Home » » Icon Star Allu Arjun Launched Raja Goutham Break Out Trailer

Icon Star Allu Arjun Launched Raja Goutham Break Out Trailer

 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుదల అయిన రాజా గౌతమ్ 'బ్రేక్ అవుట్' ట్రైలర్



అనిల్ మోదుగ ఫిలిమ్స్ బ్యానర్ పై దిగ్గజ హాస్య నటుడు బ్రహ్మానందం గారి తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో సుబ్బు చెరుకూరి దర్శకత్వంలో అనిల్ మోదుగ నిర్మిస్తున్న చిత్రం  బ్రేక్ అవుట్. బాల కృష్ణ కొండూరి, శ్రీనివాస్ వన్నియాకుల సహా నిర్మాతలు. సర్వైవల్ థ్రిల్లర్ గా తెరకెక్కతున్న ఈ చిత్రం ట్రైలర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుదలైయింది. రెండు నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది,ట్రైలర్ లోఈ చిత్రం కథాంశాన్ని చాలా ఇంటరెస్టింగ్ రివిల్ చేశారు చేసారు అని అల్లు అర్జున్ చిత్ర బృందాన్ని అభినందించి తన బెస్ట్ విషెస్ తెలియజేసారు.

హీరో అనుకోని పరిస్థితిలో వంటరిగా ఒక గ్యారేజ్ లో చిక్కుకుపోతాడు. అతనికి మోనో ఫోబియా అనే మానసిక రుగ్మత వుంటుంది. ఈ ఫోబియా వున్న వారికి వంటరిగా గడపడం అంటే తీవ్ర ఆందోళనకరంగా వుంటుంది. గ్యారేజ్ లో వంటరి గా చిక్కుకున్న హీరో అక్కడి నుండి బయటపడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు ? మోనో ఫోబియాతో  హీరో ఎలాంటి సవాళ్ళని ఎదురుకున్నాడనేది ట్రైలర్ లో బ్రిలియంట్ గా ప్రజంట్ చేశారు .


ట్రైలర్ లో రాజా గౌతమ్ ఫెర్ఫామెన్స్ టెర్రిఫిక్ గా వుంది. అతని లుక్, మేకోవర్ ఆకట్టుకున్నాయి. సాంకేతికంగా ట్రైలర్ ఉన్నతంగా వుంది. జోన్స్ రూపర్ట్ అందించిన నేపధ్య సంగీతం ట్రైలర్ మరో ఆకర్షణగా నిలిచింది. మోహన్ చారీ కెమరాపనితనం ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ సినిమాపై మరింత క్యురియాసిటీని పెంచింది.


చిత్రం శ్రీను, కిరీటి, బాల కామేశ్వరి, ఆనంద చక్రపాణి ఈ చిత్రంలో ఇతర కీలకపాత్రలు పోహిస్తున్నారు.



నటీనటులు ; రాజా గౌతమ్, చిత్రం శ్రీను, కిరీటి, బాల కామేశ్వరి, ఆనంద చక్రపాణి


టెక్నికల్ టీమ్ :

రచన, దర్శకత్వం : సుబ్బు చెరుకూరి

బ్యానర్ : అనిల్ మోదుగ ఫిలిమ్స్

నిర్మాత : అనిల్ మోదుగ

సహా నిర్మాతలు : బాల కృష్ణ కొండూరి, శ్రీనివాస్ వన్నియాకుల

సినిమాటోగ్రఫీ : మోహన్ చారీ

సంగీతం : జోన్స్ రూపర్ట్

పీఆర్వో : తేజస్వీ సజ్జ


Share this article :