Home » » Kantara will Entertain Audience-Rishab Shetty

Kantara will Entertain Audience-Rishab Shetty

 అక్టోబర్ 15న థియేటర్స్ లలో విడుదలవుతున్న "కాంతారా" సినిమా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.. హీరో, డైరెక్టర్ : రిషబ్ శెట్టి
గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా అక్టోబర్ 15న గ్రాండ్ రిలీజ్ కానున్న రిషబ్ శెట్టి  "కాంతారా" చిత్రంహోంబలే ఫిల్మ్ సంస్థ తీస్తున్న సినిమాలలో ఎక్కువగా పాన్ ఇండియా రేంజ్ సినిమాలే ఉండటం గమనార్హం.యశ్, ప్రశాంత్ నీల్ తో ‘కెజిఎఫ్‌ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొంది హోంబలే ఫిల్మ్ సంస్థ. ఆ తరువాత ‘కెజిఎఫ్‌ కు సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని వేయికళ్ళతో ఎదురుచూసిన ప్రేక్షకులకు ఈ ఏడాది వచ్చిన ‘కెజిఎఫ్‌2’  కూడా ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించి వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్ల వర్షం కురిపించడం విశేషం. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సంస్థ రిషబ్ శెట్టి కాంబినేషన్  లో వస్తున్న తాజా సినిమా "కాంతారా".


రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో  కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడు తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని  విజయ్ కిరగందూర్ నిర్మించారు. అజనీష్ లోక్‌నాథ్  సౌండ్‌ట్రాక్‌లను అందించారు. ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో  ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి..కన్నడలో  సెప్టెంబర్ 30వ తేదీన  ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన ప్రతీ చోట భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. తాజాగా ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేయనున్నారు. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ని అగ్ర నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకుని "గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్" ద్వారా  రిలీజ్ చేయనున్నారు. "కాంతారా" అంటే సంస్కృత భాషలో అడవి. ప్రేమ చూపిస్తే అంతకు మించిన ప్రేమను.. విధ్వంసం సృష్టిస్తే.. అంతకంటే ఎక్కువ విధ్వంసాన్ని రిటర్న్ గిఫ్టుగా ఇవ్వడం అడవి తల్లి నైజం. ప్రేమ భావోద్వేగాలు, గ్రామీణ వాతావారాన్ని ఆహ్లదకరంగా చూపించిన ఈ చిత్ర తెలుగు ట్రైలర్ ను అధికారికంగా రిలీజ్ చేశారు . అక్టోబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ  నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ..హోంబలే ఫిల్మ్ సంస్థ కథలు ఎన్నుకుని ,బ్రహ్మండంగా తీసే విధానం చూస్తుంటే ఇన్ని సినిమాలు తీసిన నాకు ఈ "కాంతారా" సినిమా చూసిన తరువాత వారి దగ్గర  కొంత నేర్చుకోవాలి అనిపిస్తుంది . డిఫరెంట్ ఫిలిం కావాలనుకునే వారికి "కాంతారా" కచ్చితంగా నచ్చుతుంది.ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన "పుష్ప" సినిమా చూసిన ప్రేక్షకులు ఎంత ఆనందపడ్డారో ఇప్పుడు వస్తున్న ఈ సినిమా కూడా  ఫారెస్ట్ బ్యాగ్రౌండ్ లో ఫుల్ గా తీయడమే కాకుండా  విష్ణు తాత్వాన్ని కూడా బ్యాగ్రౌండ్ గా పెట్టుకొని చెప్పడం జరిగింది.  ఇటువంటి బ్యాగ్రౌండ్ లో వచ్చిన సినిమాలు ఈ మధ్య సూపర్ హిట్ అయ్యాయి. రిషబ్ శెట్టి  డైరెక్ట్ చేయడమే కాకుండా ఇందులో అద్భుతంగా యాక్ట్ చేశాడు.సుమారు 40 నిముషాల వరకు చూపు పక్కకు తిప్పుకోకుండా సినిమా చూశాను. ఇతను డైరెక్టర్ గా తెలుసు కానీ  యాక్షన్ సన్నివేశాలు, దైవత్వ సన్నీ వేషాలల్లో ఇలా అన్ని రకాలుగా చాలా బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ డి గ్లామర్ రోల్ లో చాలా బాగా చేసింది. ఇందులో నటించిన వారందరూ చాలా బాగా చేశారు. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ  సినిమాను మా గీతా ఆర్ట్స్ ద్వారా ఈ నెల 15 నగ్రాండ్ గా థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్నాము. అందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది అన్నారు.
హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. తెలుగు చిత్ర సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలోనే అగ్రస్థానంలో ఉంది.

ఫారెస్ట్ మిస్ట్రీ కథ తో పాటు అగ్రికల్చర్ ల్యాండ్ ఎమోషన్స్ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. యూనివర్శల్ కథతో వస్తున్న "కాంతారా" సినిమా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుందని కచ్చితంగా చెప్పగలను. కన్నడలో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన ప్రతీ చోట భారీ రెస్పాన్స్‌ను అందుకుంది.ఇప్పుడు ఈ సినిమాను ఇతర భాషల్లో కూడా డబ్ చేసి విడుదల చేస్తున్నాము. ఇంతకు ముందు  నేను నటించిన "బెల్ బాటం"  సినిమా ఆహా లో రిలీజై తెలుగు ప్రేక్షకులనుండి మంచి ఆదరణ లభించింది.. మళ్ళీ  అగ్ర నిర్మాత అల్లు అరవింద్ గారే "గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్" ద్వారా  రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా  నచ్చుతుంది అని ఆశిస్తున్నాను అన్నారు.హీరోయిన్ సప్తమి గౌడ మాట్లాడుతూ..ఈ నెల 15 న తెలుగులో విడుదల అవుతున్న  మా సినిమాను అందరూ ఆదరించాలని కోరుతూ..ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు  ధన్యవాదాలు అన్నారు.లిరిసిస్ట్  రాంబాబు గోశాల మాట్లాడుతూ..హోంబలే ఫిల్మ్ ప్రొడక్షన్ లో  వస్తున్న "కాంతారా" సినిమా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ఈ సినిమాను థియేటర్స్ లోనే చూడాలి. దీంట్లో ఉండే ఆరు పాటలు  రాసే అవకాశం ఇచ్చిన హనుమాన్ గారికి ధన్యవాదాలు.  హీరో రిషబ్ శెట్టి కి రెండు సినిమాలు రాశాను ఇది మూడవ  సినిమా.ఈ సినిమాను అల్లు అరవింద్ గారు రిలీజ్ చేస్తున్నారు అంటే భారీ స్థాయిలోనే ఉంటుంది. తెలుగులో వస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అన్నారు.
నటీనటులు -

రిషబ్ శెట్టి, కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి, ప్రకాష్ తుమినాడు, మానసి సుధీర్, శనిల్ గురు, దీపక్ రాయ్ పనాజే తదితరులు సాంకేతిక నిపుణులు 

బ్యానర్ : హోంబలే ఫిల్మ్స్ 

నిర్మాత - విజయ్ కిరగందూర్

దర్శకుడు - రిషబ్ శెట్టి

సినిమాటోగ్రాఫర్ - అరవింద్ ఎస్ కశ్యప్

ఎడిటర్ - ప్రతీక్ శెట్టి, కె ఎం ప్రకాష్

సంగీతం - అజనీష్ లోకనాథ్

పంపిణీ - గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్

పి. ఆర్ ఓ : ఏలూరు శ్రీను, మేఘా శ్యామ్


Share this article :