హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఫ్యామిలీ నుంచి `రౌడీ బాయ్స్`తో ఎంట్రీ ఇస్తున్న హీరో ఆశిష్
తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను అందించిన నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్. వీరి ఫ్యామిలీ నుంచి ఓ హీరో సినీ రంగ ప్రవేశం చేస్తున్నాడు. ఆ హీరో ఎవరో కాదు..దిల్‌రాజుగారి సోదరుడు.. నిర్మాత శిరీష్ రెడ్డి తనయుడు ఆశిష్. ఈయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'రౌడీ బాయ్స్'. ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ శుక్రవారం విడుదల చేసింది.
కాలేజీ కుర్రాళ్లు, కాలేజీ జీవితం ఎలా ఉంటుందనే విషయాల బ్యాక్‌డ్రాప్‌తో 'రౌడీ బాయ్స్' తెరకెక్కినట్లు మోషన్ పోస్టర్‌తో రివీల్ అయ్యింది. 'రౌడీ బాయ్స్' టైటిల్ యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉంది. మోషన్ పోస్టర్‌లోని సాంగ్, అందులోని సీన్స్ చూస్తే ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ మధ్య జరిగే గొడవల నేపథ్యం అని తెలుస్తుంది. ఈ సినిమాలో ఆశిష్ బి.టెక్ స్టూడెంట్ పాత్రను పోషిస్తున్నారు. బి.టెక్ స్టూడెంట్ అయిన హీరో, మెడికల్ కాలేజ్ స్టూడెంట్ అయిన అనుపమ పరమేశ్వరన్‌తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది ఆసక్తికరంగా తెరకెక్కించారు.
ఇంట్రడక్షన్ ర్యాప్ వీడియో సాంగ్‌ను రోల్ రైడా చేశాడు. ఈ సాంగ్‌కు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ను 'హుషారు' ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి మది సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 'రౌడీ బాయ్స్' చిత్రాన్ని ఈ ఏడాది జూన్ 25న విడుదల చేస్తున్నారు.
Post a Comment