Latest Post

Sundeep Kishan Launched Title And First Look Of Varun Sandesh’s Yadhbhavam Thadhbhavathi

 Sundeep Kishan Launched Title And First Look Of Varun Sandesh’s Yadhbhavam Thadhbhavathi



Talented hero Varun Sandesh has become choosy of late. He is presently doing a suspense thriller under the direction of Ramesh Jakkala. Prasanna Laxmi Bhoomi is making the movie grandly under the banner of Prasanna Bhoomi Entertainments. Wishing Varun Sandesh on his birthday, the title and first look of the movie have been unveiled. Hero Sundeep Kishan has done the honour of releasing the first look and he wished the team good luck.


A powerful title Yadhbhavam Thadhbhavathi is locked for the movie. Yadhbhavam Thadhbhavathi means- your inner thoughts make your outer appearance. Your thoughts will influence your behaviour and your behaviour influences your character. The first look presents Varun Sandesh in a massy and rugged look. Retro style adds more vigour to the overall look. Sporting long hair and beard, Varun Sandesh with shades on and shackles to his hand is seen smoking a cigarette and firing two guns at a crime spot. The title as well as the first look are impressive.


Inaya Sultana is the leading lady opposite Varun Sandesh in the movie, wherein Master Bhuvan, Shrikanth Iyyanger, Lohith Kumar and Shiva Reddy will be seen in important roles.


The film being made with a unique storyline with edge of the seat narrative has music by Mihirama, while Kalyan Shyam is handling the cinematography. RM Vishwanadh Kunchanapally is the editor and Raju Addala is the art director.


The film’s shoot is nearing completion.


Cast: Varun Sandesh, Inaya Sultana, Master Bhuvan, Shrikanth Iyyanger, Lohith Kumar and Shiva Reddy


Technical Crew:

Director: Ramesh Jakkala

Producer: Prasanna Laxmi Bhoomi

Banner: Prasanna Bhoomi Entertainments

Executive producer: Sarath Sreekantam

Writer's: Dr. Vikram Bhoomi, Dasari Venakatesh

Music: Mihirams

Dop: Kalyan Shyam

Editor: RM Vishwanadh Kunchanapally

Art Director: Raju Addala

Flights: Shaolin Mallesh

Choreographer: Suresh Varma 

Publicity Design: MKS Manoj

PRO: Satish Palakurthi, Parvathaneni

First Shade From 'Vikky The Rockstar' Unveiled

 First Shade From 'Vikky The Rockstar' Unveiled




Vikram and Amrutha Chowdary are playing the lead roles in the upcoming unique musical romantic entertainer 'Vikky The Rockstar' being directed by CS Ganta. Flight Lieutenant Srinivas Nuthalapati(IAF) is producing the film with high production values under the banner of Studio87 Productions, while Mrs. Vardhini Nuthalapati presents the movie. Subhash and Charitha are the executive producers.


Shades Of Rockstar will be witnessed as a series of glimpses showing different shades of the protagonist will be revealed. Here’s the First Shade. The glimpse shows the Rockstar briefing about the significance of first one in everyone’s life. It’s a heart-wrenching video with deep emotions. Sunil Kashyap’s background score adds more depth to the glimpse. The visuals offer an eye-feast. Cinematographer Bhaskar is behind the stunning visuals. Of course, the movie is being made on lavish manner with uncompromised budget.


'Vikky The Rockstar' is in last leg of post-production works and the team is promoting the movie vigorously. In fact, the promotional material has created lots of hype, starting from the first look to the motion poster. Now, the First Shade has got instant response.


The film’s release date will be disclosed soon.


Technical Crew:

Director: CS Ganta

Banner: Studio87 Productions

Producer: Flight Lieutenant Srinivas Nuthalapati(IAF) 

Executive Producers: Subhash, Charitha

Music: Sunil Kashyap

Cinematographer: Bhaskar

Editor: Pradeep Jambiga

Production Executive: Shyamala Chandra

Designer: TSS Kumar

PRO: Sai Satish, Parvataneni Rambabu

Actor Sarath Kumar Interview About Parampara 2

 'పరంపర' సీజన్ 2ను ఎంజాయ్ చేస్తున్నారు - శరత్ కుమార్




డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ 'పరంపర' సీజన్ 2 వచ్చేసింది. ఈ వెెబ్ సిరీస్ లో జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ల దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ ను రూపొందించారు. ఈ కొత్త సిరీస్ స్ట్రీమింగ్ మొదలైంది. ఈ వెబ్ సిరీస్ లో నటించిన అనుభవాలను తెలిపారు నటుడు శరత్ కుమార్. ఆయన మాట్లాడుతూ..



- నేను కెరీర్ ప్రారంభంలో విలన్ రోల్స్ చాలా చేశాను. చాలా గ్యాప్  తర్వాత ఇన్నాళ్లకు ఒక గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్ ఈ వెబ్ సిరీస్ లో చేస్తున్నాను. ఈ పాత్ర పూర్తిగా విలనీతో ఉండదు. మరొకరి వల్ల ఎదిగాడనే పేరును తట్టుకోలేడు. అదొక్కటే అతని సమస్య. మొత్తానికి భిన్నమైన సమస్య. నాకు నచ్చని మోహన్ రావు అనే వ్యక్తి కొడుకు వచ్చి ఎదిరించినప్పుడు మా మధ్య అసలైన గొడవ మొదలవుతుంది.


- ఈ వెబ్ సిరీస్ లో నాయుడు అనే పాత్రలో నటిస్తున్నాను. మోహన్ రావు (జగపతిబాబు) కొడుకు గోపి(నవీన్ చంద్ర) నాయుడును ఎదిరించినప్పుడు ఏం జరుగుతుందని అనేది ఈ సెకండ్ సీజన్ లో చూస్తారు. అన్ని పాత్రలకు ఇంపార్టెన్స్ ఉన్న వెబ్ సిరీస్ ఇది. ఒక్కో  సందర్భంలో ఒక్కో పాత్ర హైలైట్ అవుతూ ఉంటుంది.



- పొన్నియన్ సెల్వన్ సినిమా కోసం నాలుగేళ్లు గెడ్డం లుక్ అలాగే ఉంచుకోవాల్సివచ్చింది. అదే గెటప్ లో ఈ వెబ్ సిరీస్ లో నటించాను. ఈ టీమ్ అందరితో పనిచేయడం సంతోషంగా ఉంది. దర్శకులు విజయ్, విశ్వనాథ్, హరి, కెమెరా మెన్ ..ఇలా టీమ్ అంతా చాలా కష్టపడి పనిచేశారు. నేనూ కంఫర్ట్ గా ఫీలయ్యాను. ఆర్టిస్టులు కూడా ఆమని, జగపతిబాబు, ఆకాంక్ష, నవీన్ చంద్ర ..బాగా నటించారు. కంటెంట్ బాగుంది కాబట్టి అంతా ఆకట్టుకునేలా నటించారు.



- కథ, మా క్యారెక్టరైజేషన్స్  ముందే డిజైన్ చేసి ఉంచారు కాబట్టి దర్శకులు ఎంతమంది అయినా నటించేప్పుడు కన్ఫ్యూజన్ లేదు. ఆ పాత్ర ఎలా ఉండాలో అలాగే చేసుకుంటూ వెళ్లాం. టీమ్ అంతా పూర్తి కోఆర్డినేషన్ తో పనిచేసింది.


- థియేటర్ లకు జనాలను రప్పించాలంటే ఇప్పుడు శ్రమ పడాల్సి వస్తోంది. పాన్ ఇండియా ఆర్టిస్టులను పెడుతున్నారు. అలాగే మంచి ప్రమోషన్ చేయాలి. కానీ ఓటీటీ అలా కాదు. కొంత ప్రమోషన్ చేసి మంచి కంటెంట్ చూపిస్తే...ఆడియెన్స్ ఇంట్లోనే కూర్చొని చూస్తారు. ఇప్పుడొక వెబ్ సిరీస్ చూసే నేనూ ఇంటర్వ్యూకు వచ్చాను. పరంపర మొదటి సీజన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నేను తొలిసారి చేసిన వెబ్ సిరీస్ కు ఆదరణ దక్కిందంటే సంతోషమే కదా.



- థియేటర్ లో రెస్పాన్స్ సులువుగా  తెలిసిపోతుంది. సినిమా బాగుందా బాగా లేదా అని కలెక్షన్స్ చెబుతాయి. ఓటీటీలో కంటెంట్ బాగుందంటే మీ స్పందనను బట్టే తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ కూడా బాగుందా బాగా లేదా అని చెబుతుంటాయి. గతంలో సీనియర్ నటులు పాత్రలను అర్థం  చేసుకుని, దర్శకులు చెప్పినదాన్ని బట్టి నటించేవారు. ఇవాళ మాలాంటి నటులకు ఎన్నో రిఫరెన్స్ లు తీసుకునే అవకాశం, ప్రపంచ సినిమాను చూసి స్ఫూర్తి పొందే వీలు ఉంది. గతంలో అలా లేదు.


- మనకున్న బడ్జెట్ పరిమితుల్లో మంచి కథను చెబితే వెబ్ సిరీస్ లు కూడా మంచి ప్రాఫిట్ వస్తాయి. ఘన విజయాలు సాధిస్తాయి. అందులో ప్రజలకు ఏదో ఒక మంచిని చెప్పాలనే ప్రయత్నమూ మన కథలు, పాత్రల ద్వారా  చేయవచ్చు. పరంపర 2 లో నా పాత్రకు మంచి డైలాగ్స్ ఉంటాయి. పర్మార్మెన్స్ కు అవకాశం ఉంది కాబట్టి ఈ పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతుంది అనిపిస్తోంది.


- ఇప్పుడు సినిమాల్లో విలన్ అంటే అర్థం మారిపోయింది. చూపించే విధానం ఛేంజ్ అయ్యింది. నా దృష్టిలో మంచి వాళ్లు, చెడ్డ వాళ్లు అనేది వాళ్ల ఆలోచించే కోణంలో ఉంటుంది. ఎవరికి వారు మేము హీరోనే అనుకుంటారు. ఇంట్లో వాళ్లను దూషించినప్పుడు మాత్రమే నాకు బాగా కోపమొస్తుంది.


- నేను ఇప్పటికీ రాజకీయాల్లో ఉన్నాను. ఒక మంచి పౌరుడుగా ఉండాలంటే రాజకీయ దృష్టికోణం ఉండాలి. మంచి ప్రభుత్వం కావాలంటే ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకున్నట్లే రాజకీయాల్లో ఉండటమూ ఒక బాధ్యతగా భావిస్తుంటా


- ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న వారుసుడు సినిమాలో నటిస్తున్నాను. పొన్నియన్ సెల్వన్ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే లారెన్స్ సినిమాలో విలన్ గా నటిస్తున్నాను. మా ఇంట్లో నటీనటులం చాలా మంది ఉన్నాం. ఎవరి కథలు, సినిమాల సెలక్షన్ వారే చూసుకుంటారు.

Hero Rahul Vijay Interview

 వరుస సినిమాలతో  ప్రేక్షకుల ప్రశంశలు పొందుతున్న యువ హీరో రాహుల్ విజయ్ 



"కుడి ఎడమైతే" వెబ్ సిరీస్ లో అమలాపాల్ తో పోటీ పడి నటించి  ప్రేక్షకుల ప్రశంశలు పొందాడు హీరో రాహుల్ విజయ్. తాజాగా  తను నటిస్తున్న సినిమాల జాబితా చూస్తుంటే చాలానే ఉన్నాయి అనిపిస్తుంది. కంటెంట్ ఉన్న కథలకు ప్రాధాన్యత నిస్తూ సరైన కథలు సెలెక్ట్ చేసుకుంటున్న రాహుల్ నిర్మాతల హీరో అనిపించుకొంటూ వరుస సినిమాలతో ఎంతో బిజీగా మారిపోయాడు. తను తాజాగా తను నటించిన 



పంచతంత్రం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.‘ ఈ సినిమాను టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్స్ పై హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మించారు . ఇందులో శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే "తెల్లవారితే గురువారం" సినిమా చేసిన మణికాంత్ జెల్లి దర్శకత్వంలో ఎటర్నిటీ  ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 2 గా తెరకెక్కబోతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.ఈ సినిమాలో శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటిస్తుంది .కళ్యాణ్ మాలిక్ ఈ మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు.ఇలా సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ వచ్చిన అవకాశాన్ని  సద్వినియోగం చేసుకుంటూ... నటనలో మెరుగులు దిద్దుకుంటున్నాడు రాహుల్ విజయ్. ఇవే కాకుండా భిన్నమైన కథలను సెలెక్ట్ చేసుకుంటూ వరుసగా మరో రెండు చిత్రాలలో నటిస్తున్నాడు. మొదటిది మేఘా ఆకాష్ తో కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై  ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్న చిత్రం “మాటే మంత్రము” ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చింది. రెండవది GA2 బ్యానర్ లో తేజ మార్ని దర్శకత్వంలో వస్తున్న  సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఇందులో శివాని రాజశేఖర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇలా బ్యాక్ టూ బ్యాక్  డిఫరెంట్ జానర్స్ ను సెలెక్ట్ చేసుకొని నటిస్తున్న రాహుల్  చాలా కూల్ గా ఉంటూనే  ఎంతో  సైలంట్ గా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటూ ఇండస్ట్రీ లో వరుస సినిమాలతో  దూసుకుపోతూ నిర్మాతల హీరోగా మెప్పుపొందుతున్నాడు.

20 Million Views for Ra Ra Reddy From Macherla Niyojakavargam

 20 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్న నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' రారా రెడ్డి పాట 



వర్సటైల్ స్టార్ నితిన్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మాచర్ల నియోజకవర్గం'లోని 'రారా రెడ్డి' స్పెషల్ సాంగ్ వీర మాస్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. 20+ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ఈ పాట 300K + లైక్స్ ని సొంతం చేసుకొని గత 11 రోజులుగా యూట్యూబ్ మ్యూజిక్ నెంబర్ 1 గా ట్రెండింగ్ లో వుంది. నితిన్, అంజలి ఎనర్జిటిక్ కెమిస్ట్రీ , కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులు, మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన మాస్ డ్యాన్స్ నంబర్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించాయి. నితిన్ తొలి చిత్రం 'జయం' లోని రాను రాను అంటూనే చిన్నదో పాట పల్లవిని ఈ పాటలో చేర్చడం మరింత స్పెషల్ ఎట్రాక్షన్ ని తెచ్చింది. 'రారా రెడ్డి' పాట ప్రస్తుతం ఇంటర్నెట్ సెన్సేషన్ గా దూసుకుపోతుంది. ఈ పాటకు లక్షలాది సంఖ్యలో రీల్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలపై సందడి చేస్తున్నాయి. ప్రతి మ్యూజిక్ ఫ్లాట్ ఫార్మ్ పై 'రారా రెడ్డి'  పాటే టాప్ ట్రెండ్ లో వుండటం విశేషం. 


ఈ చిత్రంలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. 


ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ గా పనిచేస్తున్నారు.  


'మాచర్ల నియోజకవర్గం' ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.


తారాగణం:  నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, సముద్రఖని, వెన్నెల కిషోర్, అంజలి(స్పెషల్ సాంగ్) తదితరులు


సాంకేతిక విభాగం : 

రచన, దర్శకత్వం:  ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి

నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి

బ్యానర్: శ్రేష్ట్ మూవీస్ 

సమర్పణ : రాజ్‌కుమార్ ఆకెళ్ల  

సంగీతం: మహతి స్వర సాగర్

డీవోపీ : ప్రసాద్ మూరెళ్ల

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

డైలాగ్స్ : మామిడాల తిరుపతి

ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్

ఫైట్స్: వెంకట్ 

పీఆర్వో: వంశీ-శేఖర్

I’m Dedicating Liger To All My Fans, Aag Lagaa Denge: The Vijay Deverakonda

 I’m Dedicating Liger To All My Fans, Aag Lagaa Denge: The Vijay Deverakonda



The Vijay Devarakonda’s most-awaited Pan India film Liger trailer was released today at Sudarshan theatre in Hyderabad. Crowd was attended in huge numbers and it was like celebrations at the venue.


Meanwhile, the trailer is like a blast on social media, trending Top on YouTube and all social media platforms. It has become a topic of discussion along with Vijay's hardwork and Puri's taking. The expectations are same across the country and it will be a blast of Pan-India Debut for Vijay for sure.


Vijay Deverakonda, Puri Jagannadh, Ananya Pandey, Karan Joahr, Charmme Kaur, Apoorva Mehta and few others attended the event. The team got a warm welcome as they got showered with flowers and fans cheered for them.


While speaking at the event, Ananya Pandey said, “Andariki Namaskaram Hyderabad (Hello Hyderabad). How did you like the trailer. Thank you so much for all the love. I’ve heard so much about all the love in Hyderabad. This is the first time, I’m experiencing it. It’s crazy. I love Tollywood fans. I want to be in this Rowdy family.”


Producer Apoorva Mehta said, “Namaskaram Hyderabad, we are so happy to be here. I hope, Bombay also learn from this. We’re delighted to make this film with Puri Jagannadh sir, Charmme and of course with superstar Vijay Deverakonda. Very excited. Looking forward to see you all in cinemas on August 25th.”


Karan Johar said, “You guys rocked. Rowdy rocks. Liger rocks. We love you. Thank for the love that you bestowed upon Liger. Liger is releasing in cinemas on 25th of August. Everybody has to come. You all are invited. Namaskar and all my love from my heart to all of you.”


Puri Jagannadh said, “How is the trailer? How is Vijay? Did he just nailed it or not? I’m not going to talk about Liger today. Vijay Deverakonda is the next big thing in the country and in the cinema industry. I thank Karan Johar for all the support. We invited him not just to show him the tailer, but to show him all of you, and the passion and love we have towards cinema.”


Vijay Deverakonda said, “This mental mass of fans is driving me crazy. I don’t know what to say. I’m just speechless. It’s been two years since my last film was released. And it was a flop. This kind of reception for the trailer is unbelievable. I… I… love you all (in Liger style). I’m dedicating this movie for you. I did dances, fights and built body for this movie. I just hate dancing. But did try dances to make all of my fans proud. There should be these kinds of similar celebrations at theatres on August 25th. Let’s shake the entire country. What are we going to do- Aag Laga Denge. My fans were bit worried the delayed promotions. In Puri’s words, “Eppudu Vacham Annadi Kaadu, Bullet Digindaa Ledaa… (It’s not important when did we come, but the bullet has fired or not.”


Liger trailer received overwhelming response and it got record views in no time.

Darja Producers Interview

 



కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మించారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు శివశంకర్ పైడిపాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. వారు చెప్పిన ‘దర్జా’ విశేషాలివే..


-ఈ స్టోరీ డిస్కషన్స్ జరిగినప్పుడు అనసూయగారు చేసిన పాత్ర కోసం ముందుగా మంచు లక్ష్మీ, వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రియమణి ఇలా అనుకున్నాం. తర్వాత జర్నలిస్ట్ ప్రభుగారు అనసూయగారి పేరు సజెస్ట్ చేశారు. అందరూ ఓకే అనుకున్నాం. అలా అనసూయగారు ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు.


-అనసూయగారిలో అందరూ రొమాంటిక్ యాంగిల్‌నే చూస్తుంటారు. కానీ ఆమె చేసిన ‘రంగస్థలం’లోని రంగమ్మత్త పాత్ర, ‘పుష్ప’ సినిమాలోని దాక్షాయణి పాత్ర ఆమెలో ఉన్న గొప్ప నటిని అందరికీ పరిచయం చేశాయి. రమ్యకృష్ణగారి తర్వాత యాక్షన్ లుక్‌ విషయానికి వస్తే మాకు అనసూయగారే కనిపించారు. ఫస్ట్ సినిమాకి సంబంధించి వేసిన స్కెచ్‌లో సేమ్ టు సేమ్ ‘పుష్ప’ లుక్కే వచ్చింది. ఈ స్టోరీ విన్నాక..  సుకుమార్‌గారిలాగే నా గురించి ఆలోచించారని అనసూయగారు మాకు థ్యాంక్స్ చెప్పారు. మొత్తం మూడు స్కెచ్‌లు రెడీ చేశాం. అందులో అనసూయగారు ప్రస్తుతం సినిమాలో కనిపించిన స్కెచ్‌ని ఓకే చేశారు.


- ఇది పూర్తి స్థాయి లేడీ ఓరియంటెడ్ చిత్రం. ఒక పట్టణంలో అనేక ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసిన యువతి.. పెద్ద అయిన తర్వాత ప్రజలకు ఎలా ప్రాబ్లమ్‌గా మారింది? ఫైనల్‌గా ఏం జరిగింది? అనేదే ఈ సినిమా మెయిన్ కథాంశం. నిర్మాతలుగా మాకిది మొదటి చిత్రం. కానీ ఇంతకు ముందు కొన్ని చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేశాం.


- ఫస్ట్ సినిమాగా ఇలాంటి స్టోరీ చేయడానికి కారణం.. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చాం (నిర్మాతలుగా). రావడమే పెద్ద హీరోలతో సినిమాలు అంటే.. జరిగే పని కాదు. అందుకే ముందు ‘దర్జా’ వంటి చిత్రంతో మేమేంటో తెలియజేయాలని అనుకున్నాం. ఈ సినిమాతో మా బ్యానర్ పేరు ఇండస్ట్రీకి తెలుస్తుంది. తర్వాత పెద్ద హీరోలతో సినిమాలు ఉంటాయి. ప్రస్తుతం ఓ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ రెడీగా ఉంది. ఈ సినిమా విడుదల తర్వాత ఆ ప్రాజెక్ట్ వివరాలను ప్రకటిస్తాం.


- సునీల్‌గారు, అనసూయగారు ఈ సినిమా కోసం ఎంతో సపోర్ట్ చేశారు. షూటింగ్ మొదట్లో వారి డేట్స్ కోసం ఇబ్బంది పడ్డాం. కానీ వారు డేట్స్ ఇచ్చిన తర్వాత మాత్రం అంతా సాఫీగానే సాగింది. వారు ఇంతగా సపోర్ట్ చేశారు కాబట్టే.. ‘దర్జా’ ఈ రోజు దర్జాగా రెడీ అయింది.


- ఈ సినిమా ప్రమోషన్ విషయంలో ఏదో ఒక అప్‌డేట్‌తో నిత్యం వార్తలలోనే ఉంది. రెండు మోషన్ పోస్టర్స్ విడుదల చేశాం. ఒకటి కె.ఎల్. నారాయణగారు విడుదల చేస్తే.. రెండోది యాక్షన్ కింగ్ అర్జున్ గారు విడుదల చేశారు. టీజర్ డి. సురేష్ బాబుగారు విడుదల చేశారు. ట్రైలర్ వెంకటేష్‌ బాబుగారు విడుదల చేశారు. నాలుగు సాంగ్స్ విడుదల చేశాం. అల్లు అరవింద్‌గారు, కె. రాఘవేంద్రరావుగారు, మైత్రీ మూవీస్ నవీన్ గారు ఇలా సాంగ్స్ విడుదల చేశారు. దాదాపు ఇంటర్వ్యూలు పెట్టి ప్రమోషన్ చేసినంతగా పెద్ద పెద్ద వాళ్లు ఈ సినిమాకి సపోర్ట్ చేశారు. అలాగే ఏపీ, తెలంగాణ రైల్వే స్టేషన్స్ అన్నింటిలో సినిమాకి సంబంధించిన ప్రోమోలు ప్లే అవుతున్నాయి. అలాగే అన్ని మల్టీప్లెక్స్ థియేటర్లలో దాదాపు 15 రోజుల నుండి ప్రోమోలు ప్లే అవుతూనే ఉన్నాయి. 2 మంత్స్ ముందు నుండే ప్రొమోషన్స్ చేస్తూ వస్తున్నాం. అలాగే మీడియాలో కూడా ఉన్నాం. సినిమాకి రావాల్సినంత పబ్లిసిటీ బాగానే వచ్చిందని అనుకుంటున్నాం.


- ఇప్పటి వరకు ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలో 400 స్క్రీన్లు వరకు మాకు వచ్చాయి. ఇంకా పెరిగే అవకాశం ఉంది.


-మొదటి నుండి ఈ సినిమాపై ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఫస్ట్ కాపీ చూసిన తర్వాత టీమంతా చాలా హ్యాపీగా ఉన్నాం. సినిమాలోని ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ సినిమాతో కొత్తగా పరిచయం అవుతున్న వారందరికీ ముందు ముందు మరిన్ని మంచి అవకాశాలు వస్తాయి. అంత బాగా వారు యాక్ట్ చేశారు.


- ముందు చిన్న బడ్జెట్‌తో ఈ సినిమాని చేయాలని అనుకున్నాం. సునీల్‌గారు, అనసూయగారు యాడ్ అయిన తర్వాత.. అవుట్‌ఫుట్ అద్భుతంగా వస్తుండటంతో.. ఇంకా బడ్జెట్ పెంచుకుంటూ వెళ్లాం. ముందు రెండు ఫైట్స్ అనుకుంటే.. తర్వాత నాలుగు, 8 రోజుల షూటింగ్ అనుకున్నది 18 రోజులు ఇలా, రామోజీ ఫిల్మ్ సిటీ, అవుట్ డోర్ షూటింగ్స్.. అన్నింటికీ భారీగానే ఖర్చు చేశాం. క్వాలిటీ, అవుట్‌పుట్ చూసిన తర్వాత.. బడ్జెట్ విషయంలో వెనుకాడలేదు. అందులోనూ ఇది మా మొదటి చిత్రం. నిర్మాణం పరంగా మంచి క్వాలిటీ చిత్రాన్ని ప్రేక్షకులకు ఇవ్వాలని ఎక్కడా తగ్గలేదు.


- సెన్సార్ నుంచి కూడా చాలా మంచి ఫీడ్ బ్యాక్ విన్నాం. అనసూయగారిని పెట్టి ఇంత వయలెన్స్ సినిమా తీశారేంటి? అని, అంత యాక్షన్ ఉన్నా.. సెంటిమెంట్‌ని చక్కగా పండించారు అని.. సెన్సార్ సభ్యులు చెప్పినట్లే.. సినిమా చూసిన మా శ్రేయోభిలాషులు కూడా.. ఒక్క యాక్షన్‌నే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు. మంచి సెంటిమెంట్ ఉంది కదా ఇందులో.. అది కూడా ఎగ్జిక్యూట్ చేయవచ్చు కదా.. అని అన్నారు. వారి సలహాల మేరకే ఆమనిగారు, ఇతర టీమ్ ఉన్న పోస్టర్‌ని విడుదల చేశాం. యాక్షన్‌తో నిండిన సెంటిమెంట్ ఫిల్మ్ ఇది. కామెడీ, డ్యాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయి. మేము ‘దర్జా’ సినిమా తీశాం. ప్రేక్షకులు ‘దర్జా’గా థియేటర్లకి వచ్చి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాం.


- మా బ్యానర్‌లో ముందు ముందు ఫ్యామిలీ అండ్ యాక్షన్ అలాగే అడ్వెంచర్ సినిమాలు చేయాలని అనుకుంటున్నాం. తర్వాత ప్రాజెక్ట్ కూడా ఫ్యామిలీ అండ్ యాక్షన్ చిత్రమే ఉంటుంది.


- సునీల్‌గారికి, అనసూయగారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి సపోర్ట్ నిజంగా మాకు ఎంతో బలాన్నిచ్చింది. అలాగే సలీమ్ మాలిక్, ర్యాప్ రాక్ షకీల్, కెమెరామెన్.. ఇలా సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు. ఈ సినిమాతో మంచి ఎక్స్‌పీరియన్స్‌ని పొందాము.


- ఈ సందర్భంగా మీడియా వారికి కృతజ్ఞతలు. ఎందుకంటే డే 1 నుండి ఓ పెద్ద చిత్రానికి సపోర్ట్ చేసినట్లుగా మీడియా మాకు సపోర్ట్ చేస్తూ వస్తుంది. త్వరలోనే మా తదుపరి చిత్రాన్ని ప్రకటిస్తాం.

LIGER (Saala Crossbreed) Trailer Out Now

 The Vijay Deverakonda, Puri Jagannadh Watt Laga Diya With The Visually-striking Extravagant Trailer Of Pan India Film LIGER (Saala Crossbreed)



After piquing the curiosity of movie buffs by sharing a bold poster featuring The Vijay Deverakonda, the makers of the Pan India film Liger (Saala Crossbreed) then came up with the first single Akdi Pakdi which shook the entire nation. They have further fuelled the excitement of viewers by dropping the theatrical trailer of the Puri Jagannadh directorial. Megastar Chiranjeevi, alongside Prabhas launched the Telugu trailer, Dulquer Salmaan unveiled the Malayalam and Ranveer Singh released the Hindi trailer.


While the film’s first glimpse introduced Vijay Deverakonda’s character, the trailer takes us inside into his wild world. Begins with Vijay Deverakonda entering the ring, with Ramya Krishna’s voice briefing the reason behind the name of Liger for his son. “My son is a crossbreed, born to a lion and a tiger,” she utters.


It’s the bumpy journey of a chaiwala, his efforts to represent India and win the MMA title, with many obstacles in the progression. Girlfriend cheats him, though he loves her so much. He has a stammer which is one of the major challenges, wherein he becomes mad and does crazy acts, when he enters the ring. It’s a journey full of emotions, ups and downs. Legend Mike Tyson’s stylish intro, followed by the dialogue exchange with Liger is a feast to watch. When Vijay says, “I’m a Fighter,” Tyson, in reply says, “If you’re a Fighter, what am I.” The last frames of Tyson giving killer look gives a perfect finish to the trailer.


Director Puri Jagannadh has managed to assemble a great cast. He has done something unthinkable by bringing the international icon Mike Tyson into the project and has shown Vijay Deverakonda in a never seen before action-packed avatar. Brought a unique body language for the character, Vijay charms with his looks and performance. Puri and Vijay duo ‘Watt Laga Diya’ with this visually-striking extravagant trailer.


Ramya Krishna makes strong impact with her acts as typical mother from slums. Ananya Pandey gets a trendy role, wherein Ronit Roy appeared as coach.


Technically, the trailer looks solid. The production design and the cinematography are first class. In fact, they are a major strength. Background score with different sounds give perfect elevations. The trailer cut is flawless with sharp editing. This is an illustrious team that has come up with a masterwork.


Puri Connects is producing the movie, in collaboration with Bollywood's leading production house Dharma Productions. Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta together are bankrolling the film on a grand scale.


While cinematography for the movie is by Vishnu Sarma, Kecha from Thailand is the stunt director. Liger will have Pan India release in Hindi, Telugu, Tamil, Kannada and Malayalam languages on 25th August, 2022.


Cast: Vijay Deverakonda, Ananya Pandey, Ramya Krishnan, Ronit Roy, Vishu Reddy, Ali, Makarand Desh Pandey and Getup Srinu.


Technical Crew:

Director: Puri Jagannadh

Producers: Puri Jagannadh, Charmme Kaur, Karan Johar and Apoorva Mehta

Banners: Puri Connects and Dharma Productions

DOP: Vishnu Sarma

Art Director: Jonny Shaik Basha

Editor: Junaid Siddiqui

Stunt Director: Kecha

Nithiin, Sreshth Movies’ Macherla Niyojakavargam Mass Loading, Three Big Updates

 Nithiin, Sreshth Movies’ Macherla Niyojakavargam Mass Loading, Three Big Updates



Versatile star Nithiin's highly anticipated mass and action entertainer Macherla Niyojakavargam is gearing up for a grand release worldwide on August 12th. Produced by Sudhakar Reddy and Nikitha Reddy on Sreshth Movies banner and presented by Rajkumar Akella, the team is leaving no stone unturned to make it a huge blockbuster. In fact, promotions are in full swing for the movie.


Meanwhile, the makers came up with three big updates. While third single Adirindey will be out on July 23rd, followed by Macherla Dhamki on 26th and trailer on 29th of this month. It's going to be a week of celebrations with triple feast from the makers.


Krithi Shetty and Catherine Tresa are the heroines in the movie, where actress Anjali will be seen sizzling in a special number Ra Ra Reddy and the lyrical video received excellent response.


Nithiin is playing the role of an IAS Officer named Siddharth Reddy in this film being directed by MS Raja Shekhar Reddy. Samuthirakani plays the main villain.


Prasad Murella is the camera man, while Mahati Swara Sagar is the music director. Mamidala Thirupathi has provided dialogues and Sahi Suresh is the art director. Kotagiri Venkateswara Rao is the editor.


Cast: Nithiin, Krithi Shetty, Catherine Tresa, Samuthirakani, Anjali (special song) and others


Technical Crew:

Written & Directed by: MS Raja Shekhar Reddy

Producers: Sudhakar Reddy, Nikitha Reddy

Banner: Sreshth Movies 

Presents Rajkumar Akella

Music: Mahati Swara Sagar

DOP: Prasad Murella

Editor: Kotagiri Venkateswara Rao

Line Producer: G Hari

Dialogues: Mamidala Thirupathi

Art Director: Sahi Suresh

Fights: Venkat

PRO: Vamsi-Shekar

Preminchoddu First Look Launched

 ఐదు బాషల్లో వస్తున్న "ప్రేమించొద్దు"  చిత్రం ఫస్ట్ లుక్ విడుదల..



రొటీన్ కు   భిన్నంగా తెరకెక్కిన సినిమా "ప్రేమించొద్దు"(సితెలిసీ తెలియని వయసులో) అనేది ట్యాగ్ లైన్ . టీనేజ్ బ్యాక్ డ్రాప్ కథతో ఐదు భాషల్లో  విడుదల అవుతున్న. మొదటి పాన్ ఇండియన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ".

సిరిన్ శ్రీరామ్ కఫె బ్యానర్ పై అనురుప్, దేవమలిషెట్టి, సనాలి  గర్జె,సారిక, మానస, యశ్వంత్ పెండ్యాల నటీ నటులుగా సిరిన్ శ్రీరామ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కు సిద్ధంగా ఉంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన నటి 

గాయత్రి గుప్త "ప్రేమించొద్దు" ఫస్ట్ లుక్  ను లాంచ్ చేశారు.


గాయత్రి గుప్త మాట్లాడుతూ..నాకు డైరెక్టర్ గత 10. సంవత్సరాలుగా తెలుసు. నన్ను షాట్ ఫిల్మ్స్ ద్వారా  పరిచయం చేసిందే తనే .ఈ సినిమాకు పనిచేసిన వారందరూ నాకు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ టీం తో నేను "బందూక్" సినిమాలో నటించడం జరిగింది. ఐదు భాషల్లో వస్తున్న ప్రేమించొద్దు, సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేసినందుకు  చాలా సంతోషంగా ఉంది . ట్రైలర్ కూడా చాలా బాగా వచ్చింది.ఈ సినిమా చాలా కల్ట్ గా ఉంటుంది. కచ్చితంగా హిట్ అవుతుంది అన్నారు .


చిత్ర దర్శకుడు సిరిన్ శ్రీరామ్ మాట్లాడుతూ..టీనేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి పాన్ ఇండియన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ . తెలుగు, హిందీ బాషలలో ఇది స్ట్రైట్ ఫిల్మ్.   మలయాళం, కన్నడ, తమిళ్ బాషలలో ఈ చిత్రం డబ్ అవుతుంది. తెలుగులో "ప్రేమించొద్దు"  హిందీలో  "ప్యార్ మత్ కర్నా" గా విడుదల అవుతుంది. అలాగే తమిళ్ లో "కాదలి కాదే", కన్నడ లో "ప్రీతీసె బేడ", మలయాళం లో "ప్రణయ కరత్"  టైటిల్స్ తో విడుదల అవుతున్నాయి. మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు. 


చిత్ర హీరో మాట్లాడుతూ.. మా చిత్రం "ప్రేమించొద్దు' ఫస్ట్ లుక్ లాంచ్ కు వచ్చిన గాయత్రి గుప్త కి ధన్యవాదాలు. మా  సినిమాను తెలుగు హిందీ భాషల్లో  బైలింగ్వెల్ గా తీయడం జరిగింది.అలాగే మూడు బాషలలో డబ్బింగ్ చేయడం జరుగుతుంది..ఈ సినిమా మొదటి పాన్ ఇండియన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ గా చెప్పవచ్చు ఈ చిత్రానికి కెమెరా మ్యూజిక్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా వచ్చింది. చైతన్య స్రవంతి  ఈ సినిమాతో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం కాబోతుంది.


నటి సనాలి గర్జె మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా ఇందులో నటిస్తూనే డైరెక్షన్ టీమ్ లో వర్క్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమాను ఐదు లాంగ్వేజ్ లలో రిలీజ్ చేయడం గొప్ప విషయం . నాకిలాంటి మంచి సినిమాలో చేసే అవకాశమిచ్చిన సిరిన్ శ్రీరామ్ గారికి ధన్యవాదాలు అన్నారు .


 ఈ సినిమాను హిందీలో చేస్తున్నప్పుడు మంచి సహకారం అందించిన అనురూప్ కు,సోనాలి కి థాంక్స్ చెపుతున్నాను. అలాగే ఇలాంటి మంచి సినిమాకు పనిచేసే అవకాశమిచ్చిన సిరిన్ గారికి ధన్యవాదాలు అన్నారు.


నటుడు దేవమలిషెట్టి మాట్లాడుతూ.. నా ఫస్ట్ ఫిల్మ్ "బందూక్".చాలా మంది ప్రేమించుకుందాం రా, ప్రేమ కావాలి వంటి సినిమాలు తీస్తారు. కానీ వాటికీ భిన్నంగా "ప్రేమించొద్దు" సినిమా తీస్తున్నారు.మంచి కంటెంట్ ఉన్న మొదటి పాన్ ఇండియన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ లో నేను నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు.


నటీ నటులు 

అనురుప్, దేవమలిషెట్టి, సనాలి  గర్జె సారిక, మానస, యశ్వంత్ పెండ్యాల తదితరులు 


సాంకేతిక నిపుణులు 

బ్యానర్ : సిరిన్ శ్రీరామ్ కేఫ్ 

రైటర్, ఎడిటర్,ప్రొడ్యూసర్, డైరెక్టర్ : సిరిన్ శ్రీరామ్ 

డి . ఓ. పి : హర్ష కొండలి 

సంగీతం : చైతన్య స్రవంతి

బ్యాగ్రౌండ్ మ్యూజిక్ : కామరాన్ 

లిరిక్స్ : శ్రీ సాయి కిరణ్

సౌండ్ మిక్సింగ్ : అరవింద్ మీనన్ 

పి. ఆర్. ఓ : లక్ష్మి నివాస్

ACF Worldwide website Launched by Minister Talasani Srinivas Yadav




 ఈరోజు (20/07/2022) "అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ (ఎ.సి.ఎఫ్)" వెబ్సైట్ ను తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా "ఎ.సి.ఎఫ్" వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ రాజపాలెం శ్రీనివాసులు గారు మాట్లాడుతూ మంత్రి గారి చేతులమీదుగా వెబ్సైట్ ఆవిష్కరణకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన లడ్డు, సయ్యద్ గార్లకు కృతఘ్నత లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షులు యర్రా శ్రీనివాస్, కసపు గోవిందు, మహేష్ (నల్గొండ), రాజేష్, మహేష్ (భువనగిరి), ప్రవరాఖ్య, సాయి, ఆది నాయక్, బాబ్జీ పాల్గొన్నారు.

Director Ravi Kola Interview

 అన్ని రకాల జోనర్ లో అందరికి నచ్చే కథలు తీయ్యాలి అన్నదే నా ఇంటెన్షన్..దర్శకుడు రవి కిరణ్ కోలా ఇంటర్వ్యూ 



రాజావారు రాణిగారు’ సినిమా ద్వారా  మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు రవి కిరణ్ కోలా తాజాగా మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో పోలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా తీయబోతున్నాడు. అయితే ఈ రోజు తన బర్త్ డే ను పురస్కరించుకొని  తను చేయబోయే ఫ్యూచర్ ఫిల్మ్స్ గురించిన విషయాలు పంచుకున్నాడు 

మాది ఈస్ట్ గోదావరి ఏలేశ్వరం మండలంలోని భద్రవరం అనే చిన్న విలేజ్. చిన్నప్పటి నుండి నాకు సినిమాపై వున్న ప్యాషన్ తో చిత్ర దర్శకుడు అవ్వాలనే కోరికతో 2016 లో హైదరాబాద్ రావడం జరిగింది.సినీ ఇండస్ట్రీ లో నాకు ఎక్కువగా పరిచయాలు లేనందున నేను రాసుకున్న కథను చెప్పడానికి ప్రయత్నం చేసే వాన్ని. ఈ క్రమంలో ఒక వ్యక్తి మూడు నెలల్లో సినిమా స్టార్ట్ అవుతుంది మంచి 

 స్క్రీన్ ప్లే  రాసి ఇవ్వమన్నాడు. రాసిచ్చినా అది స్టార్ట్ కాలేదు.ఆ తరువాత స్వచ్ఛ భారత్ పై యాంకర్ రవితో "దిల్ సే" షార్ట్ ఫిల్మ్ తీశాను. దీనికి మంచి అప్లాజ్ వచ్చింది.ఆ షార్ట్ ఫిల్మ్ నాకు మంచి లెర్నింగ్ అయ్యింది. ఆ తరువాత 

మ్యూజిక్ డైరెక్టర్ జై ద్వారా కిరణ్ అబ్బవరం పరిచయమవ్వడం జరిగింది. మొదట వెబ్ సిరీస్ చేద్దాం అనుకోని తక్కువ బడ్జెట్ లో 15 మంది టీం తో ఈస్ట్ గోదావరి కెళ్ళి షూట్ చేశాము. అయితే కథ బాగుంది ఫీచర్ ఫిల్మ్ లా ఉందని టీం అంతా ప్రోత్సహించారు. నాకు ,కిరణ్ కు మా ఇద్దరికీ ఇది మొదటి సినిమా అవ్వడంతో ఎంతో కేర్ తీసుకొని తీసిన సినిమానే "రాజావారు రాణిగారు".సురేష్ ప్రొడక్షన్ లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంశలు అందుకోవడమే కాకుండా మంచి విజయం సాధించింది 

ఆ తరువాత నేను చేసే రెండవ సినిమా డిఫరెంట్ జోనర్ లో చేయాలని,ప్రేక్షకులకు పెద్ద యాక్షన్ ప్యాక్డ్ సినిమా అందించాలనే ఉద్దేశ్యంతో పోలిటికల్ బ్యాక్ డ్రాప్ లో  రాసుకున్న కథను మ్యాట్నీ ఏంటర్ టైన్మెంట్స్ వారికి వినిపించడం జరిగింది.  ఈ సినిమా వర్క్ తో బిజీగా ఉన్న నేను మన దగ్గర వున్న కథలను ఆపగూడదు అన్న ఉద్దేశ్యంతో నా "రాజావారు రాణిగారు" సినిమాకు డి. ఓ. పి గా చేసిన విద్యా సాగర్ ను నా దగ్గర  ఉన్న తెలంగాణ అబ్బాయి - ఆంధ్ర అమ్మాయి కథ అయిన "అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ ద్వారా  డైరెక్టర్ గా పరిచయం చేయడం జరిగింది. ఈ సినిమాకు కథ- మాట‌లు, స్క్రీన్ ప్లే అందించడం జరిగింది. అయితే నిర్మాతలు మాత్రం నువ్వు అనుకున్న కథ  ప్రాపర్ గా రావాలంటే నువ్వు ఈ సినిమాకు షో రన్నర్ గా ఉండమని చెప్పడంతో షో రన్నర్ గా కూడా వ్యవహరించడం జరిగింది.

సాధారణంగా నేషనల్ ,ఇంటర్ నేషనల్ వెబ్ సిరీస్ కు మాత్రమే షో రన్నర్స్ ఉంటారు.షో రన్నర్ అనేది మన సినిమాలకు కొత్త, ఫస్ట్ టైం షో రన్నింగ్ కాన్సెప్ట్ ను యస్.వి.సి.సి డిజిటల్ వారు తీసుకొద్దాం అనుకోని  'అశోకవనంలో...' సినిమాకు షో రన్నర్ గా ఉండమన్నారు. షో రన్నర్ అంటే  దర్శకత్వ పర్యవేక్షణ లాంటిది. సినిమాకి సంబంధించిన పూర్తి క్రియేటివిటీ రెస్పాన్స్ బిలిటీ ని తీసుకోవడంమే దీని ఉద్దేశం.

నా దగ్గర ఉన్న కథలతో కొత్తవారికి అవకాశం  ఇవ్వాలని  నా దగ్గర వర్క్ చేసిన వారికి అవకాశం ఇస్తూ ఆ సినిమాలకు నేను షో రన్నర్ గా వుంటాను. ప్రస్తుతం నేను మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ లో సినిమా వర్క్ జరుగుతోంది.దీంతోపాటు ఎస్‌వీసీసీ బ్యానర్ లో ఇంకో సినిమా ఉంటుంది.  అలాగే ఓ అడ్వెంచర్స్ డ్రామా కథ కూడా రెడీగా ఉంది. ఇవి కాకుండా మరి కొన్ని  కథలు ఉన్నాయి.వాటి  వివరాలు త్వరలో తెలియజేస్తాను అని ముగించారు.

Babli Bouncer to release on 23rd September 2022 on Disney +Hotstar

Star Studios and Junglee Pictures announce the release date of Director Madhur Bhandarkar’s next  BABLI BOUNCER.



Babli Bouncer to release on 23rd September 2022 on Disney+ Hotstar in Hindi, Tamil and Telugu!


PRESENTING THE FIRST LOOK OF TAMANNAAH IN AND AS BABLI BOUNCER!


The coming-of-age feel good story with a slice-of-life comedic tone set in the real ‘bouncer town’ of North India – Asola Fatepur will see Tamannaah Bhatia in a never seen before avatar, as Babli Bouncer. 


Produced by Star Studios and Junglee Pictures, Babli Bouncer is directed by Madhur Bhandarkar and stars Tamannaah Bhatia, in the lead along with Saurabh Shukla, Abhishek Bajaj and Sahil Vaid in pivotal roles. 

Akkineni Naga Chaithanya's Poster from Lal Singh Chadda unvieled

 Akkineni Naga Chaithanya's Poster from Lal Singh Chadda unvieled.



Bollywood superstar Amir Khan's Lal Singh Chadda is all set to hit the silver screens worldwide on the 11th of August this year. Advait Chandan is directing this film, and Viacom18 Studios and Amir Khan Productions are bankrolling this project. Megastar Chiranjeevi is presenting this film in Telugu, while Geeta Film Distributions is handling the distribution in Telugu. 


Akkineni Naga Chaithanya will play a crucial role called Balaraju in the film, and the makers have unveiled the first look poster of Naga Chaithanya today. Chay in an army camouflage outfit with a wide smile looks exquisite. 


Amir Khan conducted a special screening for Mega Star Chiranjeevi, Akkineni Nagarjuna, SS Rajamouli, Sukumar and Ram Charan. Kareena Kapoor Khan and Mona Singh are also a part of the film. A few weeks ago, Aamir unveiled the film's trailer, taking viewers on a joyride of emotions. The almost 3-minute-long trailer gave a glimpse into the fascinating and innocent world of Laal Singh Chaddha, the film's protagonist.

Spark 1.0 First Look Launched by Hero Srikanth

 ఫ్రెండ్లీ స్టార్ శ్రీకాంత్ విడుదల చేసిన

సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ 

స్పార్క్ 1.O ప్రచార చిత్రం!!



      ప్రీతి సుందర్, భవ్యశ్రీ, హితేంద్ర, రాము ముఖ్య తారాగణంగా అరుణోదయ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి సురేష్ మాపుర్ దర్సకత్వంలో ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా రూపొందిన సూపర్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ "స్పార్క్ 1.O" (ఒన్ పాయింట్ ఓ). పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న ఈ క్రేజీ క్రైమ్ ఎంటర్టైనర్ ప్రచార చిత్రాన్ని ప్రముఖ కథానాయకుడు శ్రీకాంత్ విడుదల చేసి, చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. హితేంద్ర నటించి నిర్మించిన "స్పార్క్ 1.O ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. దర్శకుడు సురేష్ లో మంచి స్పార్క్ ఉందని ప్రశంసించారు!!

     తమ అభ్యర్థనను మన్నించి తమ చిత్రం ట్రైలర్ లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్ కు కృతజ్ఞతలు తెలిపిన హితేంద్ర... అతి త్వరలో "స్పార్క్ 1.O" ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు!!

     ఇద్దరు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్స్ నడుమ సాగే వినూత్నమైన క్రైమ్ డ్రామాగా రూపొందిన "స్పార్క్ 1.O" చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, వి.ఎఫ్.ఎక్స్: నవీన్, ఫైట్స్: రమణ మాస్టర్, సినిమాటోగ్రాఫర్; గోపి (అమితాబ్), ఎడిటర్: అనిల్ కుమార్, నిర్మాత: వి.హితేంద్ర, దర్శకత్వం: సురేష్ మాపుర్!!

Pradeep Machiraju launched 2 nd Lyrical song from MAATARAANI MOUNAMIDI

 ప్రదీప్ మాచిరాజు చేతుల మీదుగా "మాటరాని మౌనమిది" చిత్రం నుంచి 'ఈ

రోజేదో' లిరికల్ సాంగ్ విడుదల




రుద్ర పిక్చర్స్ మరియు పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర  దర్శకుడు సుకు

పూర్వాజ్ చేస్తున్న కొత్త సినిమా "మాటరాని మౌనమిది". మహేష్ దత్త, సోని

శ్రీవాస్తవ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్ స్టొరి, థ్రిల్లర్

బ్యాక్ డ్రాప్ లో ముల్టి జోనర్ గా రూపొందుతున్న "మాటరాని మౌనమిది" సినిమా

చిత్రీకరణ పూర్తి చేసుకుని ఆగష్టులో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ

చిత్రం నుంచి ఈ రోజేదో లిరికల్ పాటను యువ హీరో, యాంకర్ ప్రదీప్ మాచిరాజు

విడుదల చేశారు. ఈ సందర్భంగా


ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ...నేను కూడా ఈ టీమ్ లో భాగమే అనుకుంటాను. ఈ

పాట విడుదల చేయడం సంతోషంగా ఉంది. మంచి ట్యూన్ తో పాటు దర్శకుడు సుకు

పూర్వాజ్ కొత్త కాన్సెప్ట్ తో ఈ పాటను పిక్చరైజ్ చేశారు. టీమ్ అందరికీ

ఆల్ ద బెస్ట్. ఈ పాటతో పాటు త్వరలో విడుదల కాబోతున్న సినిమా కూడా సక్సెస్

కావాలి. అన్నారు.


ఈ పాటకు అషీర్ లూక్ స్వరాలు అందించగా, డాక్టర్ వాసుదేవ్ సాహిత్యాన్ని

అందించారు. ఆషీక్ అలీ, సోనీ కొమండూరి పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే...ఈ

రోజేదో కొత్తగ ఉంది. ప్రేమో ఏమో మొదలయ్యింది. ఏ మాయ చేశావో, ఏ మంత్రం

వేశావో, గాల్లో తేలుతున్నానే ఇలా. నింగిన దారం తెగిన గాలిపటంలా. అంటూ

ప్రేమికుడి లవ్ ఫీలింగ్స్ చెబుతూ సాగుతుందీ పాట.


న‌టీ న‌టులు - మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ, అర్చన అనంత్, సుమన్ శెట్టి,

సంజీవ్ , శ్రీహరి తదితరులు.


సాంకేతిక వ‌ర్గం - , సినిమాటోగ్ర‌ఫీ చరణ్, మ్యూజిక్: అషీర్ లూక్, పిఆర్ఒ

ః జియ‌స్ కె మీడియా, నిర్మాత ః రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్,

ద‌ర్శ‌కుడు ః సుకు పూర్వాజ్.


Vennela Kishore as Gunthalakadi Gurunadham in Macherla Niyojakavargam

 నితిన్ -సుధాకర్ రెడ్డి- శ్రేష్ట్ మూవీస్- 'మాచర్ల నియోజకవర్గం' నుండి 'గుంతలకడి గురునాధం'గా వెన్నెల కిషోర్ ఫస్ట్ లుక్ విడుదల  



యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న  మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ 'మాచర్ల నియోజకవర్గం' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు.  రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు.


ఇంట్రస్టింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో క్యూరియాసిటీని పెంచుతున్న యూనిట్ తాజాగా ఈ చిత్రం నుండి వెన్నెల కిషోర్ పాత్రని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో 'గుంతలకడి గురునాధం' అనే పాత్రలో కనిపించబోతున్నారు వెన్నెల కిషోర్. షార్ట్ కట్ లో గురు అనే పేరు కూడా వుంది. అంతేకాదు ఆయన పాత్రకు 'ఇగో కా బాప్' అనే క్యాప్షన్ ఇవ్వడం మరింత ఆసక్తికరంగా వుంది. 'ఇగో కా బాప్' క్యాప్షన్ కి తగ్గట్టుగానే ఫస్ట్ లుక్ లో వెన్నెల కిషోర్ చాలా సీరియస్ గా చూస్తూ ఇచ్చిన ఇగోయిస్టిక్ ఎక్స్ ప్రెషన్ ఆయన పాత్రపై ఆసక్తిని పెంచింది.


ఈ చిత్రంలో కృతిశెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తుండగా, అంజలి స్పెషల్ నంబర్ 'రారా రెడ్డి'లో సందడి చేస్తోంది. ఇటివలే విడుదలైన లిరికల్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది. 


ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్, సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారు. సముద్రఖని మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు.


ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ గా పనిచేస్తున్నారు.  


'మాచర్ల నియోజకవర్గం' ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.


తారాగణం: నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, సముద్రఖని, వెన్నెల కిషోర్, అంజలి(స్పెషల్ సాంగ్) తదితరులు

సాంకేతిక విభాగం : 

రచన, దర్శకత్వం:  ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి

నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి

బ్యానర్: శ్రేష్ట్ మూవీస్ 

సమర్పణ : రాజ్‌కుమార్ ఆకెళ్ల  

సంగీతం: మహతి స్వర సాగర్

డీవోపీ : ప్రసాద్ మూరెళ్ల

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

డైలాగ్స్ : మామిడాల తిరుపతి

ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్

ఫైట్స్: వెంకట్ 

పీఆర్వో: వంశీ-శేఖర్

Actor Sonu Sood helps 7 month-old from Karimnagar

Actor Sonu Sood helps 7 month-old from Karimnagar with liver transplant surgery



Actor-humanitarian Sonu Sood has helped seven-month-old Mohammad Safan Ali, a native of Karimnagar, to undergo a liver transplant surgery successfully. The treatment was performed at Aster Medcity Hospital, Kochi in Kerala.

Safan Ali is the first patient to be treated for the Second Chance Initiative launched by Aster Volunteers in association with Bollywood star Sonu Sood. 


Safan Ali was brought to Aster in Kochi when he was four months old. He was diagnosed with Biliary Atresia, a rare condition in medical parlance. The ailment subsequently led to liver failure. Following a failed surgical intervention in his native Karimnagar in Telangana, the patient progressed to have severe jaundice and cirrhosis which necessitated a liver transplant. It was then through the help of Sonu Sood that the patient reached Aster Medcity in Kochi and underwent a successful liver transplant procedure.


"India has taken huge strides in the advancement of medical care but the access of the same is still miles away for patients like Safan Ali and his family, and mostly because of the high cost. Through this association with Second Chance initiative, we hope to give life to more patients like Safan Ali,” said Bollywood Actor Sonu Sood.

 

Hero Srikanth Launched Bangaru Bomma song From Rudraveena

 హీరో శ్రీకాంత్ చేతులమీదుగా "రుద్రవీణ" లోని 'బంగారు బొమ్మ' పాట విడుదల 



రాగుల గౌరమ్మ సమర్పణలో సాయి విల్ల సినిమాస్ పతాకంపై శ్రీరామ్ నిమ్మల , ఎల్సా గోష్ , శుభశ్రీ సోనియా హీరో హీరోయిన్లు గా మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు సంయుక్తంగా  నిర్మిస్తున్న చిత్రం “రుద్రవీణ". ఈ చిత్రం లోని "బంగారు బొమ్మ " పాటను హైదరాబాద్ లో చిత్ర యూనిట్ సమక్షంలో హీరో శ్రీకాంత్  విడుదల చేయడం జరిగింది.ఈ సాంగ్ లాంచ్ అనంతరం 



హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. సాయి విల్ల సినిమాస్ బ్యానర్ పై రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు సంయుక్తంగా కలసి నిర్మించిన "రుద్రవీణ"  టైటిల్ చాలా బాగుంది ఈ టైటిల్ మన తెలుగు ప్రజలందరికీ తెలిసిన టైటిల్ .ఈ టైటిల్  చిరంజీవి అన్నయ్యకు మంచి పేరు తీసుకువచ్చింది. అప్పటి సినిమాలోని పాటలు ఎంతో మ్యూజికల్ హిట్ గా నిలిచి పోయాయి. అలాంటి గొప్ప టైటిల్ తో  వస్తున్న ఈ సినిమానుండి విడుదలవుతున్న "బంగారు బొమ్మ" పాట విన్నాను. చాలా బాగా ఉంది. ఈ పాటలతో పాటు సినిమాలోని అన్ని పాటలు కూడా  బిగ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ సినిమాకు పని చేసిన టెక్నిషియన్స్, ఆర్టిస్టులందరికి అల్ ద బెస్ట్ చెపుతున్నాను అన్నారు 



చిత్ర నిర్మాతలు రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు  మాట్లాడుతూ.. "రుద్రవీణ" సినిమా నుండి ఈ రోజు మొదటి సాంగ్ ను రిలీజ్ చేశాము. మాకు చిరంజీవి గారు అంటే ఎంతో ఇష్టం .అయన ఇన్స్పిరేషన్ తో ఇండస్ట్రీ కి వచ్చి సినిమాలు తీస్తున్నాము. చిరంజీవి అన్నయ్యది ఎంత మంచి మనసో శ్రీకాంత్ గారు కూడా అంతే మంచి మనసున్న వ్యక్తి.. అయితే మేము మెగా ఫ్యామిలీది గోల్డెన్ హ్యాండ్ అని ఎలా భావిస్తామో వారి తరువాత  శ్రీకాంత్ గారిది కూడా గోల్డెన్ హ్యాండ్ అని బావించి ఈ రోజు తన చేతుల మీదుగా విడుదల చేసిన 'బంగారు బొమ్మ' సాంగ్ మ్యూజికల్ హిట్ కాబోతుంది. దీన్ని మీరందరూ చూడబోతారు.సంగీత దర్శకులు మహావీర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.ఈ సినిమా నుండి ముందు ముందు ఇంకా మంచి మంచి పాటలు వస్తాయి. ఈ సినిమాలో మా హీరో శ్రీ రామ్ నిమ్మల చాలా బాగా నటించడమే డ్యాన్స్ కూడా ఇరగదీశాడు. ఇందులో సిగ్నేచర్  స్టెప్స్ చాలా ఉన్నాయి. త్వరలో అయన స్టెప్స్ చూడబోతారు. దర్శకుడు మధుసూదన్ ఈ సినిమాను చాలా చక్కగా తెరకెక్కించాడు. ఇప్పటి తరానికి అనుగుణంగా ఒక కొత్త రకమైన రీవేంజ్ డ్రామాతో వస్తున్న ఈ సినిమా  ప్రేక్షకులను అలరించేలా అనేక జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నాము. మోయిన్, రాజ్ పైడి లు చాలా బాగా కోరియోగ్రఫీ చేశారు.అలాగే హీరోయిన్స్ శుభశ్రీ, ఎల్సా, సోనియా ఈ ముగ్గురు హీరోయిన్స్ చాలా చక్కగా నటించారు. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. మేము కచ్చితంగా చెప్పగలము ఇందులోని పాటలు విన్న తరువాత అడియన్స్ ఈ సినిమాను పెద్ద మ్యూజికల్ హిట్ చేస్తారనే నమ్మకం ఉందని అన్నారు.



హీరోయిన్ శుభశ్రీ మాట్లాడుతూ.. ఈ రోజు నేను నటించిన "రుద్రవీణ" సినిమా నుండి 'బంగారు బొమ్మ' సాంగ్ ను  హీరో శ్రీకాంత్ గారు లాంచ్ చేయడం జరిగింది. వారికి నా ధన్యవాదములు.నేను ఈ రోజు ఈ పాట చూశాను. చాలా అమేజింగ్ గా ఉంది.దీన్ని యానాం లో షూట్ చేశాము. సినిమాటోగ్రఫి అద్భుతంగా ఉంది. మహావీర్ గారు మ్యూజిక్ చాలా బాగా చేశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.



చిత్ర హీరో శ్రీ రామ్ నిమ్మల మాట్లాడుతూ.. మా "రుద్రవీణ" సినిమాలోని బంగారు బొమ్మ సాంగ్ ను హీరో శ్రీకాంత్ అన్న చేతుల మీదుగా లాంచ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వారికీ మా ధన్యవాదాలు. అలాగే మా "రుద్రవీణ"  సినిమా త్వరలో మీ ముందుకు వస్తుంది. మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ పాటను కూడా మీరందరూ హిట్ చేయాలని కోరుతున్నాను అన్నారు.



మ్యూజిక్ డైరెక్టర్ మహావీర్ మాట్లాడుతూ..ఈ మెలోడీ సాంగ్  కు రాంబాబు గోశాల గారు లిరిక్స్ రాశారు. ఈ పాటను అభయ్ జోద్భుర్ కర్ పాడడం జరిగింది.. వెరీ గుడ్ కంపో జింగ్, ఈ పాట సౌండ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి మంచి సినిమాకు పాటలు రాసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు.




నటీ నటులు 

శ్రీరామ్ నిమ్మల, ఎల్సా గోష్ , శుభశ్రీ,రఘు కుంచె, ధనరాజ్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, చలాకి చంటి, సోనియా తదితరులు 


సాంకేతిక నిపుణులు 

సినిమా : "రుద్రవీణ" 

సమర్పణ : రాగుల గౌరమ్మ

బ్యానర్ : సాయి విల్లా సినిమాస్

నిర్మాతలు :  రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీను

డైరెక్టర్ : మధుసూదన్ రెడ్డి

డి . ఓ. పి : జి. యల్ .బాబు 

కోరియోగ్రఫీ :మొయిన్,రాజ్ పైడి 

మ్యూజిక్ : మహావీర్ 

లిరిక్స్ : రాంబాబు గోశాల

ఎడిటర్ : బి. నాగేశ్వర్ రెడ్డి

ఆర్ట్ : భూపతి యాదగిరి 

పి . ఆర్. ఓ : హరీష్ - దినేష్

Actress Jayasri Rachakonda Interview

 "ప్రతి పాత్రను ప్రేమిస్తూ...

ప్రతి సినిమాతో నేర్చుకుంటూ"

వడివడిగా అడుగులు వేస్తున్న

రైజింగ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ 

జయశ్రీ రాచకొండ



     "సీత ఆన్ ది రోడ్"తో చాలా యాక్సిడెటల్ గా సినీరంగ ప్రవేశం చేసిన జయశ్రీ రాచకొండ.... "మల్లేశం, తిమ్మరుసు, రిపబ్లిక్, వర్జిన్ స్టోరీ, నాతిచరామి" వంటి చిత్రాలతో తన ప్రతిభను నిరూపించుకొని వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఒక లాయర్ గా పలు రకాల కేసులను డీల్ చేసి ఉండడం, వివిధ రకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తులను పరిశీలించి ఉండడం కలిసి రావడంతో... చాలా తక్కువ కాలంలోనే తనకంటూ చిన్న ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ లాయర్ టర్నడ్ యాక్టర్... తను పోషించే ప్రతి పాత్రను ప్రేమిస్తూ... ప్రతి సినిమాతో నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నానంటారు!!

      లాయర్, జడ్జి, డాక్టర్, పోలీస్ ఆఫీసర్ పాత్రలు మొదలుకుని ప్రధానమంత్రి వంటి పవర్ ఫుల్ రోల్స్ తో మెప్పించిన జయశ్రీ... అమ్మ, అత్తయ్య, అక్క, వదిన, బామ్మ వంటి అన్ని రకాల పాత్రల్లోనూ సునాయాసంగా ఒదిగిపోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు!!

      సినిమాలతోపాటు...  వెబ్ సిరీస్, టివి కమర్షియల్స్ (యాడ్ ఫిల్మ్స్) చేసిన రాచకొండ నటించిన "రామ్ సేతు" (అక్షయ్ కుమార్ - హిందీ), నిఖిల్ "కార్తికేయ -2", వి.ఎన్.ఆదిత్య "వాళ్లిద్దరి మధ్య, త్రిగున్ "మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్", "ఎంతవారు గాని" తదితర చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి!!

      గౌతమ్ రాచిరాజు దర్శకత్వంలో జయశ్రీ నటించిన "ఎక్స్టెండెడ్ వారంటి" పలు ప్రతిష్టాత్మక అవార్డులు గెలుచుకోగా... "టోక్యో ఫిల్మ్ ఫెస్టివల్"లో "బెస్ట్ యాక్ట్రెస్"గా ఎంపికవ్వడం రాచకొండ ప్రతిభకు తార్కాణంగా చెప్పవచ్చు. నటిగా వీలైనన్ని వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించాలన్నదే తన లక్ష్యమని చెబుతున్న ఈ అచ్చ తెలంగాణ ఆడపడుచు ఆకాంక్ష నెరవేరాలని ఆశిద్దాం!!