Home » » Tremendous Response for The Trip Trailer

Tremendous Response for The Trip Trailer

 వంశీకృష్ణ ఆకెళ్ళ తెరకెక్కిస్తున్న ‘ది ట్రిప్’ సినిమా ట్రైలర్‌కు అనూహ్య స్పందన.. ఆమని, గౌతమ్ రాజు, సౌమ్య శెట్టి ప్రధాన పాత్రల్లో VDR ఫిల్మ్స్ బ్యానర్‌పై దుర్గం రాజమౌళి నిర్మిస్తున్న సినిమా ది ట్రిప్. వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసారు మేకర్స్. దీనికి కూడా అనూహ్య స్పందన వస్తుంది. భిన్నమైన కథాంశంతో వంశీ కృష్ణ ఆకెళ్ళ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ట్రైలర్ అంచనాలు పెంచేస్తుంది. ఓ ట్రిప్‌లో భాగంగా హీరోకు ఎదురైన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ట్రైలర్ చూస్తుంటే రొటీన్‌కు కాస్త భిన్నంగానూ అనిపిస్తుంది. కచ్చితంగా ఈ సినిమా అందర్నీ అలరిస్తుందని నమ్మకంగా చెప్తున్నారు దర్శక నిర్మాతలు. కార్తిక్ కొడకండ్ల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బొంతల నాగేశ్వరరెడ్డి ఎడిటింగ్ అందిస్తున్న ఈ సినిమాకు.. విశ్వ దేవబత్తుల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్. 


నటీనటులు: ఆమని, గౌతమ్ రాజ్, సౌమ్య శెట్టి తదితరులు


టెక్నికల్ టీమ్: 

దర్శకుడు: వంశీకృష్ణ ఆకెళ్ల

నిర్మాత: దుర్గం రాజమౌళి

నిర్మాణ సంస్థ: VDR ఫిల్మ్స్

సంగీత దర్శకుడు: కార్తిక్ కొడకండ్ల

ఎడిటర్: బొంతల నాగేశ్వరరెడ్డి 

సినిమాటోగ్రఫీ: విశ్వ దేవబత్తుల

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్


Share this article :