Latest Post

ReddyGari Intlo Rowdyism Trailer Launched by Hero Srikanth

 శ్రీకాంత్ చేతుల మీదుగా విడుద‌లైన ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ ట్రైలర్



సిరి మూవీస్ బ్యాన‌ర్‌పై ర‌మ‌ణ్ క‌థానాయ‌కుడిగా కె.శిరీషా ర‌మ‌ణా రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ . ఈ సినిమాను ఏప్రిల్ 8న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు. ఎం.ర‌మేష్‌, గోపి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్రియాంక రౌరీ, పావ‌ని, అంకిత‌, వ‌ర్ష హీరోయిన్స్‌. సీనియ‌ర్ న‌టుడు వినోద్ కుమార్ విల‌న్‌గా న‌టించారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్‌, సాంగ్స్‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించాయి.  సోమ‌వారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను సీనియ‌ర్ హీరో, విల‌క్ష‌ణ న‌టుడు శ్రీకాంత్ విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో హీరో ర‌మ‌ణ్‌తో పాటు ర‌ద్శ‌కులు ర‌మేష్‌, గోపి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా...


హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘దర్శకులు రమేష్, గోపిలతో మంచి అనుబంధం ఉంది. వారి కాంబోలో రూపొందిన చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డం హ్యాపీగా ఉంది. ఏప్రిల్ 8న విడుద‌ల‌వుతున్న ఈ చిత్రం పెద్ద విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాతో హీరోగా, నిర్మాత‌గా ఎంట్రీ ఇస్తున్న ర‌మ‌ణ్‌కు సినిమా పెద్ద స‌క్సెస్ కావాలి. త‌ను మ‌రిన్ని మంచి సినిమాలు చేయాల‌ని మ‌నస్ఫూర్తిగా కోరుకుంటూ యూనిట్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను’’ అని తెలిపారు.


హీరో ర‌మ‌ణ్ మాట్లాడుతూ ‘‘నాకు హీరో శ్రీకాంత్‌గారంటే ఎంతో అభిమానం నేను హీరోగా చేసిన చిత్రం ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ ట్రైల‌ర్ ఆయ‌న చేతుల మీదుగా విడుద‌ల‌వ‌డం అనేది ఎంతో హ్యాపీగా ఉంది. ద‌ర్శ‌కులు ర‌మేష్‌, గోపి క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ను అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా తెర‌కెక్కించారు. ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుద‌ల చేస్తున్నాం’’ అన్నారు.


చిత్ర ద‌ర్శ‌కులు ర‌మేష్, గోపి మాట్లాడుతూ ‘‘ఇండ‌స్ట్రీలో వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి శ్రీకాంత్‌గారితో మంచి రిలేష‌న్ ఉంది. ఆయన మా సినిమా ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసి యూనిట్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేసినందుకు ఆయ‌న‌కు స్పెష‌ల్ థాంక్స్‌. ఏప్రిల్ 8న సినిమా రిలీజ్ అవుతుంది’’ అన్నారు.




నటీనటులు:

ర‌మ‌ణ్‌, ప్రియాంక రౌరీ, పావ‌ని, అంకిత‌, వర్ష, వినోద్ కుమార్‌, ర‌చ్చ ర‌వి, మిర్చి మాధ‌వి, జూనియ‌ర్ బాల‌కృష్ణ‌, శంక‌ర్‌, కృష్ణ‌, ప్ర‌కాష్ అడ్డా, వెంక‌ట్‌, సిద్ధు తది తరులు


సాంకేతిక బృందం:

ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ఎం. ర‌మేష్‌, గోపి

నిర్మాత‌:  కె. శిరీషా ర‌మ‌ణారెడ్డి

బ్యాన‌ర్‌:  సిరి మూవీస్‌

స‌మ‌ర్ప‌ణ‌:  కొరివి పిచ్చిరెడ్డి, స‌ర‌స్వ‌తి

రిలీజ్‌:  స్క్రీన్ మ్యాక్స్ పిక్చ‌ర్స్‌

సంగీతం: మ‌హిత్ నారాయ‌ణ్‌

బ్యాగ్రౌండ్ స్కోర్‌: శ్రీ‌వ‌సంత్‌

సినిమాటోగ్ర‌ఫీ: ఎ.కె. ఆనంద్‌

ఎడిటింగ్‌: శ్రీ‌నివాస్ పి. బాబు, సంజీవ‌రెడ్డి

ఆర్ట్‌: న‌రేష్ సిహెచ్‌.

ఫైట్స్‌: అల్టిమేట్ శివ‌, కుంగ్‌ఫూ చంద్రు

కొరియోగ్ర‌ఫీ:  చందు రామ్‌, రాజ్ పైడి, సాయిశివాజీ

Darja Song Launched by Darsakendra K Raghavendra Rao

 దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు చేతుల మీదుగా ‘దర్జా’ పాట విడుదల



కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని మొదటి పాటను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తాజాగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సలీమ్ మాలిక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘దర్జా’ చిత్రంలోని పాటను విడుదల చేయడం జరిగింది. పాట చాలా బాగుంది. చాలా రిచ్‌గా చిత్రీకరించారు. చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్. ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వర్యులు కామినేని శ్రీనివాస్, చిత్ర నిర్మాత శివశంకర్ పైడిపాటి, కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటితో పాటు స్ర్కిఫ్ట్‌ కో-ఆర్డినేటర్ పురుషోత్తపు బాబీ, రైటర్ భవానీ ప్రసాద్, ఆర్టిస్ట్ సమీర్ తదితరులు పాల్గొన్నారు


ఈ సందర్భంగా కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటి మాట్లాడుతూ.. ‘‘మా ‘దర్జా’ చిత్రంలోని సాంగ్‌ని విడుదల చేసి, ఆశీస్సులు అందించిన దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావుగారికి మా టీమ్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తున్న కామినేని శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. త్వరలోనే ‘దర్జా’ విడుదల వివరాలను తెలియజేస్తాము..’’ అని అన్నారు.


సునీల్, అనసూయ, ఆమని, పృథ్వీ, అక్సాఖాన్, షమ్ము, అరుణ్ వర్మ(సత్తిపండు), శిరీష, షకలక శంకర్, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్, నాగ మహేష్, షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, సమీర్, రామ్ సర్కార్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి...

కెమెరా: దర్శన్,

సంగీతం: రాప్ రాక్ షకీల్,

ఎడిటర్: ఎమ్.ఆర్. వర్మ,

కథ: నజీర్,

మాటలు: పి. రాజేంద్రకుమార్, నజీర్, భవానీ ప్రసాద్,

ప్రొడక్షన్ డిజైనర్ : బందర్ బాబీ,

స్ర్కిఫ్ట్ కో-ఆర్డినేటర్: పురుషోత్తపు బాబీ,

పీఆర్ఓ: బి. వీరబాబు,

కో & ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌: రవి పైడిపాటి,

నిర్మాత: శివశంకర్ పైడిపాటి,

స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సలీమ్ మాలిక్.


ZEE5 announces new Original titled 'Aha Naa Pellanta'

 ZEE5 announces new Original titled 'Aha Naa Pellanta'



The romantic-comedy stars Raj Tarun, Shivani Rajasekhar


Hyderabad, April 4th, 2022: ZEE5 has announced a new Original. Titled 'Aha Naa Pellanta', it is a romantic comedy entertainer whose premise is curious. A young man, who has been itching to tie the knot for a long time, finally finds a suitable match. But, just as he is about to tie the knot, the bride elopes with her boyfriend. How the groom mounts a revenge is what the ZEE5 Original is about.

Jointly produced by ZEE5 and Tamada Media, the web series stars Raj Tarun and Shivani Rajasekhar in the lead. 'ABCD' director Sanjeev Reddy is wielding the megaphone. Rahul Tamada and Saideepreddy Burra are producing the same. The Original's puja event was held on Sunday in Rajahmundry's Garimella Satyanarayana (training college). The event was attended by Margani Bharat (parliamentarian), former MP Undavalli Arun Kumar, Chandana Nageshwar Rao, Kundala Durgesh, Adireddy Vasu, Gadamshetty Sridhar, while ZEE5 was represented by Poorna Pragna, Radhakrishna Veni and others.

Speaking on the occasion, ZEE5 and Tamada Media said that the web series will be shot in Rajahmundry and surrounding areas for 15 days. "This is Raj Tarun's OTT debut. These days, actors across languages are doing web series. Recently, actor Sushanth came on board for a ZEE5 original. And now, it is Raj Tarun's turn. 'Aha Naa Pellanta' shows a new aspect of love. Comedy, drama and romance will be its major features. There will be 8 episodes in total, each of the duration fo 30 minutes," they added.

Director Sanjeev Reddy said, "The bride elopes with her boyfriend on her wedding day. The groom is condemned to keep waiting for her to arrive, holding the Mangal Sutra in his hands. How he avenges the dejection is what the web series is about. I thank ZEE5 and Tamada Media for this opportunity."

Cast: Raj Tarun, Shivani Rajasekhar, Amani, Harshavardhan, Posani Krishna Murali, Getup Srinu, Jabardash Rajamouli, Tagubothu Ramesh, Madhunandhan, Bhadram, Raghu Karamanchi, Dorababu. 

Crew: Producers: Rahul Tamada, Saideepreddy Burra, Director: Sanjeev Reddy, Music Director: Judah Sandhy, Cinematographer: Nagesh Banell, Story, screenplay: Dawood Sheik, Dialogues: Kalyan Raghava, Lyrics: Raghuram

Editing: Madhu G Reddy, Production Design: Divya Reddy, Art Direction: PS Varma, Costumes: Lanka Santoshi

Hero Ashok Galla Interview

మ‌హేష్‌ బాబు నుంచి నేర్చుకున్న‌వి అవే - అశోక్ గ‌ల్లా


మురారి లాంటి సినిమా చేయాల‌నుంది - అశోక్ గ‌ల్లా



మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపీ జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడే అశోక్ గ‌ల్లా. ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త కూడా అయిన జ‌య‌దేవ్ ఇంటి నుంచి అమ‌ర్‌ రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థ నుంచి వ‌చ్చిన సినిమా `హీరో`. అశోక్ గ‌ల్లా క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. కౌబాయ్ నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమాతో అశోక్ గ‌ల్లాకు న‌టుడిగా మంచి గుర్తింపు వ‌చ్చింది. ఈ సినిమా థియేట‌ర్‌ లోనూ ఓటీటీలోనూ విడుద‌లై న‌టుడిగా త‌న‌కెంతో సంతృప్తినిచ్చింద‌ని అశోక్ గ‌ల్లా తెలియిజేస్తున్నారు. ఓటీటీలో వ‌స్తున్న అభినంద‌న‌లు కొత్త ఉత్సాహానిచ్చాయ‌ని తెలియ‌జేస్తూ, తాను చేయ‌బోయే కొత్త సినిమా జూన్‌ లో వెల్ల‌డిస్తాన‌ని పేర్కొన్నారు. రేపు ఆయ‌న పుట్టిన‌రోజు ఈ సంద‌ర్భంగా సోమ‌వారంనాడు  అశోక్ గ‌ల్లా తో జ‌రిపిన ఇంట‌ర్వ్యూ విశేషాలు.


 


కొత్త గెట‌ప్‌ లో క‌నిపిస్తున్నారు. ఏదైనా కొత్త సినిమా కోస‌మా?


హీరో స‌క్సెస్ త‌ర్వాత తిరుప‌తి వెళ్ళాను. అందుకే ఈ గెట‌ప్ క‌నిపిస్తుంది.


హీరో సినిమా స‌క్సెస్‌ ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?


హీరో స‌క్సెస్‌ ను వృత్తిప‌రంగా సంతృప్తి చెందాను. సినిమాలో హీరోగా నిల‌బ‌డాల‌ని అనుకున్న‌ప్పుడు వ‌చ్చిన స‌క్సెస్ ఇది. ఇప్పుడు త‌ర్వాత ఏమి చేయాల‌నేది ఆలోచిస్తున్నాను.


హీరో క‌థ‌ను ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ చెప్పిన‌ప్పుడు ఎలా అనిపించింది?


నేను మంచి క‌థ‌తో రావాల‌నుకున్నాను. ఆ స‌మ‌యంలో అనుకోకుండా శ్రీ‌రామ్ వ‌చ్చి భోజ‌నం టైంలో క‌థ చెప్పారు. అది విన్న‌వెంట‌నే ఇదే క‌దా మ‌నం చేయాల్సింది అనిపించింది. వెంట‌నే ఓకే చెప్పేశాను. ఆ త‌ర్వాత ఆయ‌న ఆఫీస్‌కూడా తీయ‌డం ప‌నులు జ‌ర‌గ‌డం చ‌కచ‌కా జ‌రిగిపోయాయి.


మ‌ళ్ళీ ఆయ‌న‌తో సినిమా చేసే అవ‌కాశం వుందా?


ప్ర‌స్తుతం వేరే సినిమా చేయాల‌నుకుంటున్నాను. అవ‌కాశం వుంటే త‌ప్ప‌కుండా చేస్తాను.


హీరో సినిమా చూశాక ఇంకా ఏమైనా కొత్త‌గా చేస్తే బాగుంటుంద‌నిపించిందా?


ఇది న్యూ ఏజ్ స్టోరీ. ఈ క‌థ‌ను కామెడీగా చూపించాం. సీరియ‌స్‌గానూ కామెడీ లేకుండా చేయ‌వ‌చ్చు. ప్రోగ్రెసివ్ స్టోరీ క‌నుక తెలుగు ఫార్మాట్ లో చేయ‌డం వ‌ల్ల కొత్త కిక్ ఇచ్చేలా చేశాం.


త‌దుప‌రి మీ బేన‌ర్‌ లోనే సినిమా వుంటుందా?


బ‌య‌ట బేన‌ర్‌ లో వుండ‌బోతోంది. త్వ‌ర‌లో వివ‌రాలు తెలియ‌జేస్తాను.


హీరో సినిమా విడుద‌ల‌య్యాక మీర‌నుకున్న‌ది ఫుల్‌ఫిల్ అయిందా?


సంక్రాంతికి రావాల్సింది రాలేదు. అప్పుడ‌యితే  ప్రేక్ష‌కులు బాగా వ‌చ్చేవారు. అందుకే ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా రాలేద‌నే కొద్దిగా నిరుత్సాహం వుంది. మేం విడుద‌ల తేదీని చూసేట‌ప్పుడు అన్ని అంశాలు చూసుకున్నాం. క‌రోనా మార్చిలో ఎక్క‌వ‌వుతుంది అనుకున్నాం. కానీ జ‌న‌వ‌రిలోనే బాగా ఎక్కువ‌యింది. ఏదైనా ప్రేక్ష‌కులు సేఫ్టీని దృష్టిలో పెట్టుకోవాలి క‌దా అందుకే పెద్ద‌గా ఫీల్‌ కాలేదు.


హీరో సినిమా చూశాక మ‌హేష్‌బాబు రెస్పాన్స్ ఎలా వుంది?


మ‌హేష్‌బాబు సినిమా చూశాక‌,  ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు.. అన్నారు. కేవ‌లం ఈ సినిమా గురించే చెప్పారు.  అదేవిధంగా కంటిన్యుటీ లో చిన్న‌పాటి త‌ప్పిదాలు వుంటే చెప్పేరు.


ఓటీటీ విడుద‌ల త‌ర్వాత ఆడియ‌న్స్ స్పంద‌న ఎలా అనిపించింది?


ఓటీటీ విడుద‌ల నాకు సెకండ్ రిలీజ్‌ లా అనిపించింది. అప్పుడే చాలా అభినంద‌న‌లు ద‌క్కాయి. ఇంకా హంగామా జ‌రిగిన‌ట్లుంది. థియేట‌ర్‌ లో రిలీజ్ చేసేముందు రెండు నెల‌లు ప్ర‌మోష‌న్‌ కు స‌రిపోయింది.


న‌ట‌న‌ప‌రంగా ఎటువంటి ప్ర‌శంస‌లు ద‌క్కాయి?


పెర్ ఫార్మెన్స్ ప‌రంగా మెచ్చుకుంటుంటే నాపై నాకే న‌మ్మ‌కం వ‌చ్చేసింది. మోటివేషన్ ఎక్కువ‌యింది. మ‌నం చేసింది బాగానే వుంది అంటున్నారు కాబ‌ట్టి ఇంకా ఎక్కువ చేయాల‌నే ఎన‌ర్జీతోపాటు ఎంకరేజింగ్ గా అనిపించింది.


హీరోగా మీకిది రెండో పుట్టిన‌రోజా?


కాదు. రెండేళ్ళు క‌రోనావ‌ల్లే సెట్‌ లో గ‌డిచిపోయాయి. ఇది మూడో పుట్టిన‌రోజు.


హీరోగా కెరీర్ ఎలా వుండ‌బోతోంది అనుకుంటున్నారు?


న‌టుడిగా ఇంకా మంచి పేరు తెచ్చుకోవాల‌నుంది. హీరో సినిమా న‌టుడిగా ప్రూవ్ అయ్యాక ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. త‌ర్వాత క‌థ‌లు, పాత్ర‌లు అనేవి కొత్త‌గా వుండేలా చూసుకోవాలి.


క‌మ‌ర్షియ‌ల్ హీరోగా నిల‌బ‌డాల‌నుందా?


క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే కాదు. అన్ని జాన‌ర్స్ చేయాల‌నుంది. ఫైటింగ్‌, డాన్స్ అనేది చేయ‌గ‌ల‌ను. న‌టుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాల‌న్న‌దే నా కోరిక‌.


ఓటీటీలో చూశాక ఏదైనా కొత్త‌గా అనిపించిందా?


ఎడిటింగ్‌ లోనే సినిమాను చాలా సార్లు చూశాను. రిలీజ్‌కు ముందు వంద‌సార్లు చూశాను. అందుకే ఓటీటీలో చూశాక పెద్ద‌గా తేడా అనిపించ‌లేదు.


క‌రోనావ‌ల్ల మొద‌ట సినిమా ఆల‌స్య‌మైంది. ఇప్పుడు స్పీడ్ పెంచుతారా?


ప్ర‌తి సినిమా రెండేళ్ళు చేయాలంటే క‌ష్ట‌మే. అందుకే సినిమాలు పెంచాల‌ని అనుకుంటున్నా.


కొత్త సినిమా వివ‌రాలు?


రెండు, మూడు సినిమాలు రెడీగా వున్నాయి. ఏద‌నేది ఫైన‌ల్ అయ్యాక జూన్‌ లో తెలియ‌జేస్తాను.


ఎలాంటి జోన‌ర్‌లో వుండ‌బోతోంది?


క‌మ‌ర్షియ‌ల్ కామెడీ చేసేశాను. కాబ‌ట్టి క‌థ‌లో డెప్త్ వుండేవి చేయాల‌నుంది. ఇంటెన్సిటీ ఉండే క‌థ‌లే చేయాల‌నుకుంటున్నా.


మీకు న‌టుడిగా స్పూర్తి ఎవ‌రు?


ఇంకెవ‌రు.. మ‌హేష్‌బాబు గారే. నేను పెరిగింది ఆయ‌న సినిమాలు చూసే. న‌ట‌న వాతావ‌ర‌ణం అంతా నా చుట్టూనే వుంది.


ఆయ‌న్నుంచి ఏం నేర్చుకున్నారు?


సెల్ప్ బిలీఫ్ అనేది మ‌హేష్‌గారికి బాగా తెలుసు. కాన్‌ఫిడెన్స్ అనేది మ‌నలోనే వుంటుంది. ఇవి ఆయ‌న్నుంచి నేర్చుకున్నా.


పాన్ ఇండియా సినిమాలు వస్తున్న త‌రుణంలో మీరు హీరోగా చేయ‌డం ఎలా అనిపిస్తుంది?


వాటి గురించి పెద్ద‌గా ఆలోచించ‌లేదు. తెలుగులోనే ప‌రిచ‌యం అవ్వాల‌నుకున్నాను. ప‌రిచ‌యం అయ్యా. ఇక్క‌డే వుండాల‌నుకుంటున్నా. పాన్ ఇండియా మార్కెట్ అనేది నిర్మాత చూసుకుంటారు. నేను ఒక‌చోట నిల‌బ‌డితే ఆ త‌ర్వాత పాన్ ఇండియా అనేది ఆలోచించాలి.


సూప‌ర్‌స్టార్ ఫ్యామిలీ నుంచి వ‌స్తున్నారు కాబ‌ట్టి ఏవైనా స‌ల‌హాలు ఫ్యామిలీలో ఇచ్చారా?


ఏదైనా హిట్, ప్లాప్ పైనే ఆధార‌ప‌డివుంటుంది. మంచి క‌థ‌లు, పాత్ర‌లు చేయ‌డ‌మే నా ముందున్న క‌ర్త‌వ్యం.


ఒత్తిడి ఏమైనా వుందా?


అలాంటిది ఇప్పుడు ఏమీ లేదు. మొద‌టి సినిమాకు ఏదైనా త‌ట్టుకోగ‌ల‌వా? అని ప్యామిలీలో అడిగేవారు. హీరో సినిమా రిలీజ్ టైంలో కొంచెం టెన్ష‌న్ గుర‌య్యాను. ఇప్పుడు అదేమీలేదు. త‌ర్వాత సినిమాపై దృష్టంతా వుంది.


యాక్టింగ్ స్కూల్‌ లో ఏం నేర్చుకున్నారు?


నేను ఏడ‌వ త‌ర‌గ‌తి సింగ‌పూర్ బోర్డింగ్ స్కూల్‌ లో చ‌దివాను. అలా 12వ త‌ర‌గ‌తివ‌ర‌కు వున్నా. అక్క‌డ సూల్లో యాక్టింగ్ కోర్సుకూడా ఓ భాగం. వెస్ట్ర‌న్ డ్రామా, షేక్స్‌ పియ‌ర్ డ్రామాలు క్లాస్‌ లో చెబుతుండేవారు. అక్క‌డే చాలా నేర్చుకున్నా.


రెండు రోజుల క్రితం ప‌బ్ ఇష్యూలో మీపేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఏమ‌నిపించింది?


నేను ఆరోజు ఫిజియో థెర‌పీ చేయించుకుంటున్నాను. సడన్ గా వార్త‌ల్లో నా పేరు ఎలా వ‌చ్చిందో తెలీదు. అప్పుడు హీరో అనే ఫీలింగ్ కలిగింది. సెల‌బ్రిటీ లైఫ్‌ లో వుంటే ఇలానే వ‌స్తుంటాయ‌నిపించింది.


కృష్ణ‌ గారు మీ హీరో సినిమాను ఎన్నిసార్లు చూశారు?


ఆయ‌న ఒక‌సారే చూశారు. కౌబాయ్ సినిమా కాబ‌ట్టి బాగా ఎంజాయ్ చేశారు. సినిమా చూశాక పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమా అని చెప్పేశారు.


ఈసారి పుట్టిన‌రోజు ఎలా సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు?


పెద్ద‌గా ఏమీ చేసుకోను. నా ఫ్యామిలీ తోనే సెల‌బ్రేష‌న్‌. అయితే ఈసారి 30వ పుట్టిన‌రోజు కాబ‌ట్టి స్నేహితుల‌తో చేసుకుంటాను.


మ‌హేష్‌బాబు సినిమాల్లో మీరు చేయాల‌నుకుంటే ఏ మూవీ చేస్తారు?


మురారి సినిమా. అలాంటి సినిమా మ‌ర‌లా రాలేదు. ముందుముందు కూడా రాదు.


బ‌ర్త్‌డే రిజ‌ల్యూష‌న్స్ వున్నాయా?


అంత డీప్‌గా ఆలోచించ‌లేదు.


వెబ్ సిరీస్ చేసే ఆలోచ‌న‌వుందా?


ఇప్ప‌టివ‌ర‌కు న‌న్ను ఎవ‌రూ అప్రోచ్ కాలేదు. మంచి క‌థ‌తో వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తా. వెబ్ సిరీస్ చేస్తే కొత్త సాటిస్‌ఫేక్ష‌న్‌గా వుంటుంది.


Allu Arjun celebrates son Ayaan’s birthday

 Allu Arjun celebrates son Ayaan’s birthday



Allu Arjun’s son Ayaan celebrated his 8th birthday recently with family and friends by his side, where he cut a customized Deadpool cake. Dad Allu Arjun played the perfect host. The Icon Staar always takes out time from his busy schedule to be there with his family – be it for their birthdays, anniversaries or school events. He maintains the perfect work-life balance and is known to be a family man. 


His mother Allu Sneha Reddy ensured that her son has the best birthday ever, with a little help from his sister Arha. The party was also attended by his grandfather Allu Aravind.



This is one of the few times when the Icon Staar celebrated the birthday of his son in Hyderabad. The family usually takes off to a foreign destination to bring in the birthday of Ayaan. Ayaan had a memorable birthday with a lot of adventure activities arranged at the party.

Sensational hero Vijay Deverakonda unveils 'Arere Arere' song from Panchathantram

 'Panchathantram': Sensational hero Vijay Deverakonda unveils 'Arere Arere' song



'Panchathantram', starring 'Kala Brahma' Brahmanandam, Samuthirakani, Swathi Reddy, Shivathmika Rajasekhar, young hero Rahul Vijay and 'Mathu Vadalara' fame Naresh Agasthya, is produced by Ticket Factory and S Originals. Written and directed by Harsha Pulipaka, it is produced by Akhilesh Vardhan and Srujan Yarabolu. Today, a song titled 'Arere Arere' from the movie was unveiled via sensational hero Vijay Deverakonda's social media handles.


Here are the initial lines from the song:


అరెరే అరెరే మాటే..రాదే.. మనసే పలికే క్షణములో...

పిలిచి అడిగి ఆరా తీ..సి  చనువే వెతికే వయసులో..

ఎదురు బదురు చేరే వేళ

నదురు బెదురు మామూ..లేనా.. తానే ఇపుడు గీత దాటేలా మో.. మాటలేనా... ఓహోహో హో..


Composed by Prashanth R Vihari and Shravan Bharadwaj, the song has been sung by Chinmayi Sripada and SP Charan. It is written by Kittu Vissapragada.


Speaking about the song, producers Srujan Yarabolu and Akhilesh Vardhan said, "Wedding songs have had a special place. They have impressed the Telugu audience time and again. 'Arere Arere', the latest lyrical video from our movie, is the kind of number music-lovers have been missing. Its lyrics, music and freshness will surely take them down a nostalgic path. The previous song 'Ye Ragamo' has clicked with the listeners. This is a special film where Brahmanandam garu, who has done several rib-tickling roles, is going to be seen in a new avatar. Besides a comedian, there is an amazing actor in him. He is someone who has acted in more than 1,000 films. Our film is currently in the post-production phase. We will be announcing the release date of 'Panchathantram' soon."


Cast: Brahmanandam, Samuthirakani, Swathi Reddy, Shivathmika Rajasekhar, Rahul Vijay, Naresh Agasthya, Divya Sripada, Srividya, Vikas, Adarsh Balakrishna and others.


Crew: PRO: Naidu Surendra Kumar-Phani Kandukuri (Beyond Media), Costume Designer: Ayesha Mariam, Editor: Garry BH, Cinematographer: Raj K Nalli, Production Controller: Sai Babu Vasireddy, Line Producer: Sunitha Padolkar, Executive Producer: Bhuvan Saluru, Creative Producer: Ushareddy Vavveti, Dialogues: Harsha Pulipaka, Lyrics: Kittu Vissapragada, Music Director: Prashanth R Vihari, Co-Producers: Ramesh Veeragandhan, Ravali Kalangi, Producers: Akhilesh Vardhan & Srujan Yarabolu, Writer, Director: Harsha Pulipaka


Producer Raj Kandukuri Launched Jagamerigina Satyam Motion Poster

 నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేసిన జగమెరిగిన సత్యం మోషన్ పోస్టర్ !!!



అమృత సత్యనారాయణ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 జగమెరిగిన సత్యం చిత్ర టైటిల్, మోషన్ పోస్టర్ ను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. అచ్చ విజయ భాస్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తిరుపతి పాలే దర్శకత్వం వహిస్తున్నారు. అవినాష్ వర్మ ఆద్య రెడ్డి, నీలిమ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుపుకుంటుంది. 



విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెలంగాణ నేపద్యంలో 1994 లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు తిరుపతి పాలే. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా నిర్మాత అచ్చ విజయ భాస్కర్ సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. మేలో సినిమాను థియేటర్స్ లో విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. 


ఈ సందర్భంగా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ...

జగమెరిగిన సత్యం టైటిల్ బాగుంది. మోషన్ పోస్టర్ గ్రాండ్ గా ఉంది. మంచి కథ కథనాలతో వస్తోన్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సినిమా సక్సెస్ అయ్యి చిత్ర యూనిట్ అందరికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాలని ఆశిస్తున్నాను అన్నారు.


నటీనటులు: అవినాష్ వర్మ, ఆద్య రెడ్డి, నీలిమ పతకమ శెట్టి


డైరెక్టర్: తిరుపతి పాలె

నిర్మాత: అచ్చ విజయ భాస్కర్ 

కెమెరామెన్: షోయబ్

ఎడిటర్: అమర్ రెడ్డి

మ్యూజిక్: సురేష్ బొబ్బిలి

ప్రొడక్షన్ డిజైనర్: శ్రీపాల్ మాచర్ల

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్ కుమార్ ఘటకల

పీఆర్ఓ: శ్రీధర్

Varalaxmi Sarathkumar starts shooting for Maha Movies multlingual " Sabari "

 Varalaxmi Sarathkumar starts shooting for Maha Movies multlingual " Sabari " 



Varalaxmi Sarathkumar will be seen in a never before role in "Sabari", a film, being produced by Mr. Mahendra Nath Kondla on Maha Movies banner and is being directed by Anilkatz. The film is being presented by Maharshi Kondla.


The multilingual project to be made in Telugu, Tamil, Malayalam and Hindi got an auspicious start on Ugadi day and regular shoot has been happening, since then. The makers have released a conceptual poster marking the start of the movie. The intriguing poster easily catches the attention of the viewers.


According to the makers, Sabari is an intriguing tale of love and crime, and is being touted as an intense Psychological thriller. Ganesh Venkatraman, Sashank Siddhamsetty, Mime Gopi are playing the other main roles. Gopi Sundar’s music is another major attraction.


This film will be shot in some of the beautiful locations in Hyderabad, Visakhapatnam and Kodaikkanal. Nani Chamidisetty is the director of photography, Asish Teja Pulala is the art director and Dharmendra Kakarala is the editor.

Pellikuthuru Party Releasing on May 20

 మే 20 న పెళ్లికూతురు పార్టీ సినిమా రిలీజ్



ప్రిన్స్, అర్జున్ కళ్యాణ్, అనీషా ధామా,  సీత, జయత్రీ, సాయికీర్తన్, ఫణి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం పెళ్లికూతురు పార్టీ. ఎ.వి.ఆర్. స్వామి నిర్మించారు. అపర్ణ దర్శకత్వం వహించారు. లేడీ సెంట్రిక్ మూవీగా రూపొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం విడుదలతేదీని వెల్లడించేందుకు సోమవారం నాడు ఫిలింఛాంబర్ లో చిత్ర యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.


నిర్మాత ఎ.వి.ఆర్. స్వామి మాట్లాడుతూ, రెండేళ్ళనాడు ఈ సినిమాను చిత్రీకరించాం. కరోనావల్ల విడుదల ఆలస్యమైంది. ప్రధానంగా కామెడీ బేస్ మూవీ. దర్శకురాలు అపర్ణ చాలా ఇంట్రెస్ట్ తో సినిమాను రూపొందించారు. పిల్లలతోపాటు పెద్దలు కూడా కలిసి చూడతగ్గ సినిమా. మే 20న సినిమాను విడుదల చేస్తున్నామని తెలిపారు.


దర్శకురాలు అపర్ణ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తం గా మా సినిమా మే 20న విడుదలవుతుంది. యు.ఎస్.లోకూడా రిలీజ్ అవుతుంది. అన్ని వయస్సులవారికి నచ్చే సినిమా అవుతుందని నమ్మకంగా చెప్పగలనని అన్నారు.


నటి అనీషా మాట్లాడుతూ, ఈరోజు కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నాం. విడుదలతేదీ ప్రకటించడంతో చెప్పలేని ఆనందంగా వుంది. టీమ్ అంతా ప్రేమతో సినిమా చేశాం. మాలాంటి కొత్తవారిని ఎంకరేజ్ చేస్తూ థియేటర్లలోనే సినిమా చూడాలని కోరుకుంటున్నాం. ఎంటర్టైన్మెంట్ మూవీగా రూపొందిన ఈ సినిమాను కుటుంబంతో కలిసి చూడతగ్గ మూవీ. నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్ కొలాబరేషన్ తో విడుదల చేయడం ఆనందంగా వుందని తెలిపారు.


ప్రిన్స్ మాట్లాడుతూ, ఈ సినిమా ట్రైలర్ విడుదలయి ఆరునెలలు అయింది. శ్రీకర్ అగస్తీ ఇచ్చిన ఆడియో బాగా పాపులర్ అయింది. సినిమాకూడా కొత్తగా వుండబోతుంది. శరత్మరార్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అపర్ణగారికి, నిర్మాత స్వామిగారికి మంచి పేరు తేవాలని ఆశిస్తున్నానని తెలిపారు.


అర్జున్ కళ్యాణ్ మాట్లాడుతూ,  మమ్మల్ని ప్రోత్సహించిన అన్నపూర్ణమ్మగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మా అందరి నీ ప్రతిభ చూసి ఎంపిక చేశారు. కోవిడ్ వల్ల సినిమా ఆలస్యమైంది. ఇప్పుడు మే20న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా నార్త్స్టార్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నారాయణ కెమెరా, శ్రీకర్ అగస్తీ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అన్నారు.


సాయికీర్తన్ మాట్లాడుతూ, నా పాత్ర చాలా ఇంటరెస్టింగ్ గా వుంటుంది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో సినిమాలు చేశాను. అందుకు చాలా హ్యాపీగా వుంది అన్నారు.


యూట్యూబ్ లో ఫేమస్ అయిన జయత్రీ మాట్లాడుతూ, మేము నటించిన పెళ్లికూతురు పార్టీ సినిమా చాలా సరదాగా వుంటుంది.  మే 20న విడులకాబోతున్నందుకు చాలా సంతోషంగా వుందని తెలిపారు.

సీత (యూట్యూబ్), ఫణి మాట్లాడుతూ, ఇది పూర్తి వినోదాత్మకంగా వుండే సినిమా. అందరూ థియేటర్ కు వచ్చి చూసి ఆనందించడండి అని తెలిపారు.

Reduced Ticket Prices in Telangana for Varun Tej's Ghani

 Reduced Ticket Prices in Telangana for Varun Tej's Ghani



The Telugu film industry, which was in severe crisis due to reduced cinema ticket prices and restrictions on the number of shows in cinemas, eventually breathed new life into it with increased ticket prices for RRR, and it is now making history in every area with favourable ticket rates.


With high ticket prices, the RRR fever is gradually fading, and new movies are being released every week, while small films are struggling to find an audience in both multiplexes and single screens.


The Telangana government has decided to cut the price of tickets for Varun Tej's Ghani. There's a lot of excitement around this action-packed movie, which marks Varun Tej's first role as a boxer. With such high ticket prices, families are reconsidering going to the movies.


Now the reduced rates are for 

Multiplexes: Rs.200 + GST

Single Screens: Rs.150 including GST

Now with revised rates Ghani is going to perform massive at the Box Office.


Ghani is a boxing backdrop family action drama. Kiran Korrapti is debuting as a director and Allu Bobby and Siddu Mudda are testing their luck as producers.


Ghani is all set to hit the screens worldwide on the 8th of April. Nadhiya, Upendra, Jagapathi babu, Sunil Setty, Saiee Manjrekar, Naresh, and Naveen Chandra are playing key roles in the movie.

Ram Charan Once again Proved as Man with Golden Heart

 'బంగారు' మనసు చాటుకున్న రామ్ చరణ్

 


 

ఆర్ఆర్ఆర్  సినిమా రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా  ఆర్ఆర్ఆర్ ప్రభంజనం కనిపిస్తుంది. ఉత్తరాదిన ఊహించని స్పందన రావడం, అక్కడ వసూళ్లు మరింత స్ట్రాంగ్‌గా ఉండటంతో ఆర్ఆర్ఆర్ కలెక్షన్లు దూసుకుపోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆర్ఆర్ఆర్ కొత్తకొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఎనిమిది రోజుల్లోనే ఏడు వందల కోట్లకు పైగా వసూలు చేసి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా ఇంత సక్సెస్ కావడంతో ఒకపక్క హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య సహా సినిమాలో భాగమైన అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

 

అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మంచి తనాన్ని చాటుకున్నారు. సినిమా కోసం పని చేసిన వివిధ శాఖలకు చెందిన హెచ్ఓడీలను ఈ ఉదయం అల్పాహారం కోసం పిలిపించి వారందరికీ ఊహించని బహుమతి అందించారు. సినిమా కోసం పని చేసిన వివిధ విభాగాల అధిపతులను, కెమెరా అసిస్టెంట్లను, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్లను, మేనేజర్లను, అకౌంటెంట్లను, స్టిల్ ఫోటోగ్రాఫర్ అసిస్టెంట్లను ఇలా దాదాపు అన్ని విభాగాలకు చెందిన సుమారు 35 మందిని ఇంటికి అల్పాహారం కోసం పిలిపించారు. వారితో కాస్త సమయం గడిపిన రామ్ చరణ్ అనంతరం వారందరికీ ఒక్కొకరికి ఒక్కో తులం బంగారం కాయిన్ కానుకగా ఇవ్వడమే కాక వారికి ఒక కేజీ స్వీట్ బాక్స్ కూడా అందించి సినిమా కోసం పని చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా ఇంత అద్భుతంగా రావడంలో వారి పాత్ర కూడా ఉందని ఈ సందర్భంగా రామ్ చరణ్ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించిన సందర్భంగా రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు.

Guttu Chappudu Poster Launched by Adivi Sesh

 అడివి శేష్ చేతుల మీదుగా "గుట్టు చప్పుడు" పోస్టర్ విడుదల 

 


ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ హీరో గా, కొత్త దర్శకుడు మణింద్రన్ దర్శకత్వంలో డాన్ ఎంటర్టైన్మెంట్ పై నిర్మాత లివింగ్ స్టన్ నిర్మిస్తున్న చిత్రం " గుట్టు చప్పుడు ". ఉగాది సందర్భంగా చిత్ర యూనిట్ హీరో, హీరోయిన్ ల రొమాంటిక్ & మాస్ యాంగిల్ ను చూపిస్తున్న పోస్టర్, మోషన్ పోస్టర్ లను హీరో అడవి శేషు చేతులు మీదుగా విడుదల చేశారు. 

 

ఈ సందర్భంగా హీరో అడవి శేషు మాట్లాడుతూ మోషన్ పోస్టర్ కూడా ఇంత హైప్ తెప్పించే విధంగా క్రియేట్ చేయవచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదని, నాకు డైరెక్టర్ గారికి ఇది నిజంగా ఫస్ట్ మూవీ నా అని చాలా డౌట్ గా ఉందని అన్నారు. ఆయనలో చాలా సీనియారిటీ ఉందా అనిపించేలా టాలెంట్ కనిపిస్తుంది, మ్యూజిక్ కూడా సూపర్ ,ఆ మ్యూజిక్ కి, ఎఫెక్ట్స్ కి గూస్ బంప్స్ వస్తున్నాయ్, మూవీకి మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాను అలాగే డైరెక్టర్ గారి ని ప్రోత్సహిస్తున్న ప్రొడ్యూసర్ లివింగ్ స్టన్ గారికి కూడా కంగ్రాట్స్, అండ్ గుట్టు చప్పుడు హోల్ టీం కి కంగ్రాట్స్ అని అన్నారు. 

 

డైరెక్టర్ మణింద్రన్ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా మా మూవీ 2nd లుక్ పోస్టర్ ని ఆయన చేతుల మీదుగా విడుదల చేసినందుకు, హీరో అడవి శేషు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, మా మూవీ 1st లుక్ పోస్టర్ కి అనూహ్య స్పందన వచ్చింది. ఆ హ్యాపీనెస్ కంటిన్యూ చేయడానికి ఉగాది సందర్భంగా గుట్టు చప్పుడు మూవీ 2nd లుక్ ని విడుదల చేసాం.. అలాగే నాకు ప్రొడక్షన్ పరంగా నాకు అండగా ఉన్న ప్రొడ్యూసర్ లివింగ్ స్టన్ గారికి నేను రుణపడి ఉంటాను. అని అన్నారు. 

 

హీరో సంజయ్ రావ్ మాట్లాడుతూ అడవి శేషు గారికి థ్యాంక్ యు చెబుతూ అన్న మీ మేజర్ మూవీ హిట్ కావాలని కోరుకుంటున్నాను, గుట్టు చప్పుడు సినిమాకి సంబంధించి ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇంకా ముందు ముందు చాలా సస్పెన్స్ లు ఉన్నాయి, డైరెక్టర్ మేకింగ్ ఏంటో అని మీరు స్క్రీన్ పై చూస్తారు.. ప్రొడ్యూసర్ గారు బడ్జెట్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ గౌర హరి గారు గూస్ బమ్స్ వచ్చే ఆర్ ఆర్ & సాంగ్స్ ని కంపోజ్ చేస్తున్నారు. ఇంకా D.O.P రాము గారు మేకింగ్ సూపర్. మరోసారి తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు అని ముగించారు. 

 

ప్రొడ్యూసర్ లివింగ్ స్టన్ మాట్లాడుతూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. మా గుట్టు చప్పుడు 2nd లుక్ అండ్ మోషన్ పోస్టర్ ని లాంచ్ చేసిన హీరో అడవి శేషు గారికి థ్యాంక్ యూ, వరుసగా సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తున్నటువంటి హీరో ఉగాది సందర్భంగా 2nd లుక్ అండ్ మోషన్ పోస్టర్ విడుదల చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. త్వరలో టీజర్ అండ్ సాంగ్ కూడా రిలీజ్ చేస్తున్నాం అని అన్నారు.

 

కెమెరామెన్ రాము మాట్లాడుతూ ఇంత మంచి మూవీ కి నన్ను కెమెరామెన్ గా తీసుకునేందుకు డైరెక్టర్ మణింద్రన్ గారికి, ప్రొడ్యూసర్. లివింగ్ స్టన్ గారికి కృతజ్ఞతలు, అలాగే మా హీరో సంజయ్ రావ్ గారి గురించి చెప్పాలంటే సేమ్ బ్రహ్మాజీ గారిలా సెట్ లో చాలా డిసిప్లిన్ గా ఉంటారు అని అన్నారు. 

 

బ్యానర్:- డాన్ ఎంటర్టైన్మెంట్, కాస్టింగ్ :- సంజయ్ రావు, అయేషా ఖాన్, వినోద్ కుమార్, మధుసూదన్, రవి, ప్రకాష్ తదితరులు, ప్రొడ్యూసర్ :- లివింగ్ స్టన్, రచయిత-దర్శకుడు మణింద్రన్, డైలాగ్స్ - ఏ. సురేష్ కుమార్, డీవోపీ - రాము, సంగీతం గౌర హరి, ఎడిటర్ : రాజు తలారి, వీఎఫెక్స్: చందు & ఆది, సౌండ్ ఎఫెక్ట్ : పురుషోత్తం రాజు, ఆర్ట్ : నాగు, పీఆర్వో : సురేష్ కొండేటి, డిజైనర్ : ఇమేజ్ 7 అడ్వేర్టిసింగ్.

Tollywood Heroines in Sri Lanka for Fashion Shoot   

 Tollywood Heroines in Sri Lanka for Fashion Shoot 

 


In its continued endeavor to support the country’s tourism revival efforts whilst fortifying connectivity in its single largest market India, SriLankan Airlines hosted yet another exceptional group of Indian celebrities and influencers. The group comprised of social media influencers, youtubers & actors specifically from the South Indian cities and arrived in Colombo on Saturday, 26th March.

For six days,  these influencers toured across the island through a curated itinerary featuring Sri Lanka’s rich ecological and cultural vibrancy entwined with the inherent island attributes of luxury, wellness and hospitality.


The influencers group includes names like Avika Sameer Gor (famous celebrity and renowned by its character of Anandi in Indian Television History), Gehna Haresh Sippy (Tollywood Actor of Chor Bazaar fame), Apoorva Srinivasan Aringundrum (Vloggers from MySouthDiva) Ruhani Sharma (Tollywood celebrity) Tanya Hope (Telugu, Tamil & Kannada Celebrity) and Manoj Kumar Katokar ( celebrity photographer and creator of Mysouthdiva ). Through their individual social media platforms, their stories of travel have been reaching lakhs of their followers and travellers in India.


The group stayed at Cinnamon Bentota Beach for the entire duration and will travell across nearby scenic destinations. The group will also visited a nearby rainforest reserve area for “tree plantation” activity. The ground services were handled by Sri Lanka’s leading DMC (Destination Management Company), Walkers Tours.

MySouthDiva has also planned their annual calendar shoot with the influencers at the property with Sri Lanka in the backdrop. The trip has been a huge success.

Nivin Pauly Starrer Mahaveeryar’s Teaser Released

 Nivin Pauly Starrer Mahaveeryar’s Teaser Released

 


The teaser of the much-awaited movie Mahaveeryar was launched today. Directed by Abrid Shine, this movie is produced under the banners of Pauly Jr Pictures and Indian Movie Makers by Nivin Pauly and PS Shamnas. The film features a formidable ensemble with Nivin Pauly, Asif Ali, Lalu Alex, Siddique, Shanvi Srivastava, Vijay Menon, Major Ravi, Mallika Sukumaran, Sudhir Karamana, Krishna Prasad, Padmaraj Ratheesh, Sudheer Paravoor, Kalabhavan Prajod, Pramod Veliyanad, Shailaja P Ambu in prominent roles.

 

The director, Abrid Shine, adapted the screenplay from a story by the award-winning author M Mukundan. This is the third time Abrid Shine and Nivin Pauly are working together after 1983 and Action Hero Biju.

 

The theme of Mahaveeryar revolves around time travel, fantasy, and courtroom proceedings interlaced with fun-filled and emotional moments, making it a wholesome entertainer.

 

The cinematography is by the award-winning Chandru Selvaraj, with Ishaan Chhabra composing both the background score and music. The crew also includes Manoj (editor), Vishnu Govind (sound-mixing), Anees Nadodi (art-direction), Chandrakanth & Melvi J (costumes), Libin Mohanan (makeup), Baby Panikar (associate director), among others.

Dandamudi Box Office Sai Sravanthi Movies launch new movie Launched

 Dandamudi Box Office, Sai Sravanthi Movies launch new movie with Vishwant, Subha Sri as lead pair



Dandamudi Box Office and Sai Sravanthi Movies have joined hands for a film starring Vishwant, Subha Sri, Ali, Sunil, Raghu Babu, 'Ee Rojullo' Sai, Khayyum, Sathyam Rajesh and others. Directed by Krishna Chaitanya, the film is produced by Avaneendra Kumar and Sai Gottipati. The film was launched in Ramanaidu Studios marking Ugadi. Star comedian Ali, who was the chief guest for the occasion, gave the clap for the muhurtham shot. Dandamudi Avanindra Kumar switched the camera on. Director Krishna Chaitanya directed the shot.


Director Krishna Chaitanya said, "This one is a suspense thriller. A team of experienced and talented technicians are on board. I thank the producers for this opportunity. The film will be shot non-stop from today. I am happy to be working with senior artists."


The film's producers said, "It feels great to kick off the shoot on an auspicious day like this. Krishna Chaitanya's story is so nice and that's why we are producing this movie. It has got a nice concept. We hope everyone is going to love it."


Cast:


Vishwant, Subha Sri, Ali, Sunil, Raghu Babu, 'Ee Rojullo' Sai, Khayyum, Sathyam Rajesh and others.


Crew:


Cinematographer: Eshwar; Editor: Amar Reddy; Music Director: Shravan Bharadwaj; Fights: Anji; Executive Producer: Sai Gottipati; Producer: Dandamoodi Avanindra Kumar; Story, dialogues, screenplay, direction: Krishna Chaitanya.

Sexystar Movie Poster Launched

హీరో సుమన్ చేతుల మీదుగా "సెక్సీ స్టార్" పోస్టర్ లాంచ్







చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్ పై లయన్ కుప్పిలి శ్రీనివాస్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం "సెక్సీ స్టార్". ఓ కొడుకు వ్యధ అనేది ట్యాగ్ లైన్ . లయన్ కుప్పిలి శ్రీనివాస్ సరసన హ్రితిక సింగ్ , సాధన పవన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటులు సుమన్ ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను హైద‌రాబాద్ లో లాంచ్ చేశారు.


అనంతరం సీనియ‌ర్ న‌టుడు సుమన్ మాట్లాడుతూ.. "నేను నటించిన చిత్రం సెక్సీ స్టార్ పోస్టర్ లాంచ్ చేయడం చాలా సంతోషగా ఉంది. షూటింగ్ లో పాల్గొన్నంత వరకు, నేను చేసిన సన్నివేశాలు దర్శక నిర్మాతలు కాంప్రమైజ్ కాకుండా తీశారు.. హీరో కుప్పిలి శ్రీనివాస్ కు మంచి టెస్ట్ ఉంది. మంచి కాన్సెప్ట్ తో వస్తున్నారు.. మిగతావి ఎలాగో ఉన్నాయో చూడాలి. త్వరలో చూస్తాను. ఒక్కటి అయితే చెప్పగలను. ఈ సినిమా కథ తండ్రీకొడుకుల మధ్య సెంటిమెంట్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం ప్రతిఒక్కరికి నచ్చుతుంది" అని తెలిపారు. ఈ కథను తెలుగుతో పాటు మిగతా భాషల్లో డబ్బింగ్ చెయ్యాలని చిత్రయూనిట్‌ను ఆయ‌న‌ కోరారు.


హీరో కుప్పిలి శ్రీనివాస్ మాట్లాడుతూ.. "నా అభిమాన హీరో సుమన్ గారు మా సినిమాలో నటించడమే కాదు. మూవీ పోస్టర్ లాంచ్ చేయడం సంతోషగా ఉంది" అన్నారు. ఈ సినిమాను చాలా ఇష్టంగా చేశాను. మంచి టెక్నిషియన్స్ తో ఈ సినిమా చేసాము అని తెలిపారు. ప్రేక్షకుల దీవెనలు మా సినిమా పై ఉండాలని ఆశిస్తున్నాము అన్నారు.


రచయిత శివప్రసాద్ ధరణ కోట మాట్లాడుతూ.. "సెక్సీ స్టార్ అంటే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు .. సెక్సీ అనేది చాలా పవిత్రమైన పదం.. బాగా ఉందని చెప్పడానికి ఈ పదం వాడుతాము.. సెక్సీ స్టార్ చిత్రానికి డైలాగ్స్ రాశాను.. హీరో గారు బాగా నటించారు.. ఈ సినిమా లో మంచి మెసేజ్ ఉంటుంది" అని అన్నారు.


సంగీత దర్శకులు జై సూర్య మాట్లాడుతూ.. "ఈ సినిమా లో 5 పాటలు ఉన్నాయి.. అవి అంద‌రికీ నచ్చుతాయి" అన్నారు.. సినిమా కూడా అందరికి నచ్చుతుందని అన్నారు...


ఈ కార్యక్రమంలో ఫైట్ మాస్టర్ హంగామా కృష్ణ , కెమెరా మెన్ పొడిపై రెడ్డి శ్రీను , గబ్బర్ సింగ్ బ్యాచ్ తో పాటు వివేకానంద నగర్ కాలనీ నాయకులు పాల్గొన్నారు..


నటీనటులు : సుమన్ ,సమీర్ ,కృష్ణ భగవాన్ ,అశోక్ కుమార్ , కోటేశ్వరరావు

బ్యానర్ : శ్రీ సూర్య నారాయణ క్రియేషన్స్

సమర్పణ : చిన్ని కుప్పిలి


కథ ,నిర్మాత : లయన్ కుప్పిలి వీరచారి


డైరెక్టర్ : రాజేంద్రప్రసాద్ కట్ల


హీరో హీరోయిన్లు : కుప్పిలి శ్రీనివాస్ (హీరో ) , హ్రితిక సింగ్ , సాధన పవన్ (హీరోయిన్స్)

 

రచయిత : శివప్రసాద్ ధరణికోట


పర్యవేక్షణ : కె.ప్రశాంత్


కొరియోగ్రాఫర్ : అమ్మ రాజశేఖర్


డి.ఓ.పి : పొడిపై రెడ్డి శ్రీను


మ్యూజిక్ డైరెక్టర్ : జై సూర్య

 

పాటలు : సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్, అనంత్‌ శ్రీరామ్, జై సూర్య

సింగర్స్ : సునీత, మాళవిక, మోహన బోగరాజు, సింహ, ధ‌నుంజయ్, శ్రీ కృష్ణ, దీపు


ఫైట్స్ : హంగామా కృష్ణ

ఎడిటర్ : ప్రణీత ,ఎన్టీఆర్

Anukoni Prayanam First Look Launched by Anil Ravipudi

 అనుకోని ప్రయాణం చిత్రటైటిల్ & ఫస్ట్ లుక్ ఆవిష్క‌రించిన ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి



డా. రాజేంద్ర ప్రసాద్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న చిత్రం అనుకోని ప్రయాణం. యాపిల్ క్రియేషన్స్‌లో డాక్టర్ జగన్మోహన్ డివై నిర్మిస్తున్నారు. వెంకటేష్_పెదిరెడ్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆదివారంనాడు ఆవిష్క‌రించారు. అనంత‌రం చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. పరుచూరి బ్రదర్స్ సంభాష‌ణ‌లు రాస్తున్న ఈ చిత్రానికి మణికుమార్‌పాత్రుడు ఎగ్జిక్యూటివ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ చిత్రానికి మల్లికార్జున్ నారాగాని సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.


AsuraGanaRudra Movie Launched Grandly



కమ్జుల ప్రొడక్షన్స్ `అసుర‌గ‌ణ రుద్ర` చిత్రం ప్రారంభం

కమ్జుల ప్రొడక్షన్స్ త‌మ‌ తొలి చిత్రంగా `అసుర‌గ‌ణ రుద్ర`చిత్రాన్ని నిర్మిస్తోంది. న‌రేష్ అగ‌స్త్య‌, సంగీర్త‌న విపిన్‌, ఆర్య‌న్ రాజేష్ త‌దితరులు న‌టించ‌నున్న ఈ చిత్రం ద్వారా ముర‌ళీ కాట్ర‌గ‌డ్డ ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ముర‌ళీ వంశీ నిర్మిస్తున్నారు. ఆదివారంనాడు ఈ చితం ప్రారంభోత్స‌వం జూబ్లీహిల్స్‌లోని దైవ‌స‌న్నిదానంలో జ‌రిగింది. పూజా కార్య‌క్ర‌మాలు అనంత‌రం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బి.గోపాల్ ముహూర్త‌పుషాట్‌కు క్లాప్ కొట్టారు. అనంత‌రం చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. మ‌రో అతిథి సి. క‌ళ్యాణ్ చిత్ర యూనిట్ శుభాకాంక్ష‌లు తెలుపుతూ, నిర్మాత‌, ద‌ర్శ‌కుల‌కు మంచి పేరు రావాల‌నీ, ఇంకా మ‌రిన్ని సినిమాలు తీసే స్థాయికి ఎద‌గాల‌ని ఆకాంక్షించారు.
 
చిత్ర నిర్మాత వంశీ మాట్లాడుతూ, మా అన్న ముర‌ళీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. మా సినిమాకు వ‌చ్చి ఆశీర్వ‌దించిన బి.గోపాల్, సి. క‌ళ్యాణ్ ల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాం. మా బేన‌ర్‌లో ఇది తొలి సినిమా. ఇదే టీమ్‌తో మ‌రో సినిమా చేయ‌బోతున్నాం. అది కూడా త్వ‌ర‌లో వెల్ల‌డిస్తాం. అసుర‌గ‌ణ రుద్ర చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ఏప్రిల్ 6నుంచి వుంటుంది. మొద‌టిరోజే రెయిన్ ఫైట్‌తో యాక్ష‌న్ సీన్‌ను చేయ‌బోతున్నాం. అదేవిధంగా, ఈ చిత్రం గురించి టైటిల్ కాంటెస్ట్‌ను ఏర్పాటు చేశాం. న‌రేష్ అగ‌స్త్య‌, శ‌త్రు, ముర‌ళీ శ‌ర్ర‌మ‌, అమిత్ ఈ న‌లుగురిలో ఎవ‌రు టైటిల్ పాత్ర‌ను పోషిస్తున్నార‌నేది చెబితే ఫ‌స్ట్  ప్రైజ్ ల‌క్ష రూపాయ‌లు, సెకండ్ ప్రైజ్ 50వేలు, మూడో బ‌హుతి 25వేలు ఇవ్వ‌నున్నాం. ఈ కాంటెస్ట్ వివ‌రాలు మా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పెట్టాం. గెలుపొందిన‌వారికి ఆ పాత్ర పోషించిన వారి చేతుల‌మీదుగా ప్రైజ్ మ‌నీ అందిస్తాం అని అన్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు ముర‌ళీ కాట్ర‌గ‌డ్డ మాట్లాడుతూ, ఈ సినిమాకు ప‌నిచేస్తున్న వారంతా నా స్నేహితులే. టైటిల్ రోల్ ప్లే చేస్తున్న పాత్ర చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా వుంటుంది. హీరోని డామినేట్ చేసేదిగా వుంటుంది. `అసుర‌గ‌ణ రుద్ర` మెడిక‌ల్ క్రైం థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో రూపొందుతోంది. చూసేవారికి భయం క‌లిగించేవిధంగా వుంటుంది. ఇందులో అభిన‌య కీల‌క పాత్ర పోషిస్తున్నారు. క‌థంతా ఆమె చుట్టూరా సాగుతుంది. థ్రిల్ల‌ర్ సినిమాలో బెస్ట్ సినిమా అవుతుంద‌నే న‌మ్మ‌క‌ముంది. ఈనెల 6నుంచి రెగ్యుల‌ర్ షూట్ ప్రారంభించి మే1కి మొద‌టిషెడ్యూల్ పూర్తి చేస్తాం అన్నారు.

ఇంకా ఈ చిత్రంలో పాల్గొన్న న‌టీన‌టులు మాట్లాడుతూ, టైటిల్ ఎంత హాంటింగ్ వుంటుందో క‌థ కూడా అంత‌కంటే బాగుంటుంది.  చ‌క్క‌టి టీమ్‌లో మేమూ భాగ‌మైనందుకు ఆనందంగా వుంద‌ని పేర్కొన్నారు.

న‌టీన‌టులు-
న‌రేష్ అగ‌స్త్య‌, సంగీర్త‌న విపిన్‌, ఆర్య‌న్ రాజేష్, మురళీ శ‌ర్మ‌, ఆమ‌ని, శ‌త్రు, అమిత్‌, అభిన‌య‌, దేవీ ఫ్ర‌సాద్ త‌దిత‌రులు
సాంకేతిక‌త‌-
కెమెరాః అమ‌ర‌నాథ్ బొమ్మిరెడ్డి, సంగీతంః శేఖ‌ర్ చంద్ర‌, ఫైట్స్ః న‌బా మాస్ట‌ర్‌, ఎడిట‌ర్ః శ్రీ‌కాంత్ ప‌ట్నాయ‌క్‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాతః శ్రీ‌హ‌రి గౌడ్‌, నిర్మాతః ముర‌ళీ వంశీ, ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంః  ముర‌ళీ కాట్ర‌గ‌డ్డ‌,


Dharmapuri Movie Releasing on April 22nd

 ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నశేఖ‌ర్ మాస్ట‌ర్ స‌మ‌ర్సిస్తున్న‌ 'ధర్మపురి' సినిమా.. 



భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న సినిమా ధర్మపురి. తెలుగు ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని.. టాలీవుడ్ టూ బాలీవుడ్ సత్తా చూపించిన డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్. ఇప్పటి వరకు ఈయన డాన్స్ చూసాం.. ఇప్పుడు ఈయనలోని అభిరుచి గల నిర్మాత బయటకు వచ్చారు. గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా విశ్వజగత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ధర్మపురి. 1995 ప్రాంతంలో జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు విశ్వజగత్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

అక్కడ ఉండే రాజ గడిలో పని చేసే ఓ జీతగాడు.. బీడీలు చుట్టుకునే అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథ ఈ ధర్మపురి. అక్కడున్న ఒరిజినల్ లొకేషన్స్ లో చాలా రియాలిస్టిక్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా విడుదల తేది ప్రకటించారు మేకర్స్. ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ లో శేఖర్ మాస్టర్ సమర్పణలో భాస్కర్ యాదవ్ దాసరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఓషో వెంకట్ సంగీతం అందిస్తున్న ధర్మపురి చిత్రానికి మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్. 


నటీనటులు: 

గగన్ విహారి, అపర్ణ దేవి, నాగ మహేష్, జనార్దన్, కేశవ, బస్టాప్ కోటేశ్వరరావు, రాగిని తదితరులు..


టెక్నికల్ టీమ్:

రచన, దర్శకత్వం: విశ్వజగత్

సమర్పణ: శేఖర్ మాస్టర్ 

బ్యానర్: భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా

నిర్మాత: భాస్కర్ యాదవ్ దాసరి

ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్

కొరియోగ్రాఫర్: శేఖర్ మాస్టర్

సంగీతం: ఓషో వెంకట్

PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Ghani Pre Release Event Held Grandly

 "గ‌ని" చిత్రాన్ని ప్రేమించి ప్రాణం పెట్టి చేశాము

-- ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ లో మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌



మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు, ట్రైలర్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఒక్క కట్ కూడా లేకుండా ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గని ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఏప్రిల్ 2న వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు.


మెగాప్రిన్స్‌ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ' ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ముఖ్య అతిథులందరికీ థాంక్స్. ద‌ర్శ‌కుడు కిర‌ణ్ నాతో 4 ఇయ‌ర్స్ నుండి ట్రావెల్ అయ్యాడు. ఈరోజు గ‌ని సినిమా చూసిని త‌రువాత నా న‌మ్మాకం నిజ‌మయ్యింద‌ని న‌మ్ముతున్నాను. కిర‌ణ్ బాగా చేశాడు. నేను నిజంగా క‌రెక్ట్ ఛాయిస్ తీసుకున్నాను. కిర‌ణ్ కి చాలా మంచ‌యి ఫ్యూచ‌ర్ వుంటుంది. జార్జ్ కెమెరామెన్ చాలా బాగా చేశాడు. ర‌వింద‌ర్ ఆర్ట్‌, అబ్బూరి ర‌వి గారు మాట‌లు ఇలా అన్ని డిపార్ట్‌మెంట్స్ వాళ్ళు చాలా బాగా చేశారు. ఈ సినిమా లో ప‌నిచేసిన ప్ర‌తిఒక్క‌రు నేను ఎంత ప్రాణం పెట్టి చేశానొ అదేవిధంగా ప్రేమించి చేశారు. నిర్మాత‌లు సిద్దు, బాబి ఇద్ద‌రూ సినిమా అంటే పిచ్చి ఇలాంటి ప్రోడ్యూస‌ర్స్ ఇండ‌స్ట్రిలొ వుండాలి అందుకే వీళ్ళ‌కి సినిమా చేశాను. ఇప్ప‌టివ‌ర‌కూ ఏ ప్రోడ్యూస‌ర్ పెట్ట‌నంత బ‌డ్జెట్ ఈ సినిమా కొసం పెట్టారు. వాళ్ళ మ‌నీ పైసాతో స‌హ వెన‌క్కి వ‌చ్చే సినిమా మా గ‌ని.. సాయి మంజ్రేక‌ర్ చాలా క్యూట్ గా వుంటుంది. న‌వీన్ చంద్ర , ఉపేంద్ర‌, సునీల్ శెట్టి, న‌రేష్ గారు, జ‌గ‌ప‌తిబాబు గారు అంద‌రూ చాలా బాగా చేశారు. అస‌లు గని సినిమా కోసం కరోనా సమయంలో కూడా మూడు సంవత్సరాలకు పైగా కష్టపడి ఈ సినిమా చేశాము. కచ్చితంగా ఇది మనల్ని అలరిస్తుందని నమ్ముతున్నాను. తెలుగులో అన్ని రకాల సినిమాలు వస్తున్నాయి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు ఎందుకు రావడం లేదని.. అప్పుడు కళ్యాణ్ గారు తమ్ముడు సినిమా చేశారు. ఆ రోజు సినిమా చేశారు కాబట్టే ఈ రోజు గని వచ్చింది. దర్శకుడు కిరణ్ కొర్రపాటి పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలోనే ఉన్నాడు. వినాయక్, హరీష్ శంకర్ ఇలాంటి పెద్ద దర్శకులతో పనిచేసాడు. ఆ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే అని సినిమా చేసిన తర్వాత నాకు అర్థం అయింది. రేపు విడుదల అయిన తర్వాత మీకు తెలుస్తుంది. ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేశాను దాని కోసం చరణ్ అన్న ఒక ట్రైనర్ ని ఇచ్చారు. బాక్సింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాను. రేపొద్దున సినిమా చూస్తున్నపుడు ఎవరికీ ఫేక్ గా కనిపించకూడదు అని ఎన్నో రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత సినిమా మొదలు పెట్టాను. నిర్మాతలు అల్లు బాబి, సిద్దు ముద్ద సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఖర్చుకు వెనకాడకుండా సినిమాని నిర్మించారు. ఇందులో పనిచేసిన టెక్నికల్ టీమ్ అందరికీ థాంక్స్. అలాగే ఉపేంద్ర గారు, సునీల్ శెట్టి గారు, జగపతి బాబు గారు, నదియా గారి ఇలాంటి సీనియర్లతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా మళ్లీ అలరిస్తుందని నమ్ముతున్నాను..' అని తెలిపారు.