20 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్న నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' రారా రెడ్డి పాట
వర్సటైల్ స్టార్ నితిన్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మాచర్ల నియోజకవర్గం'లోని 'రారా రెడ్డి' స్పెషల్ సాంగ్ వీర మాస్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. 20+ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన ఈ పాట 300K + లైక్స్ ని సొంతం చేసుకొని గత 11 రోజులుగా యూట్యూబ్ మ్యూజిక్ నెంబర్ 1 గా ట్రెండింగ్ లో వుంది. నితిన్, అంజలి ఎనర్జిటిక్ కెమిస్ట్రీ , కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులు, మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన మాస్ డ్యాన్స్ నంబర్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులు అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించాయి. నితిన్ తొలి చిత్రం 'జయం' లోని రాను రాను అంటూనే చిన్నదో పాట పల్లవిని ఈ పాటలో చేర్చడం మరింత స్పెషల్ ఎట్రాక్షన్ ని తెచ్చింది. 'రారా రెడ్డి' పాట ప్రస్తుతం ఇంటర్నెట్ సెన్సేషన్ గా దూసుకుపోతుంది. ఈ పాటకు లక్షలాది సంఖ్యలో రీల్స్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికలపై సందడి చేస్తున్నాయి. ప్రతి మ్యూజిక్ ఫ్లాట్ ఫార్మ్ పై 'రారా రెడ్డి' పాటే టాప్ ట్రెండ్ లో వుండటం విశేషం.
ఈ చిత్రంలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్ తో మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు.
ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రానికి మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పనిచేస్తున్నారు.
'మాచర్ల నియోజకవర్గం' ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.
తారాగణం: నితిన్, కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, సముద్రఖని, వెన్నెల కిషోర్, అంజలి(స్పెషల్ సాంగ్) తదితరులు
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: ఎంఎస్ రాజ శేఖర్ రెడ్డి
నిర్మాతలు: సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి
బ్యానర్: శ్రేష్ట్ మూవీస్
సమర్పణ : రాజ్‌కుమార్ ఆకెళ్ల
సంగీతం: మహతి స్వర సాగర్
డీవోపీ : ప్రసాద్ మూరెళ్ల
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
డైలాగ్స్ : మామిడాల తిరుపతి
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
ఫైట్స్: వెంకట్
పీఆర్వో: వంశీ-శేఖర్