Home » » sanchita bashu Interview About First Day First Show

sanchita bashu Interview About First Day First Show

 'ఫస్ట్ డే ఫస్ట్ షో'ని  ప్రేక్షకులు పక్కాగా ఎంజాయ్ చేస్తారు : సంచిత బషు ఇంటర్వ్యూ



ప్రతిష్టాత్మక పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత‌ ఏడిద నాగేశ్వర‌రావు మ‌నవ‌రాలు శ్రీ‌జ నిర్మాత‌గా, శ్రీ‌జ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌లో నిర్మిస్తున్న యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ `ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో`.  'జాతి రత్నాలు'తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన దర్శకుడు అనుదీప్ కెవి ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. శ్రీకాంత్ రెడ్డి, సంచిత బషు  ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మిత్రవింద మూవీస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఏడిద శ్రీరామ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంశెట్టి ద్వయం దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో హీరోయిన్ సంచిత బషు విలేఖరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.


మీ నేపధ్యం గురించి చెప్పండి ? ఈ ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?

మాది బీహార్. నాకు చిన్నప్పటి నుండి నటన అంటే ఇష్టం. టిక్ టాక్ లో నేను చేసిన వీడియోలు చాలా జనాదరణ పొందాయి. సోషల్ మీడియా వేదికలుగా చేసిన రీల్స్ కి కూడా మంచి గుర్తింపు వచ్చింది. నా వీడియోలు చూసి దర్శకుడు అనుదీప్ గారు ఆడిషన్స్ కి పిలిచారు. అలాగే లుక్ టెస్ట్ చేశారు. కొన్ని రోజుల తర్వాత 'ఫస్ట్ డే ఫస్ట్ షో'  కోసం ఆయన నుండి పిలుపొచ్చింది. నటిని కావాలని వుండేది. కానీ మొదటి సినిమాకే లీడ్ రోల్ లో అవకాశం రావడం నిజంగా చాలా ఆనందంగా వుంది.


అనుదీప్ చిత్రాల్లో కామెడీ ప్రధానంగా వుంటుంది. తెలుగు కామెడీని ఎలా అర్ధం చేసుకున్నారు ?

టిక్ టాక్ వీడియోలు, నటనకు తేడా వుంటుందని నాకు ముందే తెలుసు. టిక్ టాక్ వీడియోలో ఆడియోకి లిప్ సింక్ చేస్తాం. కానీ నటన వచ్చేసరికి వాయిస్, ఫెర్ఫార్మెన్స్ మనదే కావాలి. షూటింగ్ లో మొదటి రోజు చాలా టెన్షన్ పడ్డా. అయితే దర్శకులు ప్రతి డైలాగ్, సీన్ ని చక్కగా అర్ధమయ్యేట్లు వివరించి చెప్పారు. అలాగే  భాషని ప్రాక్టీస్ చేశా. దీంతో నటన సులువైయింది.


తొలి చిత్రానికే ఇద్దరి దర్శకులతో పని చేయడం ఎలా అనిపించింది ?

వంశీ, లక్ష్మీ నారాయణ.. ఇద్దరూ చాలా ఫ్రండ్లీగా వుంటారు. నన్ను చాలా ప్రోత్సహించారు. మంచి సమన్వయంతో ఈ సినిమాని చేశారు. అలాగే శ్రీజ గారు కూడా నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారు. ఎన్నో విలువలైన సలహాలు, సూచనలు ఇచ్చారు.


ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ?

ఈ చిత్రంలో లయ అనే పాత్రలో కనిపిస్తా. 2000 కాలం అమ్మాయిని. లయ పాత్రలో సిగ్గు, అమాయకత్వం వుంటాయి. లయ,  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పెద్ద అభిమాని. ఖుషి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్లు కావాలని తన బాయ్ ఫ్రండ్ ని కోరుతుంది. ఆ టికెట్లు సంపాదించడం చుట్టూ ఈ కథ వుంటుంది. బీహార్ లో కూడా హిందీలో డబ్ చేసిన తెలుగు సినిమాలు చూస్తాం. ఈ సినిమా చేస్తున్నప్పుడే ఖుషి చూశా. నాకు చాలా నచ్చింది. అలాగే అనుదీప్ గారి జాతిరత్నాలు సినిమా కూడా చూశాను. చాలా ఎంజాయ్ చేశాను.


శ్రీకాంత్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

శ్రీకాంత్ చాలా ఫ్రండ్లిగా వుంటారు. షూటింగ్ సమయంలో చాలా ప్రోత్సహించారు.  


ఈ సినిమా చేయడానికి మిమ్మల్ని ఆకర్షించిన అంశం ?

అనుదీప్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన్ని కలసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఆయన సినిమాలో అవకాశం రావడం గొప్ప విషయం. అలాగే పూర్ణోదయ క్రియేషన్స్ ప్రతిష్టాత్మక సంస్థ. వారి నిర్మాణంలో ముఫ్ఫై ఏళ్ల తర్వాత  వస్తున్న ఈ సినిమాలో భాగం అవ్వడం కంటే గొప్ప విషయం ఏముటుంది.


ఫస్ట్ డే ఫస్ట్ షో ఎలా వుండబోతుంది ?

ఫస్ట్ డే ఫస్ట్ షో హిలేరియస్ ఎంటర్ టైనర్. ఫుల్ లెంత్ కామెడీ వుంటుంది. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇది నా తొలి చిత్రం. ప్రేక్షకులు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.


నటిగా తెరపై చుసుకున్నపుడు ఎలా అనిపించింది ?

టిక్ టాక్ వీడియోలు చేసినప్పుడు నా లుక్ పైనే ద్రుష్టి వుండేది. కానీ తొలిసారి థియేటర్ లో చూసుకున్నపుడు చాలా గొప్ప అనుభూతి పొందాను. నాకంటే మా అమ్మగారు ఎక్కువ ఆనందం పొందారు. మా అమ్మ నేషనల్ అథ్లెట్. నా కోసం తన కెరీర్ ని త్యాగం చేసింది. నన్ను చాలా ప్రోత్సహించింది. నాలో తన కలల్ని చూసుకుంది.  నన్ను పెద్ద స్క్రీన్ పై చూసి చాలా ఆనందంగా ఫీలయ్యారు. సోషల్ మీడియాలో నాకు 2.1మిలియన్ ఫాలోవర్స్ వున్నారు.  ఈ సినిమా హిందీ లో కూడా డబ్ అయితే నా ఫాలోవర్స్ కూడా చూసి ఆనందపడతారు. ట్రైలర్ , టీజర్, పాటలు నా ఫాలోవర్స్ కి చాలా నచ్చాయి. ఈ సినిమా కోసం వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


చదువుని కొనసాగిస్తారా ?

మనం ఏ రంగంలో వున్న చదువు చాలా ముఖ్యం. ఇంటర్ పూర్తవుతుంది. దిని తర్వాత డిగ్రీలో జాయిన్ అవుతా.


ఏ హీరోలతో పని చేయాలని అనుకుంటున్నారు ?

ధనుష్, అల్లు అర్జున్, ప్రభాస్ గారంటే చాలా ఇష్టం. వారి సినిమాల్లో పని చేయాలనీ వుంది.


ఎలాంటి సినిమాలు చేయాలని అనుకుంటున్నారు ?

కథ బావుండి నాకు నప్పే పాత్రలు చేయాలని వుంది. పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే సినిమాలంటే ఇష్టం.


ఆల్ ది బెస్ట్

థాంక్స్


Share this article :