‘అన్ని ఓ గురుతులు’ చిత్రానికి మంచి గుర్తింపు !!!
టిఒఎఫ్ టవర్ వన్ ఫిలిమ్స్ బ్యానర్ పై సంతోష్ రావ్ ప్రెజెంట్స్ లో వంకాయల దివాకర్, కసం తేజ , మాస్టర్ శ్రీ నిక్షిత్, బేబీ మిక్కీ, నాగరాణి రెడ్డి ప్రధాన పాత్రలుగా వెంకట్ చల్లగుండ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్ని ఓ గురుతులు ’
పుట్టుకతోనే మన జీవితంతో ఎన్నో బంధాలు పెనవేసుకుపోతాయి. ప్రతి బంధం ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. నేనున్నాను అనే ధైర్యాన్ని ఇస్తుంది. ఒక నిజమైన తోడుగా ఉంటానని నమ్మకాన్ని కలిగిస్తుంది కానీ నీ అసలైన తోడు ఎవరు అనేది తెలిసే సరికి జీవితం మొత్తం ఖర్చు అయ్యుంటుంది. ప్రతి మనిషికి కడదాకా ఉండే అసలైన తోడు ఎవరో చెప్పే ప్రయత్నమే ఈ ‘అన్నీ ఓ గురుతులు‘ సినిమా.
ఈ సినిమా పలు ఫిలిం ఫెస్టివల్స్ లో పది అవార్డ్స్ ను సొంతం చేసుకుంది, మంచి కథ బలం ఉన్న ఈ సినిమా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షస్తుంది, చిత్ర యూనిట్ కు అభినందనలు వెళ్లువెత్తుతున్నాయి.
పారాడైస్ ఫిలిం ఫెస్టివల్, అమెరికా - జనవరి 2026 కు అధికారికంగా ఎంపిక అయ్యింది, వరల్డ్ ఇండై ఫిలిం అవార్డ్స్, యుకె - జనవరి - బెస్ట్ ఫిలిం విన్నర్, వరల్డ్ ఫిలిం ఫెస్టివల్, కెన్స్ - విన్నర్ బెస్ట్ ఇండియన్ ఫిలిం, పూంబుకర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ ఫిలిం గా అవార్డ్స్ గెలుచుకుంది, జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా అవార్డు లభించింది, స్వీడెన్ ఫిలిం అవార్డ్స్ లో ఫైనలిస్ట్ గా చేరుకుంది, టి. హెచ్. ఈ ఫిలిం ఫెస్టివల్, అమెరికా లో అధికారికంగా సెలెక్ట్ అయ్యింది, ఫ్లైట్ డెస్క్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో అధికారకంగా సెలెక్ట్ అయ్యింది... అన్ని ప్రతిష్టాత్మక IMDB సర్టిఫైడ్ అర్హత పొందినవి
ఈ చిత్రానికి దర్శకత్వం వెంకట్ చల్లగుండ్ల, కెమెరామెన్ చక్రి కనపర్తి, ఎడిటర్ దుర్గ నరసింహ, సంగీతం అబు, ఎస్ఎఫ్ఎక్స్ సాయి మణిధర్ రెడ్డి


Post a Comment