Home » » The Consulate general of the Republic of Turkey & VijayaKrishna Green Studios lead by Dr.VK Naresh meet

The Consulate general of the Republic of Turkey & VijayaKrishna Green Studios lead by Dr.VK Naresh meet



హైదరాబాద్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ టర్కీ కాన్సులేట్ జనరల్ హెచ్ఈ ఓర్హాన్ యల్మాన్ ఓకాన్, డాక్టర్ వికె నరేష్, ఛైర్మన్ -విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్, UN I.G.O ICRHRP, కాన్సుల్, కో-చైర్ ఫర్ ఆర్ట్స్ అండ్ కల్చర్ సంయుక్తంగా టర్కీలో షూటింగ్‌లకు తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఆహ్వానిస్తూ ఒక కార్యక్రమాన్ని రూపోందించారు


దీనికి సంబంధించి  జూన్ 12, 2022 ఆదివారం నాడు ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డైరెక్టర్స్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మొదలైన చిత్ర పరిశ్రమలోని వివిధ విభాగాల హెడ్స్ తో ఇంటరాక్టివ్ సెమినార్‌ని నిర్వహించారు. సినిమా రంగానికి చెందిన వివిధ విభాగాలకు చెందిన ప్రముఖులు, యువ దర్శకులు, సినిమాటోగ్రాఫర్‌లు, నిర్మాతలు, ఫోటోగ్రఫీ విభాగం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


పాండమిక్ తర్వాత  విదేశాలలో షూటింగ్ జోరందుకుంది. ఈ సందర్భంలో తెలుగు సినిమా పరిశ్రమ సంక్షేమంలో చురుకుగా పాల్గొంటున్న డాక్టర్ నరేష్ ఈ అంశంలో కూడా పరిశ్రమను చేయూతనివ్వడానికి ఈ కార్యక్రమం చేపట్టారు.


డాక్టర్ నరేష్ , ఇతర ప్రముఖులు సూచించిన వివిధ ప్యాకేజీలను హైదరాబాద్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ టర్కీ స్వాగతించారు. ఇప్పటికే కొన్ని షూటింగ్‌లు షెడ్యులయ్యాయి, వచ్చే వారంలో  ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్‌లోని రిపబ్లిక్ ఆఫ్ టర్కీ కాన్సుల్ జనరల్, హెచ్ఈ  ఓర్హాన్ యల్మాన్ ఓకాన్, తెలుగు చలనచిత్ర పరిశ్రమను కనెక్ట్ చేయడంలో సాంస్కృతిక రాయబారిగా డాక్టర్ నరేష్ చేస్తున్న ఈ చొరవను ప్రశంసించారు.

టర్కీ లో సౌత్ ఇండియా చిత్రాలని ప్రోత్సహించడంలో పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ  ఇచ్చారు. అలాగే వీసా ఏర్పాట్లను సత్వరంగా చేస్తామని తెలియజేశారు. సినిమా పరిశ్రమకు మరింత సహాయపడే టర్కీ ప్రభుత్వ ఆర్థిక ప్రయోజనాలు/విధానాల గురించి కూడా ఆయన వివరించారు. 30% వరకు రాయితీలు,  టర్కీలో చేసిన ఖర్చులకు 18% వాట్ వాపసు కూడా ఆర్ధిక ప్రయోజనాల్లో వున్నాయి. ఫిల్మ్ పర్మిట్‌ల కోసం సింగిల్ విండో సిస్టమ్‌, అందరికీ సులభంగా ఉపయోగపడే  వీలుగా www.filminginturkey.com.tr వైబ్ సైట్ ఏర్పాటు చేయడాన్ని కార్యక్రమంలో పాల్గొన్నవారు ప్రశంసించారు.


డాక్టర్ నరేష్ మాట్లాడుతూ..  కాన్సులేట్ అందించిన సహకారం స్ఫూర్తిదాయకంగా వుందని, ఫిల్మ్ ఇండస్ట్రీ , టర్కి పరస్పర ప్రయోజనాల కోసం దీనిని మరింత ముందుకు తీసుకువెళతానని హామీ ఇచ్చారు. మరికొన్ని దేశాలు కూడా దీని గురించి సంప్రదింపులు జరుపుతున్నాయని, ఈ గొప్ప కార్యక్రమంలో భాగమైనందుకు ఆనందంగా ఉందని వెల్లడించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఇండస్ట్రీ ప్రముఖులు, ఇతరులకు ధన్యవాదాలు తెలిపారు. చరిత్రలో నిలిచిపోయే ప్రయత్నమిదని పేర్కొన్నారు.  


Share this article :