Home » » MS RAJU Interview About Dirty Hari

MS RAJU Interview About Dirty Hari



 ‘’సినిమా ఇండస్ట్రీలో నా కెరీర్‌ స్టార్ట్‌ అయి 30ఏళ్లు నిండాయి. 1990 జనవరి 2న మా సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ లో నా తొలి సినిమా ‘శత్రువు’ విడుదలైంది. వ్యాపారాల్లో, రాజకీయాల్లో, సినిమాల్లో.. ఇలా ఆయా రంగంలోనివారి జీవితాల్లో ఎత్తు పల్లాలు ఉన్నట్లే నా జీవితంలోనూ ఉన్నాయి. అందుకు భయపడి ప్రయత్నం ఆపకూడదు’’ అని దర్శక–నిర్మాత ఎం.ఎస్‌. రాజు అన్నారు.          

శ్రవణ్‌ రెడ్డి హీరోగా, సిమ్రత్‌ కౌర్, రుహానీ శర్మ హీరోయిన్లుగా ఎం.ఎస్‌. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డర్టీ హరి’. గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్‌ బాబు, గూడూరు సాయి పునీత్, కేదార్‌ సెలగం శెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ సినిమా ఏటీటీ ప్లాట్‌ఫామ్‌ ఫ్రైడే మూవీస్‌ ద్వారా ఈ నెల 18న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భం గా ఎం.ఎస్‌. రాజు చెప్పిన విశేషాలు.


‘’1990 నుండి నా జర్నీ మొదలైంది ఇప్పుడు 2020.. నా హిస్టరీ మీ అందరికీ తెలుసు. మా సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్‌లో అన్ని జానర్‌ సినిమాలు తీశాను...అందరి జీవితాల్లో అప్ & డౌన్స్ ఉన్నట్లే నా జీవితంలో కూడా ఉన్నాయి.నేను రెండు మూవీస్ చేయగానే వెంటనే ఒక ఫ్లాప్ రావడం ఆ తరువాత మూవీ హిట్ వచ్చి ఆదుకోవడం జరిగేది..అయితే నేనెప్పుడూ హిట్ వస్తే పొంగి పోవడం,ఫ్లాప్ వస్తే కుంగి పోవడం చేయలేదు..నేను ఏ సినిమా చేసినా ఎం.ఎస్ రాజు ఫిల్మ్ అనేవారు నువ్వొస్తానంటే నే వద్దంటానా,ఆట,మస్కా వరకు బాగానే ఆడాయి..మస్కా’ తర్వాత నిర్మాతగా, ‘ తూనీగ తూనీగ’ తర్వాత దర్శకునిగా గ్యాప్‌ వచ్చింది. ఒక్కోసారి గ్యాప్‌ రావడం సహజం. ‘హిట్లర్‌’ సినిమాకి ముందు చిరంజీవిగారికి కూడా ఏడాది గ్యాప్‌ వచ్చింది.‘తూనీగ తూనీగ’ ఫ్లాప్‌ కావడంతో నిర్మాణమా? దర్శకత్వమా? అనే డైలమాలో ఉండిపోయాను.


గత రెండు,మూడు సంవత్సరాలుగా ఇప్పుడున్న ఆడియన్స్ కు ఏ కైండ్ ఆఫ్ మూవీ అయితే బాగుంటుందని ఆలోచించి అడల్ట్‌ కంటెంట్‌తో ‘డర్టీ హరి’ కథ రాసుకున్నాను.అయితే ఫ్రెండ్స్ తో సరదాగా కూర్చున్నప్పుడు గూడూరు శివరామకృష్ణ గారికి ఈ కథ చెప్పడం జరిగింది.చాలా బాగుందని ఎందుకు చెయ్యకూడదు అంటే కొంచెం బోల్డ్ కంటెంట్ ఉంది.నేను చేసిన సినిమాలకు దీనికి డిఫ్రెంట్ ఉంది .ఈ సినిమా చేస్తే ప్రేక్షకులు నన్ను యాక్సిప్టు చేస్తారో,లేదో అంటే ఇప్పుడంతా ట్రెండ్ మారిందని చెప్పి నాకు ఇన్స్పిరేషన్ తో పాటు అన్ని రకాలుగా సపోర్ట్ ఇవ్వడం జరిగింది.దాంతో ట్రెండ్‌కి తగ్గట్టు మారాలని అడల్ట్‌ కంటెంట్‌తో ‘డర్టీ హరి’ తీశా.ఇందులో శ్రవణ్‌ రెడ్డి హీరోగా,తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతూ చక్కగా నటించాడు.హీరోయిన్లు సిమ్రత్‌ కౌర్,రుహానీ శర్మ లు ఈ కథ విని ఆలోచించుకొని సినిమా చేయడానికి ఒప్పుకున్నారు..తరువాత అందరూఎక్కడా ఆగకుండా నాకోసం కాకుండా ఈ కథను నమ్మి అందరూ ఫుల్ ఎఫెక్ట్ పెట్టి ఈ సినిమాను కంప్లీట్ చేసాము.తరువాత లాక్ డౌన్ రావడం జరిగింది.


ఈ మూవీ ని థియేటర్ లో రిలీజ్ చేద్దామా..చేస్తే ఆడియన్స్ వస్తారా,రాకపోతే?? ఇది మనీ తో కూడుకున్న సమస్య,ఎందుకంటే ఇది నా లైఫ్. పెట్టిన ఇన్వెస్ట్మెంట్ తిరిగి వస్తుందా లేదా... అని ఆలోచిస్తున్న టైంలో సినిమా చూసిన నిర్మాత ‘బన్నీ’ వాస్‌,హైలైఫ్ ఎంటర్ టైన్మెంట్ వారు అప్రోచ్ అయి సినిమా చాలా బాగుంది, మా ‘ఫ్రైడే మూవీస్‌’ ఏటీటీలో రిలీజ్‌ చేద్దామని ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి తీసుకున్నారు.ఓలా,ఉబర్,స్విగ్గి యాప్ ల మాదిరే ఈ ఫ్రైడే మూవీస్ యాప్  ద్వారా 7997666666 నెంబర్ కు డయల్  చేసి  మీరు సినిమాను చక్కగా చూసుకోవచ్చు.. థియేటర్ కు వెళితే మీకు ఎంత ఖర్చు అవుతుందో మా సినిమా అంత ఖర్చు కూడా ఉండదు..24 గంటల్లో ఒక సారి ఫ్రెండ్స్ తో సరదాగా కూర్చొని టి.వి,లాప్ టాప్,మొబైల్ ఇలా అన్ని ప్లాట్ ఫామ్స్ లలో ఈ సినిమా చూసుకోవచ్చు.ఈ సినిమా డౌన్ లోడ్ కాదు,అంతేకాక మీరు ఈ సినిమా చూస్తూ మీరు వేరే స్క్రీన్ నుంచి వీడియో తీసినా మీ ఇన్ఫర్మేషన్ ఈ యాప్ క్యాచ్ చేస్తుందని అన్నారు..


ఈ సినిమాని నా కుటుంబ సభ్యులు చూసి, బాగుందన్నారు. ప్రేక్షకులు కూడా బాగుందంటారు. కుటుంబమంతా కలసి చూడదగ్గ చిత్రమిది.ప్యాన్‌ ఇండియా కథతో రూపొందిన చిత్రం కాబట్టి ఇతర భాషల్లోనూ అనువదించి, రిలీజ్‌ చేస్తాం ‘’అని అన్నారు.


Share this article :