Home » » Induvadana Team Held Grand Success Meet

Induvadana Team Held Grand Success Meet

 "ఇందువదన" చిత్రం ద్వారా మమ్మల్ని ఆదరిస్తూ మాకు రిటర్న్ గిఫ్ట్ ఉచ్చిన  ప్రేక్షకులకు ధన్యవాదాలు..చిత్ర నిర్మాతలునైనిష్య & సాత్విక్ స‌మ‌ర్ప‌ణ‌లో  శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై  వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి జంటగా MSR దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి నిర్మిస్తున్న చిత్రం “ఇందువదన”. చాలా ఏళ్ళ తర్వాత ఇందువదన సినిమాతోనే రీ ఎంట్రీ ఇస్తున్నారు వరుణ్ సందేశ్. ఈ సినిమాలో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్ ను చాలా అద్భుతంగా డిజైన్ చేసారు దర్శకుడు MSR. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీష్ ఆకేటీ అందించగా.. శివ కాకాని సంగీతం సమకూర్చారు. నూతన సంవత్సర శుభా కాంక్షలుతో జనవరి 1న ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ చిత్రం థియేటర్స్‌ లో విజయవంతంగా ప్రదర్శింప బడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ జరుపుకుంది.ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో


చిత్ర నిర్మాత మాధవి ఆదుర్తి మాట్లాడుతూ.. రోజు రోజు కు మా "ఇందువదన" సినిమాకు ప్రేక్షకుల నుండి ఆదరణ, కలెక్షన్స్ పెరుగుతుండడంతో థియేటర్స్ ను పెంచు తున్నాము.ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మాతో వర్క్ చేసిన వరుణ్, ఫర్నాజ్ లకు ధన్యవాదాలు మొదటిసారిగా ఎంతో ప్యాసినెట్ గా వచ్చిన మేము మంచి చిత్రం తీయాలని ప్రొడక్షన్స్ లోకి వచ్చాము. సతీష్ ఆకేటి గారిచ్చిన మంచి కథను యమ.యస్.ఆర్. చాలా చక్కగా తీశాడు.వరుణ్ గారు ఈ కథ విన్న తరువాత ఈ బ్యానర్ లో వస్తున్న ఫస్ట్ మూవీ అని చూడకుండా మేము ఏ లోకేషన్ కు రమ్మన్నా అక్కడకు వచ్చి ఫుల్ సపోర్ట్ చేశారు. సెకండాఫ్ లో వచ్చే కామెడీ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. మ్యూజిక్ డైరెక్టర్ మంచి పాటలు అందించాడు. నటీనటులు, టెక్నీసిషన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో ఈ సినిమా చాలా బాగా వచ్చింది. జనవరి 1 న విడుదలైన మా "ఇందువదన" సినిమా ఎంతో ప్రేక్షకాదరణ పొందు తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.


చిత్ర దర్శకుడు యమ్.యస్.ఆర్ మాట్లాడుతూ.. ఇందువదన సినిమాను హిట్ చేసిన ఆడియన్స్ కు ధన్యవాదాలు.ముందుగా ఈ కథను సతీష్ ఆకెటి గారు చెప్పిన తరువాత నచ్చడంతో చిన్న చిన్న మార్పులు చేసిన తరువాత శ్రీ బాలాజీ పిక్చర్స్ శ్రీమతి మాధవి ఆదుర్తి గారు మా కథను ఒకే చేశారు.నేను కొత్తవాన్ని అయినా కూడా నా మీద నమ్మకం తో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు చిత్ర నిర్మాతలు వారికి నా ధన్యవాదాలు.అలాగే ఈ కథను నమ్మిన వరుణ్,ఫర్నాజ్ లు ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేశారు. ఇందులో నటించిన వారంతా చాలా బాగా నటించారు.వీరితో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది.శివ కాకాని గారు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. బాహుబలి వంటి పెద్ద సినిమాకు వర్క్ చేసిన కోటగిరి వెంకటేశ్వర్లు గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది.నా డైరెక్షన్ టీం కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేసింది.ఇందులోని వడి వడిగా సాంగ్ పెద్ద హిట్ అయ్యింది.ఇంత మంచి పాటను కంపోజ్ చేసిన ఆట సందీప్,జ్యోతి లకు ధన్యవాదాలు. ఫర్నాజ్ శెట్టి మరాఠీ అమ్మాయి అయినా కూడా బ్లౌజ్ లేకుండా ఒక ట్రైబల్ అమ్మాయిగా చాలా బ్యూటీఫుల్ గా చేయడం తనకు ఇది బిగ్ టాస్క్..ఆమె నటనకు మంచి అప్లాజ్స్ వస్తుంది. మన మధ్య లేరు తనే శివ శంకర మాస్టర్.తను ఒక లెజెండరీ కొరియోగ్రాఫర్ చిలిపి చూపులు సాంగ్ చేశారు.అంత మంచి వ్యక్తి ఈ రోజు మా మద్య లేనందుకు చాలా బాధ పడుతున్నాను. మేము చేసిన కష్టానికి ప్రేక్షకులు చక్కటి ప్రతి ఫలాన్ని అందించారు. వారందరికీ నా ధన్యవాదాలు అన్నారు.హీరో వరుణ్ మాట్లాడుతూ..ఐదు సంవత్సరాల చేస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుంది అనుకున్నాను.కానీ ప్రేక్షకులనుండి నాకు మంచి అప్లాజ్ వస్తుంది.దర్శక, నిర్మాతలు నా క్యారెక్టర్ ను కొత్తగా డిజైన్ చేశారు.ఇప్పుడున్న ప్రస్తుత కోవిడ్ టైం లో ఇబ్బంది వున్నా నా కోసం ఈ సినిమాను బిగ్ స్క్రీన్ పై తీసుకువచ్చారు నిర్మాతలు. వారికి నా ధన్యవాదాలు. దర్శకుడు యమ.యస్.ఆర్ గారు నాకు ఏ కథ చెప్పారో అదే కథను చాలా బాగా తీశారు.మురళి గారు అద్భుతమైన విజువల్స్ వచ్చాయి. నా సహా నటులు చాలా చక్కగా నటించారు.జ్యోతి గారి వీరమ్మ క్యారెక్టర్ చిన్నదే అయినా చాలా ఇంపార్టెంట్ రోల్..ఫర్నాజ్ "ఇందు" గా చాలా చక్కగా నటించింది. ఎంతో డెడికేటెడ్ గా ఆ క్యాస్ట్యూమ్స్ తో ట్రైబల్ అమ్మాయిగా చాలా చక్కగా నటించింది.శివ కాకాని అందించిన పాటలు నా కెరీర్ లో బెస్ట్ ఆల్బమ్ గా నిలుస్తోంది.నాకిలాంటి మంచి చిత్రాన్ని అందించిన దర్శక, నిర్మాతలకు, అలాగే నన్ను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.కొరియోగ్రాఫర్స్ సందీప్, జ్యోతి  మాట్లాడుతూ..ఇందులో మేము కొరియోగ్రఫీ చేసిన వడివడిగా సాంగ్ కు థియేటర్స్ లలో ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. హీరో, హీరోయిన్లు కూడా ఫారెస్ట్ లో ,వాటర్ ఫాల్స్  దగ్గర షూట్ చేసినపుడు చాలా కష్టపడ్డారు.ఈ రోజు ఈ పాటకు ఇంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే దానికి కారణం వరుణ్,ఫర్నాజ్ లే. మ్యూజిక్ డైరెక్టర్ మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. మమ్మల్ని నమ్మి ఈ సాంగ్ ఇచ్చిన దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు.హీరోయిన్ ఫర్నాజ్ శెట్టి మాట్లాడుతూ..ఇలాంటి మంచి సినిమాలో నాకింత ఇంపార్టెంట్ రోల్ ఇచ్చిన దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు.కో యాక్టర్ వరుణ్ గారు నాకు ఫుల్ సపోర్ట్ చేశారు.శివ కాకాని గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు.సినిమాటోగ్రఫర్ ఇందులో నన్ను చాలా బాగా చూయించారు.సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో రన్ అవుతున్న మా సినిమాను ఇంకా పెద్ద విజయాన్ని అందించాలని ప్రేక్షకులను కోరుతున్నాను అన్నారు.


కమెడియన్ పార్వతీశం మాట్లాడుతూ.. ఈ సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు. థియేటర్స్ పెంచుతున్న ఈ మూవీ ను అందరూ చూసి ఇంకా పెద్ద విజయాన్ని అందించాలని అన్నారు.


విలన్ గా నటించిన వంశీ మాట్లాడుతూ.. మేమంతా "ఇందువదన" చిత్రం ద్వారా న్యూ ఇయర్ లో ప్రేక్షకులకు మంచి గిఫ్ట్ ఇచ్చామనుకున్నాము.కానీ ప్రేక్షకులే మాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు.ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.


నటి జ్యోతి మాట్లాడుతూ.. మంచి కథను సెలెక్ట్ చేసుకొని తీసిన దర్శక,నిర్మాతలు ఈ సినిమా తో మంచి సక్సెస్ సాధించారు.వరుణ్ గారిది సూపర్బ్ లుక్..ఇప్పటి వరకు చేసిన దానికి బిన్నగా ఉంది.ఫర్నాజ్ కూడా అద్భుతంగా నటించింది అన్నారు.


ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.


నటీనటులు:

వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి, రఘు బాబు, అలీ, నాగినీడు, సురేఖ వాణి, ధనరాజ్, తాగుబోతు రమేష్, మహేష్ విట్ట, పార్వతీషం, వంశీ కృష్ణ ఆకేటి, దువ్వాసి మోహన్, జ్యోతి, కృతిక (కార్తికదీపం ఫేమ్), జెర్సీ మోహన్ తదితరులు


సాంకేతిక నిపుణులు

స‌మ‌ర్ప‌ణ:  నైనిష్య & సాత్విక్

బ్యానర్: శ్రీ బాలాజీ పిక్చర్స్

నిర్మాత: శ్రీమతి మాధవి ఆదుర్తి

కో. ప్రొడ్యూసర్: గిరిధర్

లైన్ ప్రొడ్యూసర్స్: సూర్యతేజ ఉగ్గిరాల, వర్మ

దర్శకుడు: MSR

కథ, స్క్రీన్ ప్లే, మాటలు: సతీష్ ఆకేటి

సంగీతం: శివ కాకాని

కో డైరెక్టర్: ఉదయ్ రాజ్

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

ఆర్ట్: వై నాగు

లిరిక్స్: భాస్కరబట్ల, తిరుపతి జావన

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్


Share this article :