Latest Post

"Toofan" Trailer Introduction Event held Grandly

ఘనంగా విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ "తుఫాన్" ట్రైలర్ ఇంట్రడక్షన్ ఈవెంట్,  ఈ నెల 26న విడుదల కానున్న మూవీ
హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "తుఫాన్". ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్  లో "తుఫాన్" సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. "తుఫాన్" సినిమాను ఈ నెల 26వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురానున్నారు. ఇటీవల విడుదల చేసిన "తుఫాన్" ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో ఈ రోజు ట్రైలర్ ఇంట్రడక్షన్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో


మాటల, పాటల రచయిత భాష్య శ్రీ మాట్లాడుతూ - "తుఫాన్" ట్రైలర్ ఇంట్రడక్షన్ ఈవెంట్ కు వచ్చిన మీ అందరికీ వెల్కమ్. మేఘా ఆకాష్ లాంటి అందమైన అమ్మాయి, విజయ్ ఆంటోనీ లాంటి హీరో ఉన్న తర్వాత నా మాటలు మీలో ఎవరూ వినరు. మీరంతా విజయ్ ఆంటోనీ మాటలు వినేందుకు వెయిట్ చేస్తున్నారని తెలుసు. "తుఫాన్" ఒక మంచి సినిమా. మీరంతా విజయ్ ఆంటోనీ గారి బిచ్చగాడు సినిమాను ఎంతగా ఎంజాయ్ చేశారో "తుఫాన్"  సినిమాను కూడా అలాగే ఆస్వాదిస్తారు. అన్నారు.


నిర్మాత ధనుంజయన్ మాట్లాడుతూ - "తుఫాన్" సినిమా టీజర్, ట్రైలర్ మీరంతా చూశారు. మీ అందరికీ నచ్చాయని అనుకుంటున్నా. ట్రైలర్ ఇంట్రడక్షన్ ఈవెంట్ ను ఇలా మీ అందరి మధ్యలో గ్రాండ్ గా నిర్వహించాలని కోరుకున్నాం. మీరంతా వచ్చినందుకు సంతోషంగా ఉంది. "తుఫాన్" సినిమా యాక్షన్, ఎమోషన్ వంటి అన్ని అంశాలతో ఆకట్టుకుంటుంది. ట్రైలర్ లాగే సినిమానూ మీరంతా థియేటర్స్ లో ఎంజాయ్ చేయబోతున్నారు. ఈ నెల 26వ తేదీన  "తుఫాన్"  సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. అన్నారు.


డైరెక్టర్ విజయ్ మిల్టన్ మాట్లాడుతూ - "తుఫాన్"  సినిమా ట్రైలర్ ఇంట్రడక్షన్ ఈవెంట్ ఇంత గ్రాండ్ గా చేసుకోవడం సంతోషంగా ఉంది. నాకు ఈ మూవీ చేసే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్క కు, విజయ్ ఆంటోనీ గారికి థ్యాంక్స్. మేఘా ఆకాష్ ఈ మూవీలో చాలా బాగా నటించింది. భాష్యశ్రీ గారు "తుఫాన్"  స్ట్రైట్ తెలుగు సినిమా అనేంత బాగా రచన చేశారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. "తుఫాన్"  మూవీ మీ అందరికీ నచ్చుతుంది. అన్నారు.


హీరోయిన్ మేఘా ఆకాష్ మాట్లాడుతూ - మా "తుఫాన్"  మూవీ టీమ్ మీద మీరంతా చూపిస్తున్న లవ్ అండ్ సపోర్ట్ కు థ్యాంక్స్. "తుఫాన్"  నా కెరీర్ లో ఒక స్పెషల్ మూవీ. ఈ సినిమాలో లవ్, రొమాన్స్, యాక్షన్, ఎమోషన్, మంచి సాంగ్స్ అన్నీ ఉన్నాయి. మీ అందరినీ థియేటర్స్ లో ఎంటర్ టైన్ చేసేందుకు ఈ నెల 26వ తేదీన రిలీజ్ కు వస్తున్నాం. ఈ సినిమాలో విజయ్ గారితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. తప్పకుండా "తుఫాన్"  మూవీ చూడండి. అన్నారు.


హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ - మీరంతా చూపిస్తున్న లవ్ అండ్ ఎఫెక్షన్ కు చాలా థ్యాంక్స్. హైదరాబాద్ లో త్వరలో ఒక లైవ్ కాన్సర్ట్ చేస్తాను. "తుఫాన్" ను  ఈనెల 26న థియేటర్స్ లోకి తీసుకొస్తున్నాం. మీతో కలిసి నేనూ ఈ సినిమా థియేటర్స్ లో చూడాలని అనుకుంటున్నా. "తుఫాన్" వంటి మంచి మూవీ నాకు ఇచ్చిన దర్శకుడు విజయ్ మిల్టన్ గారికి థ్యాంక్స్. ఆయన అద్భుతమైన దర్శకుడే కాదు సినిమాటోగ్రాఫర్ కూడా. "తుఫాన్" సినిమాకు ఎక్స్ లెంట్ విజువల్స్ క్యాప్చర్ చేశారు. ఈ సినిమా నేపథ్యం కొత్తగా ఉంటుంది. మేఘా నేనూ పెయిర్ గా ఆకట్టుకుంటాం. మీరంతా "తుఫాన్" సినిమాను ఎంజాయ్ చేస్తారు.నటీనటులు - విజయ్ ఆంటోనీ, శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్ తదితరులు


టెక్నికల్ టీమ్


కాస్ట్యూమ్స్ - షిమోనా స్టాలిన్

డిజైనర్ - తండోరా చంద్రు

యాక్షన్ కొరియోగ్రాఫర్ - సుప్రీమ్ సుందర్

ఆర్ట్ డైరెక్టర్ - అరుముగస్వామి

ఎడిటింగ్ - ప్రవీణ్ కేఎల్

మ్యూజిక్ - అచ్చు రాజమణి, విజయ్ ఆంటోనీ

డైలాగ్ రైటర్ - భాష్య శ్రీ

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

నిర్మాతలు - కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా

రచన, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ - విజయ్ మిల్టన్ 

Director Nag Ashwin to Launch Prince and Naresh Agastya's "Kali" Teaser

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేతుల మీదుగా రేపు రిలీజ్ కానున్న ప్రిన్స్, నరేష్ అగస్త్య "కలి" మూవీ టీజర్ యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటించిన  సినిమా "కలి". ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మించింది. శివ శేషు రచించి దర్శకత్వం వహించారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ డ్రామా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ తుది దశకు చేరుకుంది . త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా టీజర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్..


రేపు సాయంత్రం అనగా 07 వ తారీకు 4.05 నిమిషాలకు "కలి" సినిమా టీజర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిలీజ్ చేయబోతున్నారు. కలి పాత్ర చుట్టూ అల్లుకున్న ఈ కొత్త కథాంశం సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని మూవీ టీమ్ చెబుతున్నారు.

 

నటీనటులు - ప్రిన్స్, నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మని చందన, మధుమణి. తదితరులు.

 

టెక్నికల్ టీమ్:

 

సంగీతం - జీవన్ బాబు

ఎడిటర్ – విజయ్ కట్స్.

సినిమాటోగ్రఫీ – నిషాంత్ కటారి, రమణ జాగర్లమూడి.

పాటలు – సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి,

క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ - రాధాకృష్ణ తాతినేని, ధరణి కుమార్ టీఆర్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఫణీంద్ర

పీఆర్ఓ  - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

సమర్పణ – కె. రాఘవేంద్ర రెడ్డి

నిర్మాత - లీలా గౌతమ్ వర్మ

రచన, దర్శకత్వం - శివ శేషు

 

Producer Chaitanya Reddy Interview About Darling

'డార్లింగ్' కంప్లీట్ ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్ టైనర్. కంటెంట్ అందరికీ కనెక్ట్ అవుతుంది: ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డిప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'డార్లింగ్'. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం ఎంటర్టైనింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేస్తోంది. డార్లింగ్ జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో నిర్మాత చైతన్య రెడ్డి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.


ముందుగా మీకు కంగ్రాట్స్. హను-మాన్ తో పెద్ద సక్సెస్ ని అందుకున్నారు. నిర్మాతగా జర్నీ ఎలా వుంది?

- థాంక్ యూ. హనుమాన్ పీపుల్ సక్సెస్. మేము ఫలితం ఆశించకుండా మా ప్రయత్నం చేశాం. ప్రేక్షకులు గొప్ప విజయాన్ని ఇచ్చారు. ఈ రోజుకి కూడా చాలా మంది 'సన్డేస్ వస్తే మా పిల్లలు హనుమాన్ తప్పకుండా చూస్తారు' అని చెబుతుంటారు. ఇది దేవుడు మాకు ఇచ్చిన వరంగా భావిస్తున్నాం.


హనుమాన్ తర్వాత డార్లింగ్ లాంటి స్క్రిప్ట్ చేయడం ఎలా అనిపించింది ?

- ఇది హనుమాన్ రిలీజ్ కి ముందే షూట్ కూడా స్టార్ట్ అయిపొయింది. ఈ సబ్జెక్ట్ కి డైరెక్టర్, ప్రొడ్యూసర్ ముందు కనెక్ట్ అయ్యారు. వాళ్ళది లవ్ మ్యారేజ్, మాది లవ్ మ్యారేజ్. మ్యారేజ్ అయి పద్నాలుగేళ్ళ తర్వాత లైఫ్ చాలా రొటీన్ అయిపోతుంది. సినిమాకి వెళ్ళడం కూడా ఒక పనిగా చూస్తాం. మొదట్లో ఎలా వున్నాం.. పిల్లలు వచ్చాక జీవితంలో బిజీ అయిపోయిన తర్వాత ఎలా ఉంటున్నాం.. ఈ పాయింట్ డైరెక్టర్ అశ్విన్ చెప్పినప్పుడు చాలా కనెక్ట్ అయ్యాం. కంటెంట్ విన్న వెంటనే ఓకే అన్నాం. ఈ జనరేష్ కి అర్ధమేయ్యేలాగ హ్యుమర్, ఫన్ ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా తీర్చిదిద్దాం. 'డార్లింగ్' అందరికీ కనెక్ట్ అయ్యే ఎంటర్ టైనర్.  


ఈ కథకు ప్రియదర్శి, నభా నటేష్ తీసుకోవడానికి కారణం?  

- హీరోకి చాలా ఇన్నోసెంట్, సింపుల్ బ్యాక్ గ్రౌండ్ వుండాలి. హీరోయిన్ హైఫై, సోషల్ లైఫ్ యాక్టివ్ గా వుండాలి. హీరో హీరోయిన్ కి ఈక్వెల్ ఇంపార్ట్టెన్స్ వుండే క్యారెక్టర్స్. ఈ పాత్రలకు ప్రియదర్శి, నభా పెర్ఫెక్ట్ యాప్ట్ ని భావించాం. ఈ పాత్రలలో లీనమావ్వడానికి రిహర్శల్స్ కూడా చేశారు. చాలా హార్డ్ వర్క్ చేశారు.  


డార్లింగ్ చాలా క్యాచి టైటిల్ కదా ?

- మొదట వైదిస్ కొలవరి అనే టైటిల్ అనుకున్నాం. అయితే హనుమాన్ సక్సెస్ తర్వాత మాకు టైటిల్ ప్రాముఖ్యత తెలిసింది. వైదిస్ కొలవరి అంటే కేవలం యూత్ కే అర్ధమౌతుంది. తర్వాత కొన్ని టైటిల్స్ అనుకున్నాం. చివరికి డార్లింగ్ కి ఫిక్స్ అయ్యాం. అయితే డార్లింగ్ పేరుతో ఇప్పటికే సినిమా వుంది. అప్పుడు వై దిస్ కొలవరి ని ట్యాగ్ లైన్ గా పెట్టాం.

-ఎమోషన్, ఎంటర్ టైన్మెంట్ బ్లెండ్ అయిన మూవీ ఇది. ఇది కంప్లీట్ ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్ టైనర్.


నభా గారికి యాక్సిడెంట్ అయ్యింది కదా. దాని వలన ఈ ప్రాజెక్ట్ ఏదైనా ఎఫెక్ట్ అయ్యిందా ?

-లేదు. తను మళ్ళీ యాక్టింగ్ కి బ్యాక్ అయినప్పుడే మేము అప్రోచ్ అయ్యాం. ఈ సినిమాకి తను పెద్ద ఎసెట్. తను చాలా సపోర్టివ్. చాలా స్వీట్. తనది చాలా పాజిటివ్ రోల్. విమెన్ రెస్పెక్ట్ పెంచేలా ఆ పాత్ర వుంటుంది.


డార్లింగ్ సబ్జెక్ట్ కి యూనివర్సల్ అప్పీల్ వుంది. హనుమాన్ నిర్మాతలుగా మీరు పాన్ ఇండియా పరిచయం అయ్యారు. ఈ సినిమాని కేవలం తెలుగుకే పరిమితం చేయడానికి కారణం ?

-మొదట తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. ప్రేక్షకులకు నచ్చి ఆదరిస్తే.. ఇంకా పెద్ద కాస్ట్ తో రీమేక్ చేయాలనే ఆలోచన వుంది.


డార్లింగ్ అనే పేరు పెట్టారు.. ప్రమోషన్స్ కి ప్రభాస్ గారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా ?

-మేము ఆల్రెడీ అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నించాం. కానీ ఆయన కల్కి తో చాలా బిజీగా వున్నారు. ఆయన టీంకి చాలా సపోర్ట్ గా వుంటారు.  


మ్యూజిక్ డైరెక్టర్ గురించి ?

-వివేక్ చాలా సపోర్ట్ చేశారు. సూపర్ సాంగ్స్ ఇచ్చారు.  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా చేశారు.


సినిమా అనేది ఆర్ట్ ఫారం. మీరు సినిమా, బిజినెస్ ఈ రెండిలో వున్నారు.. ఇందులో ఏది ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ?

-లైఫ్ లో సినిమా చూడకుండా, ఎంటర్ టైన్మెంట్ లేకుండా గడిచిన రోజు లేదు. యూఎస్ లో వున్నప్పుడు రోజుకి నాలుగు గంటలు ఎదో కంటెంట్ ని బ్రౌజ్ చేస్తూనే వుండేవాళ్ళం. సినిమా ఎంటర్ టైన్మెంట్ లైఫ్ లో ఒక భాగం అయిపొయింది. ఇప్పుడు అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది. సినిమాతో పోలిస్తే బిజినెస్ మోర్ ఎంజాయ్ చేస్తాను. బిజినెస్ అంతా నేనే చూసుకుంటా. నేను బిజినెస్ లో క్యాలిఫైడ్. రెండు మాస్టర్స్ చేశాను. టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ వుంది. బిజినెస్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. రెండు రంగాల్లో సక్సెస్ అవ్వడం ఆనందం వుంది. ఈ క్రెడిబిలిటీ అంతా దేవుడికి మా పేరెంట్స్ కి ఇస్తాను. నాకు ఫ్యామిలీ సపోర్ట్ వుంది. నిరంజన్ గారు చాలా సపోర్ట్ చేస్తారు.


జై హనుమాన్ ఎంత వరకూ వచ్చింది ? సంక్రాంతికి వచ్చే పాజిబుల్ అవుతుందా ?

-జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యింది. సంక్రాంతికి పాజిబుల్ అయ్యేలా లేదు. హనుమాన్ కి ఈ రేంజ్ రీచ్ ని ఊహించలేదు. ఒక మార్వల్ లాంటి స్టొరీ తీసుకోస్తునప్పుడు ఆ రీచ్ వుండాలి కాబట్టి కొంచెం టైం తీసుకుని చేద్దామనేది మా ఆలోచన.


హనుమాన్ పాత్రలో ఏ హీరో కనిపించే అవకాశం వుంది ? మీ పర్శనల్ ప్రిఫరెన్స్ ఎవరు ?

-ఇంకా లేదండీ. అది హనుమంతుడే డిసైడ్ చేస్తారు. ఆ పాత్రలో ఎవరు కనిపిస్తారనేది హనుమంతుల వారికే వదిలేశాం.  

-నా పర్శనల్ ప్రిఫరెన్స్ అయితే రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు. మేము సినిమా కంటే దేవుడి కథ చెప్పాలని అనుకుంటున్నాం. ఆయన ఎలా చెప్పించుకుంటారనేది ఆయన ఇష్టం.

-హనుమాన్ సినిమా విషయంలో చిరంజీవి గారి సపోర్ట్ ని మర్చిపోలేం.


స్టొరీ ఫైనల్ జడ్జిమెంట్ ఎవరిది ?

-నిరంజన్ గారిదే. ఆయన నాకంటే చాలా క్రియేటివ్. ఆయన సబ్జెక్ట్ సెలెక్షన్ చాలా బావుటుంది. ప్రొడక్షన్ సైడ్ నా ఇన్వాల్మెంట్ వుంటుంది.  


నెక్స్ట్ లైనప్ లో ఉన్న సినిమాలు ?

చాలా సినిమాలు వున్నాయి. సాయి ధరమ తేజ్ సినిమా అనౌన్స్ చేశాం. ఇంకో పది సినిమాలు ప్రీప్రొడక్షన్ లో వున్నాయి. దాదపు మూడేళ్ళలో ఈ పది సినిమాలు రిలీజ్ కి వచ్చేస్తాయి.  


ఆల్ ది బెస్ట్

-థాంక్ యూ 

Preminchane Pilla lyrical video From Srikakulam Sherlock Holmes Unveiled

 వెన్నెల కిషోర్, రైటర్ మోహన్, శ్రీ గణపతి సినిమాస్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్' నుంచి ప్రేమించానే పిల్లా సాంగ్ రిలీజ్  వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో రైటర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్'. శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్ పై లాస్య రెడ్డి సమర్పణలో వెన్నపూస రమణ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ సాంగ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. 


తాజాగా మేకర్స్ ప్రేమించానే పిల్లా సాంగ్ ని రిలీజ్ చేశారు. సునీల్ కశ్యప్ ఈ సాంగ్ క్యాచి బీట్స్ తో లవ్లీ మెలోడీగా కంపోజ్ చేశారు. పూర్ణాచారి ఆకట్టుకునే లిరిక్స్ అందించగా రాహుల్ సిప్లిగంజ్ హై ఎనర్జిటిక్ వోకల్స్ పాటకు మరింత ఎట్రాక్షన్ ని తీసుకొచ్చాయి. ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది.   


ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. మల్లికార్జున్ ఎన్ డీవోపీ గా, అవినాష్ గుర్లింక ఎడిటర్ గా పని చేస్తున్నారు. రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని సమకూరుస్తున్నారు. బేబీ ఫేం సురేష్ బిమగాని ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. రాజేష్ రామ్ బాల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.


నటీనటులు: వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల , సీయా గౌతమ్, స్నేహ గుప్తా, రవితేజ మహాద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, బద్రం, అనీష్ కురివెళ్ల, నాగ మహేష్, మచ్చ రవి, ప్రభావతి, సంగీత, శుభోదయం సుబ్బారావు, శివమ్ మల్హోత్రా, వాజ్‌పేయ్ ఐడ్రీం నాగరాజు, ఎంవీఎన్ కశ్యప్..


టెక్నికల్ టీం : 

రచన, దర్శకత్వం: రైటర్ మోహన్

బ్యానర్: శ్రీ గణపతి సినిమాస్ 

నిర్మాత: వెన్నపూస రమణ రెడ్డి

సమర్పణ: లాస్య రెడ్డి 

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రాజేష్ రామ్ బాల

సంగీతం: సునీల్ కశ్యప్ 

డీవోపీ: మల్లికార్జున్ ఎన్

ఎడిటర్ : అవినాష్ గుర్లింక

ఆర్ట్ డైరెక్టర్ : బేబీ సురేష్

స్టంట్స్: డ్రాగన్ ప్రకాష్

పీఆర్వో: వంశీ శేఖర్

Mr. Bachchan First Single Sitar on July 8th

మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్, TG విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 'మిస్టర్ బచ్చన్' ఫస్ట్ సింగిల్ సితార్ జూలై 8న రిలీజ్ మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కిక్కాస్ మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మిస్టర్ బచ్చన్' కోసం మరోసారి కలిశారు. మాస్ మహారాజా, మాస్ మేకర్ మాస్ రీయూనియన్ మునుపెన్నడూ లేని ఎక్స్ పీరియన్స్ ని అందించనుంది. రీసెంట్ గా రిలీజైన షోరీల్ వీడియో కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. 


మేకర్స్ ఇప్పుడు 'మిస్టర్ బచ్చన్' మ్యూజిక్ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ సింగిల్ సితార్ సాంగ్ జులై 8న రిలీజ్ కానుంది. స్టార్ కంపోజర్ మిక్కీ జె మేయర్ ఈ సినిమా కోసం అదిరిపోయే ఆల్బం కంపోజ్ చేశారు. 


రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మ్యూజికల్ గా హిట్స్ గా ఆలరించాయి. 'మిరపకాయ్' ఆడియో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 'మిస్టర్ బచ్చన్' ఆల్బమ్ కూడా చార్ట్ బస్టర్ హిట్ కాబోతోంది.    


ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ నటిస్తుండగా, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ ప్రాజెక్ట్‌ని గ్రాండ్‌గా నిర్నిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.


ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు, అయనంక బోస్ డీవోపీ కాగా బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్, ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి.


రవితేజ, హరీష్ శంకర్, అద్భుతమైన ప్రొడక్షన్ టీం సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో వస్తున్న "మిస్టర్ బచ్చన్" కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.


నటీనటులు: రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సచిన్ ఖేడేకర్


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: హరీష్ శంకర్

నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్

సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల

బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

సమర్పణ: పనోరమా స్టూడియోస్ & T-సిరీస్

సంగీతం: మిక్కీ జె మేయర్

డీవోపీ: అయనంక బోస్

ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి

ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో

మేకప్ చీఫ్: ఐ శ్రీనివాసరాజు

 

Oh Bhama AyyoRama Team Birthday Wishes to Malavika Manoj

 


జో సినిమాతో పరిచయమై యువత హృదయాలు దోచుకున్న మాళవిక మనోజ్. ఇప్పుడు సుహాస్ సరసన ప్రేమ‌క‌థా చిత్రం అయిన ‘ఓ భామ అయ్యో రామ’లో నటిస్తుంది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే మొదలైంది. విఆర్ట్స్అండ్ చిత్ర‌ల‌హ‌రి టాకీస్ ప‌తాకంపై హ‌రీష్ న‌ల్లా, ప్ర‌దీప్ తళ్లపు రెడ్డి  ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. రామ్ గోదాల ద‌ర్శ‌కుడుగా చేస్తున్నారు.


అయితే ఈరోజు ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న మాళవిక మనోజ్ పుట్టినరోజు కావడంతో తనకి విషెస్ చెప్తూ, చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఒక కొలనులో పింక్ కలర్ పడవ మీద తామర పువ్వుల మధ్యలో హీరోయిన్ మాళవిక మనోజ్ క్యూట్ గా నుంచున్న ఫోస్ ని రిలీజ్ చేశారు. మరో సారి ఈ అందాల భామ యువత హృదయాలను దోచుకోవడానికి తెలుగులో  ‘ఓ భామ అయ్యో రామ’తో ప్రేక్షకుల ముందుకు రానుంది.  


ఈ చిత్రంలో సుహాస్‌, మాళ‌విక మ‌నోజ్‌, అనిత హ‌స్సా నంద‌ని, అలీ, త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌: మ‌ణికంద‌న్‌, సంగీతం: ర‌థ‌న్‌, ఆర్ట్ : బ్ర‌హ్మా క‌డ‌లి, కో ప్రొడ్యూస‌ర్ ఆనంద్ గ‌డ‌గోని, ఎడిట‌ర్‌: భ‌వీన్ ఎమ్‌.షా, కాస్ట్యూమ్ డిజైన‌ర్స్‌: అశ్వ‌త్ అండ్ ప్ర‌తిభ‌, పీఆర్ ఓ : ఏలూరు శ్రీ‌ను, మ‌డూరి మ‌ధు, నిర్మాత‌లు: హ‌రీష్ న‌ల్లా, ప్ర‌దీప్ తళ్లపు రెడ్డ, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: రామ్ గోదాల


Both Cm's Should Discuss on Telugu Cinema Industry Issues TFCC President Prathani Rama Krishna Goud

ఇద్దరు సీఎంల భేటీలో తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించాలి - టీఎఫ్ సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్
ఈ రోజు ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో సమావేశమవుతున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలపై వారు చర్చించనున్నారు. ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలను సైతం పరిష్కరించేలా చర్చ జరగాలని కోరారు టీఎఫ్ సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్. ఈ మేరకు ఆయన పలు సూచనలు చేశారు. 


*ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ* - తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు సమావేశమై ఇరు రాష్ట్రాల సమస్యలపై చర్చలు జరపడం ఆహ్వానించదగ్గ విషయం. ఇదే సందర్భంలో తెలుగు చిత్ర పరిశ్రమ గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరగాలని కోరుకుంటున్నాను. ఒక సీనియర్ నిర్మాతగా, దర్శకుడిగా నేను వారి దృష్టికి కొన్ని సమస్యలు తీసుకురావాలని భావిస్తున్నా. తెలుగు సినిమా పరిశ్రమలో యూఎఫ్ వో, క్యూబ్ వంటి డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల రేట్లు నిర్మాతలకు భారంగా మారాయి. ఇతర రాష్ట్రాల్లో రెండు మూడు వేలు ఉన్న యూఎఫ్ వో, క్యూబ్ రేట్లు మన దగ్గర పది నుంచి పదిహేను వేల దాకా వసూలు చేస్తున్నారు. ఇండస్ట్రీలోని కొందరు పెద్దలు ఈ కంపెనీలకు అడ్వైజర్లుగా ఉండి ఈ వ్యాపారానికి సపోర్ట్ చేస్తున్నారు. ప్రపంచం గర్వించేలా ఎదుగుతున్న తెలుగు సినిమాకు మాత్రం ఇతర రాష్ట్రాల కంటే క్యూబ్, యూఎఫ్ వో ఎక్కువ వసూలు చేస్తున్నాయి. దీనిపై గతంలో నేను నిరాహారదీక్ష చేశాను. అయినా మార్పు రాలేదు. గతంలో 50 వేలకు ఒక  ప్రింట్ చొప్పున పది ప్రింట్లు కొంటే నిర్మాతకు అదే సరిపోయేది. చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకడం లేదు. మెయిన్ సెంటర్స్ లో థియేటర్స్ కు రెంట్ సిస్టమ్ ఉంది. ఇది చిన్న నిర్మాతలకు తమ సినిమాల రిలీజ్ టైమ్ లో ఇబ్బందిగా మారుతోంది. టికెట్ బుకింగ్స్ కూడా ప్రైవేట్ కంపెనీల ద్వారా కాకుండా ప్రభుత్వమే ఎఫ్ డీసీ ద్వారా చేయిస్తే ప్రైవేట్ వారికి అనసరంగా డబ్బులు పోకుండా ఉంటాయి. థియేటర్స్ లో తినుబండారాల రేట్లు విపరీతంగా ఉంటున్నాయి. వాటిని తగ్గించాలి. చిన్న చిత్రాలకు అప్పట్లో పది లక్షల రూపాయల రాయితీ ఇచ్చేవారు. ఇప్పడు కూడా అలాంటి సిస్టమ్ తీసుకొచ్చి..ఇరవై నుంచి యాభై లక్షల రూపాయల రాయితీ ఒక్కో చిన్న చిత్రానికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. దాని వల్ల చిన్న సినిమా బతుకుతుంది. ఇవాళ తెలుగులో తెరకెక్కే సినిమాల్లో నూటికి 90శాతం చిన్న చిత్రాలే. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా  షూటింగ్స్ కు ఉచితంగా పర్మిషన్స్ ఇవ్వాలి. అలాగే షూటింగ్స్ జరిగే ప్రాంతంలో చిత్ర యూనిట్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం మా సంస్థలో దీక్ష అనే సినిమాను రూపొందిస్తున్నాను. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. దీక్ష సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. మంచి పాటలు, ఫైట్స్ తో దీక్ష సినిమా ఘన విజయం సాధిస్తుంది. అన్నారు. 

Bharateeyudu 2 (Indian 2) pre-release event in Hyderabad on 7th July

 యూనివ‌ర్శ‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, శంకర్, లైకా ప్రొడ‌క్ష‌న్స్ , రెడ్ జెయింట్ బ్యాన‌ర్స్ భారీ పాన్ ఇండియా చిత్రం ‘భారతీయుడు 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 7న హైద‌రాబాద్‌లో!యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. జులై 7న భార‌తీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. 

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. చిత్ర యూనిట్ ప్రమోషనల్ ప్లానింగ్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఇప్పటికే విడుద‌లైన పాట‌లు, ఇండియ‌న్ 2 ఇంట్రో గ్లింప్స్‌, ట్రైల‌ర్‌తో సినిమాపై అంచ‌నాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి. 


భార‌తీయుడు 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 7న హైద‌రాబాద్‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. జులై 7న సాయంత్రం ఆరు గంట‌ల నుంచి ఎన్ క‌న్వెన్ష‌న్‌లో భార‌తీయుడు 2 వేడుక జ‌ర‌గ‌నుంది. 


https://x.com/beyondmediapres/status/180922038104109889


28 ఏళ్ల ముందు భారతీయుడు చిత్రంతో బాక్సాఫీస్ సెన్సేష‌న్ క్రియేట్ చేసిన క‌మ‌ల్ హాసన్‌, శంక‌ర్ కాంబోలో వ‌స్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భారతీయుడు 2’. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అంద‌రిలోనూ ఆస‌క్తి పెరిగిపోతుంది. ఈ త‌రుణంలో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌డానికి న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు భాగ్య‌న‌గ‌రంలో భారీ వేడుక‌ను ఏర్పాటు చేస్తున్నారు.  

సినిమాపై  భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. సేనాపతిగా మరోసారి కమల్ హాసన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయబోతున్నారోనంటూ అభిమానులు, సినీ ప్రేమికులు, ట్రేడ్ వర్గాలు స‌హా అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ర‌వివ‌ర్మ‌న్  సినిమాటోగ్ర‌ఫీ అందించిన ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందించగా, ఎ.శ్రీక‌ర ప్ర‌సాద్ ఎడిట‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా టి.ముత్తురాజ్ గా వ‌ర్క్ చేశారు. బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ‌కుమార్‌ల‌తో క‌లిసి డైరెక్ట‌ర్ శంక‌ర్ స్క్రీన్ ప్లే అందించారు. 


లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, రెడ్ జైంట్ మూవీస్  రూపొందిస్తోన్న భారీ బ‌డ్జెట్‌తో ‘భార‌తీయుడు 2’లో క్రియేటివ్ బ్రిలియ‌న్స్  క్రియేట్ చేస్తున్నారు. ఇది సినిమా ప్ర‌పంచంలో ఓ స‌రికొత్త మైలురాయిని క్రియేట్ చేయ‌టానికి సిద్ధంగా ఉంది. సినిమా చూసే ప్రేక్ష‌కుల్లో గొప్ప ఆలోచ‌న రేకెత్తించేలా సినిమాలు చేస్తూ త‌న అభిరుచి చాటుకుంటున్న లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్ జూలై 12న‌ ఇండియన్ 2 పేరుతో త‌మిళంలో, భార‌తీయుడు 2 పేరుతో తెలుగు, హిందుస్థానీ పేరుతో హిందీలో ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. సోనీ మ్యూజిక్ ద్వారా ‘భారతీయుడు 2’ పాటలు మార్కెట్లో సంద‌డి చేస్తున్నాయి. న‌టీన‌టులు:


క‌మ‌ల్ హాస‌న్‌, ఎస్‌.జె.సూర్య‌, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, నెడుముడి వేణు, వివేక్‌, కాళిదాస్ జ‌య‌రాం, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌, స‌ముద్ర‌ఖ‌ని, బాబీ సింహ‌, బ్ర‌హ్మానందం, జాకీర్ హుస్సేన్‌, పియుష్ మిశ్రా, గురు సోమ‌సుంద‌రం, డిల్లీ గ‌ణేష్, జ‌య‌ప్రకాష్‌, మ‌నోబాల‌, అశ్వినీ తంగ‌రాజ్ త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం:


క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం:  ఎస్‌.శంక‌ర్‌, స్క్రీన్ ప్లే: ఎస్‌.శంక‌ర్‌, బి.జ‌య‌మోహ‌న్‌, క‌బిల‌న్ వైర‌ముత్తు, ల‌క్ష్మీ శ‌ర‌వ‌ణ కుమార్‌, మ్యూజిక్ : అనిరుద్ ర‌విచంద్ర‌న్‌, ఎడిటింగ్:  ఎ.శ్రీక‌ర్ ప్ర‌సాద్‌, సినిమాటోగ్ర‌ఫీ:  ర‌వివ‌ర్మ‌న్‌, ఆర్ట్‌:  ముత్తురాజ్‌, స్టంట్స్‌: అన‌ల్ అర‌సు, అన్బ‌రివు, రంజాన్ బుల‌ట్‌, పీట‌ర్ హెయిన్స్‌, స్టంట్ సిల్వ‌, డైలాగ్ రైట‌ర్‌:  హ‌నుమాన్ చౌద‌రి, వి.ఎఫ్‌.ఎక్స్ సూప‌ర్ వైజ‌ర్‌:  వి.శ్రీనివాస్ మోహ‌న్‌, కొరియోగ్ర‌ఫీ:  బాస్కో సీజ‌ర్‌, బాబా భాస్క‌ర్‌, పాట‌లు:  శ్రీమ‌ణి, సౌండ్ డిజైన‌ర్‌:  కునాల్ రాజ‌న్‌, మేక‌ప్ :  లెగ‌సీ ఎఫెక్ట్‌-వాన్స్ హర్ట్‌వెల్‌- ప‌ట్ట‌ణం ర‌షీద్‌, కాస్టూమ్ డిజైన్‌:  రాకీ-గ‌విన్ మ్యూగైల్‌- అమృతా రామ్‌-ఎస్‌బి స‌తీష‌న్‌-ప‌ల్లవి సింగ్-వి.సాయి, ప‌బ్లిసిటీ డిజైన‌ర్: క‌బిల‌న్ చెల్ల‌య్య ,పి.ఆర్‌.ఒ (తెలుగు):  నాయుడు సురేంద్ర కుమార్‌, ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  సుంద‌ర్ రాజ్‌, హెడ్ ఆఫ్ లైకా ప్రొడ‌క్ష‌న్స్‌:  జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్‌, రెడ్ జైంట్ మూవీస్‌:  సెన్‌బ‌గ మూర్తి, నిర్మాత‌:  సుభాస్క‌ర‌న్‌.

Saikumar's ferocious look from the film 'Pranayagodari'

శాస‌న‌స‌భ్యులు కోమటిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేసిన‌  ‘ప్రణయగోదారి’ చిత్రంలోని సాయికుమార్ ఫెరోషియ‌స్ లుక్‌!ఎటువంటి పాత్ర‌నైనా అవ‌లీల‌గా పోషించి, ఆ పాత్ర‌లోకి ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి, వాటికి జీవం పోసి ప్రేక్ష‌కుల‌ను మెప్పించే న‌టుడు  డైలాగ్  కింగ్ సాయికుమార్... త్వ‌ర‌లో ఆయ‌న మ‌రో ఫెరోషియ‌స్ పాత్ర‌తో ఆడియ‌న్స్‌ను స‌ర్‌ఫ్రైజ్ చెయ్య‌బోతున్నారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం  `ప్ర‌ణ‌య‌గోదారి`లో సాయికుమార్ పెద‌కాపు  అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ హాస్య‌న‌టుడు 

అలీ కుటుంబానికి చెందిన  నటుడు సదన్ హీరోగా నటిస్తున్నాడు. ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్ రావినూతల ముఖ్య పాత్రలో నటిసున్నారు.

పిఎల్‌వి క్రియేషన్స్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా పారమళ్ళ లింగయ్య ఈ ‘ప్రణయగోదారి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా సాయికుమార్  లుక్‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను శుక్ర‌వారం తెలంగాణ శాస‌న‌స‌భ్యులు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి విడుద‌ల చేశారు. 


 ఈ సంద‌ర్భంగా కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ‘మా మునుగోడు ప్రాంతానికి చెందిన పారుమ‌ళ్ళ లింగ‌య్య ‘ప్ర‌ణ‌య‌గోదారి’అనే ఓ మంచి సినిమాను నిర్మించినందుకు అభినంద‌న‌లు. సినిమా రంగంలో ఆయ‌న‌కు మంచి భ‌విష్య‌త్ వుండాల‌ని కోరుకుంటున్నాను. పారుమ‌ళ్ళ లింగయ్యకు నా స‌హ‌కారం ఎప్పుడూ వుంటుంది. త‌ప్ప‌కుండా "ప్ర‌ణ‌య‌గోదారి" సినిమా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో మంచి విజ‌యం సాధించాల‌ని ఆశిస్తున్నాను. భ‌విష్య‌త్‌లో లింగయ్య ఇలాంటి సినిమాలు మ‌రిన్ని నిర్మించాల‌ని కోరుకుంటున్నాను' అన్నారు.


 చిత్ర ద‌ర్శ‌క నిర్మాత‌లు  మాట్లాడుతూ`సాయికుమార్ లుక్‌ను విడుద‌ల చేసి, మా కంటెంట్‌ను మెచ్చుకొని అభినందించి, శుభాకాంక్ష‌లు అంద‌జేసిన   మునుగోడు ఎమ్మేల్యే కోమ‌టి రెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి గారికి మా యూనిట్ త‌ర‌పున కృత‌జ్ఞత‌లు తెలియ‌జేస్తున్నాం. ఫీల్‌గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని వ‌ర్గాల వారిని అల‌రించే అంశాలున్నాయి. ఈ సినిమా ప్రేక్షకులకు డిఫరెంట్ అనుభూతి కలిగించే కథతో వ‌స్తోంది. టైటిల్‌కి తగ్గట్టుగా నాచురల్ లొకేషన్స్ లో చిత్రీక‌ర‌ణ చేస్తున్నాం. గోదారి అందాలు, అక్కడి ప్రజల జీవన విధానాలు చిత్రంలో క‌నిపిస్తాయి. కొత్త‌ద‌నం ఆశించే ప్రేక్ష‌కుల‌కు మా చిత్రం త‌ప్ప‌కుండా న‌చ్చ‌తుంద‌నే న‌మ్మ‌కం వుంది.  అతి త్వరలోనే విడుద‌ల తేదిని  ప్ర‌క‌టిస్తాం' అన్నారు. 


“చూడ‌గానే గంభీరంగా క‌నిపించే లుక్‌లో..రౌద్రంగా క‌నిపంచే మీస‌క‌ట్టు, తెల్ల‌ని పంచె, లాల్చీతో, మెడ‌లో రుద్రాక్ష‌మాల‌, చేయికి కంక‌ణంతో..చేతిలో సిగార్‌తో... చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఈ పోస్ట‌ర్‌లో క‌నిపిస్తున్నారు సాయికుమార్‌. ఈ పోస్ట‌ర్‌ను చూస్తే చిత్రంలో ఆయ‌న పాత్ర ఎంత శ‌క్తివంతంగా వుంటుందో అర్థం చేసుకోవ‌చ్చు”


స‌ద‌న్‌, ప్రియాంక ప్ర‌సాద్‌, సాయికుమార్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:  మార్కండేయ, కెమెరా: ఈద‌ర ప్ర‌సాద్‌, చీఫ్ కో-డైరెక్ట‌ర్‌: జ‌గ‌దీష్ పిల్లి, డిజైనింగ్‌: టీఎస్ఎస్ కుమార్‌, అస్టిస్టెంట్ డైరెక్ట‌ర్‌: గంట శ్రీ‌నివాస్‌, కొరియోగ్ర‌ఫీ: క‌ళాధ‌ర్‌, మోహ‌న‌కృష్ణ‌, ర‌జిని, ఎడిట‌ర్‌:  కొడ‌గంటి వీక్షిత వేణు, ఆర్ట్‌:  విజ‌య‌కృష్ణ, క్యాస్టింగ్ డైరెక్ట‌ర్:  వంశీ ఎమ్ 

Ijjath Movie Title Launch

ఇజ్జత్ టైటిల్ పోస్టర్ విడుదలదర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ఇజ్జత్ టైటిల్ పోస్టర్ విడుదలసన్నిహిత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ మరియు బ్రెయిన్ వాష్ సినిమా పతాకంపై నటి లావణ్య ప్రధాన పాత్రలో ఉపేంద్ర ఎస్ పి దర్శకత్వం లో శ్రీను కందుల నిర్మిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రం "ఇజ్జత్". షూటింగ్ అంత పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీ గా ఉంది. అయితే ఈ రోజు ఈ చిత్రం యొక్క టైటిల్ పోస్టర్ ను దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి గారు విడుదల చేశారు.


అనంతరం దర్శకుడు ఉపేంద్ర ఎస్ పి మాట్లాడుతూ "మా ఇజ్జత్ చిత్రం ఒక మధ్యతరగతి అమ్మాయి కథ. ప్రేమ పెళ్లి ని వ్యతిరేకించి, పరువు పేరుతో ఓ కుటుంబం తమ కూతురి ప్రాణాలు తీయడానికి సిద్ధం అయితే, ఆ ఆడపిల్ల తిరగబడితే ఎలా ఉంటుందో తెలియపరిచే చిత్రమే ఇజ్జత్. పరువు హత్య ల మీద వచ్చిన చిత్రాలకంటే మా చిత్రం భిన్నంగా ఉంటుంది. కొత్త కథనం తో మంచి క్వాలిటీ విజువల్స్ తో మా చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. త్వరలో విడుదల చేస్తాం" అని తెలిపారు.చిత్రం పేరు : ఇజ్జత్


హీరోయిన్ : లావణ్య


బ్యానర్ : సన్నిహిత్ ఆర్ట్స్ ప్రొడక్షన్, బ్రెయిన్ వాష్ సినిమా


డి ఓ పి : వి ఆర్ కె నాయుడు


ఎడిటర్ : సత్య గిడుతూరి


యాక్షన్ : వింగ్ చున్ అంజి


మ్యూజిక్ : సురేష్ బొబ్బిలి


బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : రియాన్


లిరిక్స్ : డి వి కృష్ణ


ఆర్ట్ : శ్రీధర్


కాస్టూమ్స్ : విజయ


మేకప్ : మాధవ్


ఎస్ ఎఫ్ ఎక్స్ : హేమంత్


సి జి మరియు డి ఐ : డెక్కన్ డ్రీమ్స్


సౌండ్ మిక్స్ : కృష్ణ కడియాల


కో డైరెక్టర్ : ఎస్ ఎస్ రాజు


చీఫ్ అసోసియేట్ డైరెక్టర్ : ఉదయ్ కిరణ్


లైన్ ప్రొడ్యూసర్ : శివ రెడ్డి


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శ్రీనివాస్ కానగర్తి


పి ఆర్ ఓ : పాల్ పవన్


డిజిటల్ టీం : ఎస్ 3 డిజిటల్ మీడియా


కో ప్రొడ్యూసర్ : మోహన్


కథ, దర్శకత్వం : ఉపేంద్ర ఎస్ పి


నిర్మాత : శ్రీను కందుల

"World Tour Lyrical Video" Out From TUK TUK

 టుక్ టుక్ చిత్రం నుంచి తొలి లిరిక‌ల్ సాంగ్  వ‌ర‌ల్డ్‌టూర్  న‌జభ‌జ జ‌..జ‌..ర క‌థ‌లెన్నో విన‌రా… మ‌న‌క‌థ విన‌నిది రా.. విడుద‌లహ‌ర్షరోహ‌న్‌, కార్తీకేయ దేవ్‌, స్టీవెన్ మ‌ధు, సాన్వీ మేఘ‌న‌, నిహాల్ కోధాటి ముఖ్య‌తార‌లుగా న‌టిస్తున్న ఫ‌న్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ టుక్ టుక్‌. చిత్రవాహిని మరియు ఆర్ వై జి బ్యానర్‌ల ప‌తాకంపై  రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ‌వ‌రుణ్‌, శ్రీ‌రాముల రెడ్డి, సుప్రీత్‌.సి. కృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సి.సుప్రీత్ కృష్ణ ద‌ర్శ‌కుడు. ఇటీవల విడుద‌లైన ఈ చిత్రం ప్ర‌చార చిత్రాలు అంద‌ర్ని ఆక‌ట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి లిరిల‌క్‌సాంగ్‌గా వ‌ర‌ల్డ్‌టూర్  న‌జభ‌జ జ‌జ‌ర క‌థ‌లోన్నో విన‌రా... మ‌న‌క‌థ విన‌నిది రా.. అనే సాంగ్‌ను విడుద‌ల చేశారు. సంతు ఓంకార్ సంగీతాన్ని అందించిన ఆల‌పించిన ఈ పాట‌కు ద‌ర్శ‌కుడు సుప్రీత్ సాహిత్యం అందించారు. యూత్‌ఫుల్ ట్రెండీగా సాంగ్‌గా ఈ చిత్రం గీతం అంద‌ర్ని ఆక‌ట్టుకునే విధంగా వుంది. ట్యూన్ అండ్ లిరిక్స్ క్యాచీగా వున్నాయి. ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ

"టుక్ టుక్ష ఇదొక ఒక ఆహ్లాదకరమైన సినిమాటిక్ అనుభూతిని అందిచేలా  చిత్రం వుంటుంది. సినిమాలో వుండే ఓ స‌రికొత్త ఫాంట‌సీ ఎలిమెంట్స్ ఆడియ‌న్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసే విధంగా వుంటుంది. ఆ ఫాంట‌సీ ఎలిమెంట్స్‌తో పాటు చిత్రంలోని ప్ర‌తి స‌న్నివేశం ఆడియ‌న్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేసే విధంగా వుంటుంది. కొత్త‌ద‌నం ఆశించే ప్రేక్ష‌కుల‌కు పూర్తిగా సంతృప్తిప‌రిచే చిత్రం ఇది. ముఖ్యంగా యూత్‌కు న‌చ్చే అన్నిఅంశాలు ఈచిత్రంలో వున్నాయి అన్నారు."టుక్ టుక్" ఒక ఉత్తేజకరమైన సినిమాటిక్ రైడ్‌గా ఎక్స్పీరియన్‌గా అన్ని వ‌ర్గాల ఆడియ‌న్స్‌ను మెప్పిస్తుంద‌నే న‌మ్మ‌కం వుంది అన్నారు.


తారాగణం:

హర్ష రోషన్

కార్తికేయ దేవ్

స్టీవెన్ మధు

సాన్వీ మేఘన

నిహాల్ కోధాటి


సాంకేతిక నిపుణులు:

దర్శకుడు: సి.సుప్రీత్ కృష్ణ

సినిమాటోగ్రాఫర్: కార్తీక్ సాయికుమార్

సంగీతం: సంతు ఓంకార్

ఎడిటర్: అశ్వత్ శివకుమార్

నిర్మాతలు:

రాహుల్ రెడ్డి

లోక్కు శ్రీ వరుణ్

శ్రీరాముల రెడ్డి

సుప్రీత్ సి కృష్ణ

పి ఆర్ ఓ: ఏలూరు శ్రీను, మాడురి మధు

డిజిటల్ మీడియా : పిక్చర్ పిచ్

”HE WAS A BEAST!” Wolverine aka Hugh Jackman reveals his obsession for Cricket

‘డెడ్‌పూల్ & వుల్వరైన్’ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్. ఈ ప్రమోషన్స్ లో భాగంగా  వుల్వరైన్ అకా హ్యూ జాక్‌మన్ ని ఒక ఇంటర్వూలో ‘మీరు భయంకరమైన క్రికెట్ అభిమాని కదా?’ అని అడిగినప్పుడు వుల్వరైన్ ‘అవును’ అని చెప్తారు. అపుడు ఆ ఇంటర్వ్యూయర్ ఇలా అడుగుతాడు ‘మీకు ప్రస్తుతం క్రికెట్ లో ఎవరంటే బాగా ఇష్టం? అనో అడగగా. దానికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ‘రోహిత్’ అని సమాధానం చెప్తారు హ్యూ జాక్‌మన్. రోహిత్ శర్మ రీసెంట్ గా ఇండియా కి వరల్డ్ కప్ సాధించాడు అని అడిగినప్పుడు. ‘నాకెందుకు తెలీదు. రోహిత్ ఒక బీస్ట్ లాగా ఆడతాడు. నాకు అతని ఆట చూడడం చాలా ఇష్టమని’ తన అభిమానాన్ని ఎవర్‌గ్రీన్ సూపర్‌స్టార్ హ్యూ జాక్‌మన్ చాటుకున్నారు.


హ్యూ జాక్‌మన్ రోహిత్ పై తన అభిప్రాయాన్ని చెప్పడం వలన భారత దేశంలోని కోట్లమంది గుండెల్లో హ్యూ జాక్‌మన్ ఆనందం నింపేలా చేశారు. మార్వెల్ స్టూడియోస్ డెడ్‌పూల్ & వుల్వరైన్ జూలై 26న ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ ఒక్క మాటతో ఈ సినిమా ప్రమోషన్ స్థాయి దేశ వ్యాప్తంగా పెరిగిపోయింది 

"Gally Gang Stars," on July 26

 'ఏ బి డి ప్రొడక్షన్స్'  సంస్థ నుండి విడుదల కానున్న రెండో సినిమా

"గల్లీ గ్యాంగ్ స్టార్స్" - జూలై 26 న సినిమా విడుదల'క్లూ', 'మంచి కాఫీ లాంటి కధ' లాంటి షార్ట్ ఫిలిమ్స్ లో  నటించిన సంజయ్ శ్రీ రాజ్ (Sanjay Sree Raj)ను  హీరోగా పరిచయం చేస్తూ ప్రియ శ్రీనివాస్'హీరోయిన్ గా పరిచయం చేస్తున్న సినిమా 'గల్లీ గ్యాంగ్ స్టార్స్'.  'మే 16' అనే ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించిన సంస్థ 'ఏ బి డి ప్రొడక్షన్స్' మరో అడుగు ముందుకు వేస్తూ 'గల్లీ గ్యాంగ్ స్టార్స్' అనే సినిమాతో ప్రజల ముందుకు వస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమా లోని పాటలు 'ఆపిల్ మ్యూజిక్' 'స్పోటిఫై' 'అమెజాన్ మ్యూజిక్'  'రిసో ప్లేయర్' 'హుంగమ' 'జియో సావన్' 'గాన' 'యుట్యూబ్ మ్యూజిక్' తదితర మాధ్యమాలల్లో అందరిని అలరిస్తున్నాయి. ఈ చిత్రంలోని 'భోలో శంకరా' పాటకి విశేష ఆదరణ లభించింది.


దర్శకులు ధర్మ గారు మాట్లాడుతూ " 'గల్లి గ్యాంగ్ స్టార్స్' అనే సినిమాని నెల్లూరు లో షూట్ చెయ్యటం జరిగింది అని. ఈ సినిమా ఒక గల్లీ లో నివసించే అనాధలు వాళ్ళు ఎదురుకునే సంఘటనల సమూహం" అని వివరించారు. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ- ఎడిటింగ్- డి ఐ- దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు తో పాటు కధలో కూడా ఆయన పాత్ర ఎంతో ఉంది. గల్లీ గ్యాంగ్ స్టార్స్ సినిమా  డైరెక్టర్ వెంకటేష్ కొండిపోగు ఏ ఈ కథకి కథ రచయత కూడా.


ప్రొడ్యూసర్ డా. ఆరవేటి యశోవర్ధన్ గారు మాట్లాడుతూ "ఈ సినిమా క్రైమ్ డ్రామా చుట్టూ జరుగుతుంది అని ఇందులో నాలుగు ముఖ్య పాత్రలు అనాధలు అని వాళ్ళ జీవితాలు ఎలా ఎవరి వల్ల మలుపు తిరుగుతుందో తెలుసుకోవాలి అంటే సినిమా తప్పకుండా చూడాలని, మాస్ ప్రేక్షకులకి తప్పక నచ్చి తీరుతుంది" అని చెప్పుకొచ్చారు.


ప్రొడ్యూసర్, దర్శకులు ఇద్దరూ ఎంతో కష్టపడి తీసిన ఈ సినిమా ప్రజాదరణ పొందాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. చిన్న సినిమాని తప్పక ప్రేక్షకులు ఆదరిస్తారు అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా జులై 26 న రిలీజ్ అవుతుంది అని తెలియచేశారు.


నటీనటులు :

సంజయ్ శ్రీ రాజ్, ప్రియ శ్రీనివాస్, భరత్ , రితిక, Rj బాలు, చందు, తారక్, మురళి కృష్ణ రెడ్డి


టెక్నీషియన్స్ :

నిర్మాణం : ఏ బి డి ప్రొడక్షన్స్

నిర్మాత: డా. ఆరవేటి యశోవర్ధన్

స్టొరీ మరియు దర్శకుడు: వెంకటేష్ కొండిపోగు, ధర్మ

డి ఓ పి- ఎడిటర్- రచయత- దర్శకత్వ పర్యవేక్షణ : ధర్మ

సంగీత దర్శకుడు: సత్య, శరత్ రామ్ రవి

పి ఆర్ ఓ: మధు VR 

Alia Bhatt & Sharvari are the ALPHA girls of Aditya Chopra’s YRF Spy Universe!

 యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్‌లో...

 ఆలియాభట్‌, శార్వరి... ఆల్ఫా గర్ల్స్ అంటున్న ఆదిత్యచోప్రా!యష్‌రాజ్‌ఫిల్మ్స్ స్పై యూనివర్శ్‌లో ఫస్ట్ ఫీమేల్‌ లీడ్‌గా బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఆలియాభట్‌ అరుదైన ఘనత దక్కించుకున్నారు. ఆదిత్య చోప్రా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో రెయిజింగ్‌ స్టార్‌, యష్‌రాజ్‌ ఫిల్మ్స్ హోమ్‌ గ్రోన్‌ టాలెంట్‌ శార్వరి ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. వారిద్దరూ స్పై యూనివర్శ్‌లో సూపర్‌ ఏజెంట్స్ గా కనిపించనున్నారు. ఈ స్పెషల్‌ ప్రాజెక్టులో వాళ్లిద్దరినీ ఆల్ఫాగర్ల్స్ గా పరిచయం చేయనున్నారు ఆదిత్య చోప్రా.

యష్‌రాజ్‌ఫిల్మ్స్ సంస్థలో ఆలియా, శార్వరి నటిస్తున్న సినిమాకు 'ఆల్ఫా' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఆల్ఫా అనే టైటిల్‌కి మగవారు మాత్రమే కాదు, మహిళలూ అర్హులే అని సమాజానికి గట్టిగా చాటి చెప్పాలనే ధ్యేయంతో ఈ టైటిల్‌ని ఖరారు చేశారు ఆదిత్య చోప్రా.


టైటిల్‌ రివీల్‌ వీడియాలో ఆలియా చెప్పిన డైలాగ్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. ''గ్రీక్‌ ఆల్ఫబెట్‌లో మొదటి అక్షరం, మన ప్రోగ్రామ్‌ మోటో, అన్నిటికన్నా ముందు, అన్నిటికన్నా వేగం, అన్నిటికన్నా స్థైర్యం... నిశితంగా గమనించండి... ప్రతి నగరం ఒక అడవే. ప్రతి అడవినీ ఏలేది.. అల్ఫా!'' అంటూ ఆలియా చెప్పిన డైలాగ్‌ ఇన్‌స్టంట్‌గా వైరల్‌ అవుతోంది.


Watch the title reveal video : 


వైఆర్‌ఎఫ్‌ స్పై యూనివర్శ్‌లో ఫస్ట్ ఫీమేల్‌ లీడ్‌ సినిమా ఆల్ఫాను యాక్షన్‌ స్పెక్టకల్‌గా చేయాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నారు ఆదిత్య చోప్రా. ఆల్ఫా సినిమాను శివ్‌ రవైల్‌ తెరకెక్కిస్తున్నారు. గతంలో యష్‌రాజ్‌ఫిల్మ్స్ లో ది రైల్వేమెన్‌ సినిమాతో పేరు తెచ్చుకున్నారు శివ్‌ రవైల్‌.


ఇండియన్‌ సినిమాలో బిగ్గెస్ట్ స్పై యూనివర్శ్‌ ఐపీగా పేరుంది యష్‌రాజ్‌ఫిల్మ్స్ ఆదిత్య చోప్రాకి. స్పై వెర్స్ చిత్రాలు ఏక్‌ థా టైగర్‌, టైగర్‌ జిందా హై, వార్‌, పఠాన్‌, టైగర్‌ 3 ఆయన తెరకెక్కించిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలే.


ప్రస్తుతం ఆలియా - శార్వది ఆల్ఫాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు ఆదిత్య చోప్రా. మరోవైపు హృతిక్‌ రోషన్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ వార్‌2 సినిమాను కూడా డీల్‌ చేస్తున్నారు. ఆయన బ్లాక్‌ బస్టర్‌ యూనివర్శ్‌  నుంచి నెక్స్ట్ సినిమాగా పఠాన్‌2 రానుంది.  ఆ వెంటనే టైగర్‌ వర్సెస్‌ పఠాన్‌ సెట్స్ మీదకు వెళ్లనుంది.

Nandamuri Kalyanram Bimbisara 2 Announced

 నందమూరి కల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ ఎపిక్‌ ఫాంటసీ థ్రిల్లర్‌ బింబిసార2... ఎగ్జయిటింగ్‌ ప్రీక్వెల్‌ అనౌన్స్ మెంట్‌!డైనమిక్‌ హీరో - నిర్మాత నందమూరి కల్యాణ్‌రామ్‌ ఇప్పుడు కెరీర్‌లో అద్భుతమైన ఫేజ్‌లో ఉన్నారు. అత్యంత వైవిధ్యమైన స్క్రిప్టులు సెలక్ట్ చేసుకుంటూ, తనదైన శైలిలో విలక్షణంగా దూసుకుపోతున్నారు. కల్యాణ్‌ రామ్‌ కెరీర్‌లో అత్యంత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా బింబిసార.


బింబిసార పార్ట్ 2 ఉంటుందని మేకర్స్, యూనిట్‌ ఎప్పుడో ప్రకటించింది. మరి అప్పుడు ప్రకటించిన ఆ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ప్రేక్షకులకు ఆనందాన్ని పంచే వార్త వచ్చేసింది. బింబిసార ప్రీక్వెల్‌ని అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. కల్యాణ్‌రామ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ అనౌన్స్ మెంట్‌ వచ్చేసింది. క్రియేటివ్‌ కాన్సెప్ట్ పోస్టర్‌తో ఈ విషయాన్ని వెల్లడించారు. 'బింబిసార కన్నా యుగాల ముందు త్రిగర్తలను ఏలిన లెజెండ్‌ని చూడడానికి సిద్ధంగా ఉండండి' అంటూ ప్రీక్వెల్‌ని అనౌన్స్ చేశారు మేకర్స్.


బింబిసార సినిమాలో కల్యాణ్‌రామ్‌ బింబిసారగా కనిపించారు. ప్రీక్వెల్‌లో అంతకు మించిన అద్భుతమైన కథను ప్రేక్షకులతో పంచుకోనున్నారు. దానికి తగ్గట్టే ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. స్క్రిప్టు విషయంలో ప్రతి స్టేజ్‌లోనూ ఆ ఎగ్జయిట్‌మెంట్‌ను ఆస్వాదిస్తోంది యూనిట్‌. బింబిసార2కి ప్రాణం పోయడానికి అన్ని విధాలా ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. స్క్రీన్‌ మీద ఇప్పటిదాకా ఎవరూ చూడనటువంటి స్థాయిలో త్రిగర్తలను ప్రదర్శించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

'రొమాంటిక్‌' సినిమాను తెరకెక్కించిన అనిల్‌ పాదూరి బింబిసార2కి దర్శకత్వం వహించనున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది.  అత్యంత భారీ స్థాయిలో, అత్యంత ఉన్నతమైన సాంకేతిక పనితనంతో కనువిందు చేసే దృశ్యకావ్యంగా తీర్చిదిద్దడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుపుకుంటోంది బింబిసార2. అతి త్వరలో సినిమాను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Nandamuri Kalyan Ram Looks Ferocious In Birthday Special Poster From #NKR21

 #NKR21 నుంచి నందమూరి కళ్యాణ్ రామ్ బర్త్ డే స్పెషల్ ఫెరోషియస్ పోస్టర్‌ రిలీజ్నందమూరి కళ్యాణ్ రామ్ #NKR21 మేకర్స్ ఆయన పుట్టినరోజు సందర్భంగా బ్రాండ్ న్యూ పోస్టర్‌ను లాంచ్ చేయడంతో స్పెషల్ ట్రీట్‌ను అందించారు. ఈ పోస్టర్‌లో కళ్యాణ్ రామ్ ఫెరోషియస్ అవతార్‌లో కనిపించారు. తన పిడికిలికి ఫైర్ తో, కుర్చీపై కూర్చున్న కళ్యాణ్ రామ్ తన చుట్టూ గూండాలని ఇంటెన్స్ గా చూస్తున్నట్లు పోస్టర్ పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేస్తోంది. స్టైలిష్ మేకోవర్ అయిన కళ్యాణ్ రామ్ వెరీ వైలెంట్ గా కనిపిస్తున్నారు.


ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న #NKR21 చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ కొన్ని డేర్ డెవిల్ స్టంట్స్ చేయనున్నారు. నందమూరి హీరో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో ఫైర్ యాక్షన్ ఎపిసోడ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.


ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక్‌ క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్ పై అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


విజయశాంతి ఐపీఎస్ ఆఫీసర్ గా డైనమిక్ క్యారెక్టర్‌ని పోషిస్తోన్నారు. ఈ చిత్రంలో సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు.


సినిమా షూటింగ్‌ శరవేగంగాజరుగుతోంది. టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకి పని చేస్తున్నారు. రామ్ ప్రసాద్ డీవోపీ గా పని చేస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రానికి తమ్మిరాజు ఎడిటర్.


నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ తదితరులు


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి

నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు

సంగీతం: అజనీష్ లోక్‌నాథ్

డీవోపీ : రామ్ ప్రసాద్

బ్యానర్స్: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్

ఎడిటర్: తమ్మిరాజు

సమర్పణ: ముప్పా వెంకయ్య చౌదరి

స్క్రీన్ ప్లే: శ్రీకాంత్ విస్సా

పీఆర్వో : వంశీ-శేఖర్, వంశీ కాకా

మార్కెటింగ్: ఫస్ట్ షో


Ustaad Ram Pothineni Double Ismart Shoot Completed

 ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాధ్, సంజయ్ దత్, ఛార్మీ కౌర్, పూరీ కనెక్ట్స్ మచ్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియన్ ఫిల్మ్ 'డబుల్ ఇస్మార్ట్' షూటింగ్ పూర్తిఉస్తాద్‌ రామ్‌ పోతినేని, డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌లో వస్తున్న 'డబుల్‌ ఇస్మార్ట్‌' ఆగస్ట్‌ 15న ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.


మేకర్స్ మాస్ సాంగ్ అఫ్ ది ఇయర్ స్టెప్పా మార్ తో మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు. ఇది ఆడియో ప్రమోషన్‌లకు చార్ట్‌బస్టర్ స్టార్ట్, మేకర్స్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను అందజేయడం ద్వారా పబ్లీసిటీ దూకుడు పెంచారు.


'డబుల్ ఇస్మార్ట్' హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌, మచ్ ఎవైటెడ్ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్. పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటించగా, రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది.


సామ్ కె నాయుడు, జియాని గియాన్నెలి సినిమాటోగ్రఫర్స్ కాగా, మణి శర్మ మ్యూజిక్ అందించారు.


నటీనటులు: రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను, తదితరులు.


సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: పూరి జగన్నాధ్

నిర్మాతలు: పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్

బ్యానర్: పూరి కనెక్ట్స్

సిఈవో: విష్

సంగీతం: మణి శర్మ

సినిమాటోగ్రఫీ: సామ్ కె నాయుడు, జియాని జియాన్నెలి

స్టంట్ డైరెక్టర్: కేచ, రియల్ సతీష్

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Rashmika Mandanna First Look & Glimpse From Kubera Unveiled

 సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, శేఖర్ కమ్ముల 'కుబేర' నుంచి రష్మిక మందన్న ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ & గ్లింప్స్ రిలీజ్సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ శేఖర్ కమ్ముల మోస్ట్ ఎవైటెడ్ మైథలాజికల్ పాన్-ఇండియన్ మూవీ 'కుబేర' ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా వుంది. మేకర్స్ ఇప్పటికే ఈ ఇద్దరి సూపర్‌స్టార్‌ల క్యారెక్టర్స్ ని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన గ్లింప్స్ లకు ట్రెమండెస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్ర పోషిస్తోంది.


ఈరోజు మేకర్స్ రష్మిక ఫస్ట్ లుక్, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ని రివీల్ చేసారు. ఆమె ఎక్స్ ట్రార్డినరీ, డిఫరెంట్ అవతార్‌లో కనిపించి ప్రేక్షకులలో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ లుక్ థ్రిల్లింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా ఉంది.


ఆకట్టుకునే విజువల్స్‌తో, శేఖర్ కమ్ముల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సోషల్ డ్రామాలో డిఫరెంట్ క్యారెక్టర్ ని డిజైన్ చేశారు. గ్లింప్స్ వీడియోలో డబ్బుని తవ్వి తీసున్న రష్మిక క్యారెక్టర్ ని ప్రజెంట్ చేసి క్యురియాసిటీని పెంచారు.  దేవి శ్రీ ప్రసాద్ రాకింగ్ మ్యూజిక్ కట్టిపడేసింది.


శేఖర్ కమ్ముల కుబేర నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్ కాస్ట్ తో  రూపొందుతున్నమోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియన్ చిత్రాలలో ఒకటి. జిమ్ సర్భ్ మరో ప్రముఖ పాత్రలో కనిపించనున్న ఈ హై-బడ్జెట్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి.


శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కుబేర  పాన్-ఇండియా మల్టీ లాంగ్వేజ్ మూవీ. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తున్నారు


ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

Visonary Director Nag Ashwin Interview About Kalki 2898 AD

‘కల్కి 2898 AD’ కి ఇంత గ్రేట్ సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ అందరికీ థాంక్స్. ఇది హోల్ ఇండస్ట్రీ సక్సెస్: విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్  విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన సైన్స్ ఫిక్షన్ ఎపిక్ మాగ్నం ఓపస్ ‘కల్కి 2898 AD’. ఈ విజువల్ వండర్ లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె లీడ్ రోల్స్ లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మైథాలజీ -ఇన్స్ స్పైర్డ్  సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘కల్కి 2898 AD’ జూన్ 27న గ్రాండ్ గా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షులని మహా అద్భుతంగా అలరించి, ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ శంకరపల్లిలోని కల్కి సెట్స్ లో గ్రాండ్ గా జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో ‘కల్కి 2898 AD’ విశేషాలని పంచుకున్నారు.


మీడియా ఇంటరాక్షన్ లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ...అందరూ మూవీ చూస్తునందుకు ఎంకరేజ్ చేస్తున్నందుకు, ఇంత గొప్ప సక్సెస్ ని ఇచ్చినందుకు మా టీం, వైజయంతీ మూవీస్ తరపున థాంక్స్. ఇది హోల్ ఇండస్ట్రీ సక్సెస్ గా భావిస్తున్నాను. ఎన్నో ప్రొడక్షన్స్, యాక్టర్స్, రైటర్స్, అప్ కమింగ్ డైరెక్టర్స్ కి ఒక డోర్ ఓపెన్ అయ్యింది. ఇలాంటి సైన్స్ ఫిక్షన్ కథలు రాసుకునే వారికి కల్కి రిఫరెన్స్ పాయింట్ లా వుంటుంది. సినిమా విడుదలైనప్పటి నుంచి ఎంతోమంది అభినందనలు తెలుపుతున్నారు. కల్కి ఒక మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చిందని చెబుతున్నారు. థియేటర్స్ లోకి వెళ్లి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ని పొందడం సినిమా ముఖ్య ఉద్దేశం. అలాంటి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా అందించినందుకు ఆనందంగా వుంది. అందరికీ థాంక్ యూ' అన్నారు.


అనంతరం Q & Aసెషన్ లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలు సమాధానం ఇచ్చారు.


నాగ్ అశ్విన్ గారు.. ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇండియన్ సినిమాకి ఇచ్చినందుకు ముందుగా కంగ్రాట్స్


-థాంక్ యూ సో మచ్


భారతం, భాగవతంలోని ఇన్సిడెంట్స్ లో కల్కి లో అడాప్ట్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది?

- తెలుగు సినిమా అంటే మనకి గుర్తుకొచ్చేది మాయాబజార్. మాయాబజార్ మహాబారతనికి ఒక అడాప్ట్టేషన్. ఆ పర్టిక్యులర్ ఇన్సిడెంట్స్ మహాభారతంలో ఎక్కడా లేదు. అదొక క్రియేటివ్ ఫిక్షన్. అక్కడి నుంచే ఇన్స్పిరేషన్ వచ్చింది.


ఇందులో శంభల ప్రజల టార్గెట్ ఏమిటి ?  

-కాంప్లెక్స్, వరల్డ్ లో ఒక బ్యాలెన్స్ తీసేసింది, శంభల టార్గెట్ మళ్ళీ వరల్డ్ లో ఒక బ్యాలెన్స్ తీసుకురావడం.  


రెండు పార్ట్స్ గా చేయాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది ? పార్ట్ 2 కోసం ఎంత టైం వెయిట్ చేయాలి ?

-ముందుగా ఒక్క సినిమాగానే ఈ కథను తెరకెక్కించాలనుకున్నా. కొన్ని షెడ్యూల్స్ షూటింగ్ పూర్తయిన తర్వాత ఇంత పెద్ద స్టోరీని ఒక్క భాగంలో చెప్పడం ఛాలెంజ్ అనిపించింది. అప్పుడే పార్ట్‌లుగా చూపించాలని నిర్ణయించుకున్నా. పార్ట్‌ 2కి సంబంధించిన 20 రోజులు షూట్ చేశాం. ఇంకా చాలా చేయాలి, చాలా యాక్షన్, బ్యాక్ స్టోరీస్, న్యూ వరల్డ్స్ ఇలా చూడటానికి చాలా వున్నాయి. అవన్నీ ఇప్పుడు క్రియేట్ చేయాలి.


మూడో సినిమాకే ఇంత పెద్ద హెవీ సబ్జెక్ట్ తీసుకోవడం రిస్క్ అనిపించలేదా? అమితాబ్, కమల్, ప్రభాస్ లాంటి బిగ్గెస్ట్ స్టార్ తీసుకోవడం గురించి ?


-మా ప్రోడుసర్స్ రిస్క్ తీసుకున్నారు. నేను ఇంత ఖర్చు చేయాలంటే.. దానికంటే ఎక్కువ ఖర్చు పెడతారు.

 -కథ, పాత్రలకు న్యాయం చేయలనే ఉద్దేశంతోనే అమితాబ్, కమల్, ప్రభాస్, దీపిక లాంటి పెద్ద యాక్టర్స్ ని తీసుకోవడం జరిగింది.


పార్ట్ 1 లో ప్రభాస్ గారి స్క్రీన్ టైం తక్కువుందనే అభిప్రాయాలు వచ్చాయి.. పార్ట్ 2 లో ఎలా వుండబోతుంది ?

- కల్కి మ్యాసీవ్ సబ్జెక్ట్, వరల్డ్ బిల్డింగ్, చాలా క్యారెక్టర్స్ వుంటాయి. ఇవన్నీ చూపించాలి. ఇప్పుడు వరల్డ్ బిల్డింగ్ అయిపొయింది. ఆడియన్స్ కి ఆ వరల్డ్ పరిచయమైయింది. ఎవరి పాత్రలు, పవర్స్, మోటివ్స్ ఏమిటో తెలిసింది. ఇకపై ఇంకా ఫన్ గా వుంటుంది.


ప్రభాస్ గారిని ని క్లైమాస్క్ లో కర్ణుడిగా రివిల్ చేశారు. పార్ట్ 2 నెగిటివ్ గా చూపిస్తారా లేదా పాజిటివ్ గానా ?

-కర్ణుడి పాత్ర పాజిటివ్ గానే వుంటుంది. ఇండియాలో ఎక్కడ చూసిన ఆ క్యారెక్టర్ ని లవ్ చేస్తారు. ఆయన కథకి క్యారెక్టర్ కి జస్టిస్ చేయాలనే వుంటుంది.


-కల్కిని రెండో సారి చూస్తునప్పుడు కర్ణుడికి సంబధించిన చాలా విషయాలు కొత్తగా కనిపిస్తాయి. సెకండ్ టైం చూసినప్పుడు డిఫరెంట్ ఫిల్మ్ అనిపిస్తుంది. సెకండ్ టైం వర్త్ వాచ్ మూవీ ఇది.


కల్కి పిల్లల్ని ఎక్కువగా ఆకట్టుకునేలా రూపొందించారనే భావన కలుగుతుంది ?

-పిల్లలు మహాభారతం, మన ఒరిజినల్ హీరోస్ కి సంబధించిన విషయాలు తెలుసుకుంటారనే ఒక ఉద్దేశం అయితే వుంది. మనకి అద్భుతమైన స్టొరీలు వున్నాయి. అందుకే సినిమాని మరీ డార్క్ కాకుండా లైట్ హార్ట్టెడ్ గా తీయడం జరిగింది.


ఈ సినిమాలో ప్రయాణంలో మీకు ఛాలెంజ్ గా అనిపించిన అంశం ఏమిటి ?

- ఒక సినిమాని నాలుగున్నరేళ్ళు దాక పట్టుకొని ఉండాలంటే జడ్జ్మెంట్ వుండాలి, 2019లో రాసిన సీన్ 2024 లో ఎడిట్ చేసుస్తున్నపుడు అదే జడ్జ్మెంట్ పెట్టుకోవడం కష్టమైన విషయం. దీనికి డిఫరెంట్ స్కిల్ సెట్ కావాలి. ఈ సినిమా విషయంలో ఇది కష్టమనిపించింది.


భవిష్యత్ లో సంపూర్ణంగా మహాభారతాన్ని తీసే ఆలోచన ఉందా ?

-ఇప్పుడు అలాంటి ఐడియా ఎం లేదు.


ఇందులో చాలా క్యామియోలు వున్నాయి కదా ? అన్ని క్యామియోలు పెట్టడానికి కారణం ?

-క్యామియోలు నాకు ఇష్టమేమో. సడన్ గా మనకి తెలిసి ఒక స్టార్ ని చూసినప్పుడు ఒక ఎక్సయిమెంట్ వస్తుంది.


ఇందులో ఇటివల కాలంలో వైజయంతి మూవీస్ లో పని చేసిన అందరూ దాదాపుగా కనిపించారు. కానీ నాని,నవీన్ పోలిశెట్టి లేకపోవడానికి కారణం?

-నాని, నవీన్ ఈ పార్ట్ లో కుదరలేదు. డెఫినెట్ గా ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ పెట్టేస్తాను(నవ్వుతూ)


కమల్ హసన్ గారి పాత్రతో శ్రీశ్రీ కవిత్వం చెప్పించారు కదా.. దాని గురించి ?

- ఆ లైన్స్ కరెక్ట్ గా సెట్ అయ్యాయి. యస్కిన్ ఫిలాసఫీ కూడా అదే అనిపించింది. కమల్ హసన్ గురించి చెప్పాల్సిన పని లేదు. నేను సగం చెప్తే ఆయన వందశాతంకు పైగా తీసుకెల్తారు.


వైజయంతీ మూవీస్ గురించి ?

-వైజయంతీ మూవీస్ 50 ఏళ్ల జర్నీలోనే కాదు.. తెలుగు సినిమా హిస్టరీలోనే ఇది వన్ అఫ్ ది మోస్ట్ ఎక్స్ పెన్స్సీవ్ ఫిల్మ్.  ఈ సినిమా గొప్ప సక్సెస్ సాధించి మా ఇన్వెస్ట్ మెంట్ ఫుల్ గా రావడం అనేది చాలా థాంక్ ఫుల్ గా భావిస్తున్నాను.


ఈ జర్నీలో ప్రభాస్ గారితో ఎలాంటి బాండేజ్ ఏర్పడింది ?

- ప్రభాస్ గారికి ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎక్సయిట్ అయ్యారు. ప్రాజెక్ట్ ని చాలా బిలివ్ చేశారు. మీరు హ్యుజ్, మ్యాసీవ్ మూవీ తీసుకున్నారని బిగినింగ్ నుంచి ఎంకరేజ్ చేశారు.


సెట్స్ ని తీర్చిదిద్దడానికి ఎంతలా కష్టపడ్డారు ? ఈ వరల్డ్ లో మీకు ఇష్టమైన ప్లేస్ ?

-మా ప్రొడక్షన్ టీం చాలా కష్టపడింది. ఇందులో నాకు ఇష్టమైన ప్లేస్ శంభల స్టెప్స్. అక్కడే కూర్చునే వాడిని. అక్కడ సైన్ రైజ్ సన్ సెట్ చాలా బావుంటుంది.


మీరు అశ్వినీదత్ గారికి తప్పితే మరొకరికి సినిమా చేయరా ?

-కుదరడం లేదండీ. ఒకొక్క సినిమాకి నాలుగైదేళ్ళు పడుతోంది(నవ్వుతూ)


రాజమౌళి, ఆర్జీవి గారిని ఎలా ఒప్పించారు ?

-రాజమౌళి, ఆర్జీవి గారు ఫ్యూర్లీ ఎ ట్రీబ్యుట్. ఇండస్ట్రీని చేంజ్ చేసిన డైరెక్టర్స్. ఆర్జీవి గారు నేను ఎందుకు ? అని అడిగారు. కలియుగంలో మీరు ఉంటారని చెప్పాను (నవ్వుతూ).


బుజ్జిని బాగా డిజైన్ చేశారు కదా.. పేటెంట్ రైట్స్ తీసుకున్నారా ?

-బుజ్జిని డిజైన్ చేయడానికి ఏకంగా అటోముబైల్ ఇంజనీరింగే చేశాం. పేటెంట్ రైట్స్ తీసుకున్నాం. టెంపరరీ లైసెన్స్ కూడా ఇచ్చారు.


కల్కిగా ఏ హీరో రాబోతున్నారు ? ఇందులో మీ ఫేవరేట్ క్యారెక్టర్ ఏమిటి ?

-ఇంకా పొట్టలోనే వున్నారు కదా. ఇంకా దానికి సమయం వుంది. నా ఫేవరేట్ కర్ణుడు.


ఆల్ ది బెస్ట్

-థాంక్ యూ


 

Director Shekhar Kammula Launched Pailam Pilaga Sodu Sodu Song

 సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల లాంచ్ చేసిన 'పైలం పిలగా' సోడు సోడు సాంగ్ 

 


టైటిల్ తోనే అందరినీ ఆకర్షిస్తోన్న సెటెరికల్ ఫన్నీ ఎంటర్టైనర్ 'పైలం పిలగా'. వ్యవసాయం చేస్తే కడుపు నిండుతుంది కానీ కోట్లు కూడబెట్టలేమని బలంగా నమ్మిన ఓ యువకుడికి అనుకోకుండా సొంతూళ్లోనే కోట్ల రూపాయల బిజినెస్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. కానీ పద్మవ్యూహంలాంటి మన బ్యూరోక్రసీ వలలో చిక్కుకొని ఎలాంటి అవస్థలు పడ్డాడు? చివరకు ఏం చేసాడు? తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ హాస్యభరిత వ్యంగ చిత్రం 'పైలం పిలగా. "పిల్లా పిలగాడు" వెబ్ సిరీస్ ఫేమ్ సాయి తేజ కల్వకోట, పుష్పా సినిమా ఫేమ్ పావని కరణం జంటగా నటించారు.


నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, వంటి టాలీవుడ్, బాలీవుడ్ అగ్రనటులతో సహా వందకి పైగా యాడ్ ఫిలిమ్స్ కి దర్శకత్వం వహించిన ఆనంద్ గుర్రం దర్శకత్వం లో వస్తోన్న మొదటి చిత్రం 'పైలం పిలగా' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలోని 'సోడు సోడు నొక్కమే నీ సోకు' అనే పాటను డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారు రిలీజ్ చేశారు. 


ఎన్నో సెన్సషనల్ సాంగ్స్ అందించిన యశ్వంత్ నాగ్, రామ్ మిర్యాల, ఆనంద్ గుర్రం కాంబినేషన్ లో వస్తోన్న ఈ పాట గురించి డెరైక్టర్ శేఖర్ కమ్ముల గారు మాట్లాడుతూ మంచి సాహిత్యానికి మంచి ట్యూన్, మంచి ట్యూన్ కి మంచి సాహిత్యం తోడైతే ఆ పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతాయి. అలాంటి మంచి పాటల్లో ఈ సోడు సోడు పాట కచ్చితంగా ఉంటుందని ఆశిస్తున్నాను, పాట తో పాటు సినిమా కూడా విజయవంతం కావాలని కోరుకుకుంటున్నా అని అన్నారు. 


ప్రొడ్యూసర్ రామకృష్ణ బొదుల మాట్లాడుతూ చిన్న సినిమాలు, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు, ఫీల్ గుడ్ సినిమాలు కూడా పెద్ద సక్సెస్ అవుతాయని నిరూపించిన డెరైక్టర్ శేఖర్ కమ్ముల గారు. వారిని చూసి ఇన్స్పైర్ అయి ఎంతో మంది కొత్త ప్రొడ్యూసర్స్ విజయాన్ని అందుకున్నారు. కంటెంట్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ వచ్చిన మమ్మల్ని ప్రోత్సహిస్తున్న శేఖర్ కమ్ముల గారికి మా మొత్తం 'పైలం పిలగా' టీం తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.


హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై రామకృష్ణబొద్దుల, ఎస్.కే. శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రం లో డబ్బింగ్ జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. యశ్వంత్ నాగ్ ఆరు అద్భుతమైన పాటలతో మెలోడియస్ సంగీతాన్ని అందించారు. 


కెమెరా సందీప్ బద్దుల, ఎడిటింగ్ రవితేజ కూర్మనా, సె సెలిన్హారిక కపొట్ట లిరిక్స్ ఆనంద్ గుర్రం, అక్కల చంద్రమౌళి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్ ఒడ్నాల పనిచేసిన ఈ చిత్రానికి రవి వాషింగ్టన్, కృష్ణమసునూరి, విజయ్ గోపు సహా నిర్మాతలుగా వ్యవహరించారు.