ChesmaRaja Selfi Rani In Post Production Works

 పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ".చెష్మా రాజ - సెల్ఫీ రాణి"



రాగిణి క్రియేషన్స్ పతాకంపై వీరేంద్ర బాబు, సంచిత నూతన నటీనటులుగా గౌతమ్ కృష్ణ దర్శకత్వంలో పి. శ్రీనివాసరావు, రామ్ అవధానం లు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న రెండవ చిత్రం " చెష్మా రాజ - సెల్ఫీ రాణి" .ఈ  చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న సందర్భంగా 



చిత్ర నిర్మాతలు పి. శ్రీనివాసరావు, రామ్ అవధానం మాట్లాడుతూ... కామెడీ, హారర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ఘనశ్యామ్ సంగీతం, ప్రేమ రక్షిత్ కొరియోగ్రఫీ, హైలెట్ గా నిలుస్తుంది. చెన్నై అడయార్ ఫిలిం ఇన్స్టిట్యూషన్ లో ఫోటోగ్రఫీ లో గోల్డ్ మెడల్ సాధించిన గౌతమ్ కృష్ణ ఈ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.మార్షల్ ఆర్ట్స్ ,డాన్స్ లో శిక్షణ పొందిన వీరేంద్రబాబు యాక్షన్ సన్నివేశాలలో పాటల్లో చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. సీనియర్ నటుడు గౌతమ్ రాజు కామెడీ సీన్స్ చాలా బాగా వచ్చాయి. జబర్దస్త్ రాజమౌళి మంచి క్యారెక్టర్ తో అలరించబోతున్నాడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని అన్నారు .



నటీనటులు

వీరేంద్ర బాబు, సంచిత,కవిత,కుసుమ్,గౌతమ్ రాజు,జబర్దస్త్ రాజమౌళి ,రామ్ అవధానం తదితరులు


సాంకేతిక నిపుణులు

బ్యానర్ : రాగిణి క్రియేషన్స్

నిర్మాతలు : పి శ్రీనివాసరావు, రామ్ అవధానం

కెమెరా,డైరెక్షన్ : గౌతమ్ కృష్ణ

మ్యూజిక్ : ఘన్ శ్యామ్

సినిమాటోగ్రఫీ : ప్రేమ రక్షిత్ మాస్టర్, తాజ్ మాస్టర్

పి.ఆర్.ఓ : మధు వి.ఆర్

Post a Comment

Previous Post Next Post