Home » » Icon Star Allu Arjun on Shakuntalam sets

Icon Star Allu Arjun on Shakuntalam sets

 


గుణశేఖర్ ‘శాకుంతలం’ సెట్‌కు వెళ్లిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. 

గుణశేఖర్ ‘శాకుంతలం’ చిత్ర యూనిట్‌కు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ చిత్ర లొకేషన్‌కు భార్య స్నేహా రెడ్డి గారితో కలిసి వెళ్లారు అల్లు అర్జున్. ఈ చిత్రంలో అల్లు అర్జున్ గారి గారాల పట్టి అర్హ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్‌లో అడుగు పెట్టింది అర్హ. దీనికి సంబంధించిన వీడియో కూడా ఈ మధ్యే విడుదలైంది. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో గుణ టీం వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్హ ఇప్పటికే 10 రోజుల షూటింగ్ పూర్తి చేసింది. ఇప్పుడు ఈ చిన్నారి మరోసారి షూటింగ్‌లో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలోనే కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అల్లు అర్హ ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుడి కుమారుడైన భరతుడు పాత్రలో నటిస్తుంది. తాజాగా అర్హ నటనను కళ్ళారా చూడ్డానికి సెట్‌కు వచ్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సతీసమేతంగా శాకుంతలం సెట్‌కి వచ్చి కాసేపు అక్కడే ఉన్నారు.. కూతురు నటన చూసి మురిసిపోయారు అల్లు అర్జున్ దంపతులు. అల్లు అర్జున్ వారసుడు అయాన్ కూడా సెట్‌లోకి వచ్చారు. శాకుంతలం సెట్‌ని అల్లు అర్జున్ సందర్శించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో గుణశేఖర్ తెరకెక్కించిన రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో నటించారు ఐకాన్ స్టార్. ఇప్పుడు ఆయన తనయ అర్హ శాకుంతలం సినిమాలో నటిస్తుంది.


Share this article :