Parampara 2 Creats Record With Digital Views

 డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో 250 మిలియన్ మినిట్స్ వ్యూస్ తో 'పరంపర' 2 వెబ్ సిరీస్ రికార్డ్



డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో లేటెస్ట్ సెన్సేషన్ అవుతోంది 'పరంపర 2' వెబ్ సిరీస్. ఈ నెల 21న స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ వెబ్ సిరీస్ కు ఓటీటీ లవర్స్, క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. కథను ఎమోషనల్ గా డ్రైవ్ చేయడంలో దర్శకులు ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ సక్సెస్ అయ్యారు. నిర్మాతలుగా శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని అభిరుచి మరోసారి విజయాన్ని అందుకుంది. 


పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'పరంపర 2' వెబ్ సిరీస్ కు ఇప్పటిదాకా 250 మిలియన్ మినిట్స్ వ్యూస్ రావడం ఒక రికార్డ్ గా చెబుతున్నారు. మూడు జెనరేషన్స్ కి సంబంధించిన కథతో రూపొందిన పరంపర 2... మొదటి సీజన్ సక్సెస్ ను మరో మెట్టుకు తీసుకెళ్లింది. ఈ సెకండ్ సీజన్ లోని  స్ట్రాంగ్ ఎమోషన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. పది సినిమాలకు కావాల్సినంత స్టఫ్ ఈ వెబ్ సిరీస్ లో ఉంది అని టీమ్ చెబుతూ వస్తున్న మాటలు ఇవాళ నిజమయ్యాయి.

Post a Comment

Previous Post Next Post