Home » » Monagadu Releasing on June 17th

Monagadu Releasing on June 17th

 ఈ నెల 17న గ్రాండ్ గా విడుద‌ల‌వుతోన్న `మొన‌గాడు`



       కీలుగుఱ్ఱం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఆకుల వంశీ, పావని, దేవ్ గిల్,  ఛ‌త్రపతి శేఖర్ మొదలగువారు నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం  మొనగాడు . వంశీ ఆకుల స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత వంశీ ఆకుల మాట్లాడుతూ...``ల‌వ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా మొన‌గాడు చిత్రాన్ని తెర‌కెక్కించాం. అన్ని కార్య‌క్ర‌మ‌లు పూర్తి చేసుకుని  ఈ నెల 17న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. ఇంద‌లో దేవ్ గిల్‌, ఛ‌త్ర‌ప‌తి పాత్ర‌లు చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటాయి. నాలుగు ఫైట్స్, రెండు పాట‌లు ఆద్యంతం ఆక‌ట్టుకుంటాయి. మా చిత్రాన్ని ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని ఆశిస్తున్నాం`` అన్నారు.

  దేవ్‌గిల్‌, ఛ‌త్ర‌ప‌తి శేఖ‌ర్‌, రాజ‌శేఖ‌ర్‌,  కోమ‌ల్ జా,  చిట్టిబాబు త‌దితరులు న‌టించిన ఈ చిత్రానికి  సినిమాటోగ్రాఫ‌ర్ః ఉద‌య్ భాస్క‌ర్‌; సంగీతంః ర్యాప్ రాక్ ష‌కీల్‌; ఎడిట‌ర్ః బొంతాల నాగేశ్వ‌ర‌రెడ్డి;  ఫైట్స్ః దేవ‌రాజ్ నూనె;  సౌండ్ ఎఫెక్ట్స్ః య‌తిరాజ్‌;  కొరియోగ్ర‌ఫీః రాధ‌;  నిర్మాత-ద‌ర్శ‌కుడుః  వంశీ ఆకుల‌.


Share this article :