Home » » Director Praveen Sattaru About 11th Hour

Director Praveen Sattaru About 11th Hour

 


ఒక రాత్రిలో జరిగే ఎమోషనల్‌ థ్రిల్లర్ 'లెవన్త్‌అవర్‌'  :  ప్రవీణ్‌ సత్తారు


చందమామ కథలు, గుంటూరు టాకీస్‌, పిఎస్‌వి గరుడవేగ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలతో డైరెక్టర్‌గా తనదైన మార్క్‌ క్రియేట్‌ చేసిన దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కించిన వెబ్‌ సిరీస్‌ 'లెవన్త్‌ అవర్త్‌'. తమన్నా టైటిల్ పాత్రలో నటించిన ఈ వెబ్‌ సిరీస్‌ తెలుగు ఓటీటీ మాధ్యమం 'ఆహా'లో ఉగాది సందర్భంగా ఏప్రిల్‌ 9న ప్రసారం అవుతుంది. ఈ సందర్భగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు మాట్లాడుతూ పలు విషయాల గురించి తెలియజేశారు.

* దర్శకుడిగా ఇప్పటి వరకు ఐదు సినిమాలు, ఓ వెబ్‌ సిరీస్‌ చేశాను. ఆ వెబ్‌ సిరీసే 'లెవన్త్‌ అవర్‌'. ఈ వెబ్‌ సిరీస్‌కు ప్రదీప్ రైటర్ అండ్ ప్రొడ్యూసర్‌. 

* 'ఆహా' కోసం అల్లు అరవింద్‌గారు ఈ స్టోరిని పిక్‌ చేశారు. ఆయన నాకు ఫోన్‌ చేసి 'ప్రవీణ్‌ నువ్వు బయట రైటర్స్‌ రాసిన స్టోరీలను కూడా డైరెక్ట్‌ చేస్తావా?' అని అడిగారు. 'బావుంటే ఎందుకు చేయను సార్‌' అన్నాను. ఆయన స్క్రిప్ట్‌ పంపించారు.  చదవి బాగుందన్నాను. అన్నీ చక్కగా ఉండటంతో వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అయ్యాను. ఇలాంటి జోనర్‌లో ఇప్పటి వరకు నేను డైరెక్ట్‌ చేయలేదు. దీంతో వెబ్‌ సిరీస్‌ను డైరెక్ట్‌ చేయడానికి సిద్ధమయ్యాను. ఓ రోజు రాత్రి జరిగే కథ. ఓ హోటల్‌లో రాత్రి పదకొండు గంటల నుంచి పొద్దున ఎనిమిది గంటల వరకు జరిగే కథ. ఈ ఎనిమిది గంటల్లో కథలో ప్రధాన పాత్రధారి అరత్రికా రెడ్డి(తమన్నా) బ్యాంకుకి పదివేల కోట్ల రూపాయలను చెల్లించాలి. అలా చెల్లించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అలాంటప్పుడు ఆమె కట్టాల్సిన డబ్బును కట్టిందా? లేదా? అనేదే కథ. 

* తెలుగు వెబ్‌ సిరీస్‌ల్లో 'లెవన్త్‌ అవర్‌'కు ఓ స్టాండర్డ్‌ ఉంది. అందుకే బిగ్గెస్ట్‌ వెబ్‌ సిరీస్‌ అని కూడా అంటున్నారు.  కాస్టింగ్‌, విజువల్స్‌ పరంగా వెబ్‌ సిరీస్‌ రిచ్‌గా ఉంటుంది. 

* '8 అవర్స్‌' అనే బుక్‌ ఆధారంగా చేసుకుని రైటర్‌ ప్రదీప్‌గారు 'లెవన్త్‌ అవర్‌' కథను రాసుకున్నారు. కథంతా ఫిమేల్‌ సెంట్రిక్‌గానే సాగుతుంది. 

*ఫిమేల్స్‌ సమాన హక్కుల కోసం ఫైట్‌ చేస్తున్నారు. అంతే తప్ప మగవాళ్లను తొక్కేయాలనే ఉద్దేశంతో కాదు. నిజంగా అలా చేస్తే మరో వందేళ్ల తర్వాత మగవాళ్లు హక్కుల కోసం పోరాటం చేయాల్సి ఉంటుంది. ఇక లెవన్త్ అవర్‌ వెబ్ సిరీస్ విషయానికి వచ్చే సరికి ఇందులో ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అని చూపించడం లేదు. ఒక కంపెనీ చైర్మన్‌ పదివేల కోట్ల రూపాయలను బ్యాంకులకు కట్టి.. కంపెనీని కాపాడుకుందా? లేదా? అనేదే కథ. 

* ఇందులో అరత్రికా రెడ్డికి ఆరేళ్ల బాబు ఉంటాడు. భర్త నుంచి విడిపోయి ఉంటుంది. అలాంటి సమయంలో ఆమె తండ్రి కంపెనీ బాధ్యతలను ఇష్టం లేకపోయినా అరత్రికారెడ్డి చేతిలో పెడతాడు. అరత్రికా రెడ్డి కూడా తన లక్ష్యాలను పక్కన పెట్టి తల్లి కోసం కంపెనీ బాధ్యతలను చేపడుతుంది. కంపెనీని ఓ స్టేజ్‌కు తీసుకొచ్చిన తర్వాత డబ్బులు ఓ చోట  ఇరుక్కుంటాయి. అందరూ అరత్రికాను తిడుతుంటారు. అప్పుడామె ఏం చేసిందనేదే కథ. ఇదొక థ్రిలర్‌. తొలి నాలుగు ఎపిసోడ్స్‌ ఓ పేజ్‌లో ఉంటే.. చివరి నాలుగు ఎపిసోడ్స్‌ మరో పేజ్‌లో ఉంటుంది. 

* స్టోరీ పూర్తయిన తర్వాత..ఇది పెద్దగా చెప్పాల్సిన కథగా అరవింద్‌గారు, ప్రదీప్‌గారు అనుకున్నారు. అప్పుడు ప్రదీప్‌గారు సూచన మేరకు తమన్నాగారు ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. తమన్నాగారు స్క్రిప్ట్‌ చదివి నచ్చడంతోనే నటించడానికి ఒప్పుకున్నారు. 

* 42 రోజులకు షెడ్యూల్‌ వేసుకున్నా. సినిమాటోగ్రాపర్‌, నిర్మాత అండ్‌ టీమ్‌ సపోర్ట్‌తో 33 రోజుల్లోనే పూర్తి చేశాం. 

*తమన్నా.. అరత్రికా రెడ్డి పాత్రలో అద్భతంగా ఒదిగిపోయారు. పెర్ఫామెన్స్‌కు చాలా స్కోప్‌ ఉండే పాత్ర. ఒక వైపు డైలాగ్స్‌, మరో వైపు ఎమోషన్స్‌తో పాత్రను క్యారీ చేయగలగాలి. తమన్నా.. ఫెంటాస్టిక్‌గా పాత్రను క్యారీ చేశారు. 

* సెన్సార్‌ పరిధి దాటి ఏ సన్నివేశాన్ని పెట్టలేదు. కథను ఫాలో అవుతూ ఏం అవసరమో దాన్ని యాడ్‌ చేసుకుంటూ వెళ్లాం.


Share this article :
 
Copyright © 2015. TeluguCinemas.in | Telugu Cinemas - All Rights Reserved
Thank You Visit Again