Home » » Adivi Sesh Interview About Major

Adivi Sesh Interview About Major

 అడ‌వి శేష్ ఇంట‌ర్వ్యూ
అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రం  మేజర్‌.  26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం  తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. ఈ సంద‌ర్భంగా చిత్ర క‌థానాయ‌కుడు అడివి శేష్ ప్ర‌మోష‌న్‌లో భాగంగా దేశ‌మంతా ప‌ర్య‌టిస్తున్నారు. అయినా తెలుగు మీడియాకు ఆయ‌న ప్ర‌త్యేకంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూ సారాంశం.


దేశ‌మంతా ప‌ర్య‌టిస్తున్నారు. ఎలాంటి స్పంద‌న వ‌స్తోంది?

మీరు మంచి సినిమా చేశారు అన‌డం మామూలు.  కంగ్రాట్స్ చాలా మంచి సినిమా చేశార‌ని గ్రీటింగ్స్ చెబుతున్నారు.


మేజర్ సందీప్ బ‌యోపిక్ చేయాల‌ని ఎప్పుడు అనిపించింది?

26/11 సంఘ‌ట‌న‌లు జ‌రిగాక ఆయ‌న ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాక మా క‌జిన్ ప‌వ‌న్ నాకూ సందీప్‌కు పోలిక‌లు వున్న‌య‌ని చెప్పాడు. వందలాది మంది ప్రాణాలు కాపాడిన ఆయ‌న‌కు అశోక్ చ‌క్ర వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న గురించి చ‌దివి ఆయ‌న‌కు ఫ్యాన్ అయ్యాను. ఆయ‌న నిజ‌జీవితంలో జ‌రిగిన విష‌యాలు ఎవ‌రికీ తెలీవు. హోట‌ల్‌లో 36 గంట‌లు ఏం చేశాడ‌నేది తెలుసు. కానీ 31 సంవ‌త్స‌రాల‌లో ఆయ‌న జీవితం ఎలా వుంద‌నేది ఎవ‌రికీ తెలీదు. ఇవ‌న్నీ నేను తెలుసుకున్నాక ఆయ‌న లైఫ్ గురించి ఎందుకు చెప్ప‌కూడ‌ద‌నే ఆలోచ‌న వ‌చ్చింది. క్ష‌ణం సినిమా టైంలో ఆలోచ‌న స్టార్ట్ అయింది. గూఢచారి టైంలో స్పీడ్ అందుకుంది.


మ‌న ఇండియాలో 31 ఏళ్ళ‌కు మ‌ర‌ణించిన భ‌గ‌త్‌సింగ్ వంటివారు కొంద‌రే తెలుసు? ఆయ‌న‌తో పోల్చ‌వ‌చ్చా?

మ‌న‌కు చిన్న‌ప్పుడు గాంధీ, భ‌గ‌త్ సింగ్ ల గురించి తెలుసు. కానీ మేజ‌ర్ గురించి బెంగుళూరు, ముంబై, ఢిల్లీలో బుక్ స్టాల్స్‌లో అడుగుతున్నారు.


గొప్ప క‌థ‌ను సినిమాలో చూపించ‌డం క‌ష్టం అనిపించిందా?

సాధార‌ణంగా బ‌యోపిక్‌లు పొడిపొడిగా ట‌చ్ చేస్తారు. కానీ ఇక్క‌డ సినిమాకు స‌రిప‌డే గొప్ప క‌థ వుంది. హీరోకు భ‌జ‌న కొట్టే క‌థ‌కాదు. మామూలు బ‌యోపిక్‌ల‌కు భిన్నంగా వుండే క‌థ ఇది. ఆయ‌న కొన్ని ప‌నులు చేశారు అంటే ఇప్పుడు చాలామంది న‌మ్మ‌క‌పోవ‌చ్చు. చాలా నెగెటివ్‌లు వ‌స్తుంటాయి. కానీ వాటిని న‌మ్మ‌బుద్ధి వేయ‌దు.


ఆయ‌న గురించి చాలా లోతుగా తెలుసుకున్నాక షాకింగ్ కు గుర‌యిన సంఘ‌ట‌న మీకు ఏమైనా వుందా?

ఓ సంఘ‌ట‌న వుంది. ఇండియ‌న్ ట్రైనింగ్ సెంట‌ర్‌లో శిక్ష‌ణ తీసుకుని తిరిగి ట్రైన్‌లో ఇంటికి వెళుతుండ‌గా సందీప్ ఫ్రెండ్‌కూడా వున్నాడు. త‌ను అస్సాం వెళుతున్నాడు. సందీప్ బెంగుళూరు వెళ్లాలి .ఆ స‌మ‌యంలో ఆయ‌న ఫ్రెండ్ నా ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవు అని అడ‌గ‌డంతో త‌న జేబులోని వున్న మొత్తం ఇచ్చేశాడు. ఆ త‌ర్వాత సందీప్ బెంగుళూరు వ‌చ్చేవ‌ర‌కు ప్ర‌యాణంలో ఏమీ తిన‌లేదు. తాగ‌లేదు. మిల‌ట్రీ మ‌నిషి కాబ‌ట్టి ఎవరినీ ఏమీ అడ‌గ‌కూడ‌దు అనే రూల్ వుంటుంది. కానీ ఇలాంటి సంఘ‌ట‌న చెబితే న‌మ్ముతారోలేదో అని పెట్ట‌లేదు.


ఆయ‌న లైఫ్‌లో ముంబై దాడులే తెలుసు? ఆయ‌న లైఫ్ గురించి చాలామందికి తెలీదు. అందుకే జ‌నాల‌కు ఫ్రెష్ సినిమా అనిపిస్తుందా?

మేం సినిమా చేస్తున్నాం అని ప్ర‌క‌టించాక చాలామంది 26/11 చూసేశాంక‌దా అన్నారు. కానీ ట్రైల‌ర్ రిలీజ్ అయ్యాక అంద‌రూ షాక్ అయ్యారు. ఆయ‌న జీవితంలో ఇంత వుందా? అని ఆశ్చ‌ర్య‌పోయారు.


బాలీవుడ్‌లో తీయ‌లేని సందీప్ బ‌యోపిక్ మీరు చేయ‌డం ఎలా అనిపిస్తుంది?

బాలీవుడ్‌లో తీయ‌లేదు అనికాదు కానీ. సందీప్ త‌ల్లిదండ్రుల‌కు వారు న‌చ్చ‌లేదు. ఎందుకంటే బాలీవుడ్ వారు, మ‌ల‌యాళంవారు తీస్తామ‌ని ముందుకు వ‌చ్చారు. కానీ హీరోలు త‌మ కొడుకులా లేర‌ని సున్నితంగా ఆయ‌న త‌ల్లి తిర‌స్క‌రించారు. న‌న్ను చూడ‌గానే చాలా హ్యాపీగా ఫీల‌య్యారు. నేను ఆమెను అమ్మా అని పిలుస్తుంటాను.


ఈ సినిమా తీయ‌డంలో మీకు ఎదురైనా ఛాలెంజ్‌లు ఏమిటి?

కోవిడ్ టైంలో ప్ర‌తిసారీ ఈ సీన్ బాగా చేద్దాం అని ప్లాన్ వేసుకుని చేస్తుంటాం. కొద్దిరోజులు చేశాక కోవిడ్ రావ‌డంతో చాలా లిమిటేష‌న్‌ను క్రియేట్ చేసింది.


మేకింగ్‌లో బిగ్జెస్ట్ ఛాలెంజ్ ఏమిటి?

టూమ‌చ్ ఛాలెంజ్‌లు వున్నాయి. ఇంకా ఈ సీన్ పెడితే బాగుండేది క‌దా అనిపించేది.రెండు  గంట‌లు అనేది లిమిటేష‌న్‌. 31 సంవ‌త్స‌రాల క‌థ‌ను కొన్ని సంద‌ర్భాల‌లో కొంత క‌ల్పితానికి వెళ్ళాల్సి వ‌చ్చింది. ఇందులో ఐదు సంఘ‌ట‌న‌లు ఒకే సీన్‌లో చూపించాల్సి వ‌చ్చింది. ఏది చెప్పినా కూడా సోల్‌లో ట్రూత్ ఉందా లేదా? ఆయ‌న ఫీల్ అయింది చూపించామా లేదా అనేది మాకు ఛాలెంజ్‌గా అనిపించింది.


ఇలాంటి క‌థ‌కు హీరోయిన్ కు ఎంత ప్రాధాన్య‌త వుంది?

సాయి మంజ్రేక‌ర్‌, శోభితా ధూళిపాళ ఇద్ద‌రు హీరోయిన్లు వున్నారు. తెలుగులో పాట‌లు వుంటేనే హీరోయిన్ వుంటార‌నే టాక్ వుంది. కానీ సందీప్ లైఫ్‌లో ఒక‌రు ప్ర‌జెంట్‌, ఒక‌రు ఫాస్ట్‌లో వున్నారు. ఆయ‌నంటే చాలామంది లేడీస్‌కు క్ర‌ష్ వుండేది. ఆయ‌న చిన్న‌త‌నం నుంచి స్కూల్, ఉద్యోగం, పెండ్లి అనేది ఒక భాగ‌మైతే, కాశ్మీర్‌, కార్గిల్ అనేది మ‌రో భాగం.


మ‌హేష్‌బాబు నుంచి ఎలాంటి స‌పోర్ట్ ల‌భించింది?

డేరింగ్‌గా సినిమా తీశామంటే మ‌హేష్‌బాబే కార‌ణం. ప్రీరిలీజ్‌కుముందే ఆడియ‌న్స్‌కు సినిమా చూపించి ప్రీ రిలీజ్ చేయ‌డం అనేది గొప్ప విష‌యం. అంత ఓపెన్ గా వుండి జ‌నాల రియాక్ష‌న్ నుంచి నిర్ణ‌యం తీసుకున్నాం. అది మ‌హేష్‌బాబుగారి ఎంక‌రేజ్ మెంట్‌.


షూట్ స‌మ‌యంలో సైనికుల క‌ష్టాలు, అక్క‌డి వాతావ‌ర‌ణం చూశాక వ్య‌క్తిగా ఎలా అనిపించింది?

లాస్ట్ సీన్ చిట్‌కూర్ అనే ఊరిలో తీశాం. అక్క‌డ జ‌నాలు 200మంది వుంటారు. ప‌గ‌లు మైన‌స్ 3 డిగ్రీలు వుంటుంది. రాత్రి మైన‌స్ 15వ‌ర‌కు వుంటుంది. ఇలాంటి ప్లేస్లో హీట‌ర్‌, బ్లాంకెట్స్ వుంచుకుంటాం. కానీ అవేవీలేకుండా సైనికులు గ‌న్ ప‌ట్టుకుని వుండ‌డం నాకు చాలా గొప్ప‌గా అనిపించింది. ఇంత‌కుముందు క‌థ‌లుగా చ‌దివాను. కానీ వాస్త‌వంగా నేను చూశాను.


ఈ సినిమాకు విఎఫ్‌.ఎక్స్ షాట్స్ చాలానే పెట్టారు?

అవును. 2,478 విఎఫ్‌.ఎక్స్ షాట్స్ వుంటాయి. అవి సినిమాలో చూస్తే మీకు అర్థ‌మ‌వుతుంది.


శ‌శికిర‌ణ్ తిక్క‌కు ఇది రెండో సినిమా. బ‌యోపిక్ అనేది పెద్ద బాధ్య‌త క‌దా న్యాయం చేశారా?

నాకు వున్న భావాల్ని జ‌నాలు ఫీల్ అయ్యేలా చేసేది ద‌ర్శ‌కుడే. ఆయ‌న చేయ‌బ‌ట్టే ఇంట‌ర్‌నేష‌న‌ల్ లుక్ వ‌చ్చింది. మంచి సినిమాకు అనుభ‌వం కాదు. టాలెంట్ కావాలి. అది ఆయ‌న‌లో చాలా వుంది.


ఈ జ‌ర్నీలో ఎప్పుడైనా మిల‌ట్రీకి వెళితే బాగుంటుంది అని అనిపించిందా?

నేను పెరిగింది అమెరికాలోనే.  ఇండియాలో ఆగ‌స్టు 15న స్కూల్ ప్రోగ్రామ్‌లో దీని గురించి మాట్లాడుతుంటారు. కానీ నేను ఇండియా గురించి ఎక్కువ‌గా తెలుసుకుంది అమెరికాలోనే. ఎ.ఆర్‌. రెహ‌మాన్ పాడిన జాతీయ గీతం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా లేచి నిల‌బ‌డేవాడిని. నాకు స్కూల్‌లో ఇండియా గురించి పెద్ద‌గా చెప్ప‌లేదు. అందుకే డిఫ‌రెంట్ అనుభ‌వం నాకుంది.


సందీప్ జీవితంలో అన్నీ పిక్చ‌రైజేష‌న్ చేశారా?

అన్నీ తీయాలంటే స‌మ‌యం స‌రిపోదు. స్కూల్ డేస్‌, క‌శ్మీర్‌, తాజ్ సంఘ‌ట‌న‌తోపాటు చిన్న‌త‌నంలో అమ్మ‌తో కూర్చుని పాయ‌సం తిన‌డం, స్కూల్ ఎగ్గొట్టి సినిమాలు చూడ‌డం, ఐస్ క్రీమ్‌లు తిన‌డం, నాన్న‌గారితో టైప్ రైటింగ్ గురించి మాట్లాడ‌డం. ఇవ‌న్నీ ఆయ‌న లైఫ్‌లో తీసుకున్న పెద్ద నిర్ణ‌యాలే. గొప్ప మ‌నుషులు గొప్ప మాట‌ల‌తో పుట్ట‌రు. వారు చేసే ప‌నివ‌ల్ల గొప్ప మ‌నిషి అవుతారు.


ఈ సినిమాలో సంగీతానికి ఎంత ప్రాధాన్య‌త వుంది?

శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల మంచి సంగీతం ఇచ్చారు. నిన్నేకోరేనే.. హృద‌యమా పాట‌లు ట్రెండ్ అయ్యాయి. అందులో ఒక‌టి ఆర్మాన్ పాడిన విధానం నాకు `బుట్టబొమ్మ` పాడిన ఫీలింగ్ వ‌చ్చింది. శ్రీ‌చ‌ర‌ణ్ పాట‌లు ఇళ‌య‌రాజాలా వుంటాయి. బ్యాక్ గ్రౌండ్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ స్తాయిలో వుంటుంది.


ఈ సినిమా మీ స్థాయిని పెంచేదిగా వుంటుందా?

మేజ‌ర్ సందీప్ ఆల్ ఇండియా మ‌నిషి క‌థ‌. నేను కూడా ఆ స్థాయికి చేరుకునేలా వుంది. పాన్ ఇండియా కాదు. ఆల్ ఇండియా సినిమా ఇది. ఆయ‌న బెంగుళూరు, హైద‌రాబాద్‌, క‌శ్మీర్ ఇలా అన్ని ప్రాంతాల‌కు వెళ్లారు. అందుకే ఈ సినిమా అన్ని ఏరియాల‌కు తీసుకెళ్ళాల‌నే త‌ప‌న‌వుంది.


మ‌హేష్‌బాబు సినిమా చూశాక ఏమ‌న్నారు?

ఆల్‌రెడీ ఆయ‌న ఇచ్చిన రివ్యూ టెలికాస్ట్ అయింది. సినిమా చూశాక గొంతు ఎడిపోయింది. క‌న్నీళ్ళు పెట్టి కౌగిలించుకుని గ‌ర్వంగా వుంద‌ని చెప్పారు.


షూట్ లో ఎ.ఎం.బి. బేన‌ర్ స‌హ‌కారం ఎంత‌మేరు వుంది?

న‌మ్ర‌త‌గారు ప్రొడ‌క్ష‌న్ ప‌రంగా చాలా స‌పోర్ట్ చేశారు.


సినిమాలో ప్ర‌కాష్‌రాజ్‌, రేవ‌తి పాత్ర‌లు ఎలా వున్నాయి?

ప్ర‌కాష్‌రాజ్‌గారికి బెంగుళూరులో సందీప్ ఫాద‌ర్ తెలుసు. మేం ఆయ‌న‌నుంచి ఎన్నో విష‌యాలు తెలుసుకున్నాం. రేవ‌తిగారు బాగా న‌టించారు. ఇద్ద‌రూ మంచి పెర్‌ఫార్మ‌ర్స్ ఇచ్చార‌ని మ‌హేష్‌బాబు చెప్పారు.


మేజ‌ర్ రిలీజ్ టైంలో హిందీలో పృధ్వీరాజ్‌, త‌మిళంలో క‌మ‌ల్ `విక్ర‌మ్‌` వ‌స్తున్నాయి ఎలా అనిపిస్తుంది?

నాకు చాలా ఆనందంగా వుంది. చిన్న‌ప్పుడు నా ఫేవ‌రేట్ సినిమా `వ‌సంత కోకిల‌`. అలాగే అక్ష‌య్ కుమార్ సినిమాల్లోని పాట‌లు నేను స్కూల్‌లో డాన్స్‌లు వేసేవాడిని. ఇద్ద‌రూ నా అభిమానులే. పృధ్వీరాజ్‌, విక్ర‌మ్ పెద్ద బ‌డ్జెట్ సినిమాల‌యితే తెలుగులో మేజ‌ర్ పెద్ద బ‌డ్జెట్ ఫిలిం.


క్ష‌ణం, గూఢ‌చారి వంటి థ్రిల్ల‌ర్ క‌థ‌లే చేస్తున్నారు. ల‌వ్ సినిమాలు చేసే ఆలోచ‌న వుందా?

అన్ని సినిమాల్లోనూ ల‌వ్ స్టోరీ వుంటుంది. మేజ‌ర్‌లో కూడా వుంది. రేపు గూఛ‌చారి2లోనూ వుంటుంది.


ఫైన‌ల్‌గా మేజ‌ర్ గురించి మీరు చెబుతారు?

నాకు మేజ‌ర్ సందీప్ పాత్ర ష‌న్‌షైన్ లాంటిది. ఆయ‌న సూర్య‌పుత్రుడు. తాజ్‌లో సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు సందీప్ లోప‌లికి రాగానే సూర్య‌పుత్రుడు వ‌చ్చిన ఫీలింగ్ క‌లిగింది అని ఆయ‌న కాపాడిన ఒక‌రు చెప్పారు. మిల‌ట్రీ అంటే సీరియ‌స్గా వుంటారు అనుకుంటాం. కానీ ఆయ‌న చాలా జోవియ‌ల్‌గా వుంటాడు


Share this article :