Home » » Ramcharan’s Archarya Interview

Ramcharan’s Archarya Interview



“ఆర్ఆర్ఆర్” లో రామరాజు, “ఆచార్య”లో సిద్ధ క్యారెక్టర్స్ మధ్య వేరియేషన్ చూపించడం చాలెంజింగ్ గా లేదంటే అది అబద్ధమే.. అలా అని  చాలా ఇష్టమైన పాత్ర వచ్చినప్పుడు కష్టమనిపించదు చేస్తాం అంటున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.శ్రీమతి సురేఖ కొనిదల సమర్పణలో  కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మెగాస్టార్ చిరంజీవి ,కాజల్ అగర్వాల్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,పూజా హెగ్డే హీరో హీరోయిన్లు గా కొరటాల శివ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి,అన్వేష్ రెడ్డిలు నిర్మించిన చిత్రం “ఆచార్య”.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని  ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 29న గ్రాండ్ విడుదల చేస్తున్నారు .ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్  పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ …




ఈ సినిమా లాంచింగ్ అయినప్పుడు ఆచార్య లో నా పాత్ర లేదు నేను నిర్మాతగా ఈ ప్రాజెక్టు లోకి ఎంటర్ అయ్యాను తప్ప నా క్యారెక్టర్ ఉంటుంది అని అస్సలు ఊహించలేదు కానీ తర్వాత సినిమాలో చిన్న పాత్ర 15 నిమిషాల  నిడివిగల పాత్ర చేయమని చెప్పారు.నాన్నగారితో సినిమా కావడంతో వెంటనే ఓకే చేశాను ఆ తర్వాత నా పాత్ర పెరిగడంతో అది కాస్త 45 నిమిషాలకు చేరింది.దాంతో  నేను సెకండాఫ్ అంతా కనిపిస్తాను


యు.వి.క్రియేషన్స్ లో మిర్చి వచ్చినప్పటినుంచి కొరటాల శివతో సినిమా చేద్దామని అనుకున్నాం ఈ చిత్రంతో సెట్ అవ్వడంతో ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ అయ్యింది. ఈ 20 ఏళ్లలో మా నాన్నను చూసి ఏం నేర్చుకున్నానో తెలియదు కానీ “ఆచార్య” చిత్రీకరణ కోసం మారేడుమిల్లి అడవులలో ఉన్న ఇరవై రోజులు ఇద్దరం ఒక కాటేజ్ లో ఉన్నాం. కలిసి వ్యాయామం, భోజనం చేశాం ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. ఇద్దరి మధ్య ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. నా జీవితంలో మరచిపోలేని రోజులవి. .సినిమా విజయం సాధిస్తే ఎలా ఉండాలి? పరాజయం పాలైతే ఎలా ఉండాలి? అనే విషయాలు నాన్న నుంచి నేర్చుకున్నాను




రాజమౌళి గారు బొమ్మరిల్లు ఫాదర్ లాంటి వారు ఆయన సినిమా అంగీకరించామంటే అది పూర్తయ్యేవరకు ఆర్టిస్ట్ చేయి వదలడు. కానీ సిద్ధ పాత్ర గురించి కొరటాల శివ గారు రాజమౌళి గారికి చెప్పారు.ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యతను రాజమౌళిగారు గుర్తించి .ఆర్ఆర్ఆర్ లో ఉన్న నన్ను నువ్వు “ఆచార్య” చేస్తే బావుంటుందని రాజమౌళి డేట్స్ ఇచ్చారు. మా నాన్న మీద గౌరవంతో అమ్మ సురేఖ డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆచార్య చేసేందుకు నాకు అవకాశం ఇచ్చారు రాజమౌళి గారు. నాన్నతో కలిసి ఈ సినిమాలో పూర్తిస్థాయిలో నటించడం చాలా ఆనందంగా ఉంది నాన్నతో కలిసి నటించే ఇలాంటి అద్భుతమైన అవకాశం వస్తుందో రాదో తెలియదు..ఇలాంటి అవకాశం కల్పించిన రాజమౌళి గారికీ,కొరటాల శివకు రుణపడి ఉంటాను.




ఈ సినిమాలో నాన్నగారిది నా పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటాయి. నాన్నగారు నా పాత్రకు చాలా తేడా ఉంటుంది. కానీ అంతిమంగా ఇద్దరం ధర్మం కోసమే  నిలబడతాము. నేను ధర్మస్థలి లోని గురుకులంలోని యువకుడిగా నటించాను.నాన్న గారు ఫైటర్ లా కనిపిస్తారు.అయితే ధర్మం ఇద్దరూ ఎలా కలుస్తారు? అధర్మం పై ఎలాంటి పోరాటం చేస్తారు అనేది దర్శకుడు శివ అద్భుతంగా చూపించాడు.




నేను ఈ సినిమాల్లోకి వచ్చాక ఎక్కడ కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. సినిమాలోని అన్ని కూడా చాలా సహజంగా ఉంటాయి తప్ప ఎక్కడ కూడా కావాలని జత చేసిన సీన్స్ ఇందులో ఉండవు. పూజ హెగ్డే చాలా బాగా నటిస్తుంది ముందుగా రంగస్థలంలో సాంగ్ చేశాం అప్పుడు ఆచార్య విడుదల ఇప్పుడు ఆచార్య విడుదల తర్వాత మా కెమిస్ట్రీ అవుతుందో ప్రేక్షకులు చూస్తారు


ఆర్ఆర్ఆర్ లో రామరాజు గా ఇటు ఆచార్యలో సిద్ధ క్యారెక్టర్స్ మధ్య వేరియేషన్ చూపించడం చాలెంజింగ్ గా లేదంటే అబద్ధమే.. అలా అని  చాలా ఇష్టమైన పాత్ర వచ్చినప్పుడు కష్టమనిపించదు చేస్తాం.ఈ సినిమా నాకు మరింత బాధ్యతను పెంచింది.”ధ్రువ”, “రంగస్థల”, “ఆర్ఆర్ఆర్” నా మనసుకు దగ్గరైన చిత్రాలు.ఆ కోవలో నిర్మించిన ఆచార్య సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది. ముఖ్యంగా కథను ఎంచుకోవడంలో ఏదిపడితే అది కాకుండా తక్కువ సినిమాలే అయినా మంచి సినిమాలుచేయాలనే బాధ్యత వచ్చింది.




నాన్నతో కలిసి మా లో 45 నిమిషాల నిడివి ఉన్న పాత్ర చేసేందుకు నాకు 13 ఏళ్ళు పట్టింది అలాంటిది ఆయనతో పూర్తిస్థాయి నిడివి ఉన్న పాత్ర అంటే ఇంకా చాలా సమయం పడుతుంది. ఆచార్య లో నాన్నగారితో కలిసి నటించడం చాలా గర్వంగా అనిపిస్తుంది.


ఫ్యాన్ ఇండియా రిలీజ్ అనేది ముందుగా అనుకోలేదు ఇటీవల వచ్చిన పుష్ప,ఆర్ఆర్ఆర్, కే జి.యఫ్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అయిన తర్వాత ఇప్పుడు ఆ ఆలోచన వచ్చినా ఇప్పుడు టైం లేదు. ఇతర భాషల్లోనూ నేనే డబ్బింగ్ చెప్పాలనేది నాకోరిక. అందుకే కొంత టైమ్ తీసుకుని కొద్ది నెలల తర్వాత రిలీజ్ చేస్తాం .




మా బ్యానర్ లో పవన్ కళ్యాణ్ సినిమా పవన్ కళ్యాణ్ గారి బ్యానర్ లో నా సినిమా కచ్చితంగా ఉంటాయి కానీ ఇద్దరికీ కుదిరినప్పుడే ఈ సినిమాలు ఉంటాయి. ఆయన ఇప్పుడు చాలా ప్రాజెక్టు ఓకే చేశారు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు.శంకర్ గారి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా 60 రోజుల షూటింగ్ పూర్తయింది ఆ సినిమా తర్వాత గౌతమ్ తిన్న నూరితో సినిమా చేస్తున్నాను. ఏ బాలీవుడ్ డైరెక్టర్ అయినా నాకు సరిపోయే పాత్ర తీసుకొస్తే హిందీలో కూడా కచ్చితంగా సినిమా చేస్తాను బాలీవుడ్లో ఈ తరహా సినిమాలు చేయాలి అని ఏమీ లేదు అని ముగించారు.





Share this article :