Home » » Software Blues Trailer Launched by Director Krish

Software Blues Trailer Launched by Director Krish

 "సాఫ్ట్ వేర్ బ్లూస్" రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు క్రిష్  ..జూన్ 24 న గ్రాండ్ రిలీజ్




శ్రీరాం, భావనా, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్. రాజు, బస్వరాజ్ నటీనటులుగా ఉమా శంకర్ దర్శకత్వంలో సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పతాకంపై నిర్మిస్తోన్న చిత్రం “సాఫ్ట్ వేర్ బ్లూస్”. ఇటీవలే ఈ చిత్ర రిలీజ్ ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేయడం జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ 24 న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా 



దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ.. సాఫ్ట్ వేర్ బ్లూస్” అంటే పెద్ద పెద్ద బిల్డింగ్ లు లక్షల లో శాలరీలు, అమ్మాయిలు పబ్బులు కాదు దూల తీరపోద్ధిరా.. రే.. అనే డైలాగ్ ఉన్న ట్రైలర్ చూస్తుంటే చాలా హిలెరియస్ గా ఎగ్జైటింగ్ గా ఉంది. సాఫ్ట్ వేర్ లో జరిగే చిన్న చిన్న గమ్మత్తులు వారి జీవితాల గురించి చాలా చక్కగా  తెరకెక్కించిన దర్శకుడు ఉమాశంకర్ కు అల్ ద  బెస్ట్ .ఈ చిత్రంలో శ్రీరాం, భావనలు చాలా క్యూట్ గా కనిపించినా చాలా చక్కగా నటించారు.కరోనా ప్యాండమిక్ దగ్గరనుండి ఇప్పటి వరకు అన్ని ప్రాబ్లెమ్స్ ను దాటుకొని ఈ నెల 24 న థియేటర్స్ లలో  విడుదల అవుతున్న ఈ సినిమా పెద్ద విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.



దర్శకుడు ఉమాశంకర్ మాట్లాడుతూ*...ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ ను మంత్రి కె.టి.ఆర్ గారు, మరియు రిలీజ్ ట్రైలర్ ను, దర్శకుడు క్రిష్ గారు విడుదల చేసి సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్ చాలా బాగుంది అని మెచ్చుకున్నారు . అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల కు సిద్దమైన ఈ చిత్ర ప్రమోషన్స్ బాగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు



సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ వి.కె రాజు మాట్లాడుతూ.. సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్ లో  “సాఫ్ట్ వేర్ బ్లూస్”పేరుతో ఔట్ ఔట్ కామెడీ ఏంటర్ టైన్మెంట్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి వస్తున్నా ఈ చిత్రాన్ని జూన్ 24 న విడుదల చేస్తున్నాము అన్నారు.



నటీ నటులు

శ్రీరాం, భావన చౌదరి ,ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్.రాజు, బస్వరాజ్   తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి 


సాంకేతిక నిపుణులు

నిర్మాతలు: సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్

కథ ,కథనం, దర్శకత్వం: ఉమాశంకర్

సంగీతం: సుభాష్ ఆనంద్,

సినిమాటోగ్రఫీ: నిమ్మ గోపి,

ఎడిటర్: వి.కె.రాజు


Share this article :