Home » » Tremendous Response For Pakka Commercial Teaser

Tremendous Response For Pakka Commercial Teaser

 ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్ టైన‌ర్ గా మ్యాచో స్టార్ గోపీచంద్ - మారుతి కాంబినేష‌న్ లో జీఏ2 పిక్చ‌ర్స్ - UV క్రియేష‌న్స్ ‘ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్’ టీజర్..



ప్ర‌తి రోజు పండ‌గే లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ తర్వాత సంచ‌ల‌న‌ ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటూ మందుకు సాగ‌తున్న జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ క‌లిసి మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీవాసు నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు మారుతి. ఈ టైటిల్ కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధ‌ర‌ణ వ‌రుకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం విశేషం. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. తాజాగా పక్కా కమర్షియల్ టీజర్ విడుదలైంది. 'ఎవరికీ చూపిస్తున్నారు సార్ మీ విలనిజం.. మీరు ఇప్పుడు చేస్తున్నారు నేను ఎప్పుడో చూసి చేసి వదిలేసాను..' అంటూ గోపీచంద్ చెప్పిన డైలాగ్స్ కు ఒక అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. టీజర్ లోని ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ - బ‌న్నీవాసు - కాంబినేష‌న్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత‌ మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.


తారాగ‌ణం


గోపీచంద్, రాశీఖ‌న్నా, రావు ర‌మేశ్, స‌ప్త‌గిరి త‌దిత‌రులు


సాంకేతిక వర్గం


స‌మ‌ర్ప‌ణ - అల్లు అర‌వింద్


బ్యాన‌ర్ - జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్


నిర్మాత - బ‌న్నీవాసు


ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ - ర‌వీంద‌ర్


స‌హా నిర్మాత - ఎస్ కే ఎన్


లైన్ ప్రొడ్యూస‌ర్ - బాబు


ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - స‌త్య‌గ‌మిడి


మ్యూజిక్ - జేక్స్ బిజాయ్


సినిమాటోగ్ర‌ఫి - క‌మ‌ర్ చావ్ల‌


ఎడిట‌ర్ - ఎస్ బి ఉద్భ‌వ్


పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్


Share this article :