Director Nag Ashwin to Launch Prince and Naresh Agastya's "Kali" Teaser

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేతుల మీదుగా రేపు రిలీజ్ కానున్న ప్రిన్స్, నరేష్ అగస్త్య "కలి" మూవీ టీజర్



 యంగ్ హీరోలు ప్రిన్స్, నరేష్ అగస్త్య నటించిన  సినిమా "కలి". ఈ చిత్రాన్ని ప్రముఖ కధా రచయిత కె.రా‌ఘవేంద్ర రెడ్డి సమర్పణలో “రుద్ర క్రియేషన్స్” సంస్థ నిర్మించింది. శివ శేషు రచించి దర్శకత్వం వహించారు. లీలా గౌతమ్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సైకలాజికల్ డ్రామా కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ తుది దశకు చేరుకుంది . త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా టీజర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్..


రేపు సాయంత్రం అనగా 07 వ తారీకు 4.05 నిమిషాలకు "కలి" సినిమా టీజర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రిలీజ్ చేయబోతున్నారు. కలి పాత్ర చుట్టూ అల్లుకున్న ఈ కొత్త కథాంశం సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని మూవీ టీమ్ చెబుతున్నారు.

 

నటీనటులు - ప్రిన్స్, నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్, గౌతంరాజు, గుండు సుదర్శన్, కేదార్ శంకర్, మని చందన, మధుమణి. తదితరులు.

 

టెక్నికల్ టీమ్:

 

సంగీతం - జీవన్ బాబు

ఎడిటర్ – విజయ్ కట్స్.

సినిమాటోగ్రఫీ – నిషాంత్ కటారి, రమణ జాగర్లమూడి.

పాటలు – సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి,

క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ - రాధాకృష్ణ తాతినేని, ధరణి కుమార్ టీఆర్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఫణీంద్ర

పీఆర్ఓ  - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

సమర్పణ – కె. రాఘవేంద్ర రెడ్డి

నిర్మాత - లీలా గౌతమ్ వర్మ

రచన, దర్శకత్వం - శివ శేషు

 

Post a Comment

Previous Post Next Post