉన్నప్పుడు వైష్ణవ్‌కు ఓ పక్క ఏడుపు తన్నుకొస్తుంది.. అందరూ వచ్చి పలకరిస్తున్నారు.. కానీ ధైర్యంగా ఉన్నాడు. అన్ని ఎమోషన్స్ ఆపుకున్నాడు. ఇంత చిన్న విషయంలో అంత బాధ్యతలను మోయడం మామూలు విషయం కాదు. బంధాన్ని పంచుకోవడం కాదు బాధ్యతను పంచుకునే తమ్ముడు దొరకడం సాయి ధరమ్ తేజ్ అదృష్టం. ఓబులమ్మ పాటను చూసినప్పటి నుంచి రకుల్‌ను ఆ పాత్రలో చూస్తున్నాను. ఎంతో గొప్పగా క్యారెక్టర్‌లోకి ట్రాన్స్‌ఫర్ అయింది. ఇది గొప్ప చిత్రం. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ఇంకా మంచి నవలను రాయాలి. దాన్ని మేం సినిమాగా తీసేందుకు రెడీగా ఉంటాం. అడవిని మళ్లీ మన ఇంటికి తీసుకొస్తున్నందుకు క్రిష్‌కు థ్యాంక్స్’ అని అన్నారు.



ఎన్ స్క్వేర్ అధినేత నవీన్ మాట్లాడుతూ.. ‘నేను మెగా అభిమానిని. వారిని చూస్తూ, అభిమానిస్తూ పెరిగాం. కొండపొలం సినిమాకు టైటిల్ స్పాన్సర్ చేశాం. క్రిష్ గారి సినిమాలు చూస్తుంటాం. పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న హరిహర వీరమల్లు గురించి ఎంతో ఆత్రుతగా చూస్తున్నాం’ అని అన్నారు.


రవిప్రకాష్ మాట్లాడుతూ.. ‘గొర్రెలే తమ జీవితం, సర్వస్వం అనుకుని గొర్రె కాపర్ల గురించి చెప్పే కథే కొండపొలం. ఓ తండ్రి తన కొడుకు భవిష్యత్తు కోసం ఆరాటపడటమే కొండపొలం కథ. ఓ అందమైన ప్రేమ కథే కొండపొలం. ఎన్ని సార్లు కిందపడ్డా కూడా రయ్ రయ్ తల ఎత్తి పోరాడాలని చెప్పే కథే కొండపొలం . సినిమా కోసం రాసిన కథ కాదు. మన జీవితాల్లోంచి మన కోసం వచ్చిన కథ. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.


మహేష్ విట్టా మాట్లాడుతూ.. ‘వైష్ణవ్ తేజ్ ఎంతో మంచివాడు. పరిచయం అయిన ఐదు నిమిషాల్లోనే ఎంతో బాగా నచ్చేస్తాడు. ముద్దు పెట్టుకోవాలనేంత నచ్చేస్తాడు. ఇక రకుల్ అంటే మనం ఫిట్ నెస్ ఫ్రీక్ అనుకుంటాం. కానీ మంచిగా తినాలి అని చెప్పేది. భాస్కర్ అనే మంచి పాత్రను ఇచ్చినందుకు క్రిష్ గారికి థ్యాంక్స్’ అని అన్నారు.


బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. ‘బంగారం లాంటి సినిమా తీశావ్ అని క్రిష్‌గారు నాతో అన్నారు. అది నా ఫ్రెండ్స్‌కు చెప్పాను. క్రిష్ గారు  ప్రతీ సినిమాతో ఓ పాఠం చెబుతారు. విలువలతో కూడా సినిమాను తీస్తారు. ఈ సినిమాను కూడా మొదటి షోనే చూస్తాను. నాన్నకు ప్రేమతో సినిమా సమయంలోనే రకుల్ గారు తెలుసు. మీ కష్టమే మిమ్మల్ని బాలీవుడ్ వరకు చేర్చింది. మొదటి ముద్దు, హగ్గు ఎప్పటికీ స్పెషల్. అలా వైష్ణ‌వ్ నా మొదటి హీరో.. నిన్ను ఎప్పటికీ గుండెల్లో దాచుకుంటాను. నా ఫ్రెండ్స్ అందరూ కూడా నీతో కథలు చెప్పాలని అనుకుంటున్నారు. కథే నీలాంటి ఆర్టిస్ట్‌ను వెతుకుతున్నాయి. ఇంకా ఇలాంటి మంచి పాత్రలతో దూసుకుపో’ అని అన్నారు.


రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘లాక్డౌన్ సమయంలో ఈ కథ చేయాలని అనుకున్నప్పుడు ఎలా అని అనుకున్నాను. అప్పుడు ఆర్థికంగా కొందరు సాయం చేశారు. వారందరికీ థ్యాంక్స్. ఆల్ ఇండియా వైడ్‌గా రైట్స్ కొనేశారు. ఐదు నిమిషాల్లో డిస్ట్రిబ్యూటర్ లక్ష్మణ్ క్లోజ్ చేసేశాడు. మనం పెట్టిన పెట్టుబడి మొత్తం వచ్చేసిందన్న కాన్ఫిడెంట్ వచ్చింది. ఆయనే ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. అంకితభావం, హార్డ్ వర్కింగ్ వల్లే రకుల్ ఆ స్థాయికి వెళ్లారు. వరుణ్ తేజ్‌తో కంచె సినిమా చేశాం. వైష్ణవ్ తేజ్‌తో కొండపొలం చేస్తున్నాం. వైష్ణవ్ తేజ్ ఓ స్టార్ అవుతారు. క్రిష్ గారి అద్భుతమైన చిత్రాల్లో కొండపొలం కూడా ఒకటిగా నిలుస్తుంద’ని అన్నారు.


లక్ష్మీకాంత్ మాట్లాడుతూ.. ‘క్రిష్ కథల్లో ప్రాణం ఉంటుంది..స్టోరీ బాగుండాలి.. అదే ప్రాణం.. గమ్యం నుంచి కొండపొలం వరకు ప్రాణం ఉంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ అనేది మాకు ఫ్యామిలీలాంటిది. లాక్డౌన్ కష్టకాలంలో మమ్మల్ని హ్యాపీగా ఉంచారు. అదే ఈ సినిమా సక్సెస్. ఇది పక్కా కమర్షియల్ సినిమా. ఉప్పెనలో బీచ్‌లో, కొండపొలంలో అడవిలో వైష్ణవ్ ఫైట్లు చేశాడు. రకుల్ ఎంతో అందమైన, కమర్షియల్ నటి. కానీ ఇందులో మాత్రం క్యారెక్టర్ కనిపిస్తుంది. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంద’ని అన్నారు.


క్రిష్ మాట్లాడుతూ.. ‘ఇంత త్వరగా ఎలా సినిమా తీస్తావ్ అని అడుగుతుంటారు. కానీ పని దినాలు తక్కువే అయినా పని వేళలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఉదయం నుంచి రాత్రి వరకు పని చేస్తుంటాం. నీకు అవసరం, ఇండస్ట్రీకి అవసరం వెళ్లు సినిమా చేయ్ అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. మధ్యలో వేరే సినిమా చేసేందుకు ఒప్పుకున్న నిర్మాత ఏఎం రత్నం గారికి కృతజ్ఞతలు.  పుస్తకాల షాపులు మూసేస్తున్నారు. సినిమాకు కావాల్సిన ముడి పదార్థం స్టోరీ. కొంతమంది గొర్రెలను తీసుకుని అడవికి వెళ్తే అది పిక్నిక్ కాదు. అది సాహసయాత్ర. కొండపొలం పుస్తకం చదివిన తరువాత.. అందులో స్త్రీ పాత్ర లేదు. గొర్రెలు కాసేందుకు అడవికి వెళ్లిన కుర్రాడు.. మళ్లీ అదే అడవిని కాపాడే అధికారిగా వస్తాడు. అలాంటి స్టోరీలో అందమైన ప్రేమకథను జోడించి తెరపై ఆవిష్కరిస్తే బాగుంటుందని అనుకున్నాను. మళ్లీ సినిమా కోసం సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారితో కథను రాయించాను. స్క్రీన్ ప్లే మాత్రమే నేను రాశాను. ఇక్కడకు వచ్చిన హరీష్ శంకర్ గారికి థ్యాంక్స్. బుచ్చిబాబు సానా వల్ల ఓ మంచి హీరో ఇండస్ట్రీకి దొరికాడు.  బొడ్డు కోయడం చాలా కష్టం. అలా బొడ్డు కోసి ఆ బిడ్డను మాకు ఇచ్చాడు. మహేష్ విట్టా చెప్పినట్టుగా వైష్ణవ్ తేజ్‌ను కలిసిన ఐదు నిమిషాలకే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది.. నేను హగ్ చేసుకుని భుజం మీద ముద్దు పెట్టేశాను. ఉప్పెన సినిమాతో వైష్ణవ్ తేజ్‌కు బెంచ్ మార్క్ క్రియేట్ అయింది. అంతకంటే పై మెట్టు ఎక్కిస్తున్నాను. అలాంటి కథ, పాత్ర దొరికింది. ఓబులమ్మగా నటించిన రకుల్ గురించి చెప్పాలి. రకుల్ అంటే అందమైన అమ్మాయి, వర్కవుట్లు అని అంటారు. కానీ ఆమె లోలోపల వేరే ఉంది. క్రమశిక్షణ, అంకితభావం, డైలాగ్స్ నేర్చుకునే తీరు, ఆ యాసతో అందరినీ ఆశ్చర్యపరిచింది. కథ చెప్పేటప్పుడే ఓబులమ్మ పాత్రలో రకుల్‌ను చూశాను. రకుల్‌ అని మరిచిపోయి ఓబులమ్మ అని పిలుస్తున్నాను. ఓబు అంటే అడవి అంత గొప్పది అని రాసుకున్నాను. ఈ పాత్రను ఒప్పుకున్నందుకు రకుల్‌కు థ్యాంక్స్. సాయి చంద్ గారి గురించి ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు. అక్టోబర్ 8న సినిమా విడుదలైన తరువాత మాట్లాడుతాను. కీరవాణి గారు మా గైడ్‌లా మారారు. సినిమా ఇంత బాగా రావడానికి ఆయనే ప్రధాన కారణం. ఇలాంటి సమయంలో సినిమాను ఇంత బాగా రీచ్  అయ్యేలా చేసిన వంశీ శేఖర్‌లకు థ్యాంక్స్. ఇది మ‌నంద‌రం గర్వపడే సినిమా. ఎంజాయ్ చేసే చిత్రం. సినిమాను బాగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.


రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రతీ నటికి గర్వంగా చెప్పుకునే పాత్ర రావాలని అనుకుంటారు. అలాంటి ఓ క్యారెక్టరే ఓబులమ్మ. ఇలాంటి పాత్ర ఇచ్చినందుకు, ఆ నమ్మకాన్ని నాపై ఉంచినందుకు క్రిష్ గారికి థ్యాంక్స్. ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఈ చిత్రాన్ని చేశాను. నాకు ఈ పాత్రను పోషించడంలో సంతృప్తి దొరికింది. నాకు ఈ పాత్ర ఎంతగా నచ్చిందో.. ప్రేక్షకులకు కూడా అంతే నచ్చుతుందని అనుకుంటున్నాను. కరోనా, లాక్డౌన్ సమయంలో ఈ సినిమాను ఇంత బాగా తీసినందుకు అందరికీ థ్యాంక్స్. కీరవాణి గారి సంగీతానికి నేను పెద్ద అభిమానిని. వైష్ణవ్ తేజ్ భవిష్యత్తులోపెద్ద స్టార్ అవుతాడని అంటారు. కానీ ఆల్రెడీ ఆయన ఇప్పటికే స్టార్ అయిపోయాడు. ఆయన కళ్లు చాలా పవర్ ఫుల్. ఎంతో ఒదిగా ఉంటాడు. అక్టోబర్ 8న అందరూ ఈ సినిమాను చూడండి’ అని అన్నారు.


వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. ‘అడవి పెద్దబాలశిక్ష అంటారు. ఉప్పెన నా మొదటి చాప్టర్ అయితే.. కొండపొలం రెండోది. ఈ చిత్రంలో ఎంతో మంది దగ్గరి నుంచి ఎన్నెన్నో నేర్చుకున్నారు. అందరినీ గమనిస్తూ కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్ ఇలా అన్ని నేర్చుకున్నాను. రాజీవ్, క్రిష్, సాయి బాబా గారు ఎప్పుడూ సినిమా గురించే మాట్లాడుతూ ఉంటారు. ఒకరినొకరు ఏం చెప్పుకోకుండానే.. అన్ని తెలిసిపోతాయి. ఆ ముగ్గురి స్నేహబంధం చాలా గొప్పది. క్రిష్ అన్న దగ్గరి నుంచి ఎన్నో నేర్చుకున్నాను. సినిమాను సాధారణ పరిస్థితుల్లో చేయలేదు. టీం అంతా కలిసి కెమెరాలు ఎత్తుకుంటూ అడవిలోకి వెళ్లాం. మా టీం అందరి కష్టమే కొండపొలం. ఈ క్యారెక్టర్ మనలో ఒకడు. మనకు ఎన్నో భయాలు ఉంటాయి. మూవీ ముందుకు వెళ్లే కొద్ది భయాలను ఎదుర్కొంటూ వెళ్తాడు. ఎన్నో కష్టాలు పడి.. పులిని ఎదురించడమే ఈ కొండపొలం. ఓ స్టెప్ వేస్తే పడిపోతామనే భయం ఉంటుంది. కానీ ఎన్ని సార్లు పడ్డా కూడా ముందుకు వెళ్లాలనే బలాన్ని కొండపొలం ఇస్తుంది. మీరు ఈ దేశాన్ని గర్వపడేలా చేయాలని ఆలోచనను మీలో రేకెత్తిస్తుంది. ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు క్రిష్ గారికి థ్యాంక్స్’ అని అన్నారు.

Icon Star Allu Arjun Visits The Sets Of Venkatesh, Varun Tej, Anil Ravipudi, Sri Venkateswara Creations F3

 Icon Star Allu Arjun Visits The Sets Of Venkatesh, Varun Tej, Anil Ravipudi, Sri Venkateswara Creations F3



Victory Venkatesh and Mega Prince Varun Tej are working together to create laughing riot with F3, a sequel to their blockbuster movie F2. Successful director Anil Ravipudi is directing the movie to offer triple the fun with Tollywood’s leading production house Sri Venkateswara Creations producing it on grand scale. While Dil Raju presents, Shirish is producing the movie.


The team had a special guest on the sets. Icon star Allu Arjun made a sudden visit to the sets. In the pictures released by the team see Allu Arjun discussing with heroes Victory Venkatesh, Mega Prince Varun Tej, Rajendra Prasad, Sunil and director Anil Ravipudi. There is cheerfulness in all the faces. The entire team is working with full of energy and Allu Arjun’s visit lifts up mood on the sets.


The crucial and lengthy shooting schedule of F3 is currently happening in Hyderabad and along with the lead cast, other artists too are taking part in it. Tamannaah Bhatia and Mehreen Pirzada are the heroines opposite Venkatesh and Varun Tej respectively, while Sunil is roped in for a crucial role. The film also boasts a stellar cast.


Rockstar Devi Sri Prasad who provided chartbuster album for F2 is readying a superhit album for F3. Sai Sriram cranks the camera, while Tammiraju is the editor. Harshith Reddy is the co-producer.


Cast: Venkatesh, Varun Tej, Tamannaah Bhatia, Mehreen Pirzada, Rajendra Prasad, Sunil etc.


Technical Crew:

Director: Anil Ravipudi

Presenter: Dil Raju

Producer: Shirish

Banner: Sri Venkateswara Creations

Co-Producer: Harshith Reddy

Music: Devi Sri Prasad

DOP: Sai Sriram

Art: AS Prakash

Editing: Tammiraju

Script Coordinator: S Krishna

Additional Screenplay: Adi Narayana, Nara Praveen

Director B Gopal Interview About Aaradugula Bullet

 


ఆరడుగుల బుల్లెట్ ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమా... గోపీచంద్‌కు సరైన స్క్రిప్ట్ -  డైరెక్టర్ బి. గోపాల్

మ్యాచో స్టార్ గోపీచంద్ - నయనతార హీరో హీరోయిన్లుగా మాస్ డైరెక్టర్ బి. గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ''ఆరడుగుల బుల్లెట్''.  జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ మీద తాండ్ర రమేష్  ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 8న ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సంద‌ర్భంగా దర్శకుడు బీ గోపాల్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు...


ఆరడుగుల బుల్లెట్ ఓ కమర్షియల్ సినిమా. తండ్రీ కొడుకుల మధ్య జరిగే కథ. ఆకతాయి కొడుకుని తండ్రి దూరంగా పెట్టడం, ఆ కుటుంబం కష్టాల్లో ఉంటే ఆ కొడుకే వచ్చి కాపాడతాడు. ఆ తండ్రి కొడుకును ఎంతలా అపార్ఠం చేసుకున్నాడు.. ఎంతలా మిస్ అయ్యాడు.. ఆ ఫ్యామిలీని అతను ఎలా కాపాడాడు అనేదే కథ.


మణిశర్మ గారు ఇచ్చిన సంగీతం బాగుంది. సమరసింహారెడ్డి, ఇంద్ర ఇలా ఎన్నో మంచి పాటలు ఇచ్చారు. ఫాదర్ అండ్ సన్ రిలేషన్, నయనతారతో లవ్ స్టోరీ, విలన్స్‌తో క్లాష్ హై ఓల్టేజ్‌గా ఉంటుంది. గోపీచంద్‌కు సరైన స్క్రిప్ట్.


ఆకతాయి కొడుకు, స్ట్రిక్ తండ్రి అనే కాన్సెప్ట్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో ఎమోషన్స్ బాగుంటాయి. వక్కంతం వంశీ కథ, అబ్బూరి రవి మాటలు బాగున్నాయి.


నరసింహ నాయుడు సినిమా విడుదలైన తరువాత పది నెలలు ఖాళీగా ఉన్నాను. 1985లో దర్శకుడిని అయ్యాను. కానీ నేను చేసింది 35 సినిమాలే. మామూలుగా అయితే వందల సినిమాలు చేయోచ్చు. కానీ నాకు కథ, స్క్రిప్ట్ నచ్చితేనే చేస్తాను. అందరికీ నచ్చేలా ఉంటేనే సినిమాను చేస్తాను.


అశ్వనీదత్ గారు, చంటి అడ్డాల గారు ఒకేసారి నా దగ్గరకు వచ్చారు. అలా ఇంద్ర, అల్లరి రాముడు చిత్రాలు మొదలయ్యాయి. అలా స్క్రిప్ట్‌లు  రెడీ అయితే ఒకేసారి రెండు సినిమాలు కూడా చేశాను.


అందరికీ ఈ సబ్జెక్ట్ నచ్చే చిత్రాన్ని చేశాం. వక్కంతం వంశీ కథ నిర్మాతలకు, గోపీచంద్ అందరికీ నచ్చడంతోనే మొదలుపెట్టాం.


నేను చేసినవి ఏవీ కూడా నా కథలు కాదు. సీనియర్ రచయితలు,కొత్త రచయితలను అందరినీ అడుగుతుంటాను. మస్కా సినిమాతో కొత్త రచయితను పరిచయం చేశాను. చిన్ని కృష్ణను కూడా నేనే పరిచయం చేశాను. నాకు కథ నచ్చితేనే సినిమాకు న్యాయం చేయగలుగుతాను.


స్క్రిప్ట్ బాగుంటే.. సూపర్ హిట్ అవుతాయి. లేదంటే ఫ్లాప్ అవుతాయి. క్రాక్ జనాలకు నచ్చింది. కాబట్టే సూపర్ హిట్ అయింది. చివరకు జనాలకు నచ్చితేనే ఆడుతాయి. సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి, ఇంద్ర బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి.


ఓటీటీ కంటెంట్లను కూడా జనాలు బాగానే చూస్తున్నారు. కానీ నాకు మాత్రం థియేటర్లోనే సినిమా చూడటం ఇష్టం. పెద్ద తెరపై సినిమా చూసేందుకే జనాలు ఇష్టపడతారు.


ఫ్యాక్షన్ కథ చేస్తున్నామని సినిమా చేస్తున్నంత వరకు నాకు తెలీదు. సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, ఇంద్ర సమయంలోనూ ఫ్యాక్షన్ సినిమా చేస్తున్నాను అని అనుకోలేదు. ఇప్పుడు కూడా ఎవరైనా కథ చెబితే.. ఫ్యాక్షన్ డ్రాప్‌లో డైరెక్షన్ చేసేందుకు రెడీగా ఉన్నాను. బాలయ్య బాబుతో సినిమా చేయాలని చాలా ట్రై చేశాను. కానీ స్క్రిప్ట్ సరిగ్గా రాకపోవడంతో ఆలస్యమవుతూ వచ్చింది. బాలయ్య బాబుతో సమరసింహారెడ్డి, నరసింహారెడ్డి కంటే బ్లాక్ బస్టర్ హిట్ తీయాలనే కోరిక ఉంది.


నేను సాఫ్ట్‌గా ఉంటాను. మైకుల ముందు కూడా మాట్లాడటం రాదు. కానీ సినిమాల్లో మాత్రం హింస ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం నా స్క్రిప్ట్ రైటర్స్. స్క్రిప్ట్‌ను బట్టి, నా హీరోలను బట్టి ఓ డైనమిక్  షాట్‌ను పెట్టాలనిపిస్తుంది. అందుకే అలాంటి సీన్స్ పడ్డాయి.




నాకు రీమేక్‌లు  చేయడం ఎక్కువగా నచ్చదు. అసెంబ్లీ రౌడీ, బ్రహ్మ చేశాను. కొత్త స్క్రిప్ట్‌తోనే సినిమాలు చేయడం ఇష్టం.


సినిమా అంటే పాటలు, ఫైట్లు పెడతాను. కానీ సిట్యువేషన్‌ను బట్టి ఫైట్లు పెడతాను. నరసింహానాయుడు ట్రైన్ సీక్వెన్స్‌లో బాలయ్య బాబుకు గొడ్డలి తగులుతుంది. ఆ సీన్‌కు అందరూ ప్రశంసలు కురిపించారు. కమర్షియల్ సినిమాలను ఆడియెన్స్‌కు నచ్చేట్టుగా తీయాలని ప్రయత్నిస్తాను.

Varun Tej Ghani First Punch Released

గ్లింప్స్ ఆఫ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్  ‘గ‌ని’ ఫస్ట్ పంచ్... డిసెంబర్ 3న ప్రపంచ వ్యాప్తంగా భారీ విడుదల 



వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ మెగాప్రిన్స్‌గా ప్రేక్ష‌కాభిమానుల‌ను మెప్పిస్తోన్న క‌థానాయ‌కుడు వ‌రుణ్‌తేజ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న తాజా చిత్రం `గ‌ని`. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో  రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. బుధ‌వారం ‘గ‌ని’  ఫ‌స్ట్ పంచ్ అంటూ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. 

గ్లింప్స్‌ను గ‌మ‌నిస్తే.. బాక్సింగ్ రింగ్‌లో వ‌రుణ్ తేజ్‌ను బ్యాక్ నుంచి చూపించారు. అత‌ను బాక్సింగ్ ఆట‌గాళ్లు ధ‌రించే జెర్సీని ధ‌రించి ఉన్నాడు. దానిపై ‘గ‌ని’ అనే పేరు క‌న‌ప‌డుతుంది. వ‌రుణ్‌తేజ్ ఫేస్‌ను రివీల్ చేయ‌గానే అత‌ను ఫంచ్ విసురుతాడు. గ‌ని..క‌నివిని ఎరుగ‌ని అనే లైన్ బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తుంది. ఇది వ‌ర‌కు చిత్రాల‌కు భిన్నంగా వ‌రుణ్‌తేజ్ ఈ మూవీలో స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తున్నాడు. డిసెంబ‌ర్ 3న ప్ర‌పంచ వ్యాప్తంగా ‘గ‌ని’ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ గ్లింప్స్ ద్వారా అనౌన్స్ చేశారు. 


ఈ సంద‌ర్భంగా నిర్మాత సిద్ధు ముద్ద మాట్లాడుతూ ‘‘డిఫ‌రెంట్ సినిమాలు చేయ‌డానికి ఇంట్రెస్ట్ చూపించే హీరో వ‌రుణ్ తేజ్‌గారు బాక్సింగ్ నేప‌థ్యం ఉన్న సినిమా కావ‌డం, మా డైరెక్ట‌ర్ కిర‌ణ్ కొర్ర‌పాటి క‌థ న‌చ్చ‌డంతో వెంట‌నే ఓకే చెప్పేశారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఈ సినిమాపై పెట్టిన ఎఫ‌ర్ట్స్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. విదేశాల‌కు వెళ్లి బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకున్నారు. తన లుక్ విష‌యంలో మ‌రింత జాగ్ర‌త్త వ‌హించారు. అలాగే మేం కూడా ఎక్కడా కాంప్ర‌మైజ్ కాలేదు. హాలీవుడ్ చిత్రం టైటాన్స్‌, బాలీవుడ్‌లో సుల్తాన్ వంటి చిత్రాల‌కు యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన  హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ లార్నెల్ స్టోవ‌ల్‌, వ్లాడ్ రింబ‌ర్గ్ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేయ‌డం విశేషం. తెలుగు ఆడియెన్స్‌కు ఓ స‌రికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చేలా సినిమాను భారీ రేంజ్‌లో నిర్మించాం. ఇప్పుడు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. డిసెంబ‌ర్ 3న ప్రపంచ వ్యాప్తంగా ‘గ‌ని’ చిత్రాన్ని భారీ రేంజ్‌లో విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు. 


బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన చంద్ర త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి జార్జ్ సి.విలియ‌మ్స్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 


నటీనటులు:

వ‌రుణ్ తేజ్‌, స‌యీ మంజ్రేక‌ర్‌, ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌వీన్ చంద్ర త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం:  కిర‌ణ్ కొర్ర‌పాటి 

నిర్మాత‌లు:  సిద్ధు ముద్ద‌, అల్లు  బాబీ

సినిమాటోగ్ర‌ఫీ:  జార్జ్ సి.విలియ‌మ్స్‌

మ్యూజిక్‌:  త‌మ‌న్‌.ఎస్‌

ఎడిటింగ్‌:  మార్తాండ్ కె.వెంక‌టేశ్‌

Siva Karthikeyan Interview About Varun Doctor

 *'వరుణ్ డాక్టర్'లో యాక్షన్, థ్రిల్, హ్యూమర్ ఉన్నాయి! అందర్నీ ఆకట్టుకునే కొత్తదనం ఉంది!* 

- శివకార్తికేయన్‌ ఇంటర్వ్యూ 



‘రెమో’, ‘సీమ రాజా’, ‘శక్తి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘వరుణ్‌ డాక్టర్‌’. ఇప్పుడు తమిళ స్టార్‌ హీరో విజయ్‌ ‘బీస్ట్‌’కు దర్శకత్వం వహిస్తున్న నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కించిన చిత్రమిది. కె.జె.ఆర్‌. స్టూడియోస్‌ అధినేత కోటపాడి జె. రాజేష్‌... గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌.కె. ప్రొడక్షన్స్‌తో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయదశమి కానుకగా తెలుగు, తమిళ భాషల్లో అక్టోబర్‌ 9న ‘డాక్టర్‌’ విడుదలవుతోంది. ఈ సందర్భంగా శివ కార్తికేయన్‌ హైదరాబాద్‌ వచ్చారు. తెలుగు సినీ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలివీ....


*ప్రశ్న: ఇతర డాక్టర్లకు, ఈ ‘డాక్టర్‌’కు వ్యత్యాసం ఏమిటి?*

జవాబు: ‘డాక్టర్‌’ గురించి పూర్తిగా తెలియాలంటే... సినిమా చూడాలి. ప్రతి డాక్టర్‌ ఆపరేషన్‌ చేస్తారు. ఈ డాక్టర్‌ చేసే ఆపరేషన్‌ డిఫరెంట్‌. హీరో పేరు వరుణ్‌. అతను ఆర్మీ డాక్టర్‌. సొంతూరుకు వచ్చి ఏం చేశాడు? ఎందుకు చేశాడు? అనేది కథ. ట్రైలర్‌లో చూపించినట్టు హ్యూమన్‌ ట్రాఫికింగ్‌, ఆర్గాన్‌ ట్రాఫికింగ్‌ సినిమాలో ఉన్నాయి. అవి ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది సినిమాలో చూడాలి.


*ప్రశ్న: ట్రైలర్‌ చూస్తుంటే స్టయిలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంది. ఈ జానర్‌లో మీరు నటించిన తొలి సినిమా ఇదే అనుకోవచ్చా?*

జవాబు: యాక్షన్‌, థ్రిల్‌ మూడ్‌లో సినిమా ఉంటుంది. కానీ, సినిమాలో ఎక్కువ ఫైట్స్‌ లేవు. రెండు ఫైట్స్‌ మాత్రమే ఉన్నాయి. హీరో, విలన్‌ మధ్య థ్రిల్‌ మూమెంట్స్‌ చాలా ఉంటాయి. నేరుగా కొట్టుకోరు. కానీ, ఇద్దరి మధ్య మైండ్‌ గేమ్‌ నడుస్తుంది. ఫిజికల్‌ ఫైట్‌ కాకుండా... మెంటల్‌ ఫైట్‌లా సినిమా ఉంటుంది. ఎవరు తెలివైనవారు అనే అంశం మీద నడుస్తుంది. ఓవరాల్‌గా చూసుకుంటే... కొంచెం హ్యూమర్‌, కొంచెం థ్రిల్‌ ఇస్తుంది.


*ప్రశ్న: సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి!*

జవాబు: పోస్టర్‌ చూస్తే... నాతో పాటు చాలామంది నటీనటులు కనిపిస్తారు. ప్రతి పాత్రకు ఓ పర్పస్‌ ఉంటుంది. వాళ్లు సినిమా అంతా ఉంటారు. వాళ్లందరూ కామెడీ చేస్తారు... నేను తప్ప! నా పాత్ర సీరియస్‌గా ఉంటుంది. ట్రైలర్‌ చూస్తే... అందులో ఎటువంటి ఎమోషన్‌ లేకుండా కనిపిస్తానో, అలా!  వరుణ్‌ పాత్ర భావోద్వేగాలను బయటకు చూపించదు. ఎప్పుడూ నవ్వడు, ఏడ్వడు, కోప్పడడు. ఎటువంటి ఎమోషన్‌ లేకుండా నటించడం చాలా కష్టం. ఈ సినిమాలో నాకు ఎదురైన ఛాలెంజ్‌ అదే. కామెడీ సన్నివేశాలు చిత్రీకరించేప్పుడు నేను నవ్వితే... నెల్సన్‌ అరిచేవాడు. ‘నువ్విలా చేస్తే సీన్‌ రెండో రోజు చేయాలి. అప్పుడు ప్రొడక్షన్‌ కాస్ట్‌ పెరుగుతుంది. ఓకేనా?’ అని అడిగితే... మౌనంగా ఉండేవాడిని.


*ప్రశ్న: హీరోయిన్‌ ప్రియాంకా అరుల్‌ మోహన్‌, మీకు మధ్య లవ్‌ ట్రాక్‌ ఎలా ఉంటుంది?*

జవాబు: లవ్‌ ఎపిసోడ్‌ పెద్దగా ఉండదు. హీరో హీరోయిన్‌ మధ్య బ్రేకప్‌తో సినిమా ప్రారంభమవుతుంది. అంతకన్నా ఎక్కువ చెప్పలేను.


*ప్రశ్న: తమిళ వెర్షన్‌లో రెండు పాటలను మీరు రాశారు. ‘సో బేబీ...’ పాటకు ముందు అనిరుధ్‌, దర్శకుడితో డిస్కషన్‌ చేసిన వీడియో విడుదల చేశారు!*

జవాబు: (నవ్వుతూ...) జనరల్‌గా మేం మాట్లాడుకునేదాంట్లో 10 శాతం మాత్రమే చూపించాం. మా డిస్కషన్స్‌ అలానే ఉంటాయి. ఫస్ట్‌ ‘చెల్లమ్మ’ (తెలుగులో ‘చిట్టమ్మ’) పాట రాశా. తర్వాత ‘సో బేబీ... చాలామందితో రాయించాం. కుదరలేదు. నువ్వు రాయి’ అన్నారు. ట్రై చేశా. ‘చెల్లమ్మ’ సాంగ్‌ ముందు సినిమాలో అవసరం లేదు. ఎందుకంటే... బ్రేకప్‌తో మొదలవుతుందని చెప్పా కదా! అనిరుధ్‌ ‘సాంగ్‌ ఎక్కడ పెడతారు?’ అని అడిగారు. ‘అది తర్వాత చూద్దాం! ముందు నువ్వు చెయ్‌’ అని చెప్పాం. హ్యాపీగా రాశా. సినిమాలో మంచి సందర్భం కుదిరింది. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. వీడియో చూసి ‘బుట్టబొమ్మ’లా ఉందని చెబుతున్నారు.


*ప్రశ్న: కథ విన్నాక సినిమా నిర్మించాలనుకున్నారా? ముందే హీరోగా, నిర్మాతగా చేయాలనుకున్నారా?*

జవాబు: దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ నా క్లోజ్‌ ఫ్రెండ్‌. టీవీలో నేను షోస్‌ చేసినప్పటి నుంచి తెలుసు. నేను 2007లో టీవీ కెరీర్‌ స్టార్ట్‌ చేస్తే... ఆ షోను నెల్సన్‌ డైరెక్ట్‌ చేశాడు. తనపై నాకున్న నమ్మకమే సినిమా ప్రొడ్యూస్‌ చేయడానికి కారణం. సినిమా ఫస్ట్‌ కాపీ వరకూ ప్రొడ్యూస్‌ చేయడం నా పని. ఆ తర్వాత మొత్తం విడుదల వ్యవహారాలు కె.జె.ఆర్‌ స్టూడియోస్‌ అధినేత కోటపాడి జె. రాజేష్‌ చూస్తారు.


*ప్రశ్న: ఓటీటీలో ‘డాక్టర్‌’ విడుదల కానుందని చాలా వార్తలొచ్చాయి. ఓటీటీలో విడుదల చేయాలనుకున్నారా?*

జవాబు: కరోనా తొలి దశలో వేచి చూడాలనుకున్నాం. అప్పటికి 80 శాతం చిత్రమే పూర్తయింది. ఫిబ్రవరికి సినిమా పూర్తయింది. విడుదల గురించి ఆలోచిస్తున్న టైమ్‌లో సెకండ్‌ వేవ్‌ వచ్చింది. ఎన్నాళ్లు ఉంటుందో తెలియదు. అప్పుడు కోటపాడి జె. రాజేష్‌తో ‘మీకు ఏది రైట్‌ అనిపిస్తే అది చేయండి’ అని చెప్పాను. ఆయన థియేటర్లలో విడుదల చేయడానికి మొగ్గుచూపారు. ఓటీటీ కోసం కాదు... థియేటర్ల కోసమే సినిమా చేశాం.


*ప్రశ్న: తెలుగులో కరోనాకు ముందు విడుదలైన చివరి సినిమా మీదే... ‘శక్తి’. మళ్లీ ఆ సినిమా నిర్మాత కోటపాడి జె. రాజేష్‌ ‘వరుణ్‌ డాక్టర్‌’ను విడుదల చేస్తున్నారు. ఆయనతో మీ అసోసియేషన్‌ గురించి...*

జవాబు: అవును... లాక్‌డౌన్‌కు కొన్ని రోజుల ముందు తెలుగులో ఆ సినిమా విడుదలైంది. దానికి మంచి స్పందన లభించింది. ఇప్పుడు ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నందుకు ఆయన్ను అప్రిషియేట్‌ చేయాలి. లేదంటే ఓటీటీకి సినిమా వెళ్ళేది. తమిళనాడులో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఆయన్ను అప్రిషియేట్‌ చేస్తున్నారు. అక్కడ సెకండ్‌ వేవ్‌ తర్వాత విడుదలవుతున్న భారీ సినిమా ఇదే. ఇన్నాళ్ళూ ఆన్‌లైన్‌ క్లాసులతో పిల్లలతో ఇంట్లో ఉన్న పేరెంట్స్‌ కూడా సినిమా చూడటానికి థియేటర్లకు వస్తారని నమ్ముతున్నా.


*ప్రశ్న: త్వరలో తెలుగు సినిమా చేయబోతున్నారని విన్నాం. ఎప్పుడు ఆ సినిమా మొదలు కానుంది?*

జవాబు: నిర్మాతలే అధికారికంగా సినిమా వివరాలు ప్రకటిస్తారు. ఆ సినిమా కోసం తెలుగు నేర్చుకుంటున్నా. నాకు తెలుగు కొంచెం వచ్చు. మీరు మాట్లాడేది అర్థమవుతుంది. నెక్ట్స్‌ టైమ్‌ హైదరాబాద్‌ వస్తే... పూర్తిగా తెలుగులో మాట్లాడతా. ఈ సినిమా నా ప్లాన్‌లో లేదు. సెకండ్‌ వేవ్‌లో ఓ ఫ్రెండ్‌ ‘ఇటువంటి కథ ఉంది’ అని చెప్పాడు. దర్శకుడికి నేను చేయగలననే నమ్మకం ఉంది. ఓకే చేశా. ఈ సినిమా చేయడానికి హీరోయిన్లందరూ నాకు స్ఫూర్తి. వాళ్లు ఓ రోజు చెన్నైలో, మరో రోజు హైదరాబాద్‌లో, ముంబైలో చిత్రీకరణ చేస్తారు. డైలాగులు రాసుకుని, మీనింగ్‌ తెలుసుకుని ప్రాక్టీస్‌ చేస్తారు. నేనూ అలా కష్టపడాలని అనుకుంటున్నా.

Naga Chaitanya to Grace Most Eligible Bachelor Pre Release Event

 అక్టోబర్ 8న అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథిగా నాగ చైతన్య.. 



అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో  మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు.. మరో నిర్మాత, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 15న విడుదలకు సిద్ధమైంది. సెన్సార్ కూడా పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి అక్కడ్నుంచి ప్రశంసలు దక్కించుకుంది. ఈ మధ్యే జరిగిన వ్రాప్ అప్ పార్టీలోనూ జబర్దస్త్ కమెడియన్స్ సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను చాలా బాగా నవ్వించారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్‌డేట్ వచ్చింది. 

అక్టోబర్ 8న JRC కన్వెన్షన్ హాల్‌లో ఈ వేడుక జరగబోతుంది. దీనికి యువ సామ్రాట్ నాగ చైతన్య ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రానున్నారు. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ కూడా విడుదల చేసారు దర్శక నిర్మాతలు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ వస్తుంది. త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా ఉండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది. యూ ట్యూబ్‌లో ఇప్పటికే 7.8 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది ఈ చిత్ర ట్రైలర్. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు మేకర్స్. 


న‌టీ న‌టులు:

అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్ తదితరులు.. 


సాంకేతిక నిపుణులు:


దర్శకుడు : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్

నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌  

బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్  

స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్  

మ్యూజిక్ : గోపీ సుంద‌ర్

సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ

ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్

ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా

PRO - ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Miles Of Love Teaser Released

 "మైల్స్ అఫ్ లవ్" టీజర్ చాలా బాగుంది..  హీరో శ్రీ విష్ణు



హుషారు ఫేమ్ అభినవ్ మేడిశెట్టి, రమ్య పసుపులేటి హీరో హీరోయిన్ లుగా నందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "మైల్స్ అఫ్ లవ్ ". కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై రాజిరెడ్డి ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. ఆర్ ఆర్ ధ్రువన్ సంగీతం అందించిన ఈ చిత్రం నుంచి ఇప్పటికే నాలుగు పాటలు విడుదల అయ్యాయి. 'తెలియదే.. తెలియదే' సాంగ్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సిడ్ శ్రీరామ్ ఈ  పాటను ఆలపించగా 6 మిలియన్స్ వ్యూస్ అందుకుని సినిమా పై అంచనాలను భారీగా పెంచింది. తాజాగా ఈ చిత్ర టీజర్ ను ప్రముఖ టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు విడుదల చేశాడు.   


మంచి మెలోడీ మ్యూజిక్ తో ఈ టీజర్ మొదలవుతుంది. పాటలలాగానే నేపథ్య సంగీతం కూడా ప్రేక్షకులను మెప్పిస్తుందని ఈ టీజర్ తో ముందే చెప్పేశారు.  హీరో హీరోయిన్ లను కూడా ఎంతో క్యూట్ గా చూపించారు. మంచి విజువల్స్ తో సినిమాటోగ్రాఫర్ ఆకట్టుకున్నాడు. టీజర్ లో కొన్ని కొన్ని విజువల్స్ సినిమా పై ఇంట్రెస్ట్ ను తెప్పిస్తున్నాయి. టీజర్ ని బట్టి చిత్రం ప్యూర్ అండ్ హానెస్ట్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. ఎంతో ఫీల్ తో హీరో హీరోయిన్ ల మధ్య లవ్ స్టోరీ ఉండబోతుంది. ఎమోషనల్ సీన్స్ కూడా ప్రేక్షకులను అలరిస్తాయని టీజర్ చివర్లో వచ్చే ఓ షాట్ ద్వారా చూపించారు. దర్శకుడి ప్రతిభ కు కూడా ఇది టీజర్ వంటిది. డైలాగ్స్ కి మంచి ప్రాధాన్యత ఇచ్చారు. 'ప్రాబ్లమ్ ని ప్రాబ్లమ్ లా కాకుండా సొల్యూషన్ లా చూస్తే సొల్యూషన్ ప్రాబ్లమ్ అవుతుంది.. ప్రాబ్లమ్ సొల్యూషన్ అవుతుంది..' అనే డైలాగ్ చాలా బాగుంది. టీజర్ లో కథ ను చెప్పే ప్రయత్నం చేసి మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు దర్శకుడు. నిర్మాణ విలువలు కూడా చాలా రిచ్ గా కనిపించాయి. కొన్ని కొన్ని సీన్స్ కి చాలానే ఖర్చుపెట్టారు. అందమైన లొకేషన్స్ లో సినిమా ని చిత్రీకరించి సినిమా పై మరింత ఆసక్తి పెంచారు. 


ఇక ఈ చిత్ర టీజర్ విడుదల చేసిన సందర్భంగా ప్రముఖ హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. మైల్స్ అఫ్ లవ్ టీజర్ చూశాను. చాలా ఫ్రెష్ గా ఉంది. హీరో అభినవ్ చాలా అందంగా కనిపించాడు.ఈ సినిమా కి  అందరు కొత్తవాళ్లే పని చేశారు.  ఈ సినిమా కి పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. త్వరలోనే థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మీ అందరు ఈ సినిమా ను ఆదరించాలని ఆశిస్తున్నాను అన్నారు.

Suresh Kondeti Completed 30years in TFI

 సినిమా సిగలో మూడు దశాబ్దాల ధగ ధగలు

- ఇదీ సురేష్ కొండేటి జీవన ప్రస్థానం



ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి అన్నట్లుగా పాలకొల్లులో పుట్టి ఫిలిం నగర్ లో కాలుపెట్టి సినిమా రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి సురేష్ కొండేటి. ‘సంతోషం’ సురేష్ అని పిలుచుకునే సురేష్ కొండేటి జీవిత ప్రస్థానాన్ని అవలోకిస్తే ఎన్నో మజిలీలు కనిపిస్తాయి. స్కూల్ డేస్ లో సూపర్ స్టార్ కృష్ణ అభిమాని అయిన సురేష్ ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా మారి హైదరాబాద్ లో అడుగుపెట్టి తన ‘సంతోషం’తో సినిమా పరిశ్రమకు సగం బలాన్ని అందిస్తున్న సురేష్ కొండేటి మూడు దశాబ్దాల అనుభవాన్నిమూటగట్టుకున్నారు. జర్నలిస్టుగా, పంపిణీదారుడిగా, నిర్మాతగా, నటుడిగా రాణిస్తున్న సురేష్ కొండేటి ఈ అక్టోబరు 6న పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కథనం.


సినిమా వారి పుట్టిల్లు..


పాలకొల్లు అన్న పేరు వినగానే సినిమా వారి పుట్టిల్లు అంటుంటారు. ఎందరో సినీ ప్రముఖులు ఇక్కడి నుంచి సినిమా పరిశ్రమలో కాలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగిన వారే. సురేష్ కొండేటి స్వస్థలం కూడా పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లే. సినిమాల మీద ఆసక్తితో నటుడు కావాలని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. హైదరాబాద్ వచ్చిన కొత్తలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. అక్కడి నుంచి జర్నలిజం వైపు జీవితం మళ్లింది. నటుడిగా కంటే జర్నలిస్టుగా దూసుకెళ్లారు. రెండు దశాబ్దాల క్రితం జర్నలిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. ‘కృష్ణాపత్రిక’, ‘వార్త’ దిన ప్రతికల్లో సినిమా జర్నలిస్ట్‌గా విశేష అనుభవాన్ని సంపాదించుకున్న సురేష్ కొండేటి ఆ తర్వాత సొంతంగా ‘సంతోషం’ సినిమా వార ప్రతికను ప్రారంభించారు. ఈ వీక్లీ మ్యాగజైన్‌ నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది. తన పత్రిక పేరుతోనే సంతోషం ఫిల్మ్ అవార్డులను అందించడం మొదలుపెట్టారు. ఇవాళ సౌత్‌లోనే ‘ఫిల్మ్ ఫేర్’ తర్వాత మళ్ళీ అంతటి క్రేజ్ ఉన్నది ‘సంతోషం అవార్డ్స్’కే అంటే అతిశయోక్తి కాదు. ‘చిత్రసీమలోని ప్రతి ఒక్కరూ తనను సొంత మనిషిగా భావించి అక్కున చేర్చుకోవడం వల్లే ఇది సాధ్యమైంది’ అని సురేష్ కొండేటి చెబుతుంటారు.


అటు పీఆర్వోగా.. ఇటు నిర్మాతగా..


జర్నలిస్ట్‌గా కొనసాగుతూనే మరో వైపు సినిమాలకు పీఆర్వోగానూ చేస్తున్నారు సురేష్ కొండేటి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు సురేష్ కొండేటి పీఆర్వోగా వ్యవహరిస్తారనే విషయం అందరికీ తెలుసు. పీఆర్వోగా దాదాపు 600 చిత్రాలు చేశారు. ఎస్‌కే పిక్చర్స్ సంస్థను స్థాపించి సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు నిర్మించడం కూడా మొదలు పెట్టారు. యంగ్ టైగర్ ఎన్టీయార్, గజాల జంటగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘స్టూడెంట్ నెంబర్1’ చిత్రం సురేష్ కొండేటి కెరీర్‌కు పంపిణీదారుడిగా పునాది వేసింది. మహేశ్వరి ఫిల్మ్ ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలో అప్పటివరకు ఎన్నోసినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన సురేష్ కొండేటి,  సొంతంగా ఎస్‌కే పిక్చర్స్ సంస్థను స్థాపించి తన తొలి సినిమాగా ‘స్టూడెంట్ నెంబర్1’ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. తొలి సినిమాతోనే హిట్ అందుకున్న దర్శకుడిగా రాజమౌళికి గుర్తింపు రాగా తొలి సినిమా డిస్ట్రిబ్యూషన్‌తో విజయం సొంతం చేసుకున్న సంస్థగా ఎస్‌కే పిక్చర్స్‌ గుర్తింపు తెచ్చుకుంది. 75 చిత్రాలను పంపిణీచేసిన అనుభవం సురేష్ కొండేటిది. ఆ అనుభవంతోనే ‘ప్రేమిస్తే’ చిత్రంతో నిర్మాతగా మారారు. తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 'జర్నీ' 'పిజ్జా' ఇలా  దాదాపు పదిహేను చిత్రలను తెలుగువారి ముందుకు తీసుకొచ్చారు.  స్టార్ కమెడియన్ 'షకలక' శంకర్ హీరోగా ఎస్.కె. పిక్చర్స్ సమర్పణలో రూపుదిద్దుకున్న విజయవంతమైన చిత్రం 'శంభో శంకర' నిర్మాతల్లో సురేష్ కొండేటి ఒకరు. అలాగే మలయాళ చిత్రం 'ఉస్తాద్ హోటల్‌'ను తెలుగులో 'జనతా హోటల్‌' పేరుతో సురేష్ కొండేటి విడుదల చేశారు. వినోదంతో పాటు సామాజికాంశాలతో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు సురేష్ కొండేటి ఉత్తమాభిరుచిని తెలియచేసేవే. నటుడిగానూ పయనం.. కెరీర్ ప్రారంభంలో చిన్న పాత్రలు చేసిన సురేష్ కొండేటి ఇటీవల కీలక పాత్రలు సెకండ్ లీడ్ లో చేస్తున్నారు. అందుకు ఉదాహరణ ‘దేవినేని’ మూవీలోని వంగవీటి రంగా పాత్రే. ఈ సినిమాలో సురేష్ కొండేటిది ప్రధాన పాత్ర. అలాగే మరికొన్ని చిత్రాల్లో కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


అల్లు అరవింద్ గారి వల్లే...


‘‘చిత్రసీమలోకి వచ్చిన తర్వాత కూడా నాకు పుట్టిన రోజు (అక్టోబర్ 6వ తేదీ)ని వేడుకగా జరుపుకోవడం అలవాటు లేదు. అయితే ఓసారి ‘మగధీర’ ప్రెస్ మీట్ కు వెళ్ళినప్పుడు ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ గారికి ఆ వేళ నా బర్త్ డే అనే విషయం తెలిసి… వెంటనే కేక్ తెప్పించి బర్త్ డే జరిపించారు. మా పాలకొల్లు వాసి, నాకు చిత్ర పరిశ్రమలో చేదోడు వాదోడుగా ఉంటే అల్లు అరవింద్ గారి ఆశీస్సులతో అప్పటి నుండి బర్త్ డే జరుపుకుంటున్నాను’’ అని సురేష్ కొండేటి గతంలో వెల్లడించారు. 


అప్‌డేట్ పర్సన్.. మల్టీ ట్యాలెంటెడ్


చిత్రసీమలోని ప్రతి ఒక్కరికీ తలలో నాలుకగా వ్యవహరించే సురేష్ కొండేటి కాలంతో పరుగులెత్తే వ్యక్తి.. ‘సంతోషం’ పత్రికను క్రమం తప్పకుండా ప్రచురించడంతో పాటు చిత్రసీమలోని అనేక విభాగాలలో అన్నీ తానై వ్యహరిస్తుంటారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ సభ్యుడిగానూ, ఫిల్మ్ ఛాంబర్ కల్చరల్ కమిటీ ఛైర్మన్‌గా, ఎఫ్.ఎన్.సి.సి. పాలకమండలి సభ్యునిగా, ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడిగానూ విశేష సేవలు అందించారు. సురేష్ కొండేటి జర్నలిస్ట్‌గా, పీఆర్వోగా, నిర్మాతగా, నటుడిగా, పలు అసోసియేషన్స్‌లో సభ్యుడిగా వ్యవహరిస్తూ మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్‌గా గుర్తింపు పొందారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో ఆరు సార్లు ఈసీ మెంబర్‌గా పని చేసిన సురేష్ కొండేటి.. ప్రస్తుతం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ అధ్యక్షతన ప్రారంభమైన ‘సినిమా బిడ్డలం’ ప్యానల్ నుంచి ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా పోటీ చేస్తున్నారు. ఇవాళ చిత్రసీమలో అందరికీ తలలో నాలుకగా వ్యవహరించే ఆయన ఎప్పుడూ అప్‌డేటెడ్‌గా ఉంటారు. ఇటీవల కరోనా మహమ్మారి సమయంలో చిత్ర పరిశ్రమ సురేష్‌లోని ఆ అప్‌డేటెడ్ మనిషిని గుర్తించింది. కరోనా మహమ్మారి సమయంలో ప్రింటింగ్ సదుపాయం కూడా లేని టైమ్‌లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి వార్తలను సోషల్ మీడియా ద్వారా అందరికీ అందించారు. నేటికీ ఆ పద్ధతిని కొనసాగిస్తున్నారు.


రికార్డ్ క్రియేట్ చేసిన 'సంతోషం సురేష్"  ఫిల్మ్ న్యూస్


కరోనా మహమ్మారి మొదటి వేవ్‌లో అన్నీ స్తంభించి పోయాయి. ప్రింటింగ్ వ్యవస్థ, రవాణా వ్యవస్థ ఏదీ లేకపోవడంతో పాఠకులకు వార్తలు చేరవేయడం ఇబ్బందిగా మారింది. అలాంటి పరిస్థితుల్లో సురేష్ కొండేటి తన బుర్రకు పదును పెట్టి కొత్తగా ఆలోచించారు. ఏ రోజు వార్తలు ఆ రోజు అందించేలా 'సంతోషం సురేష్' టాప్ ఫిల్మ్ న్యూస్‌ను తీసుకొచ్చారు. అందుకోసం ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసుకుని రాత్రింబవళ్లు పని చేస్తూ 'సంతోషం సురేష్'  టాప్ ఫిల్మ్ న్యూస్‌ను నిర్విరామంగా అందిస్తున్నారు. అది ఎంతగానో సక్సెస్ అయింది. ప్రస్తుతం 558 ఎపిసోడ్‌తో దూసుకుపోతోంది. ఇండస్ట్రీలోని ఎంతోమంది 'సంతోషం సురేష్' ఫిల్మ్ న్యూస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారనడం అతిశయోక్తి కాదు. ఒక మ్యాగజైన్ అధినేత నుంచి నిరంతరాయంగా 500 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుని 600 ఎపిసోడ్స్‌కు దగ్గరవుతుండడం ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. 


20వ సంతోషం అవార్డ్స్‌కు సమాయత్తం


దక్షిణాది సినీ పరిశ్రమలో సంతోషం అవార్డ్స్ అంటే ఎంతో గౌరవం ఉంది. గత ఏడాది కరోనా వల్ల ఆగిన ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు సురేష్ కొండేటి సమాయత్తం అవుతున్నారు. ఈ సారి సుమన్ టీవీతో కలిసి సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అందుకోసం అన్ని ఏర్పాట్లనూ సురేష్ కొండేటి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సంతోషం 20వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న సంతోషం అవార్డ్స్ కార్యక్రమం నవంబర్ 14న హెచ్‌ఐసీసీలోని నోవాటెల్ హోటల్‌లో ఘనంగా జరగనుంది.


3 దశాబ్దాల ప్రస్థానం.. ఎంతోమందికి ఆదర్శం


సురేష్ కొండేటి 1992లో చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చారు. వచ్చే ఏడాదికి ఇండస్ట్రీ మనిషిగా 30 ఏళ్లు పూర్తిచేసుకోనున్నారు. ఈ 3 దశాబ్దాల కెరీర్‌లో సురేష్ కొండేటి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. ఆయనను చూసే కొంతమంది పీఆర్వోలు కూడా అయ్యారు. సురేష్ కొండేటి దగ్గర పని చేసినవాళ్లలో ఎంతోమంది ఉన్నతస్థాయికి ఎదిగారు. ఇదీ మూడు దశాబ్దాల సురేష్ కొండేటి జీవన పయనం.. మరెందరికో స్ఫూర్తిదాయకం. 



అన్ని రంగాల్లో సక్సె స్ సాదించాలన్నదే నా ప్రయత్నం : నిర్మాత, నటుడు సురేష్ కొండేటి 

 

మన జీవితానికి ఓ లక్ష్యం అంటూ ఉండాలి, దాన్ని సాకారం చేసుకోవడానికి ప్రయత్నం ఉండాలి. అలాంటి ప్రయత్నం చేస్తూ అంచెలంచెలుగా ఎదిగాడు సురేష్ కొండేటి. తెలుగు సినిమా పరిశ్రమలో సురేష్ కొండేటి అంటే తలలో నాలుకలా ఉంటాడన్న పేరు ఉంది. సాధారణ స్థాయి నుండి ఓ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, మ్యాగజిన్ అధినేత, నటుడు ఇలా పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన వ్యక్తి. ఈ మద్యే దేవినేని సినిమాలో సెకండ్ లీడ్ పాత్రలో నటించి మెప్పించిన సురేష్ కొండేది జన్మదిన అక్టోబర్ 6, ఈ సందర్బంగా అయన మీడియాతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ .. 


మగధీర సినిమా సక్సెస్ మీట్ లో ఇక్కడే ఫిలిం కల్చరల్ సెంటర్ లో మొదటి సారి ఆ వేదికపై నా బర్త్ డే వేడుకలను నిర్మాత అల్లు అరవింద్ గారు చేసారు. అప్పుడే నేను కూడా సెలెబ్రిటీ అయ్యానని అనుకున్నాను. ఆ ఉత్సహంతో మరింత ముందుకు సాగాను. నిజానికి నేను పరిశ్రమకు వచ్చింది నటుడిగా ఎదగాలని, 1992 లో నేను ఇండస్ట్రీ కి వచ్చాను. అప్పుడు చాలా సన్నగా ఉండేవాణ్ణి, కానీ నటుడికి కావలసిన క్వాలిటీస్ లేవని ఆ తరువాత తెలుసుకున్నాను. చాలా ఆఫీసుల్లో అవకాశాల కోసం అడిగాను. ఆ తరువాత కృష్ణా పత్రికలో తెలిసిన బంధువులు ఉంటె వారి సహకారంతో అందులో చేరాను. నా ఉత్సహం చుసిన ఆ పత్రిక ఓనర్ గారు కృష్ణ చిత్ర అనే కాలం స్టార్ట్ చేసారు. అలా సినిమాలకు సంబందించిన న్యూస్ ఇచ్చేవాడిని. అందులోనే సూపర్ స్టార్ కృష్ణ గారి 300 వ సినిమా తెలుగు వీర లేవరా సమయంలో కృష్ణ చిత్ర అనే ఓ స్పెషల్ మగజైన్ ముద్రించాం. నేను స్కూల్ డేస్ లో క్రిష్ గారి అభిమానిని, ఆ తరువాత టెన్త్ లో చిరంజీవి గారి అభిమానిగా మారిపోయా. కృష్ణగారి బుక్ కోసం సింగపూర్ లో ఉన్న చిరంజీవి గారితో ఫోన్ లో మాట్లాడి ఆయనతో కృష్ణగారి కి  సంబందించిన అభిప్రాయం అడిగితె అయన ఫ్యాక్స్ లో పంపించారు . ఆ లెటర్ చూసిన వాళ్ళు ఆ పత్రికలో నన్నో సెలేబ్రిటిగా ట్రీట్ చేసారు. పరిశ్రమలో నాకు చాలా ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఎవరి సురేష్ అనే రేంజ్ లో ఎదిగాను. ఆ తరువాత వార్త పత్రికలో చేరాను. అక్కడ చేరాకా పరిశ్రమతో ఎక్కువగా అనుభందం పెరిగింది. అప్పటినుండి నన్ను వార్త సురేష్ అనే గుర్తు పెట్టుకున్నారు,. అలా చిరంజీవి గారితో పరిచయం, నాగార్జున గారితో పరిచయం ఇలా ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళాను. అలా స్టార్ హీరోలందరితో మంచి పరిచయం పెరిగింది. ఆ తరువాత మహేశ్వరీ ఫిలిమ్స్ అని డిస్ట్రిబ్యూషన్ మొదలెట్టాను. వెస్ట్ గోదావరి జిల్లాలో  మొదలెట్టాను. చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను, ఆ తరువాత ఎస్ కె పిక్చర్ పేరుతొ డిస్ట్రిబ్యూటర్ స్టార్ట్ చేశా, స్టూడెంట్ నంబర్ 1 తో మొదలెట్టి చాలా సినిమాలు చేశాను. నేనుచేసిన సినిమాలని నాకు లాభాలను తెచ్చిపెట్టాయి. 


ఆ తరువాత నాగార్జున గారితో కూడా ఎక్కువ పరిచయం ఉండేది. ఆ సమయంలో నాగార్జున గారు సంతోషం సినిమా చేస్తున్నారు. ఆ సినిమా డిస్ట్రిబ్యూట్ హక్కులు వెస్ట్ గోదావరికి నేను తీసుకున్నాను. ఆ సినిమా విషయంలో నాకు చాలా నమ్మకం ఉండేది. ఆ నమ్మకంతో ఎక్కువ రేట్ పెట్టి కొన్నాను. ఆ సినిమా హిట్ అయితే ఈ పేరుతొ మగజినె పెడతాను అని చెప్పాను. మ్యాగజిన్ ని 2002 లో సంతోషం మ్యాగజైన్ స్టార్ట్ చేసి గత ఇరవై ఏళ్లుగా సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నాను. మ్యాగజిన్ స్టార్ట్ చేసిన తరువాత ఒకరోజు నాగార్జున గారు  అడిగారు. సురేష్ లో మంచి టాలెంట్ ఉంది, తెలుగులో అవార్డ్స్ లేవు.. కాబట్టి సంతోషం పేరుతొ అవార్డు పెడితే బాగుంటుంది అని చెప్పడంతో నాగార్జున కోరిన మేరకు అవార్డు వేడుక గత ఇరవై ఏళ్లుగా చేస్తున్నాను. కోవిద్ సమయంలో రెండేళ్లు మాత్రం జరపలేదు.. కానీ ఈ నవంబర్ 14న చాలా గ్రాండ్ గా అవార్డు వేడుకలు జరుపుతున్నాను. ఈ కరోనా సమయంలో పరిశ్రమ ఓ గొప్ప గాయకుడిని కోల్పోయింది. ఈ సారి జరిపే వేడుకలో ఎస్పీ బాలు గారి పేరుతొ ఐదు భాషల్లో మేల్, ఫిమేల్ సింగర్స్ పదిమందికి అవార్డ్స్  ఇవ్వబోతున్నాం. 2019-2020 రెండు సంవత్సరాల అవార్డులు ఒకే వేదికపై సాయంత్రం 4 గంటనుండి రాత్రి 1 గంట వరకు నిర్విరామంగా ఈ అవార్డు వేడుక జరపబోతున్నాము. ఈ కార్యక్రమం మొత్తం ఒక ప్రముఖ ఎంటర్ టైనేమేంట్ ఛానల్, ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో ప్రసారం అవుతుంది. అలాగే ఈసారి  ఈవెంట్ ను సుమన్ టివి సుమన్ గారితో కలిసి చేయబోతున్నాం. 


అవార్డు వేడుకలో మెగాస్టార్ గారు సురేష్ నిర్మాతగా పేరు ఎప్పుడు వేసుకుంటావ్ అని అడగడంతో వెంటనే ప్రేమిస్తే సినిమాకు నిర్మాతగా చేశాను. ఆ సినిమా ఏ రేంజ్ సంచలనమ్ క్రియేట్ చేసిందో అందరికి తెలుసు. ఆ తరువాత జర్నీ, ఇలా చాలా సినిమాలు చేశాను. అలా నిర్మాతగా సక్సెస్ ఫుల్ గా ఉన్నపుడు మళ్ళీ ఒకరోజు చిరంజీవి గారు ఏమయ్యా నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా మంచి సక్సెస్ లో ఉన్నావు, నా సినిమా చేయవా అని అడిగితె వెంటనే వెస్ట్ గోదావరికి ఆ ఠాగూర్ సినిమాను తీసుకున్నాను. అది 17 సెంటర్స్ లో 100 రోజులు ఆడింది.. ఇప్పటికి ఆ రికార్డ్ ఎవరు దాటలేదు. నేను మీడియా వ్యక్తిగా , అటు సినిమా వ్యక్తిగా రెండు వైపులా ఉంటున్నాను. ప్రస్తుతం మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాలో ఓ పాత్ర చేసాను. అలాగే నేను నిర్మాతగా నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నాను,  దాంతో పాటు ఎర్రచీర లో కూడా చేశాను. అలాగే నటుడిగా 1995 లో రాంబంటు సినిమాలో మొదటి సారి తెరపై నటుడిగా కనిపించాను. అలా చాల సినిమాలు చేశాను. అయితే దేవినేని సినిమాలో సెకండ్ లీడ్ హీరోగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఉత్సహంతో హీరోగా కూడా చేయాలన్న కోరిక ఉంది. నాకు దాసరి గారు స్ఫూర్తి. ఆయనలా నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయితా, డిస్ట్రిబ్యూటర్ ఇలా అన్ని రంగాల్లో ఎదగాలన్నది నా కోరిక. 


నేను వందరూపాయలు తీసుకుని హైద్రాబాద్ వచ్చాను. నేను నా సొంతంగా బతకాలన్నది నా ఆలోచన, మా నాన్న బ్యాంకు ఎప్లాయ్. మధ్యతరగతి ఫ్యామిలీ మాది. కానీ నేను నా కాళ్లపై నిలబడాలన్న సంకల్పంతో ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఇండస్ట్రీ నాకు ఎంతో ఇచ్చింది .. కాబట్టి ఇండస్ట్రీ కోసం నేను ఏదైనా చేయడానికి రెడీ . అందుకే మా అసోసియేషన్ లో ఈసీ మెంబర్ గా ఆరేళ్లుగా ఉనాన్ను. నాకు పనిచేయడం ఇష్టం. ఏదైనా సరే పరిశ్రమ కోసం నేను సిద్ధంగా ఉన్నాను. మా అసోసియేషన్ లో మళ్ళీ ఈ సారి మెంబర్ గానే పోటీ చేస్తున్నాను. గత మా ఎన్నికల్లో నాకు 264 ఓట్లు వచ్చాయి.. ప్రసిడెంట్ గా పోటీ చేసిన నరేష్ కి 268 ఓట్లు వచ్చాయి. అంటే అందరు నన్ను ఈసీ మెంబర్ గా ఎన్నుకున్నారని ఈ సందర్బంగా తెలియచేస్తున్నాను. ఇప్పుడు కూడా మా పిఆర్ ఓ గా ఏడాదికి ఇచ్చే అమౌంట్ కూడా ఎవరో కాస్థల్లో ఉన్న వారికీ సాయంగా ఇచ్చేసాను. మా నుండి ఒక్క రూపాయికూడా నేను తీసుకోలేదు. ప్రతి ఏడాది పేద కళాకారులకు ఒక్కొక్కరికి ఇరవై, ఇరవై ఐదు,  పదిహేను వేల చొప్పున సంతోషం అవార్డు వేడుకలో ఇస్తూ వచ్చాను, ఈ పాండమిక్ సమయంలో తప్ప. ఏది ఏమైనా ఈ రోజు పరిశ్రమలో నాకంటూ ఓ మంచి గుర్తింపు ఇచ్చిన సినిమా కళామతల్లి కోసం కష్టపడడానికి రెడీగా ఉన్నాను. ఇక నటుడిగా మంచి పాత్రలు చేయాలని, దాంతో పాటు దర్శకత్వం కూడా చేయాలనీ ఉంది అంటూ ముగించారు.

Pushpa The Rise Srivalli Lyrical Song Release on October 13

 అక్టోబర్ 13న ‘పుష్ప: ది రైజ్’ నుంచి రష్మిక మందన్న ‘శ్రీ వల్లి’ లిరికల్ సాంగ్ విడుదల.. 



అల వైకుఠ‌పురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థ‌లం‌ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్  ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. తాజాగా రష్మిక మందన్న శ్రీవల్లి పాటకు సంబంధించిన అప్ డేట్ బయటికి వచ్చింది. దాక్కో దాక్కోమేక తర్వాత రెండో సింగిల్ విడుదల చేయబోతున్నారు మేకర్స్. రష్మిక మందన్నపై చిత్రీకరించిన శ్రీవల్లి పాటను అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. ఈ మధ్యే విడుదలైన రష్మిక మందన్న ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. పూర్తిగా డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్నారు రష్మిక మందన్న. చెవుల కమ్మలు పెట్టుకుంటూ ఉన్న ఆమె లుక్ ఆకట్టుకుంటుంది. డిసెంబర్ 17న ‘పుష్ప: ది రైజ్’ విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్. 


నటీనటలు: 

అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు


టెక్నికల్ టీం: 

దర్శకుడు: సుకుమార్

నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ 

కో ప్రొడ్యూసర్స్: ముత్తంశెట్టి మీడియా 

సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్ 

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ 

ఆర్ట్ డైరెక్టర్: S. రామకృష్ణ - మోనిక నిగొత్రే 

సౌండ్ డిజైన్: రసూల్ పూకుట్టి 

ఎడిటర్: కార్తిక శ్రీనివాస్ R

ఫైట్స్: రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్

లిరిసిస్ట్: చంద్రబోస్ 

క్యాస్ట్యూమ్ డిజైన్: దీపాలీ నూర్

మేకప్: నాని భారతి 

CEO: చెర్రీ

కో డైరెక్టర్: విష్ణు 

లైన్ ప్రొడ్యూసర్: KVV బాల సుబ్రమణ్యం 

బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ ముత్తంశెట్టి మీడియా

PRO: ఏలూరు శ్రీను, మడూరి మధు

SevaaDas Audio Launched

 అమాత్యులు-పార్లమెంట్ & శాసన సభ్యులు-

అతిరథ మహారథుల సమక్షంలో 

"సేవాదాస్" సాంగ్స్ రిలీజ్ ఫంక్షన్!!



-ముఖ్య అతిధులుగా విచ్చేసిన

మంత్రివర్యులు

తలసాని శ్రీనివాస్ యాదవ్

-సత్యవతి రాథోడ్

మరియు పలువురు పార్లమెంట్ & 

శాసనసభ్యులు-

ఐఎఎస్-ఐపీఎస్ ఆఫీసర్స్!!


    శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి కె.పి.ఎన్. చౌహాన్ దర్శకత్వంలో.. ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక బహుభాషా చిత్రం "సేవాదాస్". సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కె.పి.ఎన్. చౌహాన్, ప్రీతి అస్రాని హీరో హీరోయిన్లు. కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో బంజారా-తెలుగు- ఇంగ్లీష్-హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఆడియో వేడుక హైద్రాబాద్ లోని రవీంద్రభారతిలో అత్యంత కోలాహలంగా జరిగింది. భోలే షావలి ఈ చిత్రానికి సంగీత సారధ్యం వహించారు. 

     బంజారా సంప్రదాయపు డప్పులు, నృత్యాలు, వేషధారణలతో ఆద్యంతం ఆసక్తికరంగా నిర్వహించిన ఈ వేడుకలో తెలంగాణ మత్స్య-సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గిరిజన మరియు మహిళా సంక్షేమ శాఖామాత్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎమ్.పి శ్రీమతి మాలోత్ కవిత, ఇల్లందు ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ బానోత్, ఖానాపూర్ ఎమ్.ఎల్.ఎ. శ్రీమతి రేఖా శ్యామ్ నాయక్, డోర్నకల్ ఎమ్.ఎల్.ఎ. రెడ్యా నాయక్, మహబూబాబాద్ ఎమ్.ఎల్.ఎ. శంకర్ నాయక్, వైరా ఎమ్.ఎల్.ఎ. ఎల్.రాములు నాయక్, దేవరకొండ ఎమ్.ఎల్.ఎ. రవీంద్ర నాయక్, బోద్ ఎమ్.ఎల్.ఎ. రాథోడ్ బాబూరావు, మహబూబాబాద్ మాజీ పార్లమెంటు సభ్యులు అజ్మీరా సీతారాం నాయక్ లతోపాటు తెలంగాణవ్యాప్తంగా గల పలువురు ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్, ఐ.ఆర్.ఎస్ అధికారులు పెద్ద సంఖ్యలో విశిష్ట అతిధులుగా పాల్గొన్నారు

     ఈ చిత్రంలో సేవాదాస్ గా టైటిల్ రోల్ ప్లే చేసిన సుమన్, కీలకపాత్ర పోషించిన భానుచందర్, చిత్ర దర్శకుడు-కథానాయకుడు కె.పి.ఎన్.చౌహాన్, హీరోయిన్ ప్రీతి అస్రాని, గీతా సింగ్ "సేవాదాస్" చిత్రంలో నటించే అవకాశం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. 

    మంత్రి తలసాని మాట్లాడుతూ... "ఇది ఆడియో వేడుకలా లేదు. శత దినోత్సవ వేడుకలా ఉంది. "సేవాదాస్" చిత్రం కచ్చితంగా 100 రోజులాడాలి. ఆ వేడుకకు కూడా ముఖ్య అతిధిగా నన్ను పిలవాలి" అన్నారు.

     మరో ముఖ్య అతిధి మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ "బంజారా బిడ్డలు బంజారా భాషలోనే కాకుండా తెలుగు-ఇంగ్లీష్-హిందీ భాషల్లో తీసిన "సేవాదాస్" ఆడియో ఫంక్షన్ లో పాల్గొనడం గర్వంగా ఉంది" అన్నారు. 

     నిర్మాతలు ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ మాట్లాడుతూ... " "సేవాదాస్" రూపకల్పన కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ఈనెల 15న ఇల్లందులో ప్రి-రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేసి, ఈనెలాఖరుకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం" అన్నారు.

     వినోద్ రైనా, ఎస్.ఆర్.ఎస్. ప్రసాద్, విజయ్ రంగరాజు, చలాకీ చంటి, సంపత్ నాయక్, గీతా సింగ్, ఫిష్ వెంకట్, నవీనా రెడ్డి, శైలజ, రేఖ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, అసోసియేట్ డైరెక్టర్స్: రాజేంద్రప్రసాద్ చిరుత-రవితేజ-సంజయ్ భూషణ్-సాయి కుమార్, కో-డైరెక్టర్స్; ఎన్టీఆర్ సుబ్బు-నవీన్, వి ఎఫ్ ఎక్స్: కిషోర్ కాలకూరి, ఆర్ట్ డైరెక్టర్: విజయ్.ఎ, ప్రొడక్షన్ కంట్రోలర్: లక్ష్మణరావు-శ్రీరాములు, కెమెరామెన్: విజయ్ టాగోర్, ఎడిటర్: ప్రదీప్, పోస్ట్ ప్రొడక్షన్: రామానాయుడు స్టూడియోస్, నిర్మాతలు: ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్, కథ-స్క్రీన్ ప్లే-డైరెక్షన్; కె.పి.ఎన్. చౌహాన్!!

Maguva Majaaka in Urvasi OTT

 "మగువ"తో సంచలనం సృష్టించిన 

మధుప్రియ తాజా సంచలనం

"మగువా మజాకా" ఊర్వశి ఓటిటిలో!!



      "మగువ" చిత్రంతో సంచలనం సృష్టించిన మధుప్రియ టైటిల్ పాత్రలో డీఎస్ రావు, రవీంద్ర నారాయణ్ ముఖ్యపాత్రలు పోషించిన చిత్రం "మగువా మజాకా". ఊర్వశి ఓటిటి సమర్పణలో భీమవరం టాకీస్ సహకారంతో సంపత్ రాజ్ దర్శకత్వంలో ఫణిరాజ్ నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 8 నుంచి ఊర్వశి ఓటిటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. 

    తనపై అత్యాచారానికి ఒడిగట్టిన కామాంధులకు తెగువ కలిగిన ఓ మగువ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం తమ దర్శకుడు సంపత్ రాజ్ కు మంచి పేరు తెచ్చిపెడుతుందని, ఈనెల 8న ఊర్వశి ఓటిటిలో "మగువా మజాకాను విడుదల చేస్తున్నామని నిర్మాత ఫణిరాజ్ తెలిపారు. "మగువ" చిత్రంతో సంచలనం సృష్టించిన మధుప్రియ ఈ చిత్రంతో "మధుప్రియా మజాకా" అనిపిస్తుందని దర్శకుడు సంపత్ రాజ్ పేర్కొన్నారు.

     ఈ చిత్రానికి మ్యూజిక్: పి.ఎస్, ఎడిటింగ్: వి.ఎ, కెమెరా: శ్రీను, డైలాగ్స్: మణి, నిర్మాత: ఫణిరాజ్, కథ-స్క్రీన్ ప్లే-డైరెక్షన్: సంపత్ రాజ్!!

Nandamuri Balakrishna, Boyapati Srinu, Dwaraka Creations’ Akhanda Shooting Wrapped Up

 Nandamuri Balakrishna, Boyapati Srinu, Dwaraka Creations’ Akhanda Shooting Wrapped Up



Natasimha Nandamuri Balakrishna and mass director Boyapati Srinu’s upcoming flick Akhanda’s entire shooting was wrapped up. The makers completed canning a song in Annapurna Studios and with this the shooting part is wrapped up. Post-production works are also happening simultaneously and the makers will soon announce Akhanda’s release date.


The poster sees Balakrishna, alongside his director Boyapati Srinu, producer Miryala Ravinder Reddy and Sridhar. They shows thumbs up, as the shooting was completed.


Balakrishna and Boyapati collaborated for the third time to complete hat-trick hits in their combination. Expectations are sky high on the film as Boyapati knows the pulse of masses and he is presenting Balakrishna in never seen before avatars. Balakrishna who plays a dual character will be seen as an Aghora in one of the roles.


The teasers to introduce two characters of Balakrishna got tremendous response and first song too pleased music lovers. The makers will intensify promotional campaign, once they announce release date.


Pragya Jaiswal is the leading lady opposite Balakrishna in the mass action entertainer. Miryala Ravinder Reddy is producing Akhanda on Dwaraka Creations. Jagapathi Babu and Srikanth will be seen in crucial roles.


S Thaman renders soundtracks, while C Ram Prasad cranks the camera. Kotagiri Venkateshwara Rao is the editor.


Powerstar Pawan Kalyan Director Trivikram Wishes to Republic Team

 సాయితేజ్‌ను న‌టుడిగా మ‌రో రేంజ్‌లో కొత్తగా ప్రేక్ష‌కుల‌ను ప‌రిచ‌యం చేసిన పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ ‘రిప‌బ్లిక్‌’ను ఆవిష్క‌రించిన ద‌ర్శ‌కుడు దేవ క‌ట్టా, నిర్మాత‌లు అండ్ టీమ్‌కు అభినంద‌న‌లు:  ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌



సాయితేజ్ హీరోగా దేవ కట్టా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం ‘రిప‌బ్లిక్‌’. జీ స్టూడియోస్‌ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు.పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ బ్యాక్‌డ్రాప్‌గా రూపొందిన ఈ సినిమాను అక్టోబ‌ర్ 1న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. రొటీన్ సినిమాకు భిన్నంగా రూపొందిన ఈ మూవీలో సాయితేజ్ త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. స‌మాజాన్ని ప్రభావితం చేసే అంశాల్లో ఒక‌టైన సినిమా మాధ్య‌మంలో ప్ర‌భావ వంత‌మైన సినిమాలు చేయాల‌ని భావించి ప్రారంభం నుంచి అలాంటి సినిమాల‌నే తెర‌కెక్కిస్తోన్న ద‌ర్శ‌కుడు దేవ‌క‌ట్టా మ‌రోసారి త‌న మార్క్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. సూప‌ర్‌హిట్ టాక్‌తో ర‌న్ అవుతోన్న ఈ సినిమా స‌క్సెస్ గురించి ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, స్టార్ డైరెక్ట్ త్రివిక్ర‌మ్ చిత్ర‌యూనిట్ స్పందిస్తూ ఎంటైర్  యూనిట్‌ను అభినందించారు. 

‘‘ఇప్ప‌టి వ‌ర‌కు సాయితేజ్ చేసిన సినిమాల‌కు రిప‌బ్లిక్ సినిమా పూర్తి భిన్న‌మైన‌ది. న‌టుడిగా త‌న కెరీర్‌లో మ‌ర‌చిపోలేని చిత్రం. అలాగే త‌న‌ను యాక్ట‌ర్‌గా కొత్తగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసిన సినిమా ఇది. స‌మాజంలో రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌భుత్వోద్యోగులు, న్యాయ వ్య‌వ‌స్థను మూడు గుర్రాల‌తో పోల్చి అవి ఎలా ఉండాలి.. ఎలా ఉన్న‌ప్పుడు సామాన్య ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని తెలియ‌జేసేలా , నేటి స‌మాజంలో ఉన్న ప‌రిస్థితుల‌ను ఆవిష్క‌రించేలా రిప‌బ్లిక్ చిత్రాన్ని దేవ‌క‌ట్టా అద్భుతంగా తెర‌కెక్కించారు. సినిమాలోని ప్ర‌తి పాత్ర మ‌న‌కు న‌చ్చేలా తీర్చిదిద్దారు దేవ క‌ట్టాగారు. మ‌ణిశ‌ర్మ‌గారి సంగీతం, నేప‌థ్య సంగీతం, సుకుమార్‌గారి కెమెరా వ‌ర్క్ అన్నీ చ‌క్క‌గా కుదిరాయి. అలాగే ఇంత మంచి టీమ్‌ను ఓ చోట చేర్చి సినిమాను అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించిన నిర్మాత‌లు  జె.భగవాన్, జె.పుల్లారావు, జీ స్టూడియోస్‌వారికి ఈ సంద‌ర్భంగా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను’’ అన్నారు పవర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌.

Idhe Maa Kadha Team Success Meet


మా కష్టం అంతా ప్రేక్షకుల ప్రశంసలతో మరిచిపోయాం - ఇదే మా క‌థ చిత్ర యూనిట్‌


సుమంత్‌ అశ్విన్‌, శ్రీకాంత్‌, భూమిక, తాన్య హోప్‌లు కలిసి నటించిన చిత్రం ‘ఇదే మా కథ’. శ్రీమతి గుర్రప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ మీద జీ మహేష్ తెరకెక్కిన‌ ఈ సినిమాకు గురు పవన్‌ దర్శకుడు. ఈ చిత్రం అక్టోబర్‌ 2న విడుద‌లై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో...

దర్శకుడు గురు పవన్ మాట్లాడుతూ.. ‘మౌత్ పబ్లిసిటీతోనే ఈ సినిమా ముందుకు వెళ్తోంది. అందుకే ఈ సక్సెస్ మీట్‌కు ఎమోషనల్ హిట్ అని పెట్టాం. నిన్న (శనివారం) నాడు ఓ ఫోన్ కాల్ వచ్చింది. మార్నింగ్ సినిమా చూశాను.. ఈవినింగ్ మళ్లీ ఫ్యామిలీని కూడా తీసుకెళ్లాం అని చెప్పారు. అది విని చాలా సంతోషమనిపించింది. యూత్ కూడా సినిమా చూసి వారి ఫ్యామిలీని తీసుకెళ్లి చూపించారు. సినిమా విజయం సాధించిందని చెప్పడానికి ఇదే మంచి ఉదాహరణ. ఎన్నో రోజుల నుంచి థియేటర్లకు దూరంగా ఉన్న మహిళను థియేటర్లకు రప్పించాలని ప్రయత్నం చేశాం. అందులో సక్సెస్ అయ్యాం. ఈ సినిమాకు అద్భుతమైన  ఆదరణ దక్కుతోంది. అందరూ థియేటర్లోనే ఈ సినిమాను చూడండి. ఇంత మంచి విజయాన్ని అందించినందకు ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇంకా మంచి చిత్రాలను తీసి మిమ్మల్ని అలరిస్తాను అని మాటిస్తున్నాను’ అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ.. ‘ఇది మాకు మొదటి సినిమా. అందులో రెండు లాక్డౌన్‌లు వచ్చాయి. ఎన్నో కష్టాలు పడ్డాం. కానీ మా లక్ష్యాన్ని మాత్రం ఎప్పుడూ వీడలేదు. సినిమా తీయాలి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నాం. రెగ్యులర్ కమర్షియల్  చిత్రాలు తీస్తే మాకు సులభంగా అయ్యేది. కానీ మేం అలా చేయాలని  అనుకోలేదు. కొత్తగా ప్రయోగం చేయాలని అనుకున్నాం. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుని చిత్రాన్ని నిర్మించాం. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. దర్శకుడికి మొదటి సినిమానే  అయినా కూడా ఎంతో బాగా తెరకెక్కించారు. ఇంకా మంచి చిత్రాలను అందిస్తాం. మా  ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇంకా ఎంతో దూరం వెళ్లాల్సి ఉంది. ఇంత మంచి విజయాన్ని ఇచ్చినందుకు తెలుగు  ప్రేక్షకులకు  థ్యాంక్స్’ అని అన్నారు.

హీరో  శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ బాగుందని ఫోన్లు చేస్తున్నారు. దర్శకుడు ఎంతో బాగా చిత్రాన్ని తెరకెక్కించారని  చెబుతున్నారు. దర్శకుడికి మొదటి సినిమాలా అనిపించదు. లడఖ్ అంటే ఇలా ఉంటుందా? అని సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ అంటున్నారు. చాలా రోజుల తరువాత నాకు మంచి విజయం దక్కింది. సుమంత్, భూమిక, తాన్యాల గురించి అందరూ  మాట్లాడుతున్నారు. ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అని అన్నారు

హీరో సుమంత్ అశ్విన్‌ మాట్లాడుతూ.. ‘సినిమాను చూసిన ప్రతీ ఒక్కరూ ద్వితీయార్థానికి కనెక్ట్ అయ్యారు. చివరి 45 నిమిషాలు, లొకేషన్స్, పాటలు, డైరెక్షన్స్ ఇలా అన్నింటిని జనాలు ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారా? అని ఎక్కువగా టెన్షన్ పడ్డాం. దాదాపు రెండేళ్లు కష్టపడి చేశాం. కానీ  ఆ కష్టం అంతా కూడా ప్రేక్షకుల ప్రశంసలతో మరిచిపోయాం. అలాంటి అప్రిసియేషన్స్ వచ్చినప్పుడు ఇంకా జోష్ వస్తుంది. ఇంకా మంచి చిత్రాలు చేయాలనే స్ఫూర్తి వస్తుంది. సినిమాను థియేటర్లో చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ అద్భుతంగా ఉంది. ఆడియెన్స్ అంతా కూడా పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు. ఇంత మంచి విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్. సినిమాకు  పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు


Idhe Maa Katha Movie Review

 


TeluguCinemas.in Rating : 3 /5 

Movie: IDHE MAA KATHA

Production House : Gurappa Parameswara Productions

Starring: Sumanth Ashwin, Srikanth, Bhumika Chawla, Thanya Hope & Others

Director: Guru Pawan

Producer: G Mahesh

Executive Producer: Chiranjeevi Lankella

Music Director: Sunil Kashyap

Cinematography : C Ram Prasad & Niranjan J Reddy

Editor: Junaid Siddiqui

Stunt Choreographer : Prudthvi

Choreographer: Annie Master

It's a well known fact that India’s first ever movie based on bikers' life and journey ‘Idhe Maa Katha” has released yesterday and has received a very good response from the audience from bath states. The film stars Sumanth Ashwin, Srikanth, Bhumika Chawla and Tanya Hope in lead roles and is directed by debutant director Guru Pawan, a former associate of Puri Jagannadh, Harish Shankar, Ram Gopal Varma, Nagesh Kukunoor. 

 The film was successful to create an impact and curiosity from starting from its first look, concept teaser and it’s recently released trailer attracted the attention of all touching a new concept and was widely spread on social media like Twitter, Instagram, Youtube ect., Let us see what Idhe Maa Katha offered to movie lovers and to bike lovers. 

‘Idhe Maa Katha’ story is completely based on the backdrop of a road trip and started the narration on an interesting note establishing the characters. The film is all about how 4 completely different stanger healing from different parts of India start their journey to Leh Ladakh for the reasons of their own, how they happen to meet each other and how they helped each other emotionally,  to overcome the hurdles and hustles they face in reaching their goals. The screenplay of the film is new as so is the concept. It tries to showcase the reality of the riders life, the situations they face etc., in a very appealing and emotional way to which the audience connects immediately.

The character sketching of all characters are unique and very much appealing. Bhumika Chawala character is something that every household woman can connect and relate to. Tanya, Srikanth and Sumanth Ashwin’s looks are super stylish and this clearly shows that Guru Pawan has learnt the master craft of makeover from his boss and has implemented the same with “Idhe Maa Katha”.

Sumanth Asshwin plays the role of adventure biker who is also a mature biker, an passionate biker who is ready to go to any extent to reach his goal. Something which he hasn’t done before and he has done a pretty  good justice for this role with ease. Tanya Hope on the other hand plays the role of an angry young rider and she surely has done a fabulous job in portraying that role with her stunning stylish looks and performance. Especially in the songs she is a delight to watch.

 Srikanth plays the role of a business typhon who also has his very own reason to ride to Leh Ladakh and his story is pretty interesting and in due course of time it brings much needed curiosity to the film’s plot with a banggng twist in the end. He has played his role with much ease and his performance is one of the highlights of the film. One can say that Srikanth has the best look of his career.

All 4 characters have equal importance in the film and all the four complimented well and elevated the scenes with their performances. Saptagiri, Trivikram Sai, 30 Years Prudhvi, Jabardatsh Ram Prasad generated immense fun for the audience. Srikanth Iyengar, Sandhya Janak, Srijitha Ghosh and Madhumani performed and had their bits to play which they did justice to. Subbaraju made a small appearance as well.

Most of the films shot in Nagpur, Kullu-Manali, Leh- Ladakh and the visuals are awestruck. One of the biggest highlights of the film. Another big attraction and strength of the film is Sunil Kashyap’s soul touching music and so is the background music. Junaid Siddique's editing is good but he should have taken care of the drags in the second half. Production values are top notch and so is the production design as they did not compromise on anything which is clearly evident on screen. The costumes give a fresh look to the films.

The rest of the story is all about how they team up, how they look each other back in this journey and how they succeed in their goals, which is presented in a new and unique way, which makes ‘Idhe Maa Katha’ unique from all routine films.Director Guru Pawan succeeded big time in bringing front an unique and different film with new backdrop  which is filled with beautiful character skating, appealing dialogues, emotional quotient and very good screenplay. One should surely appreciate him for that. He is here in TFI to stay for sure.

 Quick Analysis :

 Advantages

Novel story.

Unique backdrop.

Direction Skills & character sketching.

All 4 lead actor performances

Rich & uncompromised Production Value

Hilarious elements

BGM

Visuals & Cinematography

Leh Ladak locations.

Songs

 Disadvantages

Few slow phases in the screenplay

Editing

Few Scenes.

Guru Pawan’s Idhe Maa Katha has a novel storyline and an interesting plot and backdrop with new age character sketching. The first half is entertaining and generates curiosity with interesting elements and the second is bagged with beautiful locations, emotional conflicts with a racy screenplay. Considering all these elements, we go with a 3 rating for Idhe Maa Katha. It’s a pretty decent watch, if you go with less expectation it will entertain you for sure. A proper family entertainer it is! Worthy watching for sure!

Kamal Haasan, Lokesh Kanagaraj’s Vikram Second Schedule Wrapped Up

 Kamal Haasan, Lokesh Kanagaraj’s Vikram Second Schedule Wrapped Up



Universal hero Kamal Haasan and successful director Lokesh Kanagaraj have teamed up for an action thriller titled Vikram. Besides playing the lead role, Kamal Haasan is also producing the film in association with R Mahendran under Raaj Kamal Films International banner.


Lokesh Kanagaraj managed to bring together three powerhouse performers - Kamal Haasan, Vijay Sethupathi and Fahadh Faasil - for Vikram. The first look of Vikram, which was unveiled in July this year, garnered the interest. The shooting is progressing at a brisk pace. Both Vijay Sethupathi and Fahadh Faasil joined the shoot in second schedule.


Lokesh Kanagaraj took to Twitter to inform that Vikram’s second schedule was wrapped up. “Vikram second schedule wrapped ⚡ @ikamalhaasan @VijaySethuOffl #FahadhFaasil @RKFI #Vikram #vikramsecondschedule ,” tweeted Lokesh.


A poster shared by the director sees Kamal sitting on a mud bike, while Lokesh, cinematographer Girish Gangadharan, and the stunt master duo Anbariv stand next to him.


Apart from star cast the film also features Kalidas Jayaram, Narain, Arjun Das and Shivani Narayanan in supporting roles.


The technical crew of Vikram includes composer Anirudh Ravichander, cinematographer Girish Gangadharan and editor Philomin Raj.


Cast: Kamal Haasan, Vijay Sethupathi, Fahadh Faasil, Kalidas Jayaram, Narain, Arjun Das, Shivani Narayanan and others


Technical Crew:

Director: Lokesh Kanagaraj

Producers: Kamal Haasan and R Mahendran

Banner: Raaj Kamal Films International

Music Director: Anirudh Ravichander

Cinematography: Girish Gangadharan

Editor: Philomin Raj