Home » » Brilliant Babu S/O Tenali First Look Launched

Brilliant Babu S/O Tenali First Look Launched

 రాఘవేంద్రరావు చేతుల మీదుగా సంపూర్ణేష్ బాబు ‘బ్రిలియంట్ బాబూ.. S/O తెనాలి’ ఫస్ట్ లుక్ విడుదల..బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా వెల్డింగ్ శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా బ్రిలియంట్ బాబు.. సన్నాఫ్ తెనాలి. రాజ్ కుమార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజ్ కుమార్ చందక ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమక్షంలో జరిగింది. ఆయన చేతుల మీదుగా సంపూర్ణేష్ కొత్త సినిమా టైటిల్ లాంచ్ విడుదల చేసారు. ఈ సినిమాకు శివరాం డైలాగ్స్ అందిస్తుండగా.. DSR సంగీతం అందిస్తున్నారు. రాజీవ్ కనకాల, అంతర స్వర్ణకర్, రాజీవ్ కనకాల, అదుర్స్ రఘు, శివ శంకర్ మాస్టర్, రాకేట్ రాఘవ తదితరులు నటిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనున్నారు చిత్రయూనిట్.


నటీనటులు:

సంపూర్ణేష్ బాబు, రాజీవ్ కనకాల, అంతర స్వర్ణకర్, రాజీవ్ కనకాల, అదుర్స్ రఘు, శివ శంకర్ మాస్టర్, రాకేట్ రాఘవ, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు


టెక్నికల్ టీమ్:


దర్శకుడు: వెల్డింగ్ శ్రీను

నిర్మాత: రాజ్ కుమార్ చందక

బ్యానర్: రాజ్ కుమార్ ఎంటర్టైన్మెంట్స్

కెమెరా: ముజీర్ మాలిక్

సంగీతం: D S R

డైలాగ్స్: శివరాం

పాటలు: భాసకర్ భట్ల, శ్రీరాం తపస్వి

ఎడిటర్ : నాగిరెడ్డి

నిర్మాణ నిర్వహణ: బాలాజీ శ్రీను

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, లక్ష్మీ నివాస్


Share this article :