Home » » Adivi Sesh Hit 2 Releasing on December 2nd

Adivi Sesh Hit 2 Releasing on December 2nd

 అడివి శేష్ ఇన్వెస్టిగేష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘హిట్‌2’ .. డిసెంబర్ 2న గ్రాండ్ రిలీజ్



ఈ ఏడాది మేజ‌ర్ సినిమాతో భారీ హిట్ సాధించిన హీరో అడివి శేష్‌. ఈయ‌న హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. కొత్త టాలెంట్‌, కాన్సెప్ట్ మూవీలనును ఎంకరేజ్‌ చేయడానికి సినిమాల నిర్మాణంలో భాగమైన హీరో నాని వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేనితో కలిసి నిర్మిస్తోన్న సీట్ ఎడ్జ్ క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘హిట్‌2’.  హిట్‌ సినిమాకు ఫ్రాంచైజీగా 'హిట్ ‌2  ద సెకండ్ కేస్‌' చిత్రాన్ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. హిట్ సినిమాతో ఆడియెన్స్ మెప్పించిన ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలోనే హిట్ 2 ద సెకండ్ కేస్ సినిమా రూపొందుతోంది.  తాజాగా ఈ సినిమాను డిసెంబ‌ర్ 2న రిలీజ్ చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు.


ఎవ‌రు, గూఢ‌చారి వంటి చిత్రాల‌తో వ‌రుస సూప‌ర్ హిట్స్ కొట్టిన టాలెంటెడ్ హీరో అడివి శేష్ ఇందులో కృష్ణ దేవ్‌ అలియాస్‌ కె.డి పాత్రలో మెప్పించున్నారు.  తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీస్‌ ఆఫీసర్‌ అమ్మాయి మిస్సింగ్‌ కేసుని ఎలా డీల్‌ చేశాడనే కాన్సెప్ట్‌తో హిట్‌ ‌(మోమిసైడ్‌ ఇంటర్‌వెన్షన్‌ టీమ్‌) సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు  ఆంధ్రప్రదేశ్‌ చెందిన హిట్‌ టీమ్‌ ఆఫీసర్‌ కృష్ణ దేవ్‌ అలియాస్‌ కె.డి ఈ ఎగ్జయిటింగ్‌ జర్నీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు.  


హిట్ సినిమాను శైలేష్ కొల‌ను సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కించి డైరెక్ట‌ర్‌గా త‌నేంటో ప్రూవ్ చేసుకున్నారు. అలాగే హిందీలోనూ హిట్ సినిమాను అదే పేరుతో రీమేక్ చేసి అక్క‌డ కూడా హిట్ సాధించారు. ఇప్పుడు హిట్ ఫ్రాంఛైజీగా హిట్ 2 సినిమాను పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్‌ డ్రామాగా, మరిన్ని థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్ జోడించి తెరకెక్కించారు.  


హిట్ 2 రిలీజ్ డేట్‌ను డిసెంబ‌ర్ 2గా అనౌన్స్ చేయ‌టంతో పాటు రిలీజ్ డేట్‌ పోస్టర్‌ని కూడా రిలీజ్‌ చేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.  మ‌ణి కంద‌న్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సంగీతాన్ని అందిస్తున్నారు.


నటీనటులు:


అడివిశేష్‌, మీనాక్షి చౌదరి, రావు రమేష్‌, భాను చందర్‌, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, శ్రీనాథ్ మాగంటి, కోమలి ప్రసాద్‌ తదితరులు


సాంకేతిక వర్గం:

సమర్పణ:  నాని

బ్యానర్‌:  వాల్‌పోస్టర్‌ సినిమా

నిర్మాత:  ప్రశాంతి త్రిపిర్‌నేని

రచన, దర్శకత్వం: డా. శైలేష్‌ కొలను

సినిమాటోగ్రఫీ:  మణికందన్‌.ఎస్

సంగీతం: జాన్‌ స్టీవర్స్‌ ఎడురి

ఆర్ట్‌:  మనీషా ఎ.దత్‌

ఎడిటింగ్‌:  గ్యారీ బి.హెచ్

ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఎస్‌.వెంకట్ రత్నం(వెంకట్‌)

 పి.ఆర్‌.ఓ:  వంశీ కాకా



Share this article :