Home » » Lal Bagh First Look Launched

Lal Bagh First Look Launched

 


సంపత్ కుమార్ సమర్పిస్తోన్న ‘లాల్ బాగ్’మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ 

రాజమౌళి, ఎన్టీఆర్ ల మూవీ యమదొంగ ఫేమ్ మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘లాల్ బాగ్’. ఐటి బ్యాక్ డ్రాప్ లో సాగే థ్రిల్లర్ జానర్ లో రాబోతోన్న ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో అనువదిస్తున్నారు. సంపత్ కుమార్ సమర్పణలో సెలెబ్స్ అండ్ రెడ్ కార్పెట్ బ్యానర్ పై  రాజ్ జకారియా నిర్మిస్తోన్న ఈ మూవీ తెలుగు టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

చాలా రోజుల తర్వాత మమతామోహన్ దాస్ ఓ బలమైన పాత్రలో కనిపించబోతోందీ చిత్రంతో. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే అంశాలతో వస్తోన్న ఈ మూవీలో మమతా మోహన్ దాస్ తో పాటు నందినిరాయ్, సిజోయ్ వర్ఘిస్, రాహుల్ దేవ్ శెట్టి(బాలీవుడ్ యాక్టర్), రాహుల్ మాధవ్, అజిత్ కోషీ ఇతర కీలక పాత్రల్లో నటించారు. 

ఏ సంపత్ కుమార్ సగర్వంగా సమర్పిస్తోన్న ఈ చిత్రానికి 

సంగీతం : రాహుల్ రాజ్

సినిమాటోగ్రఫీ : ఆంటోని జో 

ఎడిటర్ : సునీశ్ సెబాస్టియన్ 

పిఆర్వో : టి మీడియా

నిర్మాత : రాజ్ జకారియాస్

దర్శకత్వం : ప్రశాంత్ మురళీ పద్మనాభన్


Share this article :