Home » » Seethayanam in 3 Languages

Seethayanam in 3 Languages



 తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో విడుదలకు సిద్దమైన సీతాయణం



కన్నడ సుప్రీం హీరో శశి కుమార్ తనయుడు అక్షిత్ శశికుమార్ ని హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం "సీతాయణం". ప్రభాకర్ ఆరిపాక దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనహిత భూషణ్ కధానాయిక. కలర్ క్లౌడ్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై రోహన్ భరద్వాజ్ సమర్పణలో శ్రీమతి లలిత రాజ్యలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మించారు.  సోమవారం (డిసెంబర్ 21వ తేదీన) హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రత్యేకమైన పెళ్లి పాటను పాత్రికేయులకు ప్రదర్శించారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రభాకర్ ఆరిపాక, హీరో అక్షిత్ శశికుమార్, హీరోయిన్ అనహిత భూషణ్, మధనందన్, సినిమాటోగ్రాఫర్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. 


ఈ కార్యక్రమంలో దర్శకుడు ప్రభాకర్ ఆరిపాక మాట్లాడుతూ.. ‘‘కథానాయకుడి కోణంలో సమకాలీన పరిస్థితుల్లో ఓ అమ్మాయి జీవిత ప్రయాణానికి సంబంధించిన కథే సీతాయణం. నిర్మాత లలిత రాజ్యలక్ష్మి గారు నన్ను, నా కథను నమ్మి అవకాశం ఇచ్చారు. కన్నడ సుప్రీం హీరో శశికుమార్ నన్ను నమ్మి తన కుమారుడు అక్షిత్‌ను మూడు  భాషల్లో లాంచ్ చేయడానికి ముందుకు వచ్చారు. లాక్‌డౌన్‌కు ముందే 90 శాతం షూటింగ్ పూర్తయింది. లాక్‌డౌన్ తర్వాత 10 శాతం షూటింగుతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.  బ్యాంకాక్, హైదరాబాద్, బెంగళూరు, మంగళూరు తదితర ప్రాంతాల్లోషూటింగ్ పూర్తి చేసుకొన్నది. ఈ చిత్రంలోని పెళ్లిపాట కోసం వాల్మికి రామాయణంలోని ఒక శ్లోకాన్ని పాటగా మార్చాం. శతాబ్దాల కాలం నుంచి వెడ్డింగ్ కార్డులో ఉండే శ్లోకాన్ని పాటగా రూపొందించాం. చంద్రబోస్, అనంత శ్రీరాం అద్భుతంగా సాహిత్యాన్ని అందించారు. మనసు పలికే పాటను ఇటీవల వీడియోగా రిలీజ్ చేశాం. శ్వేతామోహన్ పాడిన బ్రీత్‌లెస్ పాట అందర్ని ఆలరిస్తున్నది‘‘ అని తెలిపారు. 


నటుడు మధునందన్ మాట్లాడుతూ.. ‘‘సీతాయణం సినిమాలో భాగస్వామ్యం కావడం నిజంగా అదృష్టం. ఒక మంచి పాత్రను నాకు ఇచ్చినందుకు దర్శకుడు ప్రభాకర్‌కు థ్యాంక్స్. టాలీవుడ‌్‌లోకి అడుగుపెడుతున్న అక్షిత్ శశికుమార్‌కు వెల్‌కమ్. కన్నడ భాషకు సంబంధించిన వారైనప్పటికి అద్భుతంగా నటించారు. నాకు దర్శకుడు కథ చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. సరికొత్త పాయింట్ కాకుండా బోల్డ్ పాయింట్‌తో తెరకెక్కించారు. ఇలాంటి కథను ఎంచుకోవడం కొత్తగా అనిపించింది. డబ్బింగ్ చెబుతున్నప్పుడు మరింత ఎక్సైటింగ్‌గా అనిపించింది. డైరెక్టర్‌కు తొలి చిత్రమైనప్పటికీ అనుభవం ఉన్న దర్శకుడిగా చిత్రాన్ని రూపొందించారు. నిర్మాత, దర్శకులకు మంచి పేరు, లాభాలను తీసుకువస్తుందనే విశ్వాసం కలుగుతున్నది‘‘ అని అన్నారు. 


సీతాయాణం సినిమాలో భాగస్వామ్యం కావడం నిజంగా అదృష్టం. ఒక మంచి పాత్రను నాకు ఇచ్చినందుకు దర్శకుడు ప్రభాకర్‌కు థ్యాంక్స్. అక్షిత్ శశికుమార్ టాలీవుడ‌్‌లోకి అడుగుపెడుతున్న శశికుమార్‌కు వెల్‌కమ్. కన్నడ భాషకు సంబంధించిన వారైనప్పటికి అద్భుతంగా నటించారు. నాకు దర్శకుడు కథ చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. సరికొత్త పాయింట్ కాకుండా బోల్డ్ పాయింట్‌తో తెరకెక్కించారు. ఇలాంటి కథను ఎంచుకోవడం కొత్తగా అనిపించింది. డబ్బింగ్ చెబుతున్నప్పుడు మరింత ఎక్సైటింగ్‌గా అనిపించింది. డైరెక్టర్‌కు తొలి చిత్రమైనప్పటికీ అనుభవం ఉన్న దర్శకుడిగా నటించారు. నిర్మాత, దర్శకులకు మంచి పేరు, లాభాలను తీసుకువస్తుందనే విశ్వాసం కలుగుతున్నది అని అన్నారు. 


హీరో అక్షిత్ శశికుమార్ మాట్లాడుతూ.. ‘‘తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. సీతాయణం సినిమా అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రభాకర్ గారికి, నిర్మాత లలిత రాజ్యలక్ష్మి గారికి ధన్యవాదాలు. భాషాపరమైన సమస్య ఉన్నప్పటికీ దర్శకుడు నాతో మంచి అవుట్‌పుట్ రాబట్టుకొన్నారు. సీతాయణం సినిమా జర్నీలో మధునందన్ సార్ నాకు సపోర్టింగ్‌గా నటించారు. నేను బాగా నటించానంటే.. నన్ను పూర్తి నటుడిగా కనిపించబోతున్నానంటే అందుకు కారణం మధునందన్ సార్. తెలుగులో పరిచయం అవుతున్న నన్ను ఆదరించమని కోరుకొంటున్నాను. నాతోపాటు నటించిన హీరోయిన్ అనహిత భూషణ్ చాలా మంచిగా నటించింది‘‘ అని అన్నారు. 


హీరోయిన్ అనహిత భూషణ్ మాట్లాడుతూ.. ‘‘తెలుగులో నటించడం నాకు కొత్త. కానీ నాకు తెలియని భాషా చిత్రంలో నటిస్తున్నాననే ఫీలింగ్ కలుగలేదు. నా యూనిట్ సభ్యులు అందరూ నన్ను కంఫర్ట్‌గా ఫీలయ్యేలా చేశారు. షూటింగు సమయంలో నాకు ఎంతో అండగా నిలిచిన దర్శకుడు ప్రభాకర్ గారికి, నాతోటి నటీనటులకు ధన్యవాదాలు‘‘ అని అన్నారు. 


తారాగణం: అజయ్ ఘోష్, మధునంధన్, విధ్యులేఖ రామన్, బిత్తిరి సత్తి, కృష్ణ భగవాన్, గుండు సుదర్శన్, అనంత్, జబర్ధస్ట్ అప్పారావు, టి యన్ ఆర్, మధుమణి, మేఘనా గౌడ తదితరులు. 

రచన & దర్శకత్వం: ప్రభాకర్ ఆరిపాక 

కెమెరా: దుర్గాప్రసాద్ కొల్లి 

ఎడిటింగ్: ప్రవీణ్ పూడి 

సాహిత్యం: చంద్రబోస్, అనంత్ శ్రీరామ్ 

ఫైట్స్: రియల్ సతీష్ 

కొరియోగ్రఫీ: అనీష్ 

సంగీతం: పద్మనాభ్ భరద్వాజ్ 

నిర్మాత: లలిత రాజ్యలక్ష్మి


Share this article :