Home » » Bhagat Singh Nagar on OTT From December 2nd

Bhagat Singh Nagar on OTT From December 2nd

 డిసెంబర్ 2 న హంగామా, యం.ఎక్స్ ప్లేయర్, డిసెంబర్ 5 న ఆమెజాన్ యు.యస్ మరియు యు.కె లలో కూడా స్ట్రీమ్ అవ్వనున్న "భగత్ సింగ్ నగర్" చిత్రం




ఈస్ట్ వెస్ట్ ఏంటర్ టైనర్స్ ద్వారా  డిసెంబర్ 2 నుండి ఓటిటి లో రిలీజ్ అవుతున్న  "భగత్ సింగ్ నగర్" చిత్రం 


భగత్ సింగ్" గారు రాసిన ఒక లైన్ ను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని యదార్థ సంఘటనలతో తెరకెక్కిన చిత్రం "భగత్ సింగ్ నగర్".గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్ , ధృవిక హీరో, హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు సంయుక్తంగా నిర్మించారు. తెలుగు, తమిళ బాషలో ఏక కాలంలో గత  ఏడాది  ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాలో యాక్షన్ తో పాటు ఎమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల మనసులను దోచుకొని సూపర్ హిట్ మూవీగా నిలిచిన  విషయం మనందరికీ తెలిసిందే. తాజాగా ఈస్ట్ వెస్ట్ ఏంటర్ టైన్మెంట్ ద్వారా ఓటిటి లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను థియేటర్స్ లలో మిస్ అయిన ప్రేక్షకులు ఈ సినిమా తిరిగి ఓటీటీలో ఎపుడు వస్తుందా అని  వేచి చూస్తున్నారు. వారి ఎదురు చూపుకు డిసెంబర్ 2 న తెరపడనుంది. ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు విజయ నగరంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ఈస్ట్ వెస్ట్ ఏంటర్ టైన్మెంట్ రాజీవ్ తో పాటు నటీ నటులు చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు.ఈ సందర్బంగా 



ఈస్ట్ వెస్ట్ ఏంటర్ టైనర్స్  సి.ఈ.ఓ రాజీవ్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు  మేము ఈస్ట్ వెస్ట్ ఏంటర్ టైనర్స్ నుండి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ప్రతి ఒక్కరికీ చేరువ కావాలనే ఉద్దేశ్యంతో మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. మేము స్థాపించిన ఈస్ట్ వెస్ట్ ఏంటర్ టైనర్స్ లో ఇప్పటివ రకు మేము 650 సినిమాలు రిలీజ్ చేశాము. థియేటర్స్ ప్రేక్షకులకే కాకుండా  ఓటిటి ప్రేక్షకులకు కూడా దగ్గర కావాలని ఓటిటి లో రిలీజ్ అవుతున్న మరో మంచి సినిమా "భగత్ సింగ్ నగర్". ముందు ఈ టైటిల్ విని పేట్రియాటిక్ సినిమా అనుకున్నాను.సినిమా చూసిన తరువాత  ఇందులో మంచి పేట్రియాటిజమే కాదు మంచి లవ్ స్టోరీ, మంచి కమర్సియల్ ఎలిమెంట్స్ తో పాటు  సమాజానికి మంచి మెసేజ్ఇస్తూ చాలా చక్కగా చిట్రీకరించడం జరిగింది. ఇంతమంచి సినిమాను మా ఈస్ట్ వెస్ట్ ఏంటర్ టైనర్స్  నుండి ఓటిటి లో రిలీజ్ చేస్తున్నందుకు మాకు గర్వంగా ఉంది.ఇందులో నటించిన నటీ నటులు కొత్తవరైనా సీనియర్ యాక్టర్స్ చాలా చక్కగా నటించారు. దర్శకుడు వాలాజా క్రాంతి ఎంచుకున్న చక్కటి కథంశాన్ని  నమ్మి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన నిర్మాతలు వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు మంచి మంచి సినిమాలు నిర్మించాలని  ఆ సినిమాలను మా ఈస్ట్ వెస్ట్ ఏంటర్ టైనర్స్ లో విడుదల చేయడానికి ఎప్పుడూ రెడీ గా ఉంటామని అన్నారు.



చిత్ర నిర్మాత రమేష్ ఉడత్తు మాట్లాడుతూ.. ఒక NRI గా దేశం మీద రాష్ట్రం మీద మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి.బిజినెస్ పరంగా కావచ్చు  సామజిక అంశాల మీద కావచ్చు. అయితే నాకు భగత్ సింగ్ నగర్ కథ నాకు  బాగా నచ్చింది. మంచి ఆశయాలతో మంచి సిద్ధాంతాలతో సినిమాకు ఉండాల్సిన అన్ని ఎమోషన్స్, ఎలిమెంట్స్, పర్ఫెక్ట్ గా ఉండడంతో ఈ సినిమాను నిర్మించడం జరిగింది. మా సినిమాకు ప్రకాష్ రాజ్,నాజర్ లాంటి ప్రముఖులు మా సినిమా చూసి మెచ్చుకోవడమే కాకుండా  మా సినిమా విజయం సాదించాలని ప్రోత్సహించిన పెద్దలకు ధన్యవాదములు. మంచి సినిమాకు వారంతా సపోర్ట్ చేయడంతో ఈ సినిమా మాకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇప్పుడు డిసెంబర్ 2 న హంగామా, యం.ఎక్స్ ప్లేయర్ మొదలగు ఓటిటి  ప్లాట్ ఫామ్స్ లలో స్ట్రీమ్ అవ్వనుంది. డిసెంబర్ 5 న ఆమెజాన్ యు.యస్ మరియు యు.కె లలో కూడా స్ట్రీమ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.మంచి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను ప్రతి ఒక్క భారతీయుడు తెలుగు వాడు చూడవలసిన సినిమా. ప్రస్తుత సమాజంలో ఒక మనిషికి ఇంకొక మనిషి హెల్ప్ అనేది చాలా అవసరం అంటూ ఒక అందమైన ప్రేమకథ లో ప్రేక్షకులకు ఒక చిన్న సోషల్ మెసేజ్ ఇవ్వడం జరిగింది ఇలాంటి మంచి సినిమాను ప్రొడ్యూస్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి సినిమాను ఓటిటి లో రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చిన ఈస్ట్ వెస్ట్ ఏంటర్ టైన్మెంట్ రాజీవ్ గారికి కూడా థాంక్స్ చెపుతున్నాను.ఇక ముందు కూడా ఇలాంటి మంచి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని అన్నారు.



చిత్ర దర్శకుడు వాలాజా క్రాంతి మాట్లాడుతూ ..కొత్త నటీ, నటులు, సీనియర్ యాక్టర్స్, మరియు అవార్డు విన్నింగ్ టెక్నిషియన్స్ తో మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో తెరకెక్కింది. "భగత్ సింగ్" గారు రాసిన ఒక లైన్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని యదార్థ సంఘటనలతో సినిమాకు కావలసిన అన్ని కమర్షియల్ హంగులతో రియాలిటీకి దగ్గరగా వినూత్న స్క్రీన్ ప్లే తో తీర్చి దిద్దడం జరిగింది. భగత్ సింగ్ నగర్ లో జరిగే ఒక అందమైన ప్రేమకథ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రిలీజైన మా సినిమాకు చూసిన క్రిటిక్స్ సైతం నటీ నటులు , టెక్నీసియన్స్, దర్శక, నిర్మాతలు అందరూ కొత్తవరైనా ఇది కొత్త వారి సినిమాలా అనిపించకుండా మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో బాగా నిర్మించారని 3.5 రేటింగ్ తో  రివ్యూస్ కూడా రాయడం జరిగింది.అలాగే ప్రేక్షకుల నుండి కూడా అద్భుతమైన స్పందన లభించడమే కాకుండా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యింది. మా అందరికీ ఎంతో పేరు తీదుకు వచ్చిన ఈ సినిమా డిసెంబర్ 2 న హంగామా, యం.ఎక్స్ ప్లేయర్ మొదలగు  ప్లాట్ ఫామ్స్ లలో స్ట్రీమ్ అవ్వనుంది.అలాగే డిసెంబర్ 5 న ఆమెజాన్ యు.యస్ మరియు యు.కె లలో స్ట్రీమ్ అవ్వనుందని అన్నారు.




చిత్ర హీరో విధార్థ్ మాట్లాడుతూ.. నా మొదటి సినిమాకే ఇంత  మంచి పేరు రావడం చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమాలో అనవసరమైన క్యారెక్టర్స్ లేకుండా దర్శక, నిర్మాతలు ఈ సినిమాను చాలా చక్కగా తీశారు.ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. మా సినిమాను థి యే టర్స్ లలో చూసి మెచ్చుకొన్న వారే కాకుండా ఇప్పుడు ఓటిటి లో చూసే ప్రేక్షకులు కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు.



హీరోయిన్ ధ్రువిక  మాట్లాడుతూ.. నేను మలయాళం లో నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా పని చేసినప్పటికీ తెలుగులో నాకిది  మొదటి సినిమా. నా తొలి సినిమాకే  100% ఛాలెంజింగ్ రోల్ లో నటించి  నా యొక్క పెర్ఫార్మన్స్ నిరూపించుకొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో నటించిన వారందరూ కూడా ఛాలెంజింగ్ రోల్ లో నటించి  ప్రేక్షకుల మెప్పు పొందారు. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు



నటీనటులు

విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య, జయకుమార్, హరిబాబు, జయచంద్ర, మహేష్, ఒమర్, శంకర్, వెంకటేష్.  


సాంకేతిక నిపుణులు 

ఛాయాగ్రహణం : రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి, 

ఎడిటింగ్ : జియాన్ శ్రీకాంత్, 

స్టిల్స్ : మునిచంద్ర, 

నృత్యం : ప్రేమ్-గోపి, 

నేపధ్య సంగీతం: ప్రభాకర్ దమ్ముగారి, 

ప్రొడ్యూసర్స్ : వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు,

కథ-కథనం-దర్శకత్వం : వాలాజా క్రాంతి.


Share this article :