”HE WAS A BEAST!” Wolverine aka Hugh Jackman reveals his obsession for Cricket

‘డెడ్‌పూల్ & వుల్వరైన్’ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్. 



ఈ ప్రమోషన్స్ లో భాగంగా  వుల్వరైన్ అకా హ్యూ జాక్‌మన్ ని ఒక ఇంటర్వూలో ‘మీరు భయంకరమైన క్రికెట్ అభిమాని కదా?’ అని అడిగినప్పుడు వుల్వరైన్ ‘అవును’ అని చెప్తారు. అపుడు ఆ ఇంటర్వ్యూయర్ ఇలా అడుగుతాడు ‘మీకు ప్రస్తుతం క్రికెట్ లో ఎవరంటే బాగా ఇష్టం? అనో అడగగా. దానికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ‘రోహిత్’ అని సమాధానం చెప్తారు హ్యూ జాక్‌మన్. రోహిత్ శర్మ రీసెంట్ గా ఇండియా కి వరల్డ్ కప్ సాధించాడు అని అడిగినప్పుడు. ‘నాకెందుకు తెలీదు. రోహిత్ ఒక బీస్ట్ లాగా ఆడతాడు. నాకు అతని ఆట చూడడం చాలా ఇష్టమని’ తన అభిమానాన్ని ఎవర్‌గ్రీన్ సూపర్‌స్టార్ హ్యూ జాక్‌మన్ చాటుకున్నారు.


హ్యూ జాక్‌మన్ రోహిత్ పై తన అభిప్రాయాన్ని చెప్పడం వలన భారత దేశంలోని కోట్లమంది గుండెల్లో హ్యూ జాక్‌మన్ ఆనందం నింపేలా చేశారు. మార్వెల్ స్టూడియోస్ డెడ్‌పూల్ & వుల్వరైన్ జూలై 26న ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ ఒక్క మాటతో ఈ సినిమా ప్రమోషన్ స్థాయి దేశ వ్యాప్తంగా పెరిగిపోయింది 

Post a Comment

Previous Post Next Post