Latest Post

Sanjay Rao Slum Dog Husband First Look Motion Poster Launched by Rana Daggubati

 Sanjay Rao, Pranavi Manukonda movie titled "Slum Dog Husband".First Look Motion Poster Launched by Rana Daggubati



Young actor Sanjay Rao who made his debut with O Pitta Katha will next be seen in an outright entertainer, which is titled Slum Dog Husband. Today being Sanjay's birthday, the motion poster of the film was unveiled. 


The motion poster of the film was unveiled by Rana Daggubati a short while back and it showcases the funny side of the story. The hero, Sanjay Rao is seen extensively loving his dog. He, his dog, and the female lead Pranavi are all seen in wedding attire in the same. The poster has a funny and quirky vibe to it. 


The film is directed by Dr. AR Sridhar and produced by Appi Reddy and Venkat Annapareddy under Mic Movies banner. 


The film has Sanjay Rao and Pranavi Manukonda in the lead roles. It has Bramhaji, Chammak Chandra, Sapthagiri and others in the lead roles.


Editor: Vaishnav Vasu

Cinematography: Srinivas

Music: Bheems Ceciroleo

Lyrics: Kasarla Shyam, Suresh Gangula, Srinivas, Poorna

PRO: GSK Media

Line producer: Ramesh Kaiguri

Business head: Kovera

Co-producers: Chinta Mervaan, CH Chaitanya, Nihar Devella, Prakash Jirra, Ravali Ganesh, Soham Reddy

Producers: Appi Reddy, Venkat Annapareddy,

Writer and director : AR Sridhar.

F3 Collected 18.77 Cr Share In Two Days

 Venkatesh, Varun Tej, Anil Ravipudi, Dil Raju Sri Venkateswara Creations F3 Collected 18.77 Cr Share In Two Days





Victory Venkatesh and Mega Prince Varun Tej’s hilarious family entertainer F3 has done exceptionally well on day two as the movie added 8.4 Cr in AP and TS alone, taking the two days total to 18.77 Cr share.


Bookings are massive for the movie on Sunday and much bigger numbers are on cards for this day in Telugu states. In fact, the movie that has enough laughs has repeat value. Moreover, family audiences are thronging to theatres for the unlimited entertainment.


While Anil Ravipudi is winning accolades for his fun-filled writing and proficient taking, both Venkatesh and Varun Tej played their parts adeptly. From kids to youth to family audience to masses, every section is enjoying the movie which is the reason for the humongous collections.


F3 is superb in overseas as well. The movie crossed $750K mark and is heading towards 1 million. Since Monday is holiday, it will be a great advantage for F3 to rake big numbers in the region in its extended first weekend.


Two days breakup list of shares is given below:


Area      Share

Nizam 8.16 Cr

UA 2.23 Cr

Ceded – 2.41 Cr

Guntur 1.42 Cr

Nellore 0.86 Cr

East 1.28 Cr

West 1.23 Cr

Krishna 1.18 Cr


Total (AP/TS): 18.77 Cr

Adivi Sesh Interview About Major

 అడ‌వి శేష్ ఇంట‌ర్వ్యూ




అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం  మేజర్‌.  26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం  తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. ఈ సంద‌ర్భంగా చిత్ర క‌థానాయ‌కుడు అడివి శేష్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా దేశ‌మంతా ప‌ర్య‌టిస్తున్నారు. అయినా తెలుగు మీడియాకు ఆయ‌న ప్ర‌త్యేకంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూ సారాంశం.


దేశ‌మంతా ప‌ర్య‌టిస్తున్నారు. ఎలాంటి స్పంద‌న వ‌స్తోంది?

మీరు మంచి సినిమా చేశారు అన‌డం మామూలు.  కంగ్రాట్స్ చాలా మంచి సినిమా చేశార‌ని గ్రీటింగ్స్ చెబుతున్నారు.


మేజర్ సందీప్ బ‌యోపిక్ చేయాల‌ని ఎప్పుడు అనిపించింది?

26/11 సంఘ‌ట‌న‌లు జ‌రిగాక ఆయ‌న ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాక మా క‌జిన్ ప‌వ‌న్ నాకూ సందీప్‌కు పోలిక‌లు వున్న‌య‌ని చెప్పాడు. వందలాది మంది ప్రాణాలు కాపాడిన ఆయ‌న‌కు అశోక్ చ‌క్ర వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న గురించి చ‌దివి ఆయ‌న‌కు ఫ్యాన్ అయ్యాను. ఆయ‌న నిజ‌జీవితంలో జ‌రిగిన విష‌యాలు ఎవ‌రికీ తెలీవు. హోట‌ల్‌లో 36 గంట‌లు ఏం చేశాడ‌నేది తెలుసు. కానీ 31 సంవ‌త్స‌రాల‌లో ఆయ‌న జీవితం ఎలా వుంద‌నేది ఎవ‌రికీ తెలీదు. ఇవ‌న్నీ నేను తెలుసుకున్నాక ఆయ‌న లైఫ్ గురించి ఎందుకు చెప్ప‌కూడ‌ద‌నే ఆలోచ‌న వ‌చ్చింది. క్ష‌ణం సినిమా టైంలో ఆలోచ‌న స్టార్ట్ అయింది. గూఢచారి టైంలో స్పీడ్ అందుకుంది.


మ‌న ఇండియాలో 31 ఏళ్ళ‌కు మ‌ర‌ణించిన భ‌గ‌త్‌సింగ్ వంటివారు కొంద‌రే తెలుసు? ఆయ‌న‌తో పోల్చ‌వ‌చ్చా?

మ‌న‌కు చిన్న‌ప్పుడు గాంధీ, భ‌గ‌త్ సింగ్ ల గురించి తెలుసు. కానీ మేజ‌ర్ గురించి బెంగుళూరు, ముంబై, ఢిల్లీలో బుక్ స్టాల్స్‌లో అడుగుతున్నారు.


గొప్ప క‌థ‌ను సినిమాలో చూపించ‌డం క‌ష్టం అనిపించిందా?

సాధార‌ణంగా బ‌యోపిక్‌లు పొడిపొడిగా ట‌చ్ చేస్తారు. కానీ ఇక్క‌డ సినిమాకు స‌రిప‌డే గొప్ప క‌థ వుంది. హీరోకు భ‌జ‌న కొట్టే క‌థ‌కాదు. మామూలు బ‌యోపిక్‌ల‌కు భిన్నంగా వుండే క‌థ ఇది. ఆయ‌న కొన్ని ప‌నులు చేశారు అంటే ఇప్పుడు చాలామంది న‌మ్మ‌క‌పోవ‌చ్చు. చాలా నెగెటివ్‌లు వ‌స్తుంటాయి. కానీ వాటిని న‌మ్మ‌బుద్ధి వేయ‌దు.


ఆయ‌న గురించి చాలా లోతుగా తెలుసుకున్నాక షాకింగ్ కు గుర‌యిన సంఘ‌ట‌న మీకు ఏమైనా వుందా?

ఓ సంఘ‌ట‌న వుంది. ఇండియ‌న్ ట్రైనింగ్ సెంట‌ర్‌లో శిక్ష‌ణ తీసుకుని తిరిగి ట్రైన్‌లో ఇంటికి వెళుతుండ‌గా సందీప్ ఫ్రెండ్‌కూడా వున్నాడు. త‌ను అస్సాం వెళుతున్నాడు. సందీప్ బెంగుళూరు వెళ్లాలి .ఆ స‌మ‌యంలో ఆయ‌న ఫ్రెండ్ నా ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవు అని అడ‌గ‌డంతో త‌న జేబులోని వున్న మొత్తం ఇచ్చేశాడు. ఆ త‌ర్వాత సందీప్ బెంగుళూరు వ‌చ్చేవ‌ర‌కు ప్ర‌యాణంలో ఏమీ తిన‌లేదు. తాగ‌లేదు. మిల‌ట్రీ మ‌నిషి కాబ‌ట్టి ఎవరినీ ఏమీ అడ‌గ‌కూడ‌దు అనే రూల్ వుంటుంది. కానీ ఇలాంటి సంఘ‌ట‌న చెబితే న‌మ్ముతారోలేదో అని పెట్ట‌లేదు.


ఆయ‌న లైఫ్‌లో ముంబై దాడులే తెలుసు? ఆయ‌న లైఫ్ గురించి చాలామందికి తెలీదు. అందుకే జ‌నాల‌కు ఫ్రెష్ సినిమా అనిపిస్తుందా?

మేం సినిమా చేస్తున్నాం అని ప్ర‌క‌టించాక చాలామంది 26/11 చూసేశాంక‌దా అన్నారు. కానీ ట్రైల‌ర్ రిలీజ్ అయ్యాక అంద‌రూ షాక్ అయ్యారు. ఆయ‌న జీవితంలో ఇంత వుందా? అని ఆశ్చ‌ర్య‌పోయారు.


బాలీవుడ్‌లో తీయ‌లేని సందీప్ బ‌యోపిక్ మీరు చేయ‌డం ఎలా అనిపిస్తుంది?

బాలీవుడ్‌లో తీయ‌లేదు అనికాదు కానీ. సందీప్ త‌ల్లిదండ్రుల‌కు వారు న‌చ్చ‌లేదు. ఎందుకంటే బాలీవుడ్ వారు, మ‌ల‌యాళంవారు తీస్తామ‌ని ముందుకు వ‌చ్చారు. కానీ హీరోలు త‌మ కొడుకులా లేర‌ని సున్నితంగా ఆయ‌న త‌ల్లి తిర‌స్క‌రించారు. న‌న్ను చూడ‌గానే చాలా హ్యాపీగా ఫీల‌య్యారు. నేను ఆమెను అమ్మా అని పిలుస్తుంటాను.


ఈ సినిమా తీయ‌డంలో మీకు ఎదురైనా ఛాలెంజ్‌లు ఏమిటి?

కోవిడ్ టైంలో ప్ర‌తిసారీ ఈ సీన్ బాగా చేద్దాం అని ప్లాన్ వేసుకుని చేస్తుంటాం. కొద్దిరోజులు చేశాక కోవిడ్ రావ‌డంతో చాలా లిమిటేష‌న్‌ను క్రియేట్ చేసింది.


మేకింగ్‌లో బిగ్జెస్ట్ ఛాలెంజ్ ఏమిటి?

టూమ‌చ్ ఛాలెంజ్‌లు వున్నాయి. ఇంకా ఈ సీన్ పెడితే బాగుండేది క‌దా అనిపించేది.రెండు  గంట‌లు అనేది లిమిటేష‌న్‌. 31 సంవ‌త్స‌రాల క‌థ‌ను కొన్ని సంద‌ర్భాల‌లో కొంత క‌ల్పితానికి వెళ్ళాల్సి వ‌చ్చింది. ఇందులో ఐదు సంఘ‌ట‌న‌లు ఒకే సీన్‌లో చూపించాల్సి వ‌చ్చింది. ఏది చెప్పినా కూడా సోల్‌లో ట్రూత్ ఉందా లేదా? ఆయ‌న ఫీల్ అయింది చూపించామా లేదా అనేది మాకు ఛాలెంజ్‌గా అనిపించింది.


ఇలాంటి క‌థ‌కు హీరోయిన్ కు ఎంత ప్రాధాన్య‌త వుంది?

సాయి మంజ్రేక‌ర్‌, శోభితా ధూళిపాళ ఇద్ద‌రు హీరోయిన్లు వున్నారు. తెలుగులో పాట‌లు వుంటేనే హీరోయిన్ వుంటార‌నే టాక్ వుంది. కానీ సందీప్ లైఫ్‌లో ఒక‌రు ప్ర‌జెంట్‌, ఒక‌రు ఫాస్ట్‌లో వున్నారు. ఆయ‌నంటే చాలామంది లేడీస్‌కు క్ర‌ష్ వుండేది. ఆయ‌న చిన్న‌త‌నం నుంచి స్కూల్, ఉద్యోగం, పెండ్లి అనేది ఒక భాగ‌మైతే, కాశ్మీర్‌, కార్గిల్ అనేది మ‌రో భాగం.


మ‌హేష్‌బాబు నుంచి ఎలాంటి స‌పోర్ట్ ల‌భించింది?

డేరింగ్‌గా సినిమా తీశామంటే మ‌హేష్‌బాబే కార‌ణం. ప్రీరిలీజ్‌కుముందే ఆడియ‌న్స్‌కు సినిమా చూపించి ప్రీ రిలీజ్ చేయ‌డం అనేది గొప్ప విష‌యం. అంత ఓపెన్ గా వుండి జ‌నాల రియాక్ష‌న్ నుంచి నిర్ణ‌యం తీసుకున్నాం. అది మ‌హేష్‌బాబుగారి ఎంక‌రేజ్ మెంట్‌.


షూట్ స‌మ‌యంలో సైనికుల క‌ష్టాలు, అక్క‌డి వాతావ‌ర‌ణం చూశాక వ్య‌క్తిగా ఎలా అనిపించింది?

లాస్ట్ సీన్ చిట్‌కూర్ అనే ఊరిలో తీశాం. అక్క‌డ జ‌నాలు 200మంది వుంటారు. ప‌గ‌లు మైన‌స్ 3 డిగ్రీలు వుంటుంది. రాత్రి మైన‌స్ 15వ‌ర‌కు వుంటుంది. ఇలాంటి ప్లేస్లో హీట‌ర్‌, బ్లాంకెట్స్ వుంచుకుంటాం. కానీ అవేవీలేకుండా సైనికులు గ‌న్ ప‌ట్టుకుని వుండ‌డం నాకు చాలా గొప్ప‌గా అనిపించింది. ఇంత‌కుముందు క‌థ‌లుగా చ‌దివాను. కానీ వాస్త‌వంగా నేను చూశాను.


ఈ సినిమాకు విఎఫ్‌.ఎక్స్ షాట్స్ చాలానే పెట్టారు?

అవును. 2,478 విఎఫ్‌.ఎక్స్ షాట్స్ వుంటాయి. అవి సినిమాలో చూస్తే మీకు అర్థ‌మ‌వుతుంది.


శ‌శికిర‌ణ్ తిక్క‌కు ఇది రెండో సినిమా. బ‌యోపిక్ అనేది పెద్ద బాధ్య‌త క‌దా న్యాయం చేశారా?

నాకు వున్న భావాల్ని జ‌నాలు ఫీల్ అయ్యేలా చేసేది ద‌ర్శ‌కుడే. ఆయ‌న చేయ‌బ‌ట్టే ఇంట‌ర్‌నేష‌న‌ల్ లుక్ వ‌చ్చింది. మంచి సినిమాకు అనుభ‌వం కాదు. టాలెంట్ కావాలి. అది ఆయ‌న‌లో చాలా వుంది.


ఈ జ‌ర్నీలో ఎప్పుడైనా మిల‌ట్రీకి వెళితే బాగుంటుంది అని అనిపించిందా?

నేను పెరిగింది అమెరికాలోనే.  ఇండియాలో ఆగ‌స్టు 15న స్కూల్ ప్రోగ్రామ్‌లో దీని గురించి మాట్లాడుతుంటారు. కానీ నేను ఇండియా గురించి ఎక్కువ‌గా తెలుసుకుంది అమెరికాలోనే. ఎ.ఆర్‌. రెహ‌మాన్ పాడిన జాతీయ గీతం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా లేచి నిల‌బ‌డేవాడిని. నాకు స్కూల్‌లో ఇండియా గురించి పెద్ద‌గా చెప్ప‌లేదు. అందుకే డిఫ‌రెంట్ అనుభ‌వం నాకుంది.


సందీప్ జీవితంలో అన్నీ పిక్చ‌రైజేష‌న్ చేశారా?

అన్నీ తీయాలంటే స‌మ‌యం స‌రిపోదు. స్కూల్ డేస్‌, క‌శ్మీర్‌, తాజ్ సంఘ‌ట‌న‌తోపాటు చిన్న‌త‌నంలో అమ్మ‌తో కూర్చుని పాయ‌సం తిన‌డం, స్కూల్ ఎగ్గొట్టి సినిమాలు చూడ‌డం, ఐస్ క్రీమ్‌లు తిన‌డం, నాన్న‌గారితో టైప్ రైటింగ్ గురించి మాట్లాడ‌డం. ఇవ‌న్నీ ఆయ‌న లైఫ్‌లో తీసుకున్న పెద్ద నిర్ణ‌యాలే. గొప్ప మ‌నుషులు గొప్ప మాట‌ల‌తో పుట్ట‌రు. వారు చేసే ప‌నివ‌ల్ల గొప్ప మ‌నిషి అవుతారు.


ఈ సినిమాలో సంగీతానికి ఎంత ప్రాధాన్య‌త వుంది?

శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల మంచి సంగీతం ఇచ్చారు. నిన్నేకోరేనే.. హృద‌యమా పాట‌లు ట్రెండ్ అయ్యాయి. అందులో ఒక‌టి ఆర్మాన్ పాడిన విధానం నాకు `బుట్టబొమ్మ` పాడిన ఫీలింగ్ వ‌చ్చింది. శ్రీ‌చ‌ర‌ణ్ పాట‌లు ఇళ‌య‌రాజాలా వుంటాయి. బ్యాక్ గ్రౌండ్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ స్తాయిలో వుంటుంది.


ఈ సినిమా మీ స్థాయిని పెంచేదిగా వుంటుందా?

మేజ‌ర్ సందీప్ ఆల్ ఇండియా మ‌నిషి క‌థ‌. నేను కూడా ఆ స్థాయికి చేరుకునేలా వుంది. పాన్ ఇండియా కాదు. ఆల్ ఇండియా సినిమా ఇది. ఆయ‌న బెంగుళూరు, హైద‌రాబాద్‌, క‌శ్మీర్ ఇలా అన్ని ప్రాంతాల‌కు వెళ్లారు. అందుకే ఈ సినిమా అన్ని ఏరియాల‌కు తీసుకెళ్ళాల‌నే త‌ప‌న‌వుంది.


మ‌హేష్‌బాబు సినిమా చూశాక ఏమ‌న్నారు?

ఆల్‌రెడీ ఆయ‌న ఇచ్చిన రివ్యూ టెలికాస్ట్ అయింది. సినిమా చూశాక గొంతు ఎడిపోయింది. క‌న్నీళ్ళు పెట్టి కౌగిలించుకుని గ‌ర్వంగా వుంద‌ని చెప్పారు.


షూట్ లో ఎ.ఎం.బి. బేన‌ర్ స‌హ‌కారం ఎంత‌మేరు వుంది?

న‌మ్ర‌త‌గారు ప్రొడ‌క్ష‌న్ ప‌రంగా చాలా స‌పోర్ట్ చేశారు.


సినిమాలో ప్ర‌కాష్‌రాజ్‌, రేవ‌తి పాత్ర‌లు ఎలా వున్నాయి?

ప్ర‌కాష్‌రాజ్‌గారికి బెంగుళూరులో సందీప్ ఫాద‌ర్ తెలుసు. మేం ఆయ‌న‌నుంచి ఎన్నో విష‌యాలు తెలుసుకున్నాం. రేవ‌తిగారు బాగా న‌టించారు. ఇద్ద‌రూ మంచి పెర్‌ఫార్మ‌ర్స్ ఇచ్చార‌ని మ‌హేష్‌బాబు చెప్పారు.


మేజ‌ర్ రిలీజ్ టైంలో హిందీలో పృధ్వీరాజ్‌, త‌మిళంలో క‌మ‌ల్ `విక్ర‌మ్‌` వ‌స్తున్నాయి ఎలా అనిపిస్తుంది?

నాకు చాలా ఆనందంగా వుంది. చిన్న‌ప్పుడు నా ఫేవ‌రేట్ సినిమా `వ‌సంత కోకిల‌`. అలాగే అక్ష‌య్ కుమార్ సినిమాల్లోని పాట‌లు నేను స్కూల్‌లో డాన్స్‌లు వేసేవాడిని. ఇద్ద‌రూ నా అభిమానులే. పృధ్వీరాజ్‌, విక్ర‌మ్ పెద్ద బ‌డ్జెట్ సినిమాల‌యితే తెలుగులో మేజ‌ర్ పెద్ద బ‌డ్జెట్ ఫిలిం.


క్ష‌ణం, గూఢ‌చారి వంటి థ్రిల్ల‌ర్ క‌థ‌లే చేస్తున్నారు. ల‌వ్ సినిమాలు చేసే ఆలోచ‌న వుందా?

అన్ని సినిమాల్లోనూ ల‌వ్ స్టోరీ వుంటుంది. మేజ‌ర్‌లో కూడా వుంది. రేపు గూఛ‌చారి2లోనూ వుంటుంది.


ఫైన‌ల్‌గా మేజ‌ర్ గురించి మీరు చెబుతారు?

నాకు మేజ‌ర్ సందీప్ పాత్ర ష‌న్‌షైన్ లాంటిది. ఆయ‌న సూర్య‌పుత్రుడు. తాజ్‌లో సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు సందీప్ లోప‌లికి రాగానే సూర్య‌పుత్రుడు వ‌చ్చిన ఫీలింగ్ క‌లిగింది అని ఆయ‌న కాపాడిన ఒక‌రు చెప్పారు. మిల‌ట్రీ అంటే సీరియ‌స్గా వుంటారు అనుకుంటాం. కానీ ఆయ‌న చాలా జోవియ‌ల్‌గా వుంటాడు

Ram Pothineni Starrer 'The Warriorr' Shooting Wrapped Up

 Ram Pothineni Starrer 'The Warriorr' Shooting Wrapped Up



It is all known that Ustaad Ram Pothineni is all set to entertain his fans with the bilingual action entertainer ' The Warriorr' helmed by N Linguswamy. As the movie is scheduled to release on July 14, the makers and director have speeded up their work.


Off late, the makers are treating the fans of Ram Pothineni with chartbuster songs and massy updates. The Bullet song creating massive records on YouTube and the recently released teaser in both Telugu and Tamil upped the fervor to a whole new level. Now, they announced great news that the shooting of this movie is completed. In this schedule, N Linguswamy picturised a mass introduction on Ram Pothineni.


They shared a new poster of Ram Pothineni and treated all his fans. The back to back updates have worked their magic on the audience, who now await to see The Warriorr in theatres on July 14. The team is also planning to conduct several promotional events ahead of the film’s release. 


The Warriorr starring Ram Pothineni is among the eagerly expected movies for many reasons. For, the young Telugu actor has partnered with ace director N Lingusamy for the first time and this film, a bilingual, will mark Ram's debut in Kollywood. 


Also, it will show Aadhi Pinisetty in a hitherto unseen role of a strong villain.  It is to be noted Lingusamy is known for his action entertainers and both Ram and Aadhi are known for their dedication to give the best. The film has a stellar star cast with Krithi Shetty as the heroine (her name is Whistle Mahalakshmi). 


The Warrior is being produced on a high budget by Srinivasaa Chitturi under Srinivasaa Silver Screen banner. Pavan Kumar will be presenting the movie.


'The Warriorr' movie will hit the theatres worldwide on July 14, 2022 in the theatres


Charlie 777 Hyderabad Event Held Grandly

 జీవితాంతం గుర్తుండిపోయే ‘ఛార్లి 777’  వంటి సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నందుకు గ‌ర్వంగా ఉంది :  రానా ద‌గ్గుబాటి



అతడే శ్రీమన్నారాయణ చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానాన్ని సంపాదించుకున్న క‌థానాయ‌కుడు ర‌క్షిత్ శెట్టి మ‌రో విభిన్న‌మైన క‌థా చిత్రం  ‘777 ఛార్లి’తో ఆడియెన్స్‌ను అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ మూవీ జూన్ 10న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ లెవ‌ల్లో విడుద‌ల‌వుతుంది. ఇందులో ఓ కుక్క టైటిల్ పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. ర‌క్షిత్ శెట్టి ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టిస్తూ జి.ఎస్‌.గుప్తాతో క‌లిసి త‌న ప‌ర‌మ్ వ‌హ్ బ్యాన‌ర్‌పై సినిమాను నిర్మించారు. కిర‌ణ్ రాజ్‌.కె ద‌ర్శ‌కుడు. ఈ సినిమా ప్రెస్‌మీట్ శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో...


హీరోయిన్ సంగీత శ్రింగేరి మాట్లాడుతూ ‘‘నేను ‘ఛార్లి 777’ చిత్రంలో యానిమల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించాను. మూడు నాలుగేళ్ల ముందు సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకున్నాను. అమేజింగ్ జ‌ర్నీ. ర‌క్షిత్ శెట్టిగారు అంద‌రినీ ముందుండి న‌డిపించారు.  ‘ఛార్లి 777’ సినిమాలో కుక్క‌తో న‌టించ‌టం ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌. జూన్ 10న వ‌స్తోన్న ఈ సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది’’ అన్నారు.


హీరో రక్షిత్ శెట్టి మాట్లాడుతూ ‘‘ ‘ఛార్లి 777’ సినిమా నటుడిగా కష్టతరమైన చిత్రమనే చెప్పాలి. సాధారణంగా ప్రతి సినిమాలో ఛాలెంజెస్ ఉంటాయి. అయితే ఇది వ‌ర‌కు చేసిన సినిమాల్లో మ‌నుషుల‌తో క‌ల‌సి చేశాను. ఈ సినిమాలో అలా కాదు.. కుక్క‌తో క‌లిసి సినిమా చేయ‌డం అంటే అంత సులువు కాదు. ప్ర‌మోద్ లేకుండా ఉండుంటే ఈ సినిమా చేయ‌టం అంత సుల‌భంగా వీల‌య్యేది కాదు. డైరెక్ట‌ర్ కిర‌ణ్ రాజ్ ప్ర‌తి చిన్న విష‌యంలో ఎంతో ప‌ర్టికుల‌ర్‌గా ఉండేవాడు. ఎంతో ప్యాష‌న్‌తో చేశాడు కాబ‌ట్టే సినిమా అంత చ‌క్క‌గా వ‌చ్చింద‌ని అనుకుంటున్నాను. ఇందులో ధ‌ర్మ అనే పాత్ర‌లో న‌టించాను. చాలా అంత‌ర్ముఖుడిగా క‌నిపించే పాత్ర‌. ఇంట్లోనే కాదు, ఫ్యాక్ట‌రీలోనూ ఒంటిరిగానే ఉండ‌టానికి ఇష్ట‌ప‌డుతుంటాడు. స్నేహితులు ఉండ‌రు. అలాంటి వ్య‌క్తి జీవితంలోకి ఓ కుక్క రావ‌టం మూలంగా ఎలాంటి మార్పులు జ‌రిగిందనే  ‘ఛార్లి 777’. ఈ సినిమాను 167 రోజుల పాటు చిత్రీక‌రించాం. ఈ స‌మ‌యంలో వ్య‌క్తిగా నాలో ఎంత మార్పు వ‌చ్చింది. న‌టుడిగా ఈ సినిమాలో భాగం కావ‌టంపై చాలా గ‌ర్వంగా ఫీల‌వుతున్నాను. జూన్ 10న విడుద‌లవుతున్న ‘ఛార్లి 777’  మిమ్మ‌ల్ని న‌వ్విస్తుంది, ఏడిపిస్తుంది.. థియేట‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్పుడు న‌వ్వు ముఖంతో బ‌య‌ట‌కు వ‌స్తాడు. తెలుగులో ఈ సినిమాను అందిస్తోన్న రానాకి థాంక్స్‌. ఇలాంటి సినిమా వ‌చ్చి 10-15 ఏళ్లు అవుతుంది. అలాగే రావ‌డానికి కూడా అంతే స‌మ‌యం ప‌ట్టొచ్చు. మా సినిమాపై న‌మ్మ‌కంతో తెలుగు స‌హా అన్ని భాష‌ల్లో విడుద‌ల చేయ‌డానికి ముందుకు వ‌చ్చిన అందరికీ థాంక్స్‌’’ అన్నారు.


రానా ద‌గ్గుబాటి మాట్లాడుతూ ‘‘పాండమిక్ సమయంలో రక్షిత్‌కి నాకు ఫోన్స్ ద్వారా ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ‘ఛార్లి 777’  వంటి డిఫ‌రెంట్ సినిమా చేస్తున్నార‌ని తెలియ‌గానే .. ఏదో ఇళ్ల‌ల్లో చేసేస్తార‌ని నేను అనుకున్నాను. కానీ ట్రైల‌ర్ చూసిన త‌ర్వాత ఎంత స్కేల్‌, స్పామ్‌లో సినిమా చేశారో అర్థ‌మైంది. చూసిన వెంట‌నే క‌ళ్ల‌ల్లో నీళ్లు వ‌చ్చాయి. చాలా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌లు సాధించే సినిమాలు చేసే అవ‌కాశాలు ఉన్న‌ప్ప‌టికీ 170 రోజులు.. కాశ్మీర్ స‌హా వివిధ ప్రాంతాల్లో ఛార్లిని తీసుకెళ్లి షూటింగ్ చేశారు. ఇలాంటి ‘ఛార్లి 777’  సినిమాను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నందుకు గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు.


న‌టీన‌టులు:

ర‌క్షిత్ శెట్టి, సంగీత శ్రింగేరి, రాజ్ బి.షెట్టి, డానిష్ సెయిట్‌, బాబీ సింహ త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్‌:  ప‌ర‌మ్ వ‌హ్ స్టూడియోస్‌

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  కిర‌ణ్ రాజ్‌.కె

నిర్మాత‌లు:  జి.ఎస్‌.గుప్తా, ర‌క్షిత్ శెట్టి

సంగీతం:  నోబిన్ పాల్‌

సినిమాటోగ్ర‌ఫీ:  అర‌వింద్ ఎస్‌.క‌శ్య‌ప్‌

ప్రొడ‌క్ష‌న్ డిజైనర్ :  ఉల్లాస్ హైదుర్‌

ఎడిట‌ర్‌:  ప్ర‌తీక్ శెట్టి

డైలాగ్స్‌:  కిర‌ణ్ రాజ్.కె, రాజ్ బి.శెట్టి, అభిజీత్ మ‌హేశ్‌, కె.ఎన్‌.విజ‌య్ కుమార్ (తెలుగు)

స్టంట్స్‌:  విక్ర‌మ్ మోర్‌

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్స్‌:  బినాయ్ కందేల్‌వాల్‌, సుధీ డి.ఎస్‌

కాస్ట్యూమ్స్ :  ప్ర‌గ‌తి రిష‌బ్ శెట్టి

కానినె ట్రైన‌ర్ :  ప్ర‌మోద్ బి.సి

పి.ఆర్‌.ఒ:  వంశీ కాక‌


Bimbisara Poster Relesed on the occasion of Ntr 100 Jayanthi

 ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ‘బింబిసార’ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్.. రాయల్ లుక్‌లో ఆకట్టుకుంటోన్న నందమూరి కళ్యాణ్ రామ్




NTR..తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. పేరు అనటం కంటే ఈ మూడు అక్షరాలను తెలుగువారి బ్రాండ్ అనొచ్చు. ఎందుకంటే సినీ ప్రస్థానంలో విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా ఆయనకు ఆయనే సాటిగా నిలవటమే కాదు.. రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించి తెలుగువారి కీర్తి పతాకాలను ప్రపంచ యవనికపై రెపరెపలాడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తెలుుగ వారి హృదయాల్లో చెరగని స్థానాన్ని సొంతం చేసుకున్నారు నందమూరి తారక రామారావు. మే 28న ఆయన జయంతి. ఆయనకు ఇది శత జయంతి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు వారే కాదు.. ప్రపంచంలోని తెలుగువారందరూ ఆయన శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మనవడు నందమూరి కళ్యాణ్ హీరోగా నటిస్తూ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కె.హరికృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న చిత్రం ‘బింబిసార’ చిత్రం నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు.


‘బింబిసార’ పోస్టర్‌ను గమనిస్తే .. అందులో కళ్యాణ్ రామ్ రెండు వేరియేషన్స్‌లో కనిపిస్తున్నారు. అందులో ఒకటి క్రూరుడైన రాజు లుక్ కాగా.. మరో లుక్ స్టైలిష్‌గా ఉంది. ఈ రెండు లుక్స్‌లోనూ కళ్యాణ్ రామ్ రాయల్‌గా కనిపిస్తున్నారు. పోస్టర్‌లో ఎన్టీఆర్ శత జయంతి విషెష్ తెలియజేశారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 5న గ్రాండ్ లెవల్లో రిలీజ్ చేస్తున్నారు.


కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన చిత్రాల్లోనటిస్తూ తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌ ఈ చిత్రంలో మగధ రాజు బింబిసారుడుగా కనిపించనున్నారు.  ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ ట్యాగ్ లైన్. వ‌శిష్ఠ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన క‌ళ్యాణ్ రామ్ ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌, టీజ‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి.


చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటోంది. బింబిసార‌లో విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్ కీల‌కంగా ఉండ‌బోతున్నాయి. భారీ సెట్స్‌తో క‌ళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న హై టెక్నిక‌ల్ వేల్యూస్ మూవీ ఇది. కళ్యాణ్ రామ్ సరసన కెథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.


ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి చిరంత‌న్ భ‌ట్ మ్యూజిక్‌. ప్ర‌ముఖ సీనియ‌ర్‌ సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణి నేప‌థ్య సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి పాట‌లు:  సిరి వెన్నెల సీతారామ‌శాస్త్రి, రామ‌జోగ‌య్య శాస్త్రి, డాన్స్‌:  శోభి, ర‌ఘు, ఫైట్స్‌:  వెంక‌ట్‌, రామ‌కృష్ణ‌, వి.ఎఫ్‌.ఎక్స్‌:  అనిల్ ప‌డూరి, ఆర్ట్‌:  కిర‌ణ్ కుమార్ మ‌న్నె, ఎడిట‌ర్‌:  త‌మ్మిరాజు, మ్యూజిక్‌:  చిరంత‌న్ భ‌ట్‌, నేప‌థ్య సంగీతం:  ఎం.ఎం.కీర‌వాణి, సినిమాటోగ్ర‌ఫీ:  ఛోటా కె.నాయుడు, ప్రొడ్యూస‌ర్‌: హ‌రికృష్ణ.కె, ద‌ర్శ‌క‌త్వం: వ‌శిష్ఠ్‌.

PVNR Bio Pic Soon

 తాతయ్య బయోపిక్ తీస్తా!!



అత్యున్నత ప్రమాణాలతో

గ్రీన్ మ్యాట్ స్టూడియో

ఆడియో మిక్సింగ్-ఎడిటింగ్

& డబ్బింగ్ స్టూడియో ఏర్పాటు!!


షూటింగ్స్ కి సువర్ణావకాశం!!


-స్వర్గీయ భారత ప్రధాని 

శ్రీ పి.వి.నరసింహారావు మనవరాలు

శ్రీమతి అజిత


      ఫార్మసీ-ఆర్కిటెక్చర్-ఫైన్ ఆర్ట్స్ -ఫోటోగ్రఫీలలో డిప్లొమా మొదలుకుని... పోస్ట్ గ్రాడ్యుయేషన్ మరియు డాక్టరేట్ వరకు విద్యనందిస్తున్న ప్రతిష్టాత్మక కళాశాలలు అత్యంత సమర్ధవంతంగా నిర్వహిస్తూనే... తన తాతగారు పి.వి.నరసింహారావు జీవితాన్ని తెరకెక్కించి... నేటి యువతలో స్ఫూర్తి నింపేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు బహుముఖ ప్రతిభాశాలి శ్రీమతి అజిత. ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ కోసం కళాశాల ప్రాంగణంలోనే అత్యంత ఆధునాతనంగా.. గ్రీన్ మ్యాట్ స్టూడియో, ఆడియో మిక్సింగ్, ఎడిటింగ్, డబ్బింగ్ స్టూడియోలను నెలకొల్పిన అజిత... చిన్న, మధ్య తరగతి నిర్మాతలకు లాభాపేక్ష లేకుండా వాటిని అందుబాటులో ఉంచేందుకు సంకల్పిస్తున్నారు. అంతేకాదు మూడెకరాల విస్తీర్ణంలో నిర్మించిన సువిశాల భవంతుల్లో పలు రకాల సన్నివేశాలు షూటింగ్స్ చేసుకునే వీలు కూడా కల్పిస్తున్నారు!!

      తన తాతగారి బయోపిక్ కోసం ప్రస్తుతం టి.ఆర్.ఎస్.పార్టీలో "ఎమ్.ఎల్.సి"గా సేవలందిస్తున్న తన తల్లి వాణీదేవి సలహాలు సూచనలు తీసుకుంటున్నానని అజిత తెలిపారు. తన తాతగారి బహుభాషా ప్రావీణ్యం, అసాధారణ రాజకీయ చాతుర్యంతోపాటు... బాహ్య ప్రపంచానికి పెద్దగా తెలియని ఎన్నో విషయాలను ఈ బయోపిక్ లో ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని అజిత వివరించారు!!

      భారతదేశం గర్వించదగ్గ ఓ మహా నాయకుడి మనవరాలు అయినా అత్యంత సాదాసీదాగా ఉండే అజిత... తమ ఫిల్మ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతూ.. "త్వరలో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉంది. మా దగ్గరున్న గ్రీన్ మ్యాట్ స్టూడియో, ఆడియో మిక్సింగ్, ఎడిటింగ్, డబ్బింగ్ యూనిట్ లను అందరికీ అందుబాటులో ఉంచడం ద్వారా సినిమా రంగానికి మావంతు సేవలందించాలని భావిస్తున్నాం. అలాగే ఈ ప్రాంగణంలో షూటింగ్స్ మరియు ఓపెనింగ్, ఆడియో రిలీజ్ వంటి ఫంక్షన్స్ చేసుకునేందుకు కూడా వీలు కల్పిస్తున్నాము" అని అన్నారు!!

Dhampudu Lakshmi Song Launched From Matarani Mounamidhi

 "మాటరాని మౌనమిది" చిత్రం నుంచి 'దం దం దంపుడు లక్ష్మీ' లిరికల్ సాంగ్ విడుదల




రుద్ర పిక్చర్స్ మరియు పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర  దర్శకుడు సుకు పూర్వాజ్ చేస్తున్న కొత్త సినిమా "మాటరాని మౌనమిది". ఈ చిత్రంతో అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ లో ట్రైన్ అయ్యిన మహేష్ దత్త, తెలుగు అమ్మాయి సోని శ్రీవాస్తవ ప్రేక్ష‌కులకు పరిచయం కాబోతున్నారు. లవ్ స్టొరి, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ముల్టి జోనర్ గా రూపొందుతున్న "మాటరాని మౌనమిది" సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన చిత్ర గ్లింప్స్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి 'దం దం దంపుడు లక్ష్మీ' అనే లిరికల్ పాటను విడుదల చేశారు.


అషిర్ లూక్ స్వరపర్చిన  ఈపాటకు డి సయ్యద్ బాషా సాహిత్యాన్ని అందించగా..రేవంత్, మనీషా పాండ్రంకి, యువరాహుల్ కనపర్తి ఆలపించారు. ఈ పాటలో జాస్ప్రీత్ కౌర్ నటించారు . ఈ పాట ఎలా ఉందో చూస్తే..*దం దం దంపుడు లక్ష్మీ..మాయదారి మాపటేల చిన్నోడు సూటు బూటు ఏసుకుని నా కంట పడ్డాడు, మాయదారి మాపటేల చిన్నోడు ఫారిన్ సెంటు పూసుకుని నా వెంట పడ్డాడు, దుబాయి జావిదును కలిపిస్తానన్నాడు, నూజివీడు మామిడి తోట రాసిస్తానన్నాడు*..అంటూ మాస్ ను ఆకట్టుకునేలా సాగిందీ పాట. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది.


న‌టీ న‌టులు - మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ, అర్చన అనంత్, సుమన్ శెట్టి,

సంజీవ్ , శ్రీహరి తదితరులు.


సాంకేతిక వ‌ర్గం - , సినిమాటోగ్ర‌ఫీ చరణ్, మ్యూజిక్: అషీర్ లూక్, పిఆర్ఒ

ః జియ‌స్ కె మీడియా, నిర్మాత ః రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్, ద‌ర్శ‌కుడు ః సుకు పూర్వాజ్

Andala Raasi Promo Out now From Pakka Commercial

గోపీచంద్, మారుతి ‘పక్కా కమర్షియల్’ నుంచి అందాల రాశీ సాంగ్ టీజ‌ర్ విడుదల..



ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ తర్వాత విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో స‌క్సెస్ ఫుల్ బ్యాన‌ర్లుగా అంద‌రి మ‌న్న‌న‌లు అందుకుంటూ మందుకు సాగ‌తున్న జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ క‌లిసి మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాసు నిర్మాత‌గా మ్యాచో హీరో గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమాను తెరకెక్కిస్తున్నారు మారుతి. ఈ టైటిల్ కు అటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుంచి ఇటు సాధ‌ర‌ణ ప్రేక్షకుల వ‌రకు అంతటా అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించ‌డం విశేషం. ఇప్పటికే విడుదలైన పక్కా కమర్షియల్ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాసిన టైటిల్ సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జులై 1, 2022న పక్కా కమర్షియల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలోని అందాల రాశీ పాట జూన్ 1న విడుదల కానుంది. తాజాగా ఈ పాట‌కు సంబంధించిన టీజ‌ర్ విడుదలై, ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్‌ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారు. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. భలే భలే మగాడివోయ్, టాక్సీవాలా, ప్రతి రోజు పండగే లాంటి విజయాలతో అపజయమే లేని జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ - బ‌న్నీవాసు - కాంబినేష‌న్ లో పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. గ‌తంలో ఈ బ్యాన‌ర్స్ నుంచే ద‌ర్శ‌కుడు మారుతి భ‌లేభ‌లే మ‌గాడివోయ్, ప్ర‌తిరోజు పండ‌గే వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందించారు. ప్రతి రోజు పండగే సినిమా తర్వాత సత్యరాజ్ మరోసారి ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి జ‌కేస్ బీజాయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. SKN సహ నిర్మాత‌. మరిన్ని వివరాలు త్వరలోనే చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.


నటీనటులు:


గోపీచంద్, రాశీఖ‌న్నా, స‌త్య‌రాజ్, రావు ర‌మేశ్, సప్తగిరి తదితరులు


టెక్నికల్ టీం:


స‌మ‌ర్ప‌ణ - అల్లు అరవింద్

బ్యాన‌ర్ - జీఏ2పిక్చ‌ర్స్, యూవీక్రియేష‌న్స్

నిర్మాత‌ - బ‌న్నీ వాస్

ద‌ర్శ‌కుడు - మారుతి

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ - ర‌వీంద‌ర్

మ్యూజిక్ - జ‌కేస్ బీజాయ్

స‌హ నిర్మాత - ఎస్ కే ఎన్

లైన్ ప్రొడ్యూసర్ - బాబు

ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - స‌త్య గ‌మిడి

ఎడిటింగ్ - ఎన్ పి ఉద్భ‌వ్

సినిమాటోగ్ర‌ఫి - క‌ర‌మ్ చావ్ల‌

పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌ శ్యామ్



Brahmāstra Team in Vizag on May31st

 SUPERSTAR RANBIR KAPOOR, ALONG WITH DIRECTOR AYAN MUKERJI AND THE LEGENDARY S. S. RAJAMOULI TO VISIT THE ‘JEWEL OF THE EAST COAST’ – VISAKHAPATNAM FOR A DIVINE START TO BRAHMĀSTRA CAMPAIGN AND MEET FANS!



Superstar Ranbir Kapoor, director Ayan Mukerji and legendary filmmaker S. S. Rajamouli will be visiting the beautiful city of Visakhapatnam on Tuesday, 31st May for a divine and special beginning to the journey of BRAHMĀSTRA PART ONE: SHIVA.


The first motion poster of Brahmāstra in Telugu language was presented by S. S. Rajamouli in December at Hyderabad to much fanfare. The team will visit Visakhapatnam and embark on their journey towards the release of the film.  We hear that Ranbir, Ayan and S. S. Rajamouli Garu will first seek blessings at the renowned and historic Simachalam temple during their visit to Vizag and meet fans at the iconic Melody Theatre!


One of the biggest cinematic spectacles of 2022, Brahmastra has been keenly awaited by movie connoisseurs across the globe. From the motion poster to the Kesariya teaser song, all the assets released of the film have created a stir worldwide amongst fans.



Produced by Star Studios, Dharma Productions, Prime Focus and Starlight Pictures, the magnum opus will release theatrically on September 9, 2022 across 5 Indian languages – Hindi, Tamil, Telugu, Malayalam, and Kannada with a stellar ensemble cast of Amitabh Bachchan, Ranbir Kapoor, Alia Bhatt, Mouni Roy and Nagarjuna Akkineni.

Basavatarakarama Creations Production No1 Launched by Nandamuri Balakrishna

 బసవతారకరామ క్రియేషన్స్' బ్యానర్ లాంచ్ చేసిన నందమూరి బాలకృష్ణ- ప్రొడక్షన్ నెం 1గా నందమూరి చైతన్య కృష్ణ హీరోగా వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో కొత్త చిత్రం



విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో ఆయన పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ 'బసవతారకరామ క్రియేషన్స్' పేరుతో కొత్త బ్యానర్ ని స్థాపించారు. నటసింహ నందమూరి బాలకృష్ణ 'బసవతారకరామ క్రియేషన్స్' బ్యానర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. బసవతారకరామ క్రియేషన్స్' బ్యానర్ లో ప్రొడక్షన్ నెం 1గా నందమూరి జయకృష్ణ కుమారుడు, నందమూరి చైతన్య కృష్ణని హీరో గా పరిచయం చేస్తూ వంశీ కృష్ణ దర్శకత్వంలో ఒక వైవిధ్యమైన చిత్రం నిర్మిస్తున్నారు.


బ్యానర్ లాంచ్ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. 'బసవతారకరామ క్రియేషన్స్' బ్యానర్ కి శ్రీకారం చుట్టిన అన్నయ్య జయకృష్ణ గారికి అభినందనలు. ఇది మా సొంత బ్యానర్ . మా అన్నదమ్ములందరి బ్యానర్. మా అమ్మగారు, నాన్నగారి పేర్లు కలిసోచ్చేలా 'బసవతారకరామ' అని బ్యానర్ కి పేరు పెట్టడం చాలా ఆనందంగా వుంది. ఈ బ్యానర్ ద్వారా నందమూరి చైతన్య కృష్ణ హీరో గా పరిచయం కావడం ఆనందంగా వుంది. నాన్నగారికి చైతన్య కృష్ణ చాలా ఇష్టమైన మనవడు. చైతన్య కృష్ణ ప్రేక్షకుల అభిమానాన్ని పొందాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. చాలా వైవిధ్యమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ళకు నా బెస్ట విశేష్. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను'' అన్నారు


నిర్మాత నందమూరి జయకృష్ణ మాట్లాడుతూ.. మా తమ్ముడు నందమూరి బాలకృష్ణ బ్యానర్ ని లాంచ్ చేయడం ఆనందంగా వుంది. 'బసవతారకరామ క్రియేషన్స్' బ్యానర్ ద్వారా మా అబ్బాయి చైతన్య కృష్ణని హీరోగా పరిచయం చేస్తున్నాం. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్, మిగతా వివరాలు త్వరలోనే  ప్రకటిస్తాం'' అన్నారు  


హీరో చైతన్య కృష్ణ మాట్లాడుతూ.. నాన్నగారు స్థాపించిన 'బసవతారకరామ క్రియేషన్స్'బ్యానర్ ని బాబాయ్ బాలకృష్ణ గారు లాంచ్ చేయడం, ఆశీస్సులు అందించడం చాలా ఆనందంగా వుంది'' అన్నారు.

F3 Collects 10.37 Cr Share In AP TS On First Day

 Venkatesh, Varun Tej, Anil Ravipudi, Dil Raju, Sri Venkateswara Creations F3 Collects 10.37 Cr Share In AP, TS On First Day



 


Victory Venkatesh and Mega Prince Varun Tej’s hilarious family entertainer F3 directed by Anil Ravipudi hit the screens on Friday to unanimous positive talk from everywhere. This was clearly witnessed in the box office numbers of the movie on first day. Housefull boards are seen everywhere, particularly the footfalls are massive for first and second shows. This usually happens for a film that receives positive talk, after its release.


Expectations were quite high on F3, since the promotional content was highly entertaining and it is the franchise of the blockbuster F2. The film exceeded all the prospects and did strong business on day one. It amassed Rs 10.26 Cr share on first day.


F3 grossed over half million in USA on its first day including premieres on Thursday. The film is likely to cross million-dollar mark by the end of its first weekend itself.


F3 has repeat value, thus the movie will rake big numbers in next few days, wherein bookings are outstanding for Saturday and Sunday.


F3 First Day AP/TS Share:


Nizam 4.06 Cr

UA 1.18 Cr

Guntur 88 L

Nellore 62 L

East 76 L

West 94 L

Krishna 67 L

Ceded - 1.26 Cr

Total 1st Day AP/TS share : 10.37Cr

Ante Sundaraniki Trailer Update On May 30th

 Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki Trailer Update On May 30th



Natural Star Nani and talented director Vivek Athreya’s much awaited rom-com Ante Sundaraniki produced by leading production house Mythri Movie is getting ready for release worldwide in three languages on June 10th. The movie will have simultaneous release in Tamil and Malayalam, along with the Telugu version.


Meanwhile, the makers announced Ante Sundarakini’s trailer update is coming on May 30th at 11:07 AM. Both Nani and Nazriya look cute together in the announcement poster.


Since the reception for the teaser was humongous with hilarious content, there is eagerness for theatrical trailer. Surely, the trailer is expected to set the bar further high on the movie that is already making huge noise.


Niketh Bommi handled cinematography, while Vivek Sagar rendered soundtracks.

Nandamuri Balakrishna NBK 107 Mass Poster Released As A Tribute For NTR On His 100th Birth Anniversary

 A Tribute For NTR On His 100th Birth Anniversary With A Mass Poster Of Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers #NBK107



Natasimha Nandamuri Balakrishna and mass director Gopichand Malineni who delivered biggest blockbusters of their careers with their last respective movies Akhanda and Krack are working together to deliver much bigger hit with their first film together. Tentatively titled #NBK107, the film to be produced by Tollywood’s leading production house Mythri Movie Makers stars Shruti Haasan playing the female lead.


Marking the legendary actor, filmmaker and politician Sri Nandamuri Taraka Rama Rao’s 100th birth anniversary, the makers gave a perfect tribute by releasing a brand-new mass poster where Balakrishna is seen in a ferocious avatar.


Wearing white and white, Balakrishna holds a specially designed bloody sword in his hand. Sporting light beard and moustache, Balakrishna looks young and dashing here. We can observe a huge crowd at a holy place in the background.


#NBK107 will be high on action and the mass poster too designates the same. It’s a dream come true for Gopichand Malineni to helm his all-time favoarite star Balakrishna and the director is presenting the star in a never seen before mass look and role. The film’s title will be announced soon.


While the first look poster amazed one and all, the new and mass poster promises high intense action in the movie. As of now, 40% of the shoot has been completed and the team is contented with the outcome so far. The film is being made on uncompromised manner.


Kannada star Duniya Vijay is venturing into Tollywood with this movie where he is playing the antagonist. Varalaxmi Sarathkumar will be seen in a significant role.


Naveen Yerneni and Y Ravi Shankar are producing the film on massive scale. The film in the crazy combination will be technically solid with some noted technicians handling different crafts.


Music Sensation S Thaman who worked for Krack and Akhanda is the music director for NBK107. Rishi Punjabi is taking care of cinematography. Acclaimed writer Sai Madhav Burra provides dialogues, while National Award-Winning Craftsman Navin Nooli is handling editing and AS Prakash is the production designer. Chandu Ravipati is the executive producer for the film that has fights by Ram-Lakshman duo.


Cast: Nandamuri Balakrishna, Shruti Haasan, Duniya Vijay, Varalaxmi Sarathkumar, Chandrika Ravi (special number) and others.


Technical Crew:

Story, Screenplay & Direction: Gopichand Malineni

Producers: Naveen Yerneni, Y Ravi Shankar

Banner: Mythri Movie Makers

Music Director: Thaman S

DOP: Rishi Punjabi

Editor: Navin Nooli

Production Designer: AS Prakash

Dialogues: Sai Madhav Burra

Fights: Ram-Lakshman

CEO: Chiranjeevi (Cherry)

Co-Director: Kurra Ranga Rao

Executive Producer: Chandu Ravipati

Line Producer: Bala Subramanyam KVV

Publicity: Baba Sai Kumar

Marketing: First Show

PRO: Vamsi-Shekar

Sonu Sood to impress as Chand Bardai from 'Prithviraj'

 Sonu Sood to impress as Chand Bardai from 'Prithviraj'




Actor-philanthropist Sonu Sood has been one of the most talked-about actors in India. Besides creating an image for himself with his outstanding acting skills, the actor has been winning the hearts of everyone with his relentless social work.


It is known that Sonu Sood will next be seen in a Bollywood film, titled Prithviraj. The ace actor is stepping into the shoes of Chand Bardai, the court poet of King Prithviraj Chauhan in Chandraprakash Dwivedi’s directorial.


The makers have shared a few stills of Sonu Sood from Prithviraj, and the actor looks very impressive in an unbelievable transformation. With his intense looks, the humanitarian seems to be delivering a career best performance in the movie. Meanwhile, the film also features Akshay Kumar, Manushi Chhillar, and Sanjay Dutt. The movie is set to hit the screens on June 3rd.


Besides this film, Sonu Sood is also working on his home production 'Fateh'.

Actor Kiran Abbavaram's next film goes on floors in Hyderabad

 Actor Kiran Abbavaram's next film goes on floors in Hyderabad   




The upcoming film titled 'Rules Ranjan' starring the happening actor Kiran Abbavaram went on floors on Friday following a pooja ceremony here in Hyderabad. 

In the presentation of AM Ratnam, the film is being produced under the banners 

Star Light Entertainments and Sai Surya Movies. Besides starring Kiran Abbavaram, the film also features comedian-actor Vennela Kishore, Himani, Vaishali, Jayavani, Mumtaz, Satya, Annu Kapoor, Siddharth Sen, Atul Parchure, Ashish Vidhyarthi, Ajay among other star casts. Ratnam Krishna has penned the story and is also heming the project. 

The pooja ceremony was held in Hyderabad city amidst much fanfare. Prominent filmmaker Krish gave the clap for the muhurat shot featuring the lead protagonist Kiran Abbavaram while producer A.M Ratnam switched on the camera besides handing over the script to the director on the occasion. The regular shooting of the film commenced on Friday.

Other characters in the film include Goparaju Ramana, Gemini Suresh, Tulasi, Abhimanyu Singh, Himani, Vaishali, Jayavani, Mumtaz and Manohar Singh.



Writer, director: Ratnam Krishna

Co-director: Srikanth

Co-producer: Rinku Kukreja

Line producer and co-director: K Ranganath

DoP: Duleep Kumar

Music: Amresh Ganesh

Art director: M Sudheer

Lyricist: Kasarla Shyam

Editor: Varaprasad

Publicity designer: Ananth

Genius filmmaker S. S. Rajamouli launches 'KumKumala

 Genius filmmaker S. S. Rajamouli launches 'KumKumala'- The Telugu version of viral song 'Kesariya' from Brahmāstra Part One: Shiva!



Power Couple Ranbir Kapoor and Alia Bhatt's teaser song 'Kesariya' (hindi version) from Ayan Mukerji's magnum opus Brahmāstra Part One: Shiva went viral receiving love from all corners!


Now, the makers have a special surprise for fans! A special Telugu version of 'Kesariya' song called Kumkumala was launched online by the legendary filmmaker S. S. Rajamouli (who is presenting the film in the 4 south markets).


The Telugu version is sung by the renowned Sid Sriram (who recently sang the blockbuster Srivalli) while lyrics is by veteran Chandrabose whose recent hits include Pushpa and RRR.


Brahmāstra Part One: Shiva releases on 9th September 2022.


The movie is presented by S. S. Rajamouli in Telugu, Tamil, Kannada and Malayalam 


Directed by Ayan Mukerji, Produced by Fox Star Studios, Dharma Productions, Prime Focus and Starlight Pictures the magnum opus will release theatrically on 09.09.2022 in 5 Indian languages – Hindi, Tamil, Telugu, Malayalam and Kannada with a stellar ensemble cast of Amitabh Bachchan, Ranbir Kapoor, Alia Bhatt, Mouni Roy and Nagarjuna Akkineni.

F3 Blockbuster Success Celebrations

 ఎఫ్3 ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థ్యాంక్స్ : ఎఫ్3 టీం



''ఎఫ్ 3ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. ఎఫ్ 3 చిత్రానికి మొదటి ఆట నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్, కిడ్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు,. యూనివర్షల్ గా అన్ని ఏరియాల నుండి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు. కుటుంబం అంతా కలిసొచ్చి ఎఫ్ 3 ని ఎంజాయ్ చేయడం ఆనందంగా వుంది'' అని పేర్కొంది ఎఫ్3 చిత్ర యూనిట్.


విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ ప్రొడ్యూసర్  దిల్ రాజు సూపర్ హిట్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ మల్టీస్టారర్ 'ఎఫ్ 3'. 


 డబుల్ బ్లాక్‌బస్టర్ 'F2' ఫ్రాంచైజీ నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పకులుగా నిర్మాత శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎఫ్3 శుక్రవారం (మే 27) ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలై యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ తో ప్రభంజనం సృష్టించింది. ఈ సందర్భంగా హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు సక్సెస్ సెలబ్రేషన్స్ భాగంగా మీడియా మీట్ లో మాట్లాడారు.


విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ఎఫ్ 3ని బిగ్గెస్ట్  బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు, అభిమానులకు కృతజ్ఞతలు. పాండమిక్ తర్వాత చాల సినిమాలు వచ్చాయి. యూత్, మాసే థియేటర్ కి వస్తున్నారని వినిపించేది. దిల్ రాజు గారు, అనిల్ రావిపూడి మేము అంతా కలసి ఫ్యామిలీస్ ని థియేటర్ కి రప్పించాలనే లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యం ఎఫ్ 3తో నెరవేరినందుకు ఆనందంగా వుంది. కుటుంబం అంతా కలిసొచ్చి ఎఫ్ 3 ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎఫ్ 2 తర్వాత నేను థియేటర్ కి వెళ్లి చూసిన ఎఫ్ 3నే. దేవి థియేటర్ లో చూశాను. థియేటర్లో ప్రేక్షకులు రియాక్షన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తున్నారు. దిల్ రాజు గారు, శిరీష్ గారు ఎఫ్ 2 తర్వాత మళ్ళీ ఇంతపెద్ద ఎంటర్ టైనర్ తీసునందుకు సంతోషంగా వుంది. అనిల్ రావిపూడి ఎఫ్ 2 కంటే అద్భుతమైన వర్క్ చేశారు. ఎఫ్ 3 యూనిట్ అంతా వండర్ ఫుల్ టీం వర్క్ చేసింది. ప్రేక్షకులు మళ్ళీ మళ్ళీ వచ్చి ఎఫ్ 3 ని ఎంజాయ్ చేయాలి'' అని కోరుకున్నారు . 


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. '' ఎఫ్ 3కి యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ రావడం ఆనందంగా వుంది. ఎఫ్ 3 చూసిన ప్రేక్షకులు సూపర్ ఎక్స్ ట్రార్డినరీ, అదిరిపోయిందిగా..! అంటున్నారు.


ఇక్కడ చూసిన ఇదే మాట వినిపిస్తుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు గారు, వెంకటేష్ గారికి థ్యాంక్స్. వెంకటేష్ గారితో అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరింది. మా కాంబినేషన్ ని ప్రేక్షకులు ఇంత గొప్పగా ఆదరించడం ఆనందంగా వుంది. ఎఫ్ 3 ని బిగ్గెస్ట్  బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు'' అన్నారు. 


నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఎఫ్ 3 చిత్రానికి మొదటి ఆట నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. ఎఫ్ 3తో మరో బిగ్గెస్ట్ సక్సెస్ ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఎఫ్ 3 మాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. వెంకటేష్ గారి సీతమ్మవాటిట్లో సిరిమల్లె చెట్టు, ఎఫ్ 2, ఇప్పుడు ఎఫ్ 3 తో హ్యాట్రిక్ విజయం, అలాగే వరుణ్ తేజ్ తో ఫిదా, ఎఫ్ 2, ఇప్పుడు ఎఫ్ 3 హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడం చాలా ప్రత్యేకం. మాస్, క్లాస్, ఫ్యామిలీ, యూత్, కిడ్స్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు,..  అమెరికా, లండన్, రాయలసీమ, కోస్తా, నిజాం ఇలా యునివర్షల్ గా అన్ని ఏరియాల నుండి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించారు. వెంకటేష్ గారు, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడితో మా జర్నీ విజయవంతంగా కొనసాగుతున్నందుకు ఆనందంగా వుంది. బ్లాక్ బస్టర్ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు'' తెలిపారు. 


దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఎఫ్ 3ని బిగ్గెస్ట్  బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఉదయం నుండి 'ఎనీ సెంటర్ సింగల్ టాక్ బ్లాక్ బస్టర్' అనే మాటే వినిపిస్తుంది. ప్రేక్షలులు థియేటర్ లో పడిపడి నవ్వుతున్నారు. ఎఫ్ 2 కంటే గొప్ప రెస్పాన్స్ వచ్చింది. ఎఫ్ 3 రెండేళ్ళ ప్రయాణం. అందరం ఒక ఫ్యామిలీలా పని చేశాం. దిల్ రాజు గారు, శిరీష్ గారితో ఇది నాకు ఐదో సినిమా. ఈ రోజు ఉదయం రాజుగారికి ఒక హ్యాపీ హాగ్ ఇచ్చాను. వెంకటేష్ గారి బిగ్ థ్యాంక్స్. ఒక స్టార్  ఇమేజ్ వుండి కామెడీని ఇలా పండించడం చాలా కష్టం. ఈ విషయంలో  వెంకటేష్ గారి స్పెషల్ థ్యాంక్స్. ఒకొక్క ఎపిసోడ్ ని ప్రేక్షకులు సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఎఫ్ 3ని మరో లెవెల్ కి తీసుకెళ్ళిందుకు ఆనందంగా వుంది. వరుణ్ తేజ్ అద్భుతంగా చేశారు.  ఈ ప్రయాణం ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇలా హాయిగా నవ్వుకునే సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ప్యామిలీ అంతా కలసి వెళ్ళండి... హాయిగా నవ్వుకోండి'' అన్నారు.

Adivi Sesh's Pan India Film Major Ticket Prices, Lowest For Any Film Post Pandemic

 Adivi Sesh's Pan India Film Major Ticket Prices, Lowest For Any Film Post Pandemic



Adivi Sesh's Pan India Film Major directed by Sashi Kiran Tikka is all set for grand release worldwide on June 3rd. The makers announced the film to have affordable ticket prices in single screens and multiplexes. While per ticket price in single screens in Telangana is 150, it will be 147 in Andhra Pradesh, wherein the multiplexes will charge 195 and 177 respectively. These are the lowest ticket prices for any film post pandemic.


The makers have reduced ticket prices for everyone to watch. This will surely bring family audience to theatres and moreover, the movie will have repeats with the affordable ticket prices in Telugu states.


The makers also took the brave decision of screening early premieres across the country, much before it's theatrical release. The first screening was already held few days ago in Pune and it got unanimous positive talk. The audience indeed have standing ovation after watching the show.


The film is produced jointly by Sony Pictures Films India in association with Mahesh Babu's GMB Entertainment and A+S Movies


A perfect tribute to selfless, brave military personnel, Major Sandeep Unnikrishnan who sacrificed his life for the nation in the 26/11 Mumbai attacks, the film also features Sobhita Dhulipala, Prakash Raj, Revathi and Murli Sharma in prominent roles.


Vamsi Patchipulusu handled the cinematography of the movie which is one of the most-awaited movies in 2022.

Jwala Teaser Out Now

 విజయ్‌ఆంటోనీ, అరుణ్‌ విజయ్‌ పాన్‌ ఇండియా చిత్రం జ్వాల టీజర్‌ విడుదల



ఆర్‌ఆర్‌ఆర్, కె.జి.ఎఫ్, విక్రమ్‌ల వరసలో జ్వాల


‘‘పాత రోమ్‌ నగరం గుర్తుందా మిత్రుడా! ఇద్దరు గ్లాడియేటర్స్‌ తలపడతారు, ఓడినవాడు చస్తాడు గెలిచినవాడు మాత్రమే బ్రతుకుతాడు...బతికుంటే అలాంటి ఒక గెలుపుతో బతికుండాలి. చచ్చినాకూడా అలాంటి వాడి చేతిలో చచ్చాము అనే గర్వంతో చావాలి...’’. ఇటువంటి పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు ఉన్న  ‘జ్వాల’’ చిత్ర టీజర్‌ను  శుక్రవారం ప్రముఖ నటుడు ఆలిండియా యాక్టర్‌ రానా దగ్గుబాటి సోషల్‌ మీడియా ట్వీట్టర్‌ ద్వారా  విడుదల చేశారు. ఈ మధ్యే విడుదలైన  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’,‘కె.జి.ఎఫ్‌–2’, ‘విక్రమ్‌’ వంటి పాన్‌ఇండియా చిత్రాల సరసన చేరనుంది ‘జ్వాల’  సినిమాకూడా.  ‘జ్వాల’ చిత్ర  టీజర్‌కూడా ఇంచుమించు ఆ సినిమాల స్థాయిలోనే ఉంది. బేస్‌ వాయిస్‌తో తెరమీద కనిపించే సన్నివేశాలను గురించి విశ్లేషిస్తూ  బ్యాక్‌గ్రౌండ్‌లో  ఓ మనిషి కథలా చెప్తూ ఉంటారు. ‘సాహో’ ఫేమ్‌ అరుణ్‌ విజయ్, ‘బిచ్చగాడు’ ఫేమ్‌ విజయ్‌ ఆంటోని టీజర్‌లో పోటాపోటీగా నటించారు.  అక్షరహాసన్‌ కీలక పాత్రలో నటించారు.   ‘జ్వాల’ పాన్‌ఇండియా చిత్రాన్ని అమ్మ క్రియేషన్స్‌ టి.శివ సమర్పిస్తుండగా శర్వాంత్‌రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై జవ్వాజి రామాంజనేయులు, షిరిడిసాయి మూవీస్‌ పతాకంపై యం.రాజశేఖర్‌ రెడ్డి నిర్మించారు. రష్యా, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, స్విట్జర్లాండ్, కలకత్తాలతో పాటు అనేక దేశాల్లో షూటింగ్‌ జరుపుకుంది. అరుణ్‌విజయ్, విజయ్‌ ఆంటోనీ, అక్షరహాసన్‌ల కెరీర్‌లోనే తెరకెక్కిన భారీబడ్జెట్‌ చిత్రం  ‘జ్వాల’. ఈ చిత్రాన్ని  నవీన్‌ దర్శకత్వం వహించారు. ప్రకాశ్‌రాజ్, రైమాసేన్,నాజర్‌ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా– కె.ఎ.బచ్చ, ఎడిటర్‌– వెట్రికృష్ణన్, సంగీతం– నటరాజన్‌ శంకరన్‌ పీ.ఆర్‌.వో– శివమల్లాల