Home » » Gargi Trailer Launched By Hero Nani and Hero Rana

Gargi Trailer Launched By Hero Nani and Hero Rana

 


సాయి పల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘గార్గి’ ట్రైలర్‌ను విడుద‌ల చేసిన నేచుర‌ల్ స్టార్ నాని, రానా ద‌గ్గుబాటి


ప్ర‌తి చిత్రంలో త‌న‌దైన నేచుర‌ల్ లుక్స్‌, పెర్ఫామెన్స్‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను దోచుకుంటోన్న నేచుర‌ల్ లేడీ స్టార్ సాయి ప‌ల్ల‌వి. తెలుగులో ఆమెకు ఫాలోయింగ్‌, ఫ్యాన్ బేస్‌తో ఆమెను లేడీ సూప‌ర్ స్టార్ అని కూడా పిలుస్తుంటారు. 



రీసెంట్‌గా విడుద‌లైన విరాట‌ప‌ర్వం చిత్రంతో ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను ఆక‌ట్టుకుంది సాయి ప‌ల్ల‌వి. ఇప్పుడ గార్గి అనే మ‌రో వైవిధ్య‌మైన చిత్రంతో మెస్మ‌రైజ్ చేయ‌డానికి సిద్ధ‌మైంది. గౌత‌మ్ రామ‌చంద్ర‌న్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. జూలై 15న ఈ మూవీ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ సినిమా ప్ర‌మోష‌న్స్‌ను వేగ‌వంతం చేశారు. 



ఈ సినిమా నుంచి అంద‌రినీ ఆక‌ట్టుకునే ప్ర‌భావంతమైన ట్రైల‌ర్‌ను బుధ‌వారం నేచుర‌ల్ స్టార్ నాని, రానా ద‌గ్గుబాటి సోష‌ల్ మీడియా వేదికగా విడుద‌ల చేశారు. 


ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే ఇదొక స్కూల్ టీచ‌ర్ జ‌ర్నీ గురించి తెలియ‌జేసే చిత్ర‌మ‌ని తెలుస్తోంది. ఆమె తండ్రిని పోలీసులు అరెస్ట్ చేసిన‌ప్పుడు ఆ రాత్రి ఆమె ఎలాంటి ఇబ్బందుల‌ను ఎదుర్కొంద‌నే ప్ర‌ధాన క‌థాంశం. మేక‌ర్స్ ట్రైల‌ర్‌ను ఆద్యంతం ఆక‌ట్టుకునేలా రూపొందించి విడ‌ద‌ల చేశారు. గోవింద్ వ‌సంత నేప‌థ్య సంగీతం.. ట్రైల‌ర్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లింది. ఇదొక ఇన్‌టెన్స్ కోర్ట్ డ్రామా అని ట్రైల‌ర్‌తో అవ‌గ‌తం అవుతోంది. 


తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో జూలై 15న రిలీజ్ అవుతోన్న ఈ చిత్రానికి గోవింద్ వ‌సంత సంగీతాన్ని అందించారు. ఐశ్వ‌ర్య ల‌క్ష్మి,, ర‌విచంద్ర‌న్ రామ‌చంద్ర‌న్‌, గౌత‌మ్ రామ‌చంద్ర‌న్‌, థామ‌స్ జార్జి త‌దిత‌రులు ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. తెలుగులో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రానా ద‌గ్గుబాటి.. 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య ఈ చిత్రాన్ని త‌మిళంలో ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు.



Share this article :