Home » » Actress Samyuktha Menon Interview About Bimbisara

Actress Samyuktha Menon Interview About Bimbisara

 ఇప్పటి వరకు నేను చేసిన సినిమాల్లో ‘బింబిసార’లో చేసిందే బెస్ట్ క్యారెక్టర్ - సంయుక్తా మీనన్



వైవిధ్యమైన చిత్రాల్లోనటిస్తూ తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌. ఈ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘బింబిసార’. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్. వ‌శిష్ఠ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఆగస్ట్ 5న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సంయుక్తా మీనన్ ఇంటర్వ్యూ విశేషాలు..



- నేను తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నానంటే కార‌ణం.. సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తోన్న తాజా చిత్రం కార‌ణ‌మ‌ని చెప్పాలి. సుకుమార్‌స‌హా మంచి టెక్నీషియ‌న్స్ ఆ సినిమాలో భాగ‌మై ఉన్నారు. ఆ సినిమాలో నా పాత్రకు చాలా ప్రాధాన్య‌త ఉంది. నేను ఇప్పటి వ‌ర‌కు చేసిన సినిమాల్లో అదే బెస్ట్ క్యారెక్టర్ అని చెప్ప‌వ‌చ్చు. నేను చేసిన పాత్ర‌కు మ‌రొక‌రు డ‌బ్బింగ్ చెప్ప‌ట‌మ‌నేది నాకు ఇష్టం లేదు. రేపు నా పాత్ర‌ను నేను స్క్రీన్‌పై చూసుకున్న‌ప్పుడు దాన్ని ఓన్ చేసుకోగ‌ల‌గాలి. భాష తెలియ‌కుండా న‌టిస్తే ఆ పాత్ర‌తో ఉన్న క‌నెక్ష‌న్‌లో యాబై శాతాన్ని కోల్పోతాన‌ని భావించాను నా క్యారెక్ట‌ర్స్ విష‌యంలో నేను స్వార్థ‌ప‌రురాలిన‌నే చెప్పుకోవాలి. నా పాత్ర‌ల‌ను నేను అంతగా ప్రేమిస్తాను. అందుక‌నే నేను తెలుగు నేర్చుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాను. మ‌నం తెలుగులో మాట్లాడిన‌ప్పుడు మ‌న‌తో ఇత‌ర యూనిట్ సభ్యుల‌కు తెలియ‌ని ఓ అనుబంధం ఏర్ప‌డుతుంది.  ఆ విషయాన్ని నేను బ‌లంగా న‌మ్ముతాను. అందుక‌ని ప్రత్యేకంగా ట్యూట‌ర్‌ని పెట్టుకుని లాక్ డౌన్ స‌మయంలో తెలుగు నేర్చుకున్నాను.


- నేను యాక్ట‌ర్ కావాల‌ని ఎప్పుడూ అనుకోలేదు. చ‌దువు పూర్త‌యిన త‌ర్వాత జాబ్ చేయాల‌ని భావించాను. అయితే న‌టిగా అవ‌కాశం వ‌చ్చింది. తెలుగులో న‌టించ‌డానికి చాలా స‌మ‌యం ప‌ట్టింది. చాలా మంది ఎందుక‌ని తెలుగులో చేయ‌టం లేద‌ని కూడా అడిగారు. అయితే నిజానికి రెండు, మూడు సినిమాల‌కు ఆడిష‌న్ జ‌రిగినా అవి వ‌ర్క‌వుట్ కాలేదు.


- లాక్ డౌన్ త‌ర్వాత తెలుగు సినిమా నుంచి వ‌చ్చిన అవ‌కాశం బింబిసార‌. సినిమాను రెండు భాగాలుగా చేయ‌బోతున్నామ‌ని డైరెక్ట‌ర్ వ‌శిష్ట చెప్పారు. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ 15వ చిత్రంలో అవకాశం వచ్చింది. తర్వాత భీమ్లా నాయక్ సినిమా ఛాన్స్ వచ్చింది. ఒకే రోజు రెండు సినిమాలు (భీమ్లా నాయ‌క్‌, ధ‌నుష్ మూవీ సార్‌ ) సైన్ చేశాను. ఎవ‌రూ ఊహించ‌లేదు. మా అమ్మ‌గారైతే ఆశ్చ‌ర్య‌పోయారు.


- బింబిసార టైమ్ ట్రావెల్ మూవీ. ఇందులో ఫ్లాష్ బ్యాక్‌, ప్ర‌స్తుతం సాగే క‌థ అని రెండు భాగాలుంటాయి. అందులో ప్రెజంట్ అంటూ సాగే స్టోరిలో నా పాత్ర క‌నిపిస్తుంది. కాస్త మోడ్ర‌న్‌గా కనిపించే పాత్ర‌.


- నాకు పీరియాడిక్ సినిమాలంటే చాలా ఇష్టం. డైరెక్ట‌ర్ వ‌శిష్ట ఈ క‌థ చెప్ప‌గానే నాకు అందులో పాత్ర చేయాల‌నిపించింది. అది డ్రీమ్ కూడా. ఆ విష‌యంలో కాస్త బాధ‌గా కూడా అనిపించింది.


- క‌ళ్యాణ్‌రామ్‌గారి క‌ళ్ల‌లో చాలా ప‌వ‌ర్ ఉంది. ఆయ‌న మాట‌ల కంటే ముందు క‌ళ్ల‌తోనే మాట్లాడుతారు. ఆయన్ని బింబిసారుడి పాత్ర‌లో చూడ‌గానే న‌చ్చేశారు. గంభీరంగా క‌నిపించారు. చాలా మంచి వ్య‌క్తి. షూటింగ్ అంతా పూర్త‌యిన తర్వాత న‌న్ను ప్ర‌త్యేకంగా క‌లిసి మీరు మా సినిమాలో భాగ‌మైనందుకు చాలా ఆనందంగా ఉంద‌ని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు నాకెవ‌రూ అలా చెప్ప‌లేదు.


- మ‌ల‌యాళంలో సినిమాల‌ను చ‌క‌చ‌కా పూర్తి చేసేస్తుంటారు. ఈ ఏడాది నేను చేసిన భీమ్లా నాయ‌క్‌, బింబిసార, క‌డువా, సార్‌.. నాలుగు చిత్రాల్లో 20 రోజుల చొప్పున వ‌ర్క్ చేశాను. నాకు ఖాళీగా ఉండ‌టం ఇష్టం ఉండ‌దు. సినిమాలు చూస్తాను. లేదా పెద్ద స్టార్స్ ఇంట‌ర్వ్యూలు చూస్తుంటాను. స‌క్సెస్‌ఫుల్ ఎలా అయ్యార‌ని ఆలోచిస్తుంటాను. సినిమాలంటే అంత ప్యాష‌న్ నాకు.


- తెలుగు ప్రేక్ష‌కులు చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంటారు. సినిమాలను చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఎమోష‌న్స్‌ను చ‌క్క‌గా చూపెడ‌తారు. మాస్ సినిమాల్లో అరిచి గోల పెడుతారు. యాక్ట‌ర్స్‌ను ఓన్ చేసుకుంటారు.


- గ్లామ‌ర్‌ను డ్రెస్‌తో క‌నెక్ట్ చేసి చూడ‌టం త‌ప్పు అనేది నా భావ‌న‌.


- ఇలాంటి పాత్ర‌లే చేయాల‌ని ముందుగా ఆలోచించ‌లేదు. న‌టిగా మంచి పాత్ర‌ల‌తో గుర్తుండిపోవాల‌ని అనుకుంటున్నాను.


- డైరెక్ట‌ర్ వ‌శిష్ట ఎన‌ర్జీ న‌చ్చుతుంది. ఖాళీగా కూర్చోరు. సెట్ అంతా తిరుగుతుంటారు. క‌రెక్ష‌న్స్ చెబుతుంటారు.


- మ‌ల‌యాళంలో ఓ భారీ చిత్రంలో న‌టిస్తున్నాను. ఆ వివ‌రాల‌ను ఇప్పుడే చెప్ప‌లేను. తెలుగులో సార్ సినిమా చేస్తున్నాను. ఓ సాంగ్ మిన‌హా నా పాత్ర‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది.



Share this article :