Best Opportunity to Producers From Producer Bazaar

 నిర్మాతల పాలిట కొంగు బంగారం!!



"ప్రొడ్యూసర్ బజార్ - బెటర్ ఇన్వెస్ట్"

సంయుక్తంగా అందిస్తున్న సువర్ణావకాశం!!


      ఒక సినిమా నిర్మాణంలో ఉండగానే... తదుపరి చిత్రం కోసం సన్నాహాలు చేసుకునే నిర్మాతలకు ఒక గొప్ప సదవకాశం. ప్రొడ్యూసర్ బజార్ డాట్ కామ్ (producerbazaar.com) బెటర్ ఇన్వెష్ట్ డాట్ క్లబ్ (betterinvest.club) సంయుక్తంగా ఈ అరుదైన అవకాశాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ఓటిటి, ఆడియో, శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ డీల్స్ క్లోజ్ చేసుకున్న నిర్మాతలు... సదరు అగ్రిమెంట్స్ ఆధారంగా... ఆ మొత్తాన్ని తక్షణం డిస్కౌంట్ చేసుకునే వెసులుబాటును ఈ సంస్థలు అందిస్తున్నాయి 

      ఓటిటి, శాటిలైట్, ఆడియో రైట్స్ అమ్మకాలు జరిగిపోయినప్పటికీ... ఆ "మొత్తం" నిర్మాతలకు వెంటనే ముట్టదు. రెండు మూడు దఫాలుగా... సినిమా విడుదల అనంతరం అందుతాయి. ఇలాంటి పరిస్థితిలో నిర్మాతలకు "అధిక వడ్డీ భారం" పడకుండా... "సేల్ అగ్రిమెంట్లు" ఆధారంగా నామమాత్రపు డిస్కౌంట్ తో... ఆ మొత్తం ఒకేసారి విడుదల చేయడం ఈ సంస్థల ప్రత్యేకత. అది కూడా గరిష్టంగా వారం నుంచి పది రోజుల లోపు. 

     బెటర్ ఇన్వెష్ట్ డాట్ క్లబ్ (betterinvest.club) కార్యనిర్వహణాధికారి (CEO) ప్రదీప్ సోము, ప్రొడ్యూసర్ బజార్ డాట్ కామ్ (producerbazaar.com) సి.ఒ.ఒ. విజయ్.డి మాట్లాడుతూ... "నిర్మాతలకు అధిక వడ్డీ భారం లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో మా రెండు సంస్థలు అత్యంత పారదర్శకంగా ముందుకు సాగుతున్నాయి. తెలుగుతోపాటు సౌత్ ఇండియాలోని మిగతా మూడు భాషల నిర్మాతలకు కూడా ఈ అవకాశాన్ని అందిస్తున్నాము" అన్నారు. టెక్నాలజీ సిద్ధహస్తులు "సెంథిల్ నాయగం"తో కలిసి సినిమా రంగ అభివృద్ధి కోసం వీరు చేస్తున్న కృషి అభినందనీయం అంటూ కార్పొరేట్ రంగ నిపుణులు కితాబు ఇస్తుండడం గమనార్హం!!

Post a Comment

Previous Post Next Post