Home » » Tremendous Response for Sami Song FromPushpa The Rise

Tremendous Response for Sami Song FromPushpa The Rise

 నువ్ కాలు మీద కాలేసుకుంటే పూనకాలే సామీ..’.. ‘పుష్ప: ది రైజ్’ లిరికల్ సాంగ్‌కు అనూహ్య స్పందన..



పుష్ప సినిమా నుంచి మరో పాట విడుదలైంది. మేకర్స్ ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించిన విశేషాలను అభిమానుల ముందుంచుతున్నారు. దానికి తోడు అల వైకుఠ‌పురంలో లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రంగస్థ‌లం‌ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో పుష్పపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఆర్య‌, ఆర్య‌ 2 సినిమాల తర్వాత హ్యాట్రిక్ చిత్రంగా పుష్ప సినిమా వస్తుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు సుకుమార్. ఇందులో మొదటి భాగం పుష్ప: ది రైజ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల కానుంది. వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్  ప్రొడ‌క్ష‌న్ హౌజ్‌గా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్, మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియాతో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో సంచలనం రేపింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, దాక్కో దాక్కో మేక, రష్మిక మందన శ్రీవల్లి పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా 'సామి సామి' అంటూ సాగే మూడో సింగిల్ వచ్చేసింది. దీనికి కూడా అనూహ్య స్పందన వస్తుంది. పక్కా మాస్ అవతారంలో అటు అల్లు అర్జున్.. ఇటు రష్మిక మందన్న కనిపిస్తున్నారు. న్యాచురల్ లుక్స్‌తో కట్టి పడేస్తున్నారు ఈ ఇద్దరూ. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్రయూనిట్.


అమ్మీ ఏందమ్మీ అట్టా సూత్తండావ్.. ఏందమ్మీ..

నువ్వు అమ్మీ అమ్మీ అంటాంటే నీ పెళ్లానైపోయినట్టుందిరా సామీ.. నా సామీ..

నిను సామీ సామీ అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామీ.. నా సామీ..

నీ ఎనకే ఎనకే అడుగేస్తాంటే.. నీ ఎనకే ఎనకే అడుగేస్తాంటే ఎంకన్న గుడి ఎక్కినట్టుందిరా సామీ..

పక్కాపక్కాన గూసుంటేనే పరమేశ్వరున్ని ఎక్కినట్టుందిరా సామీ..

నువ్ ఎల్లే దారే సూత్తుంటే ఏరే ఎండినట్టుందిరా సామీ..


సామీ.. నా సామీ.. నా సామీ.. రారా సామీ.. బంగారు సామీ.. మీసాలా సామీ.. రోషాల సామీ..

సామీ.. నా సామీ.. నా సామీ.. రారా సామీ.. బంగారు సామీ.. మీసాలా సామీ.. రోషాల సామీ..


పిక్కల పైదాక పంచె నువ్ ఎత్తి కడితే..

పిక్కల పైదాక పంచె నువ్ ఎత్తి కడితే.. నా పంచ ప్రాణాలు పోయేను సామీ..

కార కిల్లి నువ్ కసకస నములుతుంటే నా ఒళ్ళు ఎర్రగ పండెను సామీ..

నీ అరుపులు కేకలు వింటా ఉంటే.. ఏఏఏఏ..

నీ అరుపులు కేకలు వింటా ఉంటే.. పులకరింపులు సామీ..

నువ్ కాలు మీద కాలేసుకుంటే పూనకాలే సామీ..

రెండు గుండీలు విప్పి గుండెలు చూపిత్తే పాల కుండలాగా పొంగిపోతా సామీ.. నా సామీ..


సామీ.. నా సామీ.. నా సామీ.. రారా సామీ.. బంగారు సామీ.. మీసాలా సామీ.. రోషాల సామీ..

సామీ.. నా సామీ.. నా సామీ.. రారా సామీ.. బంగారు సామీ.. మీసాలా సామీ.. రోషాల సామీ..


కొత్తసీర కట్టుకుంటే.. ఎట్టవుందో సెప్పకుంటే.. కొన్న విలువ సున్నా అవ్వదా సామీ..

కొప్పులోన పూలు కొడితే.. గప్పున నువ్ పీల్చుకుంటే పూల గుండె రాలిపడదా సామీ..

కొంగే జారేటప్పుడు నువ్వు.. ఆఆఆఆఆ..

నా కొంగే జారేటప్పుడు నువ్వే సూడకుంటే సామీ.. ఆ కొంటెగాలి నన్నే చూసి జాలిపడదా సామీ..

నా అందం చందం నీదవకుంటే సామీ.. నా ఆడపుటకే పీడైపోదా సామీ..


సామీ.. నా సామీ.. నా సామీ.. రారా సామీ.. బంగారు సామీ.. మీసాలా సామీ.. రోషాల సామీ..

సామీ.. నా సామీ.. నా సామీ.. రారా సామీ.. బంగారు సామీ.. మీసాలా సామీ.. రోషాల సామీ..



నటీనటలు:

అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ ఘోష్, అనసూయ భరద్వాజ్ తదితరులు


టెక్నికల్ టీం:

దర్శకుడు: సుకుమార్

నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై రవిశంకర్

కో ప్రొడ్యూసర్స్: ముత్తంశెట్టి మీడియా

సినిమాటోగ్రఫర్: మిరోస్లా క్యూబా బ్రోజెక్

సంగీతం: దేవి శ్రీ ప్రసాద్

ఆర్ట్ డైరెక్టర్: S. రామకృష్ణ - మోనిక నిగొత్రే

సౌండ్ డిజైన్: రసూల్ పూకుట్టి

ఎడిటర్: కార్తిక శ్రీనివాస్ R

ఫైట్స్: రామ్ లక్ష్మణ్, పీటర్ హెయిన్

లిరిసిస్ట్: చంద్రబోస్

క్యాస్ట్యూమ్ డిజైన్: దీపాలీ నూర్

మేకప్: నాని భారతి

CEO: చెర్రీ

కో డైరెక్టర్: విష్ణు

లైన్ ప్రొడ్యూసర్: KVV బాల సుబ్రమణ్యం

బ్యానర్స్: మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ ముత్తంశెట్టి మీడియా

PRO: ఏలూరు శ్రీను, మడూరి మధు



Share this article :