Home » » Mr Kalyan film going to be success. Best wishes to the team : Malla Reddy

Mr Kalyan film going to be success. Best wishes to the team : Malla Reddy

 Mr Kalyan film going to be success. Best wishes to the team : Malla Reddy 



"మిస్టర్ కళ్యాణ్'' సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను : మల్లారెడ్డి గారు.



శ్రీమతి ఉష శ్రీ సమర్పణలో శ్రీ దత్తాత్రేయ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబడిన చిత్రం మిస్టర్ కళ్యాణ్. ఫ్యామిలీ, లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో మాన్యం కృష్ణ, అర్చన, హీరో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాతో పండు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిర్మాత సుబ్బారెడ్డి ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించారు. 


మిస్టర్ కళ్యాణ్ ట్రైలర్ ను దర్శకులు నక్కిన త్రినాధ్ రావు విడుదల చేశారు అలాగే రిలీజ్ డేట్ పోస్టర్ ను నటుడు ఆకాశ్ పూరి విడుదల చేశారు. 


ఈ సందర్భంగా మల్లారెడ్డి గారు మాట్లాడుతూ...

 మార్చి 10న విడుదల కాబోతున్న మిస్టర్ కళ్యాణ్ సినిమా విజయం సాధించాలి, అలాగే నిర్మాత ఎన్వీ సుబ్బారెడ్డి గారికి దర్శకుడు పండు కు ఇతర నటీనటులకు ఈ సినిమా మంచి పేరును తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను అన్నారు.


అమ్మాయిలు మరియు మహిళలు తప్పకుండా ఈ సినిమా చూడాలి, ముఖ్యంగా వారికి కనెక్ట్ అయ్యే అనేక అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని చిత్ర యూనిట్ తెలిపింది.


సప్తగిరి, ధనరాజ్, తాగుబోతు రమేష్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా చిత్రీకరణ వైజాగ్ మరియు హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగింది. ఒక ప్రేత్యేక సాంగ్ కోసం లడక్ లోని అందమైన లొకేషన్స్ లో షూట్ చెయ్యడం జరిగింది. 



నటీనటులు: 

మాన్యం కృష్ణ, అర్చన, రాజ్ వర, సప్తగిరి, తాగుబోతు రమేష్, ధనరాజ్ తదితరులు.



సాంకేతిక నిపుణులు: 

డైరెక్టర్: పండు

నిర్మాత: సుబ్బారెడ్డి

సంగీతం: సుక్కు

సినిమాటోగ్రఫీ: నానాజీ. ఎంవి.గోపి

ఎడిటర్: వినోద్ అద్వయ్

డాన్స్: అనీష్

ఫైట్స్: మల్లేష్

పీఆర్ఒ: శ్రీధర్


Share this article :