Home » » Director Raghavendra Rao Launched Athadu Ame Priyudu First Look

Director Raghavendra Rao Launched Athadu Ame Priyudu First Look

 "అతడు ఆమె ప్రియుడు"

ఫస్ట్ లుక్ పోస్టర్ ఆవిష్కరించిన

శతాధిక సంచలన చిత్ర దర్శకుడు

కె.రాఘవేంద్రరావు!!



    ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం "అతడు-ఆమె-ప్రియుడు".

సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై స్టార్ హీరో సునీల్-బిగ్ బాస్ ఫేమ్ కౌశల్-సీనియర్ నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో... ఝాన్సీ కూనం (యు.ఎస్.ఎ) సమర్పణలో- రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ విభిన్న కథా చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని... పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. 

     ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ శతాధిక సంచలన చిత్ర దర్శకుడు కె.రాఘవేంద్రరావు  ఆవిష్కరించారు. రచనా సంచలనం యండమూరితో తనకు గల సుదీర్ఘ అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన నెమరువేసుకున్నారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ... "సంధ్య స్టూడియోస్ నిర్మిస్తున్న "అతడు ఆమె ప్రియుడు" ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. రచయితగా యండమూరి వీరేంద్రనాధ్ సృష్టించిన సంచలనాలు అందరికీ తెలిసినవే. నా దర్శకత్వంలో రూపొంది అసాధారణ విజయాలందుకున్న "ఆఖరి పోరాటం, జగదేకవీరుడు-అతిలోక సుందరి" చిత్రాల రచయిత అయిన యండమూరి... దర్శకుడిగాను ఇప్పటికే తన ప్రత్యేకతను ప్రకటించుకున్నారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న "అతడు ఆమె ప్రియుడు" ఘన విజయం సాధించి, నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాలి" అన్నారు.

     యండమూరి మాట్లాడుతూ... "రాఘవేంద్రరావు గారు నాకు మంచి మిత్రుడు మాత్రమే కాదు గురువులాంటివారు కూడా. భారతదేశం గర్వించదగ్గ మహా దర్శకుడాయన. ఆయన మా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, మా చిత్ర ప్రచారానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉంది" అన్నారు.

     రాఘవేంద్రరావు వంటి దర్శకదిగ్గజం తమ చిత్రం "అతడు ఆమె ప్రియుడు" ఫస్ట్ లుక్ లాంచ్ చేసి, బ్లెస్ చేయడం... ఈ చిత్రం సాధించబోయే ఘన విజయానికి శుభసూచకమని నిర్మాతలు రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత-వ్యాపారవేత్త అంబికా రాజా, హీరోయిన్ మహేశ్వరి, అమర్, నటుడు భూషణ్ తదితరులు పాల్గొన్నారు.

     అతి త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, కెమెరా: మీర్, నిర్మాణ సారధ్యం: అమర్, సమర్పణ: ఝాన్సీ కూనం (యు. ఎస్.ఎ), నిర్మాతలు: రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాధ్!!


Share this article :