Home » » Preminchoddu First Look Launched

Preminchoddu First Look Launched

 ఐదు బాషల్లో వస్తున్న "ప్రేమించొద్దు"  చిత్రం ఫస్ట్ లుక్ విడుదల..



రొటీన్ కు   భిన్నంగా తెరకెక్కిన సినిమా "ప్రేమించొద్దు"(సితెలిసీ తెలియని వయసులో) అనేది ట్యాగ్ లైన్ . టీనేజ్ బ్యాక్ డ్రాప్ కథతో ఐదు భాషల్లో  విడుదల అవుతున్న. మొదటి పాన్ ఇండియన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ".

సిరిన్ శ్రీరామ్ కఫె బ్యానర్ పై అనురుప్, దేవమలిషెట్టి, సనాలి  గర్జె,సారిక, మానస, యశ్వంత్ పెండ్యాల నటీ నటులుగా సిరిన్ శ్రీరామ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కు సిద్ధంగా ఉంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన నటి 

గాయత్రి గుప్త "ప్రేమించొద్దు" ఫస్ట్ లుక్  ను లాంచ్ చేశారు.


గాయత్రి గుప్త మాట్లాడుతూ..నాకు డైరెక్టర్ గత 10. సంవత్సరాలుగా తెలుసు. నన్ను షాట్ ఫిల్మ్స్ ద్వారా  పరిచయం చేసిందే తనే .ఈ సినిమాకు పనిచేసిన వారందరూ నాకు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ టీం తో నేను "బందూక్" సినిమాలో నటించడం జరిగింది. ఐదు భాషల్లో వస్తున్న ప్రేమించొద్దు, సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేసినందుకు  చాలా సంతోషంగా ఉంది . ట్రైలర్ కూడా చాలా బాగా వచ్చింది.ఈ సినిమా చాలా కల్ట్ గా ఉంటుంది. కచ్చితంగా హిట్ అవుతుంది అన్నారు .


చిత్ర దర్శకుడు సిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ..టీనేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి పాన్ ఇండియన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ . తెలుగు, హిందీ బాషలలో ఇది స్ట్రైట్ ఫిల్మ్.   మలయాళం, కన్నడ, తమిళ్ బాషలలో ఈ చిత్రం డబ్ అవుతుంది. తెలుగులో "ప్రేమించొద్దు"  హిందీలో  "ప్యార్ మత్ కర్నా" గా విడుదల అవుతుంది. అలాగే తమిళ్ లో "కాదలి కాదే", కన్నడ లో "ప్రీతీసె బేడ", మలయాళం లో "ప్రణయ కరత్"  టైటిల్స్ తో విడుదల అవుతున్నాయి. మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు. 


చిత్ర హీరో మాట్లాడుతూ.. మా చిత్రం "ప్రేమించొద్దు' ఫస్ట్ లుక్ లాంచ్ కు వచ్చిన గాయత్రి గుప్త కి ధన్యవాదాలు. మా  సినిమాను తెలుగు హిందీ భాషల్లో  బైలింగ్వెల్ గా తీయడం జరిగింది.అలాగే మూడు బాషలలో డబ్బింగ్ చేయడం జరుగుతుంది..ఈ సినిమా మొదటి పాన్ ఇండియన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ గా చెప్పవచ్చు ఈ చిత్రానికి కెమెరా మ్యూజిక్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా వచ్చింది. చైతన్య స్రవంతి  ఈ సినిమాతో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం కాబోతుంది.


నటి సనాలి గర్జె మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా ఇందులో నటిస్తూనే డైరెక్షన్ టీమ్ లో వర్క్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమాను ఐదు లాంగ్వేజ్ లలో రిలీజ్ చేయడం గొప్ప విషయం . నాకిలాంటి మంచి సినిమాలో చేసే అవకాశమిచ్చిన సిరిన్ శ్రీరామ్ గారికి ధన్యవాదాలు అన్నారు .


 ఈ సినిమాను హిందీలో చేస్తున్నప్పుడు మంచి సహకారం అందించిన అనురూప్ కు,సోనాలి కి థాంక్స్ చెపుతున్నాను. అలాగే ఇలాంటి మంచి సినిమాకు పనిచేసే అవకాశమిచ్చిన సిరిన్ గారికి ధన్యవాదాలు అన్నారు.


నటుడు దేవమలిషెట్టి మాట్లాడుతూ.. నా ఫస్ట్ ఫిల్మ్ "బందూక్".చాలా మంది ప్రేమించుకుందాం రా, ప్రేమ కావాలి వంటి సినిమాలు తీస్తారు. కానీ వాటికీ భిన్నంగా "ప్రేమించొద్దు" సినిమా తీస్తున్నారు.మంచి కంటెంట్ ఉన్న మొదటి పాన్ ఇండియన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ లో నేను నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.


నటీ నటులు 

అనురుప్, దేవమలిషెట్టి, సనాలి  గర్జె సారిక, మానస, యశ్వంత్ పెండ్యాల తదితరులు 


సాంకేతిక నిపుణులు 

బ్యానర్ : సిరిన్ శ్రీరామ్ కేఫ్ 

రైటర్, ఎడిటర్,ప్రొడ్యూసర్, డైరెక్టర్ : సిరిన్ శ్రీరామ్ 

డి . ఓ. పి : హర్ష కొండలి 

సంగీతం : చైతన్య స్రవంతి

బ్యాగ్రౌండ్ మ్యూజిక్ : కామరాన్ 

లిరిక్స్ : శ్రీ సాయి కిరణ్

సౌండ్ మిక్సింగ్ : అరవింద్ మీనన్ 

పి. ఆర్. ఓ : లక్ష్మి నివాస్


Share this article :