Latest Post

Cbi Jd Laxminarayan Key role in Bhimadevarapalli Branch

 CBI JD LAXMINARAYANA గారు నటించిన మొదటి చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి.




"భీమదేవరపల్లి బ్రాంచి " ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించన ముఖ్యమైన సన్నివేశాలని దర్శకుడు రమేష్ చెప్పాల నిన్న చిత్రీకరించారు. ఇందులో సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు, ప్రఖ్యాత రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, నాయకులు అద్దంకి దయాకర్ గారు నటించారు. జేడీ లక్ష్మీనారాయణ గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు నటించిన మొదటి చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి కావడం విశేషం. ఇంతకుముందు ఎంతో మంది దర్శకులు,నిర్మాతలు ,స్వయంగా రామ్ గోపాల్ వర్మ తన సినిమాలో నటించమని అడిగిన నో చెప్పిన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. భీమదేవరపల్లి బ్రాంచిలో  యాక్ట్ చేయడం విశేషం.ఈ మధ్య జరిగిన ఒక సంఘటన దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయ్యింది. దాని ప్రేరణతో ఈ సినిమాను"Neorealism" ఉట్టిపడేలా "స్లైస్ ఆఫ్ లైఫ్" జానర్ లో నిర్మించారు. దర్శకుడు

చెప్పాలనుకున్న కథలో సహజత్వం పోకూడదని, వెతికి వెతికి అనేకమంది థియేటర్ ఆర్టిస్టులని నటింపజేశారు, వాస్తవికత కళ్ళ ముందుoచే ఈ చిత్రం ప్రతి ఒక్కరిని  కదిలిస్తుంది. ఇందులో

అంజి బాబు,రాజవ్వ,సుధాకర్ రెడ్డి,కీర్తి లత, అభి, రూప శ్రీనివాస్,శుభోదయం సుబ్బారావు, సి. ఎస్.ఆర్. వివ రెడ్డి, బుర్ర శ్రీనివాస్ 

పద్మ, సాయి ప్రసన్న,మానుకోట ప్రసాద్,గడ్డం నవీన్, తాటి గీత మల్లికార్జున్, మహి, వాలి సత్య ప్రకాష్, మిమిక్రీ మహేష్, తిరుపతి, వంటి పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

AB CINEMASS & NIHAL PRODUCTIONS  నిర్మిస్తోన్న  ఈ చిత్రానికి 

రచన-దర్శకత్వం: రమేశ్ చెప్పాల. 

నిర్మాతలు: బత్తిని కీర్తిలత గౌడ్,రాజా నరేందర్ చెట్లపెల్లి

 కెమెరా: కె.చిట్టి బాబు. సంగీతం: చరణ్ అర్జున్, సాహిత్యం:సుద్దాల అశోక్ తేజ.ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి. పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే  ఆర్ట్: మోహన్. పి ఆర్ ఓ: శ్రీధర్.



Tremendous Response for Month Of Madhu Teaser

 న‌వీన్ చంద్ర‌, క‌ల‌ర్ స్వాతి చిత్రం ‘మంత్ ఆఫ్ మ‌ధు’ .. ఆకట్టుకుంటోన్న టీజర్



వైవిధ్యమైన పాత్రలో నటుడిగా తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న యాక్ట‌ర్ న‌వీన్ చంద్ర‌. ఈ వెర్స‌టైల్ పెర్ఫామర్ లేటెస్ట్ మూవీ ‘మంత్ ఆఫ్ మ‌ధు’. శ్రీకాంత్ నాగోటి దర్శ‌క‌త్వంలో క్రిష్వి ప్రొడ‌క్ష‌న్స్‌, హ్యండ్ పిక్డ్ స్టోరీస్ బ్యాన‌ర్స్‌పై య‌శ్వంత్ ములుకుట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


ఇంతకు ముందు న‌వీన్ చంద్ర, శ్రీకాంత్ నాగోటి కాంబినేష‌న్‌లో రూపొందిన ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న చిత్రం ‘భానుమతి అండ్ రామకృష్ణ’. 2020లో ఆహా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ హిట్ కాంబో ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించటానికి సిద్ధమైంది.


రీసెంట్‌గా రిలీజైన ‘మంత్ ఆఫ్ మ‌ధు’ ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. గురువారం మూవీ నిర్మాతలు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది.


టీజర్‌ను గ‌మ‌నిస్తే 1 నిమిషం 58 సెక‌న్లుగా ఉంది. అందులో బ్యూటీఫుల్ విజువ‌ల్స్‌తో సినిమా క‌థేంటో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. సింక్ సౌండ్ ఎఫెక్ట్‌తో రియ‌లిస్టిక్‌, నేచుర‌ల్‌గా ఉంది. హీరో హీరోయిన్స్ న‌ట‌నతో మెప్పించారు.


మాన‌వ సంబంధాలు.. ఓ విష‌యాన్ని జనం ఏ కోణంలో చూస్తున్నార‌నే దానిపైనే ‘మంత్ ఆఫ్ మ‌ధు’  చిత్రాన్ని తెర‌కెక్కించిన‌ట్లు టీజ‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. క‌ల‌ర్స్ స్వాతి ఇందులో గృహిణి పాత్ర‌లో న‌టించింది. విప‌రీత‌మైన భావోద్వేగాలున్న తాగుబోతు భ‌ర్త పాత్ర‌లో న‌వీన్ చంద్ర యాక్ట్ చేశారు. వైజాగ్ ప‌రిస‌ర ప్రాంతాల్లో లైవ్ లోకేష‌న్స్‌లో సింక్ సౌండ్‌తో ‘మంత్ ఆఫ్ మ‌ధు’  సినిమాను రూపొందించారు.


శ్రేయా న‌వేలీ, హ‌ర్ష చెముడు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. య‌శ్వంత్ ములుకుట్ల నిర్మించిన ఈ చిత్రానికి అచ్చు రాజ‌మ‌ణి సంగీతాన్ని అందించారు.


Simba - The Forest Man Theme Song Launched

‘సింబా’ థీమ్ సాంగ్ రిలీజ్‌.. ప్రకృతి బ‌లాన్ని,  ప్ర‌కోపాన్ని తెలియ‌జేస్తున్న పాట‌



సింబా - ది ఫారెస్ట్ మ్యాన్ సినిమాను అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అందరి దృష్టిని ఆక‌ర్షిస్తూ వ‌స్తోంది. విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు, అన‌సూయ‌, వశిష్ట ఎన్‌.సింహ‌, క‌బీర్ దుహాన్ సింగ్‌, బిగ్ బాస్ ఫేమ్ దివి త‌దిత‌రులు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. అట‌వీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది క‌థ‌ను అందించారు.


ఇటీవ‌ల విడుద‌లైన ‘సింబా’ ఫ‌స్ట్ లుక్‌, ఫ‌స్ట్ సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుంచి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. గురువారం ఈ సినిమా నుంచి థీమ్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ సాంగే సినిమాకు హార్ట్ ఆఫ్ ది సాంగ్. ప‌వ‌ర్‌ఫుల్ బీట్‌, భీక‌ర‌మైన స‌న్నివేశాల‌ను వెంటనే సాంగ్ చార్ట్ బ‌స్ట‌ర్ అయ్యింది.


జ‌గ‌ప‌తి బాబు అడ‌వులు, ప‌ర్యావ‌రణాన్ని ర‌క్షించే ర‌క్ష‌కుడిగా క‌నిపించారు. సినిమాలోని ఇత‌ర న‌టీన‌టులు.. వారి క్యారెక్టర్స్‌ను కూడా ప‌రిచ‌యం చేశారు. య‌దు కృష్ణ‌న్ ఈ సాంగ్‌ను ఆల‌పించారు.


పాట‌లో లిరిక్స్ చాలా ఇంపాక్ట్‌ను క‌లిగించేలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఈ పాట‌లో ‘తందనాన అహి తందనానాపురే తందనాన భల తందనాన’ అనే లైన్‌ను అన్న‌మ‌య్య కీర్త‌న నుంచి తీసుకున్నారు. కృష్ణ సౌర‌భ్ ఎక్స్‌ట్రార్డిన‌రీ సంగీతాన్ని అందించారు.


ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కే సింబా - ది ఫారెస్ట్ మ్యాన్ సినిమా కోసం సంప‌త్ నంది, అత‌ని టీమ్ వ‌ర్క్ చేస్తున్నారు. ముర‌ళీ మ‌నోహార్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. కృష్ణ ప్ర‌సాద్ ఈ  సినిమాకు సినిమాటోగ్ర‌ఫీ, కృష్ణ సౌర‌భ్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ చిత్రాన్నిరాజేంద్ర రెడ్డి.డి, సంప‌త్ నంది నిర్మిస్తున్నారు.

 

Visual Wonder Shaakuntalam in 3D New Release Date Announcement Shortly -Gunashekar

 విజువ‌ల్ వండ‌ర్‌ ‘శాకుంతలం’ సినిమాను 3D టెక్నాలలోకి క‌న్వ‌ర్ట్ చేస్తున్నాం.. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం :  ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్‌



లార్జర్ దేన్ లైఫ్ చిత్రాలను రూపొందిస్తూ.. అద్భుతమైన విజువల్స్, భారీ బడ్జెట్‌తో సినిమాల‌ను రూపొందిస్తోన్న ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్‌. ఆయన ఆవిష్కరిస్తోన్న అద్భుతమైన ప్రణయ దృశ్య కావ్యం శాకుంతలం’.  మ‌హాభార‌త ఇతిహాసంలో అద్భుత‌మైన ప్రేమ ఘ‌ట్టంగా చెప్పుకుంటూ ప్రపంచం నలుమూలలున్న పండితుల ప్రశంసలు పొందిన సంస్కృత‌ నాటకం అభిజ్ఞాన శాకుంతలం. దీన్ని ఆధారంగా చేసుకుని.. ‘శాకుతలం’ చిత్రాన్ని గుణ శేఖ‌ర్‌ తెరకెక్కిస్తున్నారు. శ‌కుంత‌ల‌, దుష్యంత మ‌హారాజు మ‌ధ్య ఉన్న అజ‌రామ‌ర‌మైన ప్ర‌ణ‌య‌గాథ ఇది. శకుంత‌ల‌గా స‌మంత‌.. దుష్యంతుడిగా దేవ్ మోహ‌న్ న‌టించారు.


‘శాకుంతలం’ చిత్రాన్నిప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో భారీ ఎత్తున న‌వంబ‌ర్ 4న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.  అయితే ఇలాంటి దృశ్య కావ్యాన్ని చూస్తున్న‌ప్పుడు ప్రేక్ష‌కుడు మ‌ధుర‌మైన అనుభూతికి లోను కావాలి.. ఆ అనుభూతుల‌ను త‌న‌లో భ‌ద్ర‌ప‌రుచుకోవాల‌నే త‌లంపుతో ఎపిక్ మేక‌ర్ గుణ శేఖ‌ర్‌.. ‘శాకుంతలం’ సినిమాను 3Dలో ఆందించే ప్రయత్నం చేస్తున్నారు.


‘‘అత్యంత భారీ స్థాయిలో, అత్యద్భుతంగా శాకుంతం చిత్రాన్ని మీకు పరిచయం చేయాలన్నదే మా లక్ష్యం.  అందుకే, ఇంతకు ముందు ప్రకటించిన సమయానికి మిమ్మల్ని థియేటర్లలో కలుసుకోలేకపోతున్నాం. ఇప్పటిదాకా అడుగడుగునా మమ్మల్ని ఆదరించిన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా ఈ ప్రయత్నాన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీరందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాం. సరికొత్త విడుదల తేదీతో త్వరలో మిమ్మల్ని కలుసుకుంటాం’’  అని చిత్ర యూనిట్ తెలియజేసింది.


‘శాకుంతలం’ మనసుని హత్తుకునే అందమైన ప్రేమ కథ. ఇందులో భారీ తారాగ‌ణం కూడా నటించారు.   స‌చిన్ ఖేడేక‌ర్‌, క‌బీర్ బేడీ, డా.ఎం.మోహ‌న్ బాబు, ప్ర‌క‌రాష్ రాజ్‌, మ‌ధుబాల‌, గౌత‌మి, అదితి బాల‌న్‌, అన‌న్య నాగ‌ళ్ల‌, జిస్సు సేన్ గుప్తా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ యువ‌రాజు భ‌ర‌తుడి పాత్ర‌లో న‌టించ‌టం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కానుంది.  ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు స‌మర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్, గుణ టీమ్ వ‌ర్క్స్ ప‌తాకాల‌పై నీలిమ గుణ నిర్మాత‌గా శాకుంత‌లం సినిమా రూపొందుతోంది.


GodFather Pre Release Event Held Grandly

 గాడ్ ఫాదర్ సినిమా ఒక నిశ్శబ్ద విస్పోటనం.. నా అభిమానులే నా గాడ్ ఫాదర్స్: గాడ్ ఫాదర్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి



మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'గాడ్ ఫాదర్' కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి నటిస్తున్న 'గాడ్ ఫాదర్' ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 5న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ అనంతపురంలో చాలా గ్రాండ్ గా జరిగింది. వేలాది మంది ప్రేక్షకులు, అభిమానులు హాజరైన ఈ వేడుక కన్నుల పండువగా జరిగింది. వర్షం కురుస్తున్నప్పటికీ వేలాది మంది అభిమానులు కోలాహలం మధ్య ఈ వేడుక  విజయవంతమైయింది.


ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... నేను ఎప్పుడు రాయలసీమకి వచ్చినా నేల తడుస్తుంది. ఈ రోజు కూడా వర్షం కురవడం ఒక శుభపరిణామంగా అనిపిస్తుంది. మలయాళంలో విజయం సాధించిన లూసిఫర్ చూడటం జరిగింది. ఇది గాడ్ ఫాదర్ గా మారడానికి, నేను చేయడానికి ప్రధానమైన కారణం రామ్ చరణ్. సినిమా బావుంది నాకు వైవిధ్యంగా ఉంటుందని అనుకున్నాను. అయితే ఎవరు చేస్తారని ఆలోచిస్తున్నపుడు.. రామ్ చరణ్ ముందుకు వచ్చి '' మీ ఇమేజ్ కి ఈ సమయంలో చేయాల్సిన సబ్జెక్ట్ లూసిఫర్' అని చరణ్ చెప్పాడు. చరణ్ కోరిక మేరకు ఇది గాడ్ ఫాదర్ గా రూపాంతరం చెందింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ కి కృతజ్ఞతలు. ఈ సినిమాకి దర్శకుడిగా మోహన్ రాజా పేరుని సూచించింది కూడా రామ్ చరణ్ నే. మోహన్ రాజా ఈ సినిమాని మనందరం గర్వపడేలా తీశారు. దాదాపు ఆరు నెలలు పాటు మిత్రుడు సత్యానంద్ తో కలసి మీ అందరూ ఆనందించేలా ఈ సినిమా స్క్రీన్ ప్లే చేయడం జరిగింది. ఆ స్క్రీన్ ప్లేని అత్యద్భుతంగా తెరకెక్కించారు మోహన్ రాజ్. మోహన్ రాజా మామూలు దర్శకుడు కాదు. ఆయనవి అన్నీ పెద్ద కోరికలు. ఈ సినిమాలో నాకు దళపతిగా వుండే ఒక పాత్ర వుంది, ఆ పాత్ర కోసం సల్మాన్ ఖాన్ అయితే బావుటుందని చాలా సింపుల్ గా చెప్పారు. రాజా అంత సింపుల్ గా చెప్పారు కానీ అసలు సల్మాన్ ఖాన్ ని తీసుకురావడం సాధ్యమేనా అని అలిచిస్తున్నపుడు రామ్ చరణ్ ఆ భాద్యత తీసుకున్నారు. ''నాన్న గారి సినిమాలో ఒక పాత్ర వుంది మీరు చేస్తే బావుంటుంది'' అని చరణ్ చెప్పడం,, ''నేను చేయాలని చిరు గారు కోరితే.. ఆ పాత్ర చేయడానికి నేను సిద్ధమే.. కథ కూడా చెప్పొద్దు. నేరుగా షూటింగ్ కి వచ్చేస్తా' అని సల్మాన్ అన్నారు. మాపై ఇంత ప్రేమ చూపించిన సల్మాన్ భాయ్ కి కృతజ్ఞతలు. చరణ్ తో కలసిసూపర్ గుడ్ ఫిలింస్  ఆర్‌బి చౌదరి గారు, ఎన్‌వి ప్రసాద్ గారు ఈ సినిమాని ఎంతో భారీగా నిర్మించారు. వారికి కృతజ్ఞతలు. నయనతార పాత్ర ఇందులో అత్యద్భుతంగా వచ్చింది. సెకండ్ హాఫ్ లో అద్భుతమైన సెంటిమెంట్ గొప్పగా పండించారు. నయనతారకి హ్యాట్సప్. ఇందులో ప్రతినాయకుడిగా సత్యదేవ్ చేశారు. నాకు ఎదురుగా నిలబడే పాత్రది. సత్యదేవ్ అద్భుతమైన నటుడు. ఇందులో ఆయన నటనని పరిపూర్ణంగా వాడుకున్నాం. సత్యదేవ్ కి చాలా మంచి భవిష్యత్ వుంది. మన కళ్ళముందే సత్యదేవ్ సూపర్ స్టార్ గా ఎదుగుతాడు. మురళి శర్మ పాత్ర చాలా వైవిధ్యంగా వుంటుంది. సముద్రఖని ఇందులో మరో ప్రతి నాయకుడి గా శభాష్ అనిపించారు, సునీల్, షఫీ, గెటప్ శ్రీను పాత్రలు కూడా ఆసక్తికరంగా వుంటాయి. ఇందులో దర్శకుడు పూరి జగన్నాధ్ ఇందులో యూట్యుబర్ గా కనిపించి పాత్రలని కథని పరిచయం చేస్తారు. ఆయన రాకతో కథలో ఒక ఫ్రెష్ నెస్ వస్తుంది. వీరంతా కలసి సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళారు.  లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సల్మాన్ భాయ్ ఇందులో తన స్టయిల్, గ్రేస్, మస్కులేన్ లుక్స్, ఫైట్స్ తో నా తరపున మీ అందరినీని అలరిస్తారు. చాలా అద్భుతంగా వచ్చింది సల్మాన్ పాత్ర.  ఇందులో నేను సల్మాన్ ఒక పాట కు డ్యాన్స్ చేశాం. ఇద్దరి స్టార్లని బ్యాలన్స్ చేస్తూ ప్రభుదేవా అద్భుతంగా ఆ పాటని కొరియోగ్రఫీ చేశారు. గాడ్ ఫాదర్ కి ఆరో ప్రాణం తమన్ మ్యూజిక్. తమన్ మ్యూజిక్ తో ఈ సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది.  కేవలం కంటిచూపుతోని గొప్ప హీరోయిజం తీసుకొచ్చే పాత్రని ఇందులో చేశాను. తమన్ చాలా అద్భుతమైన రీరికార్డింగ్ చేశారు. గూస్ బంప్స్ వస్తాయి. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఇందులో చాలా అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లు చేశారు. ఇందులో నజభజజజరా పాటని అద్భుతమైన ఫైట్ గా తీర్చిదిద్దారు. ఈ సినిమాలో పొలిటికల్, ఫ్యామిలీ డ్రామా వుంటుంది. ఈ రెండు కలసి ప్రేక్షకులుని ఆద్యంతం అలరిస్తుందని హామీ ఇస్తున్నాను. సినిమాని చూశాను కాబట్టి ఇంత నమ్మకంగా చెబుతున్నాను. గాడ్ ఫాదర్ అక్టోబర్ 5 విజయదశమి నాడు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి ప్రేక్షకులు ఆదరించి గొప్ప విజయాన్ని ఇవ్వాలి. ఈ మధ్య చేసిన చిత్రం కాస్త నిరాశ పరిచింది. మిమ్మల్ని సరిగ్గా అలరించలేకపోయాననే అసంతృప్తి వుంది. దీనికి సమాధానమే ఈ సినిమా. గాడ్ ఫాదర్  నిశ్శబ్ద విస్పోటనం. మీ అందరి ఆశీస్సులు కావాలి. విజయదశమి మీ జీవితాల్లో కూడా విజయాన్ని తేవాలి. అలాగే అదే రోజు నా మిత్రుడు నటించిన నాగార్జున ది ఘోస్ట్, యువ హీరో గణేష్ నటిస్తున్న స్వాతిముత్యం చిత్రాలు వస్తున్నాయి. ఈ చిత్రాలు కూడా మంచి విజయం సాధించాలి. మేము అనుకున్నదానికంటే పదిహేను రేట్లు ఎక్కువ మంది వచ్చి.. ఇంత వర్షం పడుతున్న ఒక్కరు కూడా కదలకుండా ఈ వేడుకని విజయవంతం చేశారు. ఇది కదా నిజమైన ప్రేమ. ఈ  ప్రేమనే కదా కోరుకునేది. ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో నిలబడ్డానని అంటారు. నన్ను ఇక్కడ నిలబెట్టింది నా అభిమానులు. నా అభిమానులే నా గాడ్ ఫాదర్స్. చాలా నిజాయితీగా చెబుతున్న మాట ఇది. మీరు చూపిన అనంతమైన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను.. అందరికీ కృతజ్ఞతలు'' తెలిపారు.


గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. గాడ్ ఫాదర్ లాంటి టైటిల్ కి సరిపోయే ఒకే ఒక్క మనిషి చిరంజీవి గారు. చిరంజీవి గారు ఎందరికో స్ఫూర్తి. ఈ సినిమా కోసం మూడు పాటలు, రెండు బిట్ సాంగ్స్ రాశాను. ఈ అవకాశం ఇచ్చిన చిరంజీవి గారికి కృతజ్ఞతలు. మోహన్ రాజా గారు చాలా క్లారిటీ వున్న దర్శకులు. తమన్ ఈ చిత్రానికి తన కెరీర్ బెస్ట్ రీరికార్డింగ్ ఇస్తున్నారు. లక్ష్మీ భూపాల ఈ సినిమా కోసం పదునైన మాటలు రాశారు. గాడ్ ఫాదర్ ఖచ్చితంగా గొప్ప విజయం సాధిస్తుంది'' అన్నారు.


నటుడు షఫీ మాట్లాడుతూ..  గాడ్ ఫాదర్ లో నటించడం, ఆ అద్భుతమైన సినిమా గురించి మాట్లాడటం మర్చిపోలేని అనుభూతి. చిరంజీవి గారంటే నాకు ప్రేమ భక్తి. ఇప్పుడు ఆయన సినిమాలో నటించడం ఒక దివ్యానుభూతి. ఆయనతో కలసి పని చేయడంతో  నా కల నెరవేరినట్లయింది'' అన్నారు.


రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ మాట్లాడుతూ.. మేము అన్నయ్యకి అభిమానులం. అన్నయతో కలసి పని చేయడం మా అదృష్టం. దర్శకుడు మోహన్ రాజా గారు ఈ సినిమాని అద్భుతంగా తీశారు. తమన్ బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రానికి పని చేసిన సాంకేతిక నిపుణులంతా అద్భుతమైన టెక్నిషియన్స్. ఈ సినిమాలో మేము ఎప్పటికీ గుర్తుపెట్టుకునే ఒక ఫైట్ చేశాం. అన్నయ్యతో పీక్ ఎమోషనల్ స్టయిలీష్ ఫైట్ చేయించాం. చాలా అద్భుతంగా వచ్చింది. అది మీరంతా చూడబోతున్నారు. ఈ సినిమాలో అన్నయ్య చాలా కొత్తగా కనిపిస్తారు. అందరినీ అలరిస్తారు'' అని చెప్పారు.


ఈ వేడుకలో సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, సూపర్ స్టార్ మహేష్ బాబు గారి తల్లి ఇందిరాదేవి మృతి పట్ల సంతాపం ప్రకటించింది గాడ్ ఫాదర్ చిత్ర యూనిట్. దర్శకుడు మోహన్ రాజా, సత్యదేవ్, సంగీత దర్శకుడు తమన్, మాటల రచయిత లక్ష్మీ భూపాల, చిట్టి, నాగమహేష్ , గెటప్ శ్రీను, తదితరులు ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.

Mogalthuru Gives Royal Welcome To Prabhas & Family

 Mogalthuru Gives Royal Welcome To Prabhas & Family



The memorial service of Krishnam Raju was held at his hometown, Mogalthuru today and it was attended by Prabhas and Krishnam Raju's family.


This is the first time Prabhas is setting foot in Mogalthuru after a decade and he received a very warm welcome from the locals. 


There was a massive turnout of crowd to see Prabhas and offer final respects to their local hero, Krishnam Raju. 


The memorial service is a grand one and the family had also arranged a grand feast to the attendees. 


Prabhas greeted his fans and commoners alike. He appeared to be touched by the love and warmth he received from the local crowds. 


This goes down as an emotional day for the people of Mogalthuru and Prabhas's family.

Allu Sirish' Urvashivo Rakshashivo enthralling teaser is out now

 Allu Sirish' Urvashivo Rakshashivo enthralling teaser is out now



Allu Sirish and Anu Emmanuel are ready to entertain the audience in a modern-day romantic drama. The film, previously titled 'Prema Kadanta' is now coming out as 'Urvasivo Rakshasivo'.


Well, a few days back, the makers of this film said that they were going to release the film on November 4th. So, a month prior to that, the makers made themselves busy in the promotion of the film. The promotions of the movie started with the fun filled and romantic teaser.


The teaser showed Allu Sirish in a completely new view, balancing his romantic life while posing as a good boy at home. This romantic story begins suddenly, and then the twist occurs, as Anu Immanuel is not ready for a relationship.


The teaser has everyone intrigued with its comedy punches from Sunil and Vennala Kishore and Allu Sirish's magical chemistry with Anu Immanuel. The rich visuals and background score by Achu Rajamani impressed.


The film is directed by Rakesh Sashii. The makers of the film are now planning to release the film on November 4. Renowned Producer Allu Aravind presenting the film while Dheeraj Mogilineni producing it. GA 2 pictures bankrolled the film in association with Shri Tirumala Production Private Ltd banner.


Achu Rajamani composed the music. Tanveer handling the cinematography while editing is done by Karthika Srinivas.

Renu Desai As Hemalatha Lavanam In Ravi Teja Tiger Nageswara Rao

 Renu Desai As Hemalatha Lavanam In Ravi Teja, Vamsee, Abhishek Agarwal Arts’ Pan Indian Film Tiger Nageswara Rao



Renu Desai As Hemalatha Lavanam In Ravi Teja, Vamsee, Abhishek Agarwal Arts’ Pan Indian Film Tiger Nageswara Rao


Mass Maharaja Ravi Teja and director Vamsee’s Tiger Nageswara Rao produced by Abhishek Agarwal is one of the craziest Pan India movies. Tej Narayan Agarwal presents the movie being made on an uncompromised budget. Tiger Nageswara Rao is a biopic on the notorious thief and is set in the 70s in the village named Stuartpuram.


The makers today came up with a small glimpse to introduce Renu Desai’s character. Renu Desai is playing a very important and powerful character called Hemalatha Lavanam. It’s a real-life character and Hemalatha Lavanam was an Indian social worker, and writer, who protested against untouchability and the imbalance in the social system. Renu Desai, in the video, makes a powerful entry, as she walks on the road along with two other female activists who appear in white sarees. GV Prakash Kumar’s BGM uplifts the character.


Nupur Sanon and Gayathri Bharadwaj are playing the leading ladies opposite Ravi Teja in the movie made in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi languages.


R Madhie ISC is the cinematographer and GV Prakash Kumar takes care of music. Avinash Kolla is the production designer. Srikanth Vissa is the dialogue writer, while Mayank Singhaniya is the co-producer.


Cast: Ravi Teja, Nupur Sanon, Gayathri Bharadwaj, Renu Desai and others

Writer, Director: Vamsee

Producer: Abhishek Agarwal

Banner: Abhishek Agarwal Arts

Presenter: Tej Narayan Agarwal

Co-Producer: Mayank Singhaniya

Dialogues: Srikanth Vissa

Music Director: GV Prakash Kumar

DOP: R Madhie

Production Designer: Avinash Kolla

PRO: Vamsi-Shekar

Dasara First Single Dhoom Dhaam Dhosthaan From Dasara

 Nani, Keerthy Suresh, Srikanth Odela, Sudhakar Cherukuri, SLVC’s Dasara First Single Dhoom Dhaam Dhosthaan From Dasara



Natural Star Nani has played a rugged character for the first time in the rustic mass action entertainer Dasara which marks the first Pan India project of the actor. Srikanth Odela is debuting as director with the movie being mounted on a large scale by Sudhakar Cherukuri under the banner of Sri Lakshmi Venkateswara Cinemas. National Award-Winning actress Keerthy Suresh is playing Nani’s love interest in the movie.


Santhosh Narayanan has composed tunes for the movie and the first single Dhoom Dhaam Dhosthaan will be released on Dasara. Nani, in the video, is seen making the announcement about the song. Nani called it the ‘Massiest Street Song Ever’. Though he looks elegant, he makes the announcement in a mas-appealing way.


The film’s story is set in a village situated in Singareni Coal Mines in Godavarikhani (Telangana) in the Peddapalli district.


Samuthirakani, Sai Kumar and Zarina Wahab are the important cast of the film that will have music by Santhosh Narayanan with Sathyan Sooryan ISC handling cinematography.


Navin Nooli is the editor and Avinash Kolla is the production designer of the film, and Vijay Chaganti is the Executive Producer.


The film Dasara will be released in Telugu, Tamil, Kannada, Malayalam and Hindi languages on 30th March 2023.


Cast: Nani, Keerthy Suresh, Samuthirakani, Sai Kumar, Zarina Wahab and others.


Technical Crew:

Directed By Srikanth Odela

Produced By Sudhakar Cherukuri

Production Banner: Sri Lakshmi Venkateswara Cinemas

Director Of Photography: Sathyan Sooryan ISC

Music: Santhosh Narayanan 

Editor: Navin Nooli

Production Designer: Avinash Kolla

Executive Producer: Vijay Chaganti

Fights: Anbariv

PRO: Vamsi-Shekar

Icon Star Allu Arjun with his Family visits Golden Temple at Amritsar

 Icon Star Allu Arjun with his Family visits Golden Temple at Amritsar



Icon Star Allu Arjun always makes time for his family members. On the occasion of his wife Allu Sneha Reddy's birthday, he visited the Golden Temple in Amritsar.


The actor was seen entering the temple like a common man with the family. He sought the almighty's blessings at the golden temple without disturbing the other visitors. Meanwhile, a large crowd had gathered around him. Fans flocked to take selfies with the actor and spend time with him.


He has made the birthday of his loving life memorable and special. Not only this, the actor has also wished him a birthday by sharing a picture on Instagram. 


In the photos revealed on social media, he and his family are getting to see the traditional style. Following the entire culture and rules, he has seen the Golden Temple.


The 'Ala Vaikunthapurramuloo' actor can be seen wearing a blue traditional dress in the video. His fans have loved the post and have flooded the comment section with various emojis.

Nenu C/o Nuvvu Premiere Show Held Grandly

 ’నేను c/o నువ్వు’’ వంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు థియేటర్స్ కు కచ్చితంగా రావాలి...ప్రీమియర్ షో లో మాట్లాడిన ప్రముఖ నిర్మాతలు, రాజకీయ నాయకులు 




ఆగాపే అకాడమీ పతాకంపై రత్న కిషోర్,సన్య సిన్హా, సత్య,ధన, గౌతమ్ రాజ్ నటీ,నటులుగా సాగారెడ్డి తుమ్మ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘’నేను c/o నువ్వు’’.ఈ చిత్రానికి అత్తావలి , శేషిరెడ్డి, దుర్గేష్ రెడ్డి, కె .జోషఫ్ లు  సహ నిర్మాతలు.ఈ చిత్రం నుండి విడుదలైన మోషన్  పోస్టర్‌, టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 30 న గ్రాండ్ గా విడుదల అవుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ సినీ, రాజకీయ  ప్రముఖులకు, పాత్రికేయులకు మరియు ఫెమస్ యూట్యూబర్స్ కు ప్రీమియర్ షోను ప్రదర్శించడం జరిగింది. షో అనంతరం మీడియా సమావేశంలో 



నిర్మాతలు , రాజకీయ నాయకులు  మాట్లాడుతూ.. సినిమా చాలా బాగుంది..మనం ఈ మధ్య కులం పేరుతో ఇంకా పరువు హత్యలు జరుగుతుండడం  మనం చూస్తునే ఉన్నాము.కాబట్టి ఇలాంటి పరువు హత్యల సినిమాలు థియేటర్స్ కు కచ్చితంగా రావాలి.ఈ సినిమాల వలన  ప్రేక్షకులలో ఇంకా అవగాహన  పెరుగుతుంది.చిత్ర దర్శకుడు సాగా రెడ్డి తుమ్మ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించాడని చూసిన వారందరూ ప్రశంశలతో  ముంచెత్తారు.

Arulnithi Stalin's 'Reyiki Veiyi Kallu' To Be Streamed On Aha

 


While OTT platforms were making a mark for themselves in the Indian market, COVID-19 crisis accelerated the process. The usage of OTT platforms has increased swiftly in the last 2 to 3 years. In fact, movie buffs are showing interest in watching a wide variety of movies in different languages.

Coming to the actual point, the Tamil blockbuster movie ‘Iravukku Aayiram Kangal’ is being dubbed into Telugu. The popular OTT platform AHA is bringing this film to the Telugu audience with the title 'Reyiki Veyi Kallu'. This Friday i.e. on September 30, the film will start streaming on AHA.

Arulnithi Stalin is well known for his blockbuster hits like Demonte Colony, Dejavu, Diary, etc. He is all set to enthrall the Telugu audience with 'Reyiki Veyi Kallu' arriving on AHA. The movie ran for more than 50 days in theatres. Critics as well as the audience got spellbound by the twists in the movie. It’s an edge-of-the-seat action thriller with a novel story.

The film uses reverse chronology to good effect in telling the story and the most commendable thing is that the interest is kept fueled till the very end. Sometimes the audience will feel that the screenplay technique is inspired by Christopher Nolan's MOMENTO. 

The film, actually, deals with a series of murders. It revolves mainly around a cab driver Bharath (Arulnithi) and Ganesh (Ajmal) who blackmails people for money. The audience keeps guessing the murderer till the end, the guessing game will be engaging and exciting, it leaves the audience in awe.

G Dilli Babu of Axess Film Factory who produced Ratsasan (Rakshasudu in Telugu) has bankrolled the project in Tamil. Sam CS's background score, Aravind Singh's cinematography, and San Lokesh's editing are the other big assets.

In fact, there is no language barrier to watch thriller movies. Thus, 'Reyiki Veiyi Kallu' is going to connect well with the Telugu audience as well. However, we need to wait for 3 more days to watch the movie on AHA.

Megastar Chiranjeevi garu will be Launching Allu Studios with the Allu Family on Allu Ramalingaiah gari Birth Centenary

 Megastar Chiranjeevi garu will be Launching Allu Studios with the Allu Family on Allu Ramalingaiah gari Birth Centenary 



Last Year On October 1, coinciding with the 99th birth anniversary of late Telugu actor Allu Ramalingaiah garu, his family members led by Allu Aravind announced that Hyderabad will soon have a new film studio — Allu Studios.


On the day of announcement his son Allu Aravind and grandsons Allu Arjun, Bobby Allu and Allu Sirish inaugurated the construction work of a film studio in Hyderabad.


Spread over 10 acres in Gandipet, Allu Studios' construction work in Gandipet began with a low-key event on the same day and continued with the efforts of many people.


As promised, by the Allu family the studio will be having a grand opening on the 100th birth anniversary of Legend Late Allu Ramalingaiah garu. Megastar Chiranjeevi will be present at the grand event to kick off the new endeavor and launch the Allu Studios. The studios will be launched by Megastar Chiranjeevi, with Renowned Producer Allu Aravind, Icon Star Allu Arjun, Allu Sirish, Allu Venkatesh, and the whole Allu family.


Now this exciting news made everyone is eagerly waiting to witness the grand opening of Allu Studios, which will be an addition to the handful of film shooting studios in Hyderabad

Allari Naresh Itlu Maredumilli Prajaneekam To Release On November 11th

 Allari Naresh, AR Mohan, Zee Studios & Hasya Movies’ Itlu Maredumilli Prajaneekam To Release On November 11th



Multi-faceted star Allari Naresh’s upcoming film Itlu Maredumilli Prajaneekam under the direction of AR Mohan is currently in the post-production stages. Razesh Danda of Hasya Movies is producing the movie, in association with Zee Studios. The film has garnered enough buzz, with a terrific response for the teaser. The video that unveiled the storyline of the movie presented Allari Naresh in an intense character as a government official who is sent on election duty in the tribal area- of Maredumulli where he faces many challenges.


The makers today announced the release date of the movie. Itlu Maredumilli Prajaneekam will be hitting the screens worldwide on November 11th. The announcement poster sees Naresh, along with his colleagues and police officials walking in the tribal area.


Anandhi is the leading lady in the movie, where Vennela Kishore, Praveen, and Sampath Raj will be seen in important roles. Balaji Gutta is the co-producer of the movie that has music by Sricharan Pakala, while Raam Reddy handled the cinematography. Abburi Ravi has penned the dialogues. Brahma Kadali is the art director and Chota K Prasad is the editor.


Cast: Allari Naresh, Anandhi, Vennela Kishore, Praveen, Sampath Raj


Technical Crew:

Written & Direction: AR Mohan

Producer: Razesh Danda 

Produced By: Zee Studios and Hasya Movies 

Co-Producer: Balaji Gutta

Music Director: Sricharan Pakala

Dialogues: Abburi Ravi

DOP: Raam Reddy

Art Director: Brahma Kadali

Editor : Chota K Prasad

Stunts: Pruthvi 

Choreography: Sekhar Master, Binny

DI - Annapurna Studios 

PRO: Vamsi-Shekar

Megastar Chiranjeevi, Superstar Salman Khan’s GodFather Mass-appealing Telugu Theatrical Trailer Dropped

 Megastar Chiranjeevi, Superstar Salman Khan’s GodFather Mass-appealing Telugu Theatrical Trailer Dropped



Mega fans have been waiting eagerly for this day to witness the grand pre-release event of GodFather and also to watch the theatrical trailer of the movie. The event in Anantapur of Andhra Pradesh state has begun and the makers unveiled the Telugu trailer during the function.


Megastar Chiranjeevi and superstar Salman Khan will be seen sharing the screen space, which itself is the biggest attraction of the movie. Director Mohan Raja has tried to bring out the best version of both stars. He indeed presented the two megastars the way fans wish to see them.


The trailer takes us insight into what the film is all about. The state’s chief minister PKR passes away, leading to questions on succession. While his daughter (Nayanthara) is not interested, his son-in-law (Satya Dev), and a few others in the party are at the heart of a power grab. Brahma (Chiranjeevi), the trusted man of the fallen stalwart, is drawn into the murky affairs and is keen to keep greedy sharks at bay.


Chiranjeevi delivers a strong performance as Brahma as well as GodFather. Style comes easy to Chiranjeevi and that is evident throughout his performance. Salman Khan’s aura on screen amplifies the punch moment. It’s an eye feast to watch them together. Nayanthara and Satya Dev are cool in their respective roles.


Nirav Shah’s cinematography is top-notch, while S Thaman has fired up the scenes with his background score. Every dialogue uttered by Chiranjeevi is very powerful.


The trailer has lived up to all the hype and has taken the expectations to another level. The production design of Konidela Production Company and Super Good Films is first class.


GodFather is up for release on October 5th on Dasara.


Cast: Megastar Chiranjeevi, Salman Khan, Nayanthara, Puri Jagannadh, Satya Dev

Directed by - Mohan Raja.

Dialogues: Lakshmi Bhupala

Producers: Ram Charan, R B Choudary, N V Prasad

Music: Thaman S

Cinematography: Nirav Shah

Production Designer:  Suresh Selvarajan

Ex-Producer: Vakada Apparao

VFX Supervisor: Yugandhar T

DI : Annapurna Studios

Colorist : Venu Gopal Rao.J

Teaser cut-Praveen Antony

Banners: Konidela Production Company, Super Good Films.

PRO: Vamsi-Shekar

Blockbuster Director Anil Ravipudi Launched Coffee With a Killer Trailer

 బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆవిష్కరించిన ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ ట్రైలర్



ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ కాస్త గ్యాప్ తీసుకొని మళ్లీ మెగాఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో.. ది బెస్ట్ క్రియేషన్, సెవెన్‌హిల్స్ ప్రొడక్షన్స్ పతాకాలపై ‘బట్టల రామస్వామి బయోపిక్కు’ వంటి సినిమాతో అభిరుచి గల నిర్మాతగా పేరొందిన సెవెన్‌హిల్స్ సతీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘కాఫీ విత్ ఎ కిల్లర్’. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘కరోనా ప్యాండమిక్ తరువాత రీ రిలీజులు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అదరగొడుతున్నాయి. ముఖ్యంగా కంటెంట్ ఉన్న సినిమాలకే ఎక్కువ స్కోప్ ఉంది. ఆ స్కోప్ ఈ ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ ట్రైలర్‌లో కనపడుతోంది. నిజమే ఒక కాఫీ షాప్‌లో ఇన్ని జరుగుతూ ఉంటాయి కాబోలు అని అర్థమైంది. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ట్రైలర్ కనిపిస్తోంది. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఈ ట్రైలర్ చూశాక నాకు ఆర్.పి గారే హీరో అనిపించింది. ఎందుకంటే.. కథే హీరో కనుక ఆ కథను మలిచింది ఆయనే కనుక. ఆర్.పి గారు ఏ క్రాఫ్ట్‌కు వెళ్ళినా సక్సెస్ ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. ఆయనంటే నాకు ప్రత్యేకమైన అభిమానం.. ఎందుకంటే మేము టీనేజ్‌లో ఉన్నప్పుడు ఆయన కంపోజ్ చేసిన పాటలే ఎక్కువగా వినే వాళ్ళం. ఆ పాటలే లేకుంటే మా టీనేజ్ అంతా ఏమైపోయేదో.. మమ్మల్ని అంత ఇంప్రెస్ చేశాయి. ఇక ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరితో నా కెరీర్ మొదటి నుంచి కలిసి ట్రావెల్ చేశాను. ఫ్రెండ్స్ మధ్య ఉండి మాట్లాడుతున్న ఫీలింగ్ ఉంది. అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ.. టీమ్‌కి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను..’’ అన్నారు.


అతిథిగా హాజరైన నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. మొదట ఈ టైటిల్ చెప్పగానే ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ ఏంటి? కాఫీ విత్ కరణ్ లాగా అని అనుకున్నా.. బట్ ట్రైలర్ చూస్తే చాలా థ్రిల్లింగ్‌గా, ఎంటర్టైనింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సినిమా ఘన విజయం సాధించాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అన్నారు.  


దర్శకుడు ఆర్.పి పట్నాయక్ మాట్లాడుతూ.. ‘‘ఓటిటి వచ్చాక జనాలకు థియేటర్స్‌లో సినిమా చూడాలనే ఆలోచనలో మార్పు వచ్చింది. కొత్తగా చెప్తే కానీ థియేటర్స్‌కు రప్పించలేము అనిపించే ఎంటర్‌టైనింగ్‌తో కూడిన థ్రిల్లర్ కథగా ఈ ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ సినిమా కథను రాసుకొని.. డైరెక్ట్ చేయడం జరిగింది. అందుకు నా మరో తమ్ముడు సెవెన్‌హిల్స్ సతీష్ తోడై నిర్మాతగా వ్యవహరించాడు. సెట్‌లో తన ఆవేశాన్ని కంట్రోల్ చేయడం కొంచెం కష్టమే అయ్యింది( నవ్వుతూ). కానీ, సతీష్ అలా ఉండడం వల్లే ఈ సినిమా ఇక్కడి వరకు రాగలిగింది. ఇంకో రెండు సినిమాలు మా ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్నాయి. ఇక ఇప్పుడు ఈ కాఫీ విత్ ఎ కిల్లర్ చిత్రానికి వస్తే.. ఆరిస్టులు అందరూ చాలా సపోర్ట్ చేసినా.. వారి వెంట వచ్చిన అసిస్టెంట్స్ వల్ల బాగా ఇబ్బంది పడ్డాము. అది కాకుండా అయితే ఇట్స్ ఎ టీం వర్క్ అని చెప్పాలి. ఈజీగా చేసే సినిమా మాత్రం కాదు అని చెప్పగలను. ఈ చిత్రంలో ఒక సీక్రెట్ కూడా ఉంది.. అది ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రివీల్ చేస్తాము. అందుకే ఆర్టిస్టులను ఎవర్నీ ఇక్కడికి తీసుకురాలేదు.  ఒక డిఫరెంట్ అండ్ న్యూ కాన్సెప్ట్‌ను ట్రై చేశాము. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. ఇక మేము పిలవగానే తను ఎంతో బిజీగా ఉన్నా.. ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చిన అనిల్ రావిపూడి‌గారికి కృతఙ్ఞతలు.. ఎందుకో ఆయనకు నేనంటే చాలా అభిమానం. అలాగే అభిషేక్ అగర్వాల్ గారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..’’ అన్నారు.


నిర్మాత సెవెన్‌హిల్స్ సతీష్ మాట్లాడుతూ.. ‘‘ఆర్.పి గారు నాకు సొంత బ్రదర్ లాంటి వాడు. వాళ్ళ సొంత బ్రదర్స్ తనతో పాటు ఉంటారు.. నేను బయట తనతో తిరుగుతూ ఉంటాను అంతే. ఈ సినిమా లైన్ చెప్పగానే యాక్సెప్ట్ చేయాలనుకున్నా.. ఈ సినిమాలో ఒక చిన్నసర్‌ప్రైజ్ ఉంది.. త్వరలో రివీల్ చేస్తాము. ఈ సినిమాకు క్రియేటివ్ హెడ్‌గా పనిచేసిన గౌతమ్ పట్నాయక్ కానీ లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇంతదాకా వచ్చేది కాదు. ఆర్ పి గారితో ఇంకో రెండు ప్రాజెక్ట్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.


ఇంకా ఈ కార్యక్రమంలో రఘు కుంచె, జెమినీ సురేష్, బెనర్జీ, రవి ప్రకాష్, గౌతమ్ పట్నాయక్, అనుష్, తిరుమల నాగ్, కృష్ణారెడ్డి, డైరెక్టర్ రాజ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

శ్రీనివాస్ రెడ్డి, రవి బాబు, సత్యం రాజేష్, రఘు బాబు, జెమినీ సురేష్, రవి ప్రకాష్, టెంపర్ వంశీ, బెనర్జీ తదితరులు ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి

క్రియేటివ్ హెడ్: గౌతమ్ పట్నాయక్,

డి ఓ పి- ఎడిటర్- డి ఐ- అనుష్ గౌరక్,

డైలాగ్స్: తిరుమల నాగ్,

పీఆర్వో: బి. వీరబాబు,

నిర్మాత: సెవెన్ హిల్స్ సతీష్,

రైటర్- డైరెక్టర్: ఆర్ పి పట్నాయక్.


Young hero Havish says 'Yes Boss'!!!

 Young hero Havish says 'Yes Boss'!!!



'Yes Boss' is the title of a new movie announced today by A Studios. Koneru Satyanarayana is producing the movie. Havish is the hero of this mass entertainer. Ashok of 'Bhaagamathie' fame is its director. The film has completed its first schedule. Brahmanandam is playing a key role. Prominent writer Akula Siva is writing its story and dialogues. 


Director Ashok is wielding the megaphone for a feature film after a gap. The second schedule will be held from the third week of October. Koneru Satyanarayana is producing this movie after Ravi Teja's 'Khiladi'. Anup Rubens is its music director. Sai Prakash of 'DJ Tillu' fame is its cinematographer. The first look of the entertainer will be released soon.


Krishna Vrinda Vihari Thankyou Meet

 ‘కృష్ణ వ్రింద విహారి'ని హిలేరియస్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు: ‘కృష్ణ వ్రింద విహారి' థాంక్ యు మీట్ లో చిత్ర యూనిట్  



వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి'.  షిర్లీ సెటియా కథానాయిక.  శంకర్ ప్రసాద్ ముల్పూరి ఈ చిత్రాన్ని సమర్పించారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం హిలేరియస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ  నేపధ్యంలో  చిత్ర యూనిట్ థాంక్ యూ మీట్ ని నిర్వహించింది.



హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. మా సినిమాని ఆదరించి గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. చాలా మంచి సినిమా. థియేటర్ లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు నుండి థియేటర్లు , రెవెన్యూ  పెరుగుతున్నాయి. పంపిణీదారులు, మేము అంతా ఆనందంగా వున్నాం. మాకు ఎంతగానో సహకరించిన మీడియా మిత్రులకు, వంశీ-శేఖర్ కృతజ్ఞతలు. సత్య, రాహుల్ రామకృష్ణ, వెన్నెల కిషోర్ ఇలా అందరూ నటులు చాలా అద్భుతంగా చేశారు. వారితో కలసి చేసిన సీన్స్ కి థియేటర్ లో ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. మంచి సినిమాని ఇచ్చిన దర్శకుడు అనీష్ కృష్ణకు, నిర్మాతైన మా అమ్మకి థాంక్స్. ఛలో తర్వాత గర్వపడే హిట్ ఇచ్చినందు మా అమ్మకి స్పెషల్ థాంక్స్. సినిమాని ఇంకా చూడనివారు థియేటర్ కి రండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు'' అని చెప్పారు.


నిర్మాత ఉషా మూల్పూరి మాట్లాడుతూ.. ‘కృష్ణ వ్రింద విహారి' సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకునికి కృతజ్ఞతలు. ఈ సినిమాపై మొదటి నుండి చాలా నమ్మకంతో వున్నాం. ఆ బలమైన నమ్మకంతోనే నాగశౌర్య పాదయాత్ర కూడా చేశారు. ఈ పాదయాత్రకి ఎంతగానో సపోర్ట్ చేసిన పోలీస్ సిబ్బందికి, పీఆర్ టీంకి, పాదయాత్రలో మా వెంటనడిచిన అభిమానులందరికీ కృతజ్ఞతలు. ‘కృష్ణ వ్రింద విహారి' ఫ్యామిలీతో అందరూ కలసి థియేటర్ లో చూడాల్సిన సినిమా. ఒక రెండు గంటల పాటు అన్ని ఒత్తిళ్ళు పోగొట్టి మనసుని హాయితో నింపే సినిమా ఇది. థియేటర్ కి వచ్చిన అందరూ చాలా ఎంజాయ్ చేశారు. దసరా సెలవలు కూడా వచ్చాయి కాబట్టి ఇంకా సినిమా చూడని వారు మీ ప్యామిలీతో కలిసొచ్చి సినిమా చూసి ఆనందించాలి'' అని కోరారు


దర్శకుడు అనీష్‌ ఆర్‌ కృష్ణ మాట్లాడుతూ..  ‘కృష్ణ వ్రింద విహారి' డీసెంట్ ఓపెనింగ్స్ తో మొదలైయింది. శుక్రవారం కంటే శనివారం 36 శాతం రెవెన్యు పెరిగింది. ఆదివారం ఇంకో 20 శాతం పెరిగింది. రెవెన్యూ స్టడీగా కొనసాగుతోంది. సినిమాని పెద్ద విజయం చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. నాగశౌర్య గారికి స్పెషల్ థాంక్స్. రాధిక గారితో పాటు ఈ సినిమాలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. మా సినిమాకి పెద్ద విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు'' తెలిపారు.

ఈ వేడుకలో రాహుల్ రామకృష్ణ, సత్య, హిమజ తదితరులు పాల్గొన్నారు.

aha to kickstart season 2 of 'Unstoppable with NBK' with the launch of Unstoppable Anthem

 

aha, to kickstart season 2 of 'Unstoppable with NBK' with the launch of Unstoppable Anthem


-     The Anthem was rapped by Roll Rida and composed by Mahati Swara Sagar –


Hyderabad, 27th September: Nandamuri Balakrishna is one name that Indian film 

audience enthrals both at the theatres and OTT alike. Balakrishna, informally referred to as NBK, dons many hats of actor, producer, and director, and with Unstoppable, has also turned into a talk show host for the first time ever on aha. Now he is all set to return with his most famous, quirky, IMDb top-rated talk show, Unstoppable with NBK Season 2. To the show's launch, aha has come up with yet another breakthrough idea by launching an anthem of the show, adding a thrill quotient to season 2. 


Sharing his thoughts on the title song, Nandamuri Balakrishna, said, "This fast-paced soundtrack created by Roll Rida and Mahati Swara Sagar is great. I'm excited to be part of season 2 and looking forward to the audience's reaction to the anthem."


Link – https://www.youtube.com/watch?v=TWjWSHFOClk&feature=youtu.be


Anchored by good conversations, the show has become a property that its fans look forward to. aha has unveiled the anthem, showcasing the show's plot line. Notably, Roll Rida has sung and penned the lyrics composed by Mahati Swara Sagar. Season 2 is all set to steam on, aha, from October 2022. 




Sagileti Kadha First Look Launched

 సగిలేటి కథ ఫస్ట్ లుక్ విడుదల 



అశోక్ ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై రవితేజ మహాదాస్యం, విషిక హీరో హీరోయిన్ గా కేన్స్ లాంటి ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన ఫిలిం ఫెస్టివల్ లో తన ప్రతిభను చాటుకూన రాజశేఖర్ సుడ్మూన్ దర్శకత్వంలో అశోక్ మిట్టపల్లి నిర్మిస్తున్న చిత్రం "సగిలేటి కథ". ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో చిత్రీకరించబడిన "ఒక అందమైన మట్టి కథ అక్కడి మనుషుల కథ" . ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను యూనిట్ సభ్యులు సోషల్ మీడియా లో విడుదల చేశారు. 


ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ "తెలుగు చిత్రసీమలో ఇప్పటివరకు ఇటువంటి నేటివిటీని ఎప్పుడు చూసి ఉండరు. ఈ చిత్రంలోని  భావోద్వేగాలు మిమ్మల్ని కదిలిస్తాయి, ఇంకా చెప్పాలి అంటే ఇందులో పాత్రలతో మీరు మాట్లాడబోతున్నారు అనడంలో అతిశయోక్తి  ఏమాత్రం లేదు. ఇందులో కనిపించే ప్రతి పాత్ర మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి పాత్ర ఒక కల్ట్ పాత్ర. ఒక అద్భుతమైన రాయలసీమ కథను త్వరలోనే మీ ముందుకు తీసుకురాబోతున్నాము" అని తెలిపారు. 


బ్యానర్ : అశోక్ ఆర్ట్స్ 

చిత్రం పేరు : సగిలేటి కథ


నటి నటులు : రవితేజ మహాదాస్యం, విషిక కోట, నరసింహ ప్రసాద్ పంటగాని, రాజశేఖర్ ఆంగిని 


సంగీత దర్శకుడు : జస్వంత్ పసుపులేటి 

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : సనల్ వాసుదేవ్ 

లిరిక్స్ : వారికుప్పల్లా యాదగిరి, రాజశేఖర్ సుడ్మూన్, శేషికాంత్ బిలపతి 

ఆర్ట్ డైరెక్టర్ : హేమంత్ జి , ఐశ్వర్య కులకర్ణి 

సౌండ్ డిజైన్ : జె ఆర్ ఎతిరాజ్ 

సౌండ్ మిక్సింగ్ : శ్యామల్ సికిందర్ 

పబ్లిసిటీ డిజైన్ : మాయాబజార్ 

పి ఆర్ ఓ : పాల్ పవన్