Divya Sripada First Look From Charitha Kaamakshi

 'చరిత కామాక్షి' సినిమా నుంచి దివ్య శ్రీపాద ఫస్ట్ లుక్ విడుదల..



ఫైర్ ఫ్లై ఆర్ట్స్ బ్యానర్ పై రజినీ రెడ్డి నిర్మాతగా చందు సాయి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'చరిత కామాక్షి'. నవీన్ బెత్తిగంటి, దివ్య శ్రీపాద జంటగా నటిస్తున్నారు. సెప్టెంబర్ 5న హీరోయిన్ దివ్య పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. టైటిల్ రోల్ చరిత కామాక్షి పాత్రలో నటిస్తున్నారు దివ్య. చక్కటి చీరకట్టులో.. గృహిణి పాత్రలో.. చూడగానే గౌరవం ఉట్టిపడే విధంగా ఫస్ట్ లుక్ డిజైన్ చేశారు మేకర్స్. చిరునవ్వుతో ఎంతో అందంగా కనిపిస్తున్నారు దివ్య శ్రీపాద. నా మాటల జతగా, నీ అడుగులు సాగాలని.. నా కలలు అలలుగా, నీ తీరం చేరాలని ఆశిస్తూ.. నీ జన్మదినం.. నా పునర్జన్మం.. అంటూ పోస్టర్ పై ఉన్న మ్యాటర్ కూడా ఆకట్టుకుంటుంది. అబూ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు కోడాటి పవన్ కళ్యాణ్ ఎడిటర్. రాకీ వనమాలి సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే దర్శక నిర్మాతలు తెలియజేయనున్నారు.


నటీనటులు: 

నవీన్ బెత్తిగంటి, దివ్య శ్రీపాద..


టెక్నికల్ టీం: 

దర్శకుడు: చందు సాయి

నిర్మాత: రజిని రెడ్డి

నిర్మాణ సంస్థ: ఫైర్ ఫ్లై ఆర్ట్స్

ఎడిటర్: కోడాటి పవన్ కళ్యాణ్

సినిమాటోగ్రఫీ: రాకీ వనమాలి

సంగీతం: అబూ

PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Post a Comment

Previous Post Next Post