Cbi Jd Laxminarayan Key role in Bhimadevarapalli Branch

 CBI JD LAXMINARAYANA గారు నటించిన మొదటి చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి.




"భీమదేవరపల్లి బ్రాంచి " ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించన ముఖ్యమైన సన్నివేశాలని దర్శకుడు రమేష్ చెప్పాల నిన్న చిత్రీకరించారు. ఇందులో సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు, ప్రఖ్యాత రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, నాయకులు అద్దంకి దయాకర్ గారు నటించారు. జేడీ లక్ష్మీనారాయణ గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు నటించిన మొదటి చిత్రం భీమదేవరపల్లి బ్రాంచి కావడం విశేషం. ఇంతకుముందు ఎంతో మంది దర్శకులు,నిర్మాతలు ,స్వయంగా రామ్ గోపాల్ వర్మ తన సినిమాలో నటించమని అడిగిన నో చెప్పిన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు. భీమదేవరపల్లి బ్రాంచిలో  యాక్ట్ చేయడం విశేషం.ఈ మధ్య జరిగిన ఒక సంఘటన దేశవ్యాప్తంగా సెన్సేషనల్ అయ్యింది. దాని ప్రేరణతో ఈ సినిమాను"Neorealism" ఉట్టిపడేలా "స్లైస్ ఆఫ్ లైఫ్" జానర్ లో నిర్మించారు. దర్శకుడు

చెప్పాలనుకున్న కథలో సహజత్వం పోకూడదని, వెతికి వెతికి అనేకమంది థియేటర్ ఆర్టిస్టులని నటింపజేశారు, వాస్తవికత కళ్ళ ముందుoచే ఈ చిత్రం ప్రతి ఒక్కరిని  కదిలిస్తుంది. ఇందులో

అంజి బాబు,రాజవ్వ,సుధాకర్ రెడ్డి,కీర్తి లత, అభి, రూప శ్రీనివాస్,శుభోదయం సుబ్బారావు, సి. ఎస్.ఆర్. వివ రెడ్డి, బుర్ర శ్రీనివాస్ 

పద్మ, సాయి ప్రసన్న,మానుకోట ప్రసాద్,గడ్డం నవీన్, తాటి గీత మల్లికార్జున్, మహి, వాలి సత్య ప్రకాష్, మిమిక్రీ మహేష్, తిరుపతి, వంటి పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

AB CINEMASS & NIHAL PRODUCTIONS  నిర్మిస్తోన్న  ఈ చిత్రానికి 

రచన-దర్శకత్వం: రమేశ్ చెప్పాల. 

నిర్మాతలు: బత్తిని కీర్తిలత గౌడ్,రాజా నరేందర్ చెట్లపెల్లి

 కెమెరా: కె.చిట్టి బాబు. సంగీతం: చరణ్ అర్జున్, సాహిత్యం:సుద్దాల అశోక్ తేజ.ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి. పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే  ఆర్ట్: మోహన్. పి ఆర్ ఓ: శ్రీధర్.



Post a Comment

Previous Post Next Post