Home » » Raising Hands Production No1 Shooting is going on in Brisk Pace

Raising Hands Production No1 Shooting is going on in Brisk Pace

 శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 చిత్రం !!!



రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 1 చిత్రం ప్రారంభోత్సవం ఇటీవల హైదరాబాద్ లోని ఫిలిం నగర్ సాయిబాబా టెంపుల్ లో గ్రాండ్ గా జరిగింది. లక్ష్మణ్ , కిశోరి దాత్రక్ హీరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా డి.నాగ శశిధర్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 


ఈ చిత్ర షూటింగ్ కర్నూల్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే దాదాపు డెబ్భై శాతం షూటింగ్ పూర్తి అయినట్లు చిత్ర యూనిట్ తెలిపారు. ఈ వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలని చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. కామెడీ ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథ కథనాలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి. త్వరలో ఈ చిత్ర టైటిల్ ఫస్ట్ లుక్ విడుదల కానుంది.



నటీనటులు: లక్ష్మణ్, కిశోరి దాత్రక్, ఢిల్లీ రాజేశ్వరి, కృష్ణమూర్తి, సందీప్ వారణాశి, గురుస్వామి.


సాంకేతిక నిపుణులు:

బ్యానర్: రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్

నిర్మాతలు: పార్థ సారధి, డి. నాగేందర్ రెడ్డి, వి.కృష్ణలక్ష్మి

కెమెరామెన్: అరుణ్ కుమార్ పర్వతనేని

మ్యూజిక్: రుద్ర కిరణ్

ఎడిటర్: ప్రణీత్ కుమార్

సౌండ్ డిజైన్: సాయి మనిందర్ రెడ్డి

లిరిక్స్: శేఖర్ రాజు విజయ భట్టు

రచన, దర్శకత్వం: డి.నాగ శశిధర్ రెడ్డి.


Share this article :