Home » » Bhagat Singh Nagar Song Launched by Hero Srikanth

Bhagat Singh Nagar Song Launched by Hero Srikanth

 భగత్ సింగ్ నగర్" చిత్రంలోని "ఈ విశ్వమంతము వ్యాపించిన" పాటను విడుదల చేసిన హీరో శ్రీకాంత్




 *గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్ ,ధృవిక హీరో, హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో  వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు లు నిర్మిస్తున్న చిత్రం "భగత్ సింగ్ నగర్" . తెలుగు మరియు తమిళ  బాషలో ఏక కాలంలో చిత్రీకరించి విడుదల చేస్తున్న ఈ సినిమా లోని 'ఈ విశ్వమంతము వ్యాపించిన' పాటను హీరో శ్రీకాంత్, బెనర్జీ చేతులు మీదుగా విడుదల చేశారు సందర్భంగా* 




 *శ్రీకాంత్ గారు మాట్లాడుతూ..* భగత్ సింగ్ నగర్ ఆ పేరు లో ఉండే పవర్ ఆక్షన్ టీజర్ లోను ప్రకాష్ రాజ్ గారు రిలీజ్ చేసిన చరిత చూపని సాంగ్ లోను స్పష్టంగా కనపడుతుంది...అదే రేంజ్ లో ఏ మాత్రం తగ్గకుండా ఈ విశ్వంతము వ్యాపించిన  పాట ప్రస్తుత పరిస్థితులకి అద్దం పెట్టినట్టుగా ఉంది అంటూ... భగత్ సింగ్ నగర్ టీం ను ప్రశంసించారు, ఒక కొత్త టీం కొత్త కథలతో సినిమాలు తీయడం వారి మంచి ప్రయత్నాని ప్రోత్సహించడం మన భాద్యతగా భావింసి ఆశీర్వదిస్తే ఇంకా మంచి మంచి సినిమాలు మనకి వస్తాయి అని అన్నారు. 



 *బెనర్జీ గారు మాట్లాడుతూ* .. భగత్ సింగ్ నగర్ ఈ సినిమా లో నేను నెగటివ్ షేడ్స్ ఉన్న మంచి క్యారెక్టర్ చేసాను... సినిమాకు కధే బలం ఆ కథను దర్శకుడు క్రాంతి వాలాజా చాలా బాగా ప్రెసెంట్ చేసాడు... చాలా మంది క్రొత్త నటీనటులు టెక్నిషన్స్ తో పాటు సీనియర్ ఆక్టర్స్ అవార్డు విన్నింగ్ టెక్నిన్సియాన్స్ తో కలిపి ఒక మంచి సినిమాగా మన ముందుకు తీసుకు వస్తున్నా గ్రేట్ ఇండియా మీడియా హౌస్ బ్యానర్ కు ప్రొడ్యూసర్స్  గౌరీ వాలాజా, రమేష్ ఉడత్తు గార్లకు, డైరెక్టర్ క్రాంతి వాలాజాకు, మ్యూజిక్ డైరెక్టర్ ప్రభాకర్ దమ్ముగారికి శుభాకాంక్షలు తెలియ చేశారు...





*నటీనటులు* : 


విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య, జయకుమార్, హరిబాబు, జయచంద్ర, మహేష్, ఒమర్, శంకర్, వెంకటేష్.  



*సాంకేతిక నిపుణులు :* 


ఛాయాగ్రహణం : రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి, 


ఎడిటింగ్ : జియాన్ శ్రీకాంత్, 


స్టిల్స్ : మునిచంద్ర, 


నృత్యం : ప్రేమ్-గోపి, 


నేపధ్య సంగీతం: ప్రభాకర్ దమ్ముగారి, 


ప్రొడ్యూసర్స్ : వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు,


కథ-కథనం-దర్శకత్వం : వాలాజా క్రాంతి.


పి ఆర్ వో : మధు వి ఆర్, తేజు సజ్జా.





Share this article :