Home » » Another Award to Film Journalist Dheeraj Appaji-Telugu Cinema Legendries Award

Another Award to Film Journalist Dheeraj Appaji-Telugu Cinema Legendries Award

 ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీకి

తెలుగు సినిమా లెజండరీస్ స్మారక పురస్కారండిజిటల్ డైలీ పేపర్ "స్వాతిముత్యం" సంపాదకుడు, ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ అండ్ పి.ఆర్.ఒ ధీరజ అప్పాజీని మరో పురస్కారం వరించింది. తెలుగు సినిమా 91వ పుట్టిన రోజును (ఫిబ్రవరి 6) పురస్కరించుకుని, హైదరాబాద్, ప్రసాద్ ల్యాబ్ లో అత్యంత ఘనంగా నిర్వహించిన వేడుకలో అప్పాజీ తెలుగు సినిమా లెజండరీస్ పురస్కారం అందుకున్నారు. "నేస్తం ఫౌండేషన్ - తెలుగు సినిమా వేదిక" తరపున ప్రముఖ నిర్మాతలు జె.వి.మోహన్ గౌడ్, పి.వి.ఎస్.వర్మ, ఆర్.వి.ఎన్.ప్రసాద్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ వేడుకలో ప్రముఖ నటులు - మాజీ పార్లమెంట్ సభ్యులు మురళీ మోహన్, సీనియర్ నటులు శివకృష్ణ, ప్రముఖ నటీమణి అన్నపూర్ణమ్మ, ప్రముఖ నిర్మాత - స్థిరాస్తి వ్యాపారి ఎ.గురురాజ్... అప్పాజీని శాలువాతో సత్కరించి, జ్ఞాపిక అందించారు. ఈ కార్య్రమానికి ప్రముఖ నటులు - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ అలి, తెలంగాణ ఎఫ్.డి.సి.చైర్మన్ అనిల్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు!!


Share this article :