Home » » 1000 Moons Infra Launched By Nara Rohit and Sree Vishnu

1000 Moons Infra Launched By Nara Rohit and Sree Vishnu

 నారా రోహిత్, శ్రీ విష్ణు (హీరో మిత్రుల) చేతుల మీదుగా థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా ఘన ప్రారంభం2022, ఫిబ్రవరి 21న హైదరాబాద్ లోని తాజ్ బంజారా హోటల్ లో సరికొత్త రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన 'థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా' యొక్క లాంచ్ వైభవంగా జరిగింది. ఈ  కార్యక్రమాన్ని జ్యోతిష్యశాస్త్ర ప్రముఖులు, శ్రీ బాలు మున్నంగి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇక ప్రముఖ నటులు నారా రోహిత్ గారు, శ్రీ విష్ణు గారు ముఖ్య అతిథులుగా వీచ్చేసి ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ యొక్క ప్రారంభోత్సవం చేశారు.


ఒక వ్యక్తి తన జీవితంలో వెయ్యి పౌర్ణమి చంద్రులను చూస్తే అది ఒక సంపూర్ణ జీవితం అవుతుంది, అనగా 81 ఏళ్ళు జీవితాన్ని అనుభవించినట్టు. అలా మీ సహస్ర పూర్ణ చంద్రోదయాల వరకు గుర్తుండిపోయే ఒక చక్కటి జ్ఞాపకాన్ని అందించడమే ఈ థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా యొక్క ప్రధాన ఉద్దేశ్యం.


'1000 మూన్స్ ఇన్ఫ్రా' స్థాపకులు 15 ఏళ్ళ అపారమైన వ్యాపార అనుభవం కలిగి, ఎన్నో రకాల వ్యాపారాలలో సృజనాత్మకమైన పనితీరుతో విజయాలు సాధించడం జరిగింది. కాగా, ఇప్పుడు ఈ రంగంలో కూడా తమదైన ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రాతో ప్రతీ ఒక్కరి అనుభవం ఎంతో కళాత్మకంగా, ఆనందాయకంగా ఉండాలనేది ఈ కంపెనీ యొక్క ముఖ్య ధ్యేయం. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ యొక్క అతిపెద్ద ప్రాజెక్టు మోమిన్ పేట సమీపంలో మొదటగా మీకు అందుబాటులోకి వస్తుంది. 

 

ఈ ప్రారంభోత్సవానికి అతిథులుగా వచ్చిన శ్రీవిష్ణు మాట్లాడుతూ, "వీరితో నాది చాలా ఏళ్ళ పరిచయం. వీరి పనితీరు చాలా క్రియేటివ్ గా ఉంటుంది. ఇప్పటి వరకు వాళ్ళు పట్టిందల్లా బంగారమే అయింది, ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా' కూడా అంతకుమించి లెవెల్ లో ఉంటుందనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు" అని అన్నారు. ఇక నారా రోహిత్ మాట్లాడుతూ, "థౌసండ్ మూన్స్ ఇన్ఫ్రా అనే ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ పేరు రానున్న రోజుల్లో గట్టిగా వినిపించే పేరు అవుతుంది, ఎందుకంటే, దాని వెనుక ఉన్నవారి అనుభవం గానీ, స్కిల్ గానీ అలాంటిది. వాళ్ళు ఏది చేసినా కొత్తగా ఉంటుంది, సర్వీస్ ఇంకా అద్భుతంగా ఉంటుంది, ఆల్ ది బెస్ట్ టూ ద టీమ్" అని ముగించారు.


Share this article :